ట్విటర్‌ షాక్‌.. బ్లూ స్కైకు పోటెత్తిన యూజర్లు! | Bluesky Gains Witness All Time High Traffic After Twitter's New Rules | Sakshi
Sakshi News home page

ట్విటర్‌ షాక్‌.. బ్లూ స్కైకు పోటెత్తిన యూజర్లు!

Published Sun, Jul 2 2023 7:08 PM | Last Updated on Mon, Jul 3 2023 7:44 AM

Bluesky Gains Witness All Time High Traffic After Twitter's New Rules - Sakshi

యూజర్లకు ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ షాకిచ్చారు. ట్వీట్స్‌ను చూడటంలో వినియోగదారులకు పరిమితులు విధించారు. వెరిఫైడ్​, అన్​వెరిఫైడ్​, కొత్త అన్​వెరిఫైడ్ ఖాతాదారులకు వేర్వేరుగా లిమిట్‌ ఇచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు ట్విటర్‌కు గుడ్‌బై చెప్పారు. ట్విటర్‌ ప్రత్యర్ధి సంస్థ బ్లూస్కైలో లాగిన్‌ అవుతున్నారు. యూజర్ల తాకిడితో బ్లూస్కై ట్రాఫిక్‌ ఆల్‌ టైమ్‌ హై చేరుకుంది. 

ఈ సందర్భంగా ట్విటర్‌ మాజీ కో- ఫౌండర్‌, బ్లూ స్కై ఫౌండర్‌ జాక్‌ డోర్స్‌ ట్వీట్‌ చేశారు.  ట్విటర్‌ కొత్త విధానం కారణంగా యూజర్లు బ్లూ స్కైలో లాగిన్‌ అవుతున్నారు. యూజర్ల తాకిడి పెరిగే కొద్ది తమ సంస్థలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. త్వరలో ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు.  

మస్క్‌ షరతులివే
ఎలాన్‌ మాస్క్‌ వెరిఫైడ్‌ అకౌంట్‌ యూజర్లు రోజుకు 6,000 పోస్ట్‌లు, అన్‌వెరిఫైడ్‌ యూజర్లు 600 పోస్ట్‌లు, కొత్తగా చేరిన అన్‌వెరిఫైడ్‌ యూజర్లు 300 పోస్టులు, వెరిఫైడ్‌ యూజర్లు రోజుకు 8,000 పోస్ట్‌లు, అన్‌ వెరిఫైడ్‌ యూజర్లు 800 పోస్ట్‌లు, నూతన అన్‌వెరిఫైడ్‌ యూజర్లు 400 పోస్ట్‌లు చదివేలా పరిమితిని పెంచనున్నట్లు ట్వీట్‌ చేశారు. ఆట్వీట్‌ దెబ్బకు ట్విటర్‌ యూజర్లు బ్లూస్కై బాట పట్టారు. 

పెరిగిపోతున్న డిమాండ్‌ 
గత కొన్ని వారాలుగా బ్లూ స్కై యాప్‌కు డిమాండ్ పెరిగింది. యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ డేటా ఏఐ.. ప్రకారం.. బ్లూ స్కై ఐఓఎస్‌ వెర్షన్ యాప్‌ను (ఏప్రిల్‌ 21)  240,000 మంది ఇన్ స్టాల్ చేసుకున్నారు. వీటిలో ఒక్క ఏప్రిల్‌ నెలలో 1,35,000 ఇన్‌స్టాలింగ్స్ పూర్తయ్యాయి. మార్చి నెలలో 97,000 మంది మాత్రమే బ్లూ స్కై యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకున్నారు.

చదవండి : ఎలాన్‌ మస్క్‌కు ఏమైంది? ఆ మందులు ఎందుకు వాడుతున్నట్లు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement