jack dorsey
-
ట్విటర్ షాక్.. బ్లూ స్కైకు పోటెత్తిన యూజర్లు!
యూజర్లకు ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ షాకిచ్చారు. ట్వీట్స్‌ను చూడటంలో వినియోగదారులకు పరిమితులు విధించారు. వెరిఫైడ్, అన్‌వెరిఫైడ్, కొత్త అన్‌వెరిఫైడ్ ఖాతాదారులకు వేర్వేరుగా లిమిట్ ఇచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు ట్విటర్‌కు గుడ్‌బై చెప్పారు. ట్విటర్ ప్రత్యర్ధి సంస్థ బ్లూస్కైలో లాగిన్ అవుతున్నారు. యూజర్ల తాకిడితో బ్లూస్కై ట్రాఫిక్ ఆల్ టైమ్ హై చేరుకుంది. ఈ సందర్భంగా ట్విటర్ మాజీ కో- ఫౌండర్, బ్లూ స్కై ఫౌండర్ జాక్ డోర్స్ ట్వీట్ చేశారు. ట్విటర్ కొత్త విధానం కారణంగా యూజర్లు బ్లూ స్కైలో లాగిన్ అవుతున్నారు. యూజర్ల తాకిడి పెరిగే కొద్ది తమ సంస్థలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. త్వరలో ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు. మస్క్ షరతులివే ఎలాన్ మాస్క్ వెరిఫైడ్ అకౌంట్ యూజర్లు రోజుకు 6,000 పోస్ట్‌లు, అన్‌వెరిఫైడ్ యూజర్లు 600 పోస్ట్‌లు, కొత్తగా చేరిన అన్‌వెరిఫైడ్ యూజర్లు 300 పోస్టులు, వెరిఫైడ్ యూజర్లు రోజుకు 8,000 పోస్ట్‌లు, అన్ వెరిఫైడ్ యూజర్లు 800 పోస్ట్‌లు, నూతన అన్‌వెరిఫైడ్ యూజర్లు 400 పోస్ట్‌లు చదివేలా పరిమితిని పెంచనున్నట్లు ట్వీట్ చేశారు. ఆట్వీట్ దెబ్బకు ట్విటర్ యూజర్లు బ్లూస్కై బాట పట్టారు. పెరిగిపోతున్న డిమాండ్ గత కొన్ని వారాలుగా బ్లూ స్కై యాప్‌కు డిమాండ్ పెరిగింది. యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ డేటా ఏఐ.. ప్రకారం.. బ్లూ స్కై ఐఓఎస్ వెర్షన్ యాప్‌ను (ఏప్రిల్ 21) 240,000 మంది ఇన్ స్టాల్ చేసుకున్నారు. వీటిలో ఒక్క ఏప్రిల్ నెలలో 1,35,000 ఇన్స్టాలింగ్స్ పూర్తయ్యాయి. మార్చి నెలలో 97,000 మంది మాత్రమే బ్లూ స్కై యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకున్నారు. చదవండి : ఎలాన్ మస్క్‌కు ఏమైంది? ఆ మందులు ఎందుకు వాడుతున్నట్లు? -
ట్విటర్‌కు షాక్: రూ.50 లక్షల జరిమానా
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు భారీ షాక్ తగిలింది. కేంద్రం ప్రభుత్వ ఆదేశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ విషయంలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ పిటీషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు రూ.50 లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి వివరణను ట్విటర్ ఇవ్వలేదని న్యాయమూర్తి దీక్షిత్ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ తీర్పును ట్విటర్లో షేర్ చేసిన అన్ని ప్లాట్‌ఫారమ్‌లు భారతీయ చట్టానికి అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కానీ జాక్ నేతృత్వంలోని ట్విటర పదే పదే ఉల్లంఘించిందని ట్వీట్ చేశారు. 2021 ఫిబ్రవరి నుంచి 2022 మధ్య కేంద్ర ప్రభుత్వం 10 సార్లు ట్విటర్‌ను బ్లాక్ చేసిందని ఆరోపించింది. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బ్లాక్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గత ఏడాది జూలైలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రంఆదేశాలు, ఏకపక్షంగా వాక్, భావప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉన్నాయని వాదించింది. 2021లో రైతుల నిరసనల నిర్వహణపై విమర్శనాత్మకమైన ఖాతాలను పరిమితం చేయాలనే ఆదేశాలను పాటించకపోతే దేశంలో సోషల్ మీడియాను మూసివేస్తామని ఇండియా బెదరించిందని ట్విటర్‌మాజీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ ఆరోపించిన తరువాత తాజా తీర్పు వెలువడటం విశేషం. గత ఏడాది జూన్ 28న, జూలై 4లోగా ఉత్తర్వులను పాటించాలని కోరుతూ ప్రభుత్వం ట్విటర్‌కు లేఖ రాసింది, లేకపోతే మధ్యవర్తిగా తన చట్టపరమైన కవచాన్ని కోల్పోతారని హెచ్చరించింది. లీగల్ షీల్డ్‌ను కోల్పోతే,యూజర్లు ఐటీ చట్టాన్ని ఉల్లంఘించిన కేసుల్లో ట్విటర్ ఎగ్జిక్యూటివ్‌లకు జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. VIDEO | "Our relationship with (social media) platforms isn't adversarial. Our insistence is that law must be followed. I am glad that the court has today laid down that non-compliance isn't an option. All platforms in India have to comply with Indian law," says Union Minister… pic.twitter.com/ExO0jWugpD — Press Trust of India (@PTI_News) June 30, 2023 -
ఆలోచన రేపుతున్న ఆరోపణలు
నూరుపూలు వికసించనీ... వేయి భావాలు సంఘర్షించనీ అంటారు. కానీ, మనమిప్పుడు ఏ చిన్న వ్యతిరేక వ్యాఖ్యనైనా సహించలేని స్థితికి వచ్చేశామా? డిజిటల్, సోషల్ మీడియా విప్లవంతో జనం సమాచారం పంచుకోవడం నుంచి స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తీకరణ దాకా – సమస్తం మారిపోయిన వేళ ప్రభుత్వాల నియంత్రణ ఎంత? ప్రతి ఒక్కరికీ అందుబాటుతో మీడియా ప్రజాస్వామికీకరణతో పాటు విచ్చలవిడితనమూ పెరిగే ప్రమాదం ఉన్నందున ఈ భారీ టెక్ సంస్థల బాధ్యత ఎంత? కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ట్విట్టర్ మాజీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడైన జాక్ డోర్సీ సోమవారం చేసిన సంచలన ఆరోపణలు ఇలాంటి ఎన్నో ప్రశ్నల్ని మరోసారి లేవనెత్తాయి. అమెరికన్ యూట్యూబ్ షో ‘బ్రేకింగ్ పాయింట్స్’కు డోర్సీ ఇచ్చిన ఇంటర్వ్యూ భారత ప్రభుత్వానికీ, పాపులర్ సోషల్ మెసేజింగ్ వేదికకూ మధ్య కొనసాగుతున్న పోరులో కొత్త సంగతులను సోమవారం రాత్రి బయటపెట్టింది. రైతుల ఉద్యమ సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పలు ట్విట్టర్ ఖాతాలను స్తంభింపజేయాల్సిందిగా భారత ప్రభుత్వం నుంచి పలు అభ్యర్థనలు వచ్చాయనేది ఆయన కథనం. అంతకన్నా ఆందోళనకరమైనవి ఏమిటంటే – ప్రభుత్వ డిమాండ్లకు తలొగ్గకపోతే, భారత్‌లో ట్విట్టర్‌ను మూసివేయిస్తామనీ, దేశంలోని సంస్థ ఆఫీసులపైన, ఉద్యోగుల ఇళ్ళపైన దాడులు చేయిస్తామనీ గద్దె మీది పెద్దలు బెదిరించారట. డోర్సీ చేసిన ఈ ఆరోప ణలు తీవ్రమైనవి. సహజంగానే ప్రభుత్వం ఆ ఆరోపణల్ని పూర్తిగా తోసిపుచ్చింది. అంతమాత్రాన కేంద్రంలో గడచిన తొమ్మిదేళ్ళ పైచిలుకు బీజేపీ హయాం సంప్రదాయ మీడి యాకైనా, సోషల్ మీడియాకైనా సవ్యంగా ఉందనుకోలేం. పత్రికలు, టీవీ ఛానళ్ళ నుంచి వెబ్సైట్లు, సోషల్ మీడియా దాకా అన్నిటినీ నయానో, భయానో తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి పాలకులు ప్రయత్నిస్తున్న తీరు కొత్తేమీ కాదు. కొన్ని జాతీయ టీవీ ఛానళ్ళను బీజేపీ పెద్దలు, వారి మిత్రులు, ఆశ్రితులు హస్తగతం చేసుకోవడమూ బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ మాజీ పెద్ద చేసిన ఆరోపణలు అసత్యమో, సత్యమో కానీ... అసహజమని మాత్రం అనిపించట్లేదు. తొమ్మిదేళ్ళ చరిత్ర చూస్తే నమ్మశక్యంగానే ఉన్నాయి. అదే సమయంలో ట్విట్టర్ సారథ్యం వదిలేసిన ఇంతకాలానికి డోర్సీ ఇప్పుడు ఈ అంశాలను ఎందుకు లేవనెత్తుతున్నారన్నదీ ఆలోచించాల్సినదే! ట్విట్టర్ పులు కడిగిన ముత్యం అనుకోలేం. పలు సందర్భాల్లో ఏకపక్షంగా వ్యవహరించిన చరిత్ర దానిది. పారదర్శకత లేకుండా ఈ తోక లేని పిట్ట తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలు కూడా సవాలక్ష. స్వయంగా డోర్సీ సైతం వివాదాలకు అతీతులేమీ కాదు. 2018లో భారత్‌లో పర్యటించినప్పుడు ఆయన వివాదాస్పద పోస్టర్‌ను చేత ధరించిన ఘటన ఇప్పటికీ విశ్లేషకులకు గుర్తే. అలాగే, ఆయన హయాంలో ట్విట్టర్ తన అల్గారిథమ్ ద్వారా నచ్చినవారిని పెంచుతూ, నచ్చనివారిని తుంచుతూ నడిచిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ సైతం అలాంటి కొన్ని అంతర్గత పత్రాలను బయటపెట్టారు. కొన్ని వార్తా కథనాలను నిరో ధిస్తూ, కొన్ని ఖాతాలను స్తంభింపజేశాక ఇలాంటి వేదికలకు ఇక తటస్థత ఎక్కడున్నట్టు? పారదర్శ కత, జవాబుదారీతనం లేనప్పుడు ట్విట్టరే కాదు... ఏ సోషల్ మీడియా వేదికకైనా పవిత్రత, గౌరవం ఏం ఉంటాయి? పాలకులను అవి వేలెత్తి చూపితే, మూడు వేళ్ళు వాటినే వెక్కిరిస్తాయి. అలాగని ఆ లోపాలే సందుగా... పాలక పక్షాలు, ప్రభుత్వాలు సోషల్ మీడియా సహా సమస్త భావప్రసార వేదికల పైనా స్వారీ చేస్తుంటే సమర్థించలేం. సోమవారం ఒకపక్కన ‘కోవిన్’ పోర్టల్ లోని పౌరుల సమాచారం అంగట్లో లభిస్తున్నట్టు బయటపడ్డ కొద్ది గంటల్లోనే, డోర్సీ సంచలన ఆరోపణలూ రావడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ, వార్తలనైనా, వ్యాఖ్యలనైనా... నోటితో ఖండించడమే తప్ప సర్కార్ తన సమర్థత, నిర్దోషిత్వాలను నిరూపించుకొనేందుకు ప్రయత్నించడం లేదు. నిజానికి, 2021 ఫిబ్రవరిలో సైతం దాదాపు 250 ఖాతాలనూ, ట్వీట్లనూ తొలగించమంటూ పాలకుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు ట్విట్టర్ ప్రతిఘటించింది. బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు చేసిన వివాదాస్పద ట్వీట్‌కు ‘మ్యానిప్యులేటెడ్ మీడియా’ అని ట్యాగ్ తగిలించేసరికి, 2021 మే నెలలో తన కార్యాలయాలపై ఢిల్లీ పోలీసు దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు ఇలా రహస్యంగా, అడ్డగోలుగా సాగుతున్న ఈ సెన్సార్షిప్ డిమాండ్లపై కర్ణాటక హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ వేసింది. అప్పుడైనా, ఇప్పుడైనా ప్రభుత్వం ఆరోపణల్ని తోసిపుచ్చడానికే పరిమితమైంది. ధ్రువీకృత జర్నలిస్టులు, వార్తా సంస్థల ఖాతాలు పోస్ట్‌లను సైతం స్తంభింపజేయమంటూ మన దేశం నుంచి ట్విట్టర్‌కు వస్తున్న డిమాండ్లే ఎక్కువట. 2021 ద్వితీయార్ధంలో మొత్తం 326 లీగల్ డిమాండ్లొస్తే, అందులో 114 మన దేశానివే. మొత్తం మీద పాలకులకు ప్రజా ఉద్యమాలు, ప్రతికూల వ్యాఖ్యలంటే దడ పుడుతున్నట్టుంది. రైతు ఉద్యమమైనా, రెజ్లర్ల నిరసనైనా సర్కార్ శైలి ఒకటే– ముందు ఉదాసీనత, తర్వాత అణచివేత. ప్రజాక్షేత్రంలో వ్యవహారం బెడిసి కొడుతోందనిపిస్తే – ఆఖరికి అత్యవసర కంటి తుడుపు కార్యాచరణ. ఏ రకంగా చూసినా ఇది సరి కాదు. ట్విట్టర్ సహా అన్నీ జవాబుదారీతనంతో, స్థానిక చట్టాలకు కట్టుబడాలి. అదెంత ముఖ్యమో, బెదిరింపు ధోరణులు ప్రజాస్వామ్య విలువలకే మచ్చ అని పాలకులు గ్రహించడం అంత కీలకం. ఆ రెండూ జరగనంత కాలం ఇవాళ డోర్సీ... రేపు మరొకరు... పేరు మారవచ్చేమో కానీ, ఆరోపణల తీరు, సారం మారవు. -
భారత ప్రభుత్వం బెదిరించింది
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020, 2021లో పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం జరిగినప్పుడు ట్విట్టర్ ఖాతాలపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం తమను ఆదేశించిందని, మాట వినకపోతే దేశంలో ట్విట్టర్‌ను మూసివేస్తామని హెచ్చరించిందని జాక్ డోర్సే సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడైన జాక్ డోర్సే 2021లో ఆ సంస్థ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. ఖాతాలపై ఆంక్షలు విధించడంతోపాటు కొన్ని పోస్టులను తొలగించకపోతే సంస్థను మూసివేయడంతోపాటు ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందని, తమపై ఒత్తిడి తెచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. తుర్కియే(టర్కీ), నైజీరియా ప్రభుత్వాల నుంచి కూడా తమకు బెదిరింపులు వచ్చాయని అన్నారు. చెప్పినట్లు చేయాలని అక్కడి ప్రభుత్వాలు తమపై ఒత్తిడి తెచ్చాయని పేర్కొన్నారు. భారత ప్రభుత్వంపై జాక్ డోర్సే చేసిన ఆరోపణలను కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మంగళవారం కొట్టిపారేశారు. డోర్సే పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. డోర్సే సీఈఓగా ఉన్న సమయంలో భారత ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా పనిచేసేందుకు ట్విట్టర్ యాజమాన్యం నిరాకరించిందని గుర్తుచేశారు. భారత ప్రభుత్వ చట్టాలు తమకు వర్తించవన్నట్లుగా వ్యవహరించిందని అన్నారు. ట్విట్టర్ సంస్థ నుంచి ఎవరూ జైలుకు వెళ్లలేదని, మన దేశంలో ట్విట్టర్‌ను మూసివేయలేదని చెప్పారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికే జాక్ డోర్సే పస లేని ఆరోపణలు చేస్తున్నారని రాజీవ్ చంద్రశేఖర్ ఆక్షేపించారు. జాక్ డోర్సే ఆరోపణలను కేంద్ర ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ ఐటీ విభాగం నాయకుడు అమిత్ మాలవీయ తదితరులు ఖండించారు. దేశానికి వ్యతిరేకంగా కొందరు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని, అలాంటి వారి ఖాతాలపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో ట్విట్టర్ యాజమాన్యానికి సూచించామని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కేంద్రం సమాధానం చెప్పాలి: ఖర్గే ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే చేసిన ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. సోషల్ మీడియాను, జర్నలిస్టులను అణచివేయడం ప్రభుత్వం ఇకనైనా ఆపాలని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలను కచ్చితంగా అడ్డుకుంటామని ఖర్గే తేల్చిచెప్పారు. డోర్సే ఆరోపణలపై మోదీ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్, రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ తదితరులు డిమాండ్ చేశారు. ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేశారు: తికాయత్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఉద్యమాన్ని ప్రముఖంగా వెలుగులోకి తీసుకొచ్చిన ట్విట్టర్ ఖాతాలను అప్పట్లో ప్రభుత్వం నిలిపివేసిన సంగతి నిజమేనని, ఈ విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. ఖాతాలను బ్లాక్ చేసేలా ట్విట్టర్ యాజమాన్యంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని అన్నారు. రైతుల ఉద్యమం ప్రజల్లోకి వెళ్లకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. చాలా ట్విట్టర్ ఖాతాలు ఇప్పటికీ మూసివేసి ఉన్నాయని వివరించారు. అసమ్మతిని, వ్యతిరేకతను కేంద్రం సహించదని వ్యాఖ్యానించారు. -
మాజీ ట్విటర్ సీఈఓ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ కేంద్రమంత్రి.. కారణం ఇదే!
Rajeev Chandrasekhar Vs Jack Dorsey: మాజీ ట్విటర్ సీఈఓ 'జాక్ డోర్సే' (Jack Dorsey) భారత ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు చేశారు. ఇందులో తమ బృందానికి షట్‌డౌన్ మాత్రమే కాకుండా వారి ఇళ్లపై కూడా దాడులు జరుగుతాయని బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించాడు. ఈ ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని కేంద్ర మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' స్ఫష్టం చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. జాక్ డోర్సే చేసిన ప్రకటనలు పూర్తిగా అవాస్తవాలని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ట్విటర్ బృందం మీద ఎవరూ దాడి చేయలేదని, జైలుకి పంపలేదని స్పష్టం చేసారు. అంతే కాకుండా డోర్సే, అతని బృందం భారతదేశ చట్టాన్ని పదేపదే ఉల్లంఘించిందని 2020 నుంచి 2022 వరకు ఇదే పద్దతిని పాటించినట్లు చెప్పుకొచ్చాడు. జాక్ డోర్సే భారత చట్టానికి సంబంధించిన సార్వభౌమాధికారాన్ని అంగీకరించడానికి సుముఖ చూపడంలేదని, చట్టాలు అతనికి ఏ మాత్రం వర్తించనట్లు ప్రరవర్తించారని చెప్పడమే కాకుండా, దేశంలో ఉన్న కంపెనీలన్నీ చట్టాలను తప్పకుండా అనుసరించాలాని పేర్కొన్నారు. రైతుల నిరసనను డోర్సే ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించారో కూడా చంద్రశేఖర్ వివరించారు. నిరసనల సందర్భంగా చాలా తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని, అలాంటి తప్పుడు వార్తలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. డోర్సీ ఆధ్వర్యంలోని ట్విట్టర్ కేవలం భారతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే కాదు, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,19ని ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా, పక్షపాతంతో వ్యవహరించిందని.. తప్పుడు సమాచారాన్ని ఆయుధాలుగా చేయడంలో సహాయం చేస్తుందని అన్నారు. ప్రస్తుతం భారత ప్రభత్వం విధి విధానాలు స్పష్టంగా ఉన్నాయని.. సంస్థలు కూడా విశ్వసనీయంగా, జవాబుదారీగా వ్యవహరించాలని చంద్రశేఖర్ సూచించారు. This is an outright lie by @jack - perhaps an attempt to brush out that very dubious period of twitters history Facts and truth@twitter undr Dorsey n his team were in repeated n continuous violations of India law. As a matter of fact they were in non-compliance with law… https://t.co/SlzmTcS3Fa — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) June 13, 2023 -
బ్లాక్ కంపెనీని టార్గెట్ చేసిన హిండెన్‌బర్గ్.. జాక్ డార్సీకి షాక్!
న్యూఢిల్లీ: షార్ట్‌సెల్లింగ్ రిపోర్టుతో అదానీ గ్రూప్‌ను అతలాకుతలం చేసిన అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ తాజాగా మరో కంపెనీని టార్గెట్ చేసుకుంది. ఈసారి ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డార్సీకి చెందిన చెల్లింపుల కంపెనీ బ్లాక్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్టర్లను బ్లాక్ తప్పుదోవ పట్టించిందంటూ నివేదికను ప్రచురించింది. 1 బిలియన్ డాలర్ల పైగా మోసానికి పాల్పడిందంటూ ఆరోపించింది. దాదాపు రెండేళ్ల పరిశోధన తర్వాత ఈ రిపోర్టును రూపొదించినట్లు పేర్కొంది. ఈ నివేదికతో అమెరికా మార్కెట్లో బ్లాక్ షేర్లు ఒక దశలో 20 శాతం పైగా క్షీణించి 58 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ ఈ ఏడాది జనవరిలో ఆరోపించడం, ఫలితంగా అదానీ సంస్థల షేర్లు భారీగా పతనం కావడం తెలిసిందే. అంతకు ముందు 2020లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ నికోలా కార్పొరేషన్‌పై కూడా హిండెన్‌బర్గ్ పలు ఆరోపణలు చేసింది. దీనితో ఆ కంపెనీ షేరు పతనం కావడంతో పాటు సంస్థ వ్యవస్థాపకుడు ట్రెవర్ మిల్టన్‌పై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. -
చాలా అకౌంట్లు ఫేకే! హిండెన్‌బర్గ్‌కు చిక్కిన ‘బ్లాక్’ బాగోతం ఇదే..
ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు మాజీ సీఈవో జాక్ డోర్సే నేతృత్వంలోని అమెరికా మొబైల్ చెల్లింపు సంస్థ ‘బ్లాక్’పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదికను విడుదల చేసింది. అవకతవకలకు పాల్పడిదంటూ ఆరోపించింది. ఈ నివేదిక ప్రకారం.. గతంలో స్వేర్ (Square Inc) అనే పేరుతో ఉన్న ఈ బ్లాక్ (Block Inc) సంస్థ మార్కెట్ విలువ 44 బిలియన్ డాలర్లు. బ్యాంక్ ఖాతాలు లేనివారి కోసం ఈ సంస్థ సరికొత్త ఆర్థిక సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి? అయితే అదే టెక్నాలజీ ఆధారంగా వినియోగదారులను పెంచుకున్న బ్లాక్ సంస్థ దాన్ని అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. వినియోగదారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోసాన్ని సులభతరం చేయడం, నియంత్రణను నివారించడం, రుణాలు, ఫీజుల దోపిడీని విప్లవాత్మక సాంకేతికతగా మార్చిందని ఆక్షేపించింది. యూజర్ల సంఖ్యను ఎక్కువగా చూపించి ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించిందని ఆరోపించింది. 40 నుంచి 75 శాతం అకౌంట్లు ఫేక్‌వే కరోనా సంక్షోభం అనంతరం బ్లాక్ క్యాష్ యాప్ పురోగతి చాలా మంది విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. బ్లాక్ తన యూజర్ల సంఖ్యను ఎక్కువగా చూపిందని, అదే సమయంలో ఖర్చులను తక్కువగా చూపించిందని హిండెన్‌బర్గ్ నివేదిక పేర్కొంది. బ్లాక్ కస్టమర్ల అకౌంట్లలో 40 నుంచి 75 శాతం ఫేక్‌వేనని ఆరోపించింది. కోవిడ్ సమయంలో 18 నెలల్లో 639 శాతం పెరిగిన బ్లాక్ స్టాక్‌కు కొత్త వ్యాపారం ఒక్కసారిగా పెరుగుదలను అందించిందని నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! జాక్ డోర్సీపై ఆరోపణలు జాక్ డోర్సే బ్లాక్‌లో మోసాన్ని సులభతరం చేశారని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ట్విటర్ సహ వ్యవస్థాపకుడైన డోర్సే 2015 నుంచి 2021 వరకు దాని సీఈవోగా పనిచేశారు. కోవిడ్ సమయంలో బిలియన్ డాలర్ల విలువైన స్టాక్లను డంప్ చేయడం ద్వారా ఆయన లాభపడ్డారని హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆరోపించింది. బ్లాక్ సహ వ్యవస్థాపకులు జాక్ డోర్సే, జేమ్స్ మెక్‌కెల్వే ఇద్దరూ 1 బిలియన్ డాలర్ల స్టాక్‌ను విక్రయించారని పేర్కొంది. సీఎఫ్‌వో అమృతా అహుజాతో సహా ఇతర అధికారులు, క్యాష్ యాప్ లీడ్ మేనేజర్ బ్రియాన్ గ్రాసడోనియా కూడా మిలియన్ డాలర్ల విలువైన స్టాక్‌ను డంప్ చేశారని ఆరోపించింది. ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ పేరుతో కూడా.. బ్లాక్ క్యాష్ యాప్‌లో జాక్ డోర్సీకి అనేక ఫేక్ ఖాతాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ పేరిట కూడా డజన్ల కొద్దీ నకిలీ ఖాతాలు కూడా ఉన్నాయని వివరించింది. ఇదీ చదవండి: పిన్ అవసరం లేదు!.. పేమెంట్ ఫెయిల్ అయ్యే సమస్యే లేదు! -
హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి?
న్యూఢిల్లీ:యూఎస్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ బ్లాక్ ఇంక్‌పై వెల్లడించిన రిపోర్ట్ సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ బ్లాక్ఇంక్ ఏంటి? సహ వ్యవస్థపాకులతోపాటు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కంపెనీ భారతీయ-అమెరికన్ సీఎఫ్‌వో అమృతా అహుజా గురించిన వివరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాక్ డోర్సే నేతృత్వంలోని బ్లాక్ ఇంకపై హిండెన్‌బర్గ్ గురువారం కీలక రిపోర్ట్‌ను వెల్లడించింది. జాక్ డోర్సే జేమ్స్ మెక్కెల్వీతో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమృతా అహుజా, క్యాష్ యాప్ లీడ్ మేనేజర్, బ్రియాన్ గ్రాసడోనియాతో సహా పలు కీలక ఎగ్జిక్యూటివ్‌లు "మిలియన్ల డాలర్లను స్టాక్‌లో పెట్టారని " ఆరోపించింది. (ట్విటర్ మాజీ సీఈవోపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు) పెట్టుబడిదారులను మోసం చేసేందుకు కస్టమర్లను ఎక్కువగా చూపించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. రిపోర్ట్ ప్రకారం మోసంద్వారా వచ్చిన లాభాలను దోచు కున్నారని, ముఖ్యంగా కోవిడ్ సమయంలో జాక్ డోర్సే , జేమ్స్ మెక్ కెల్వే సమిష్టిగా 1 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్‌ను విక్రయించారు. అలాగే సీఎఫ్‌వో అమృతా అహుజా సహా ఇతర ఎగ్జిక్యూటివ్స్‌పై కూడా విమర్శలు గుప్పించింది. అమృతా అహుజా ఎవరు? ♦ అహుజా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, డ్యూక్ యూనివర్సిటీ , హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వంటి ప్రీమియం విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థి. ♦ 2019లో బ్లాక్‌లో చేరడానికి ముందు, ఆమె ఎయిర్బిఎన్బి, మెకిన్సే & కంపెనీ, ది వాల్ట్ డిస్నీ కంపెనీ వంటి దిగ్గజాలతో కలిసి పనిచేసింది. ♦ ఆమె 2001లో కన్సల్టింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీతో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ♦ ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, అహుజా క్లీవ్‌ల్యాండ్ శివారులో డే-కేర్ సెంటర్ నిర్వహించే భారతీయ వలసదారుల కుమార్తె. ♦ ఫాక్స్‌లో పనిచేస్తున్నప్పుడు, స్ట్రీమింగ్ సర్వీస్ హులును ప్రారంభించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ♦ "కాల్ ఆఫ్ డ్యూటీ," "కాండీ క్రష్" , "వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్" వంటి పాపులర్ గేమ్‌ల వీడియో గేమింగ్ కంపెనీ యాక్టివిజన్ బ్లిజారే కంపెనీకి అభివృద్ధిలో తోడ్పడింది. ఆన్ స్టోర్ బిజినెస్ మోడల్నుంచి,ఆన్లైన్, ఆల్వేస్ ఆన్ లాంటి మల్టీప్లేయర్ వ్యాపార నమూనాతో అమ్మకాలతో దుమ్ము రేపేలా సాయపడింది. ♦ ఆమె 2022లో ఫార్చ్యూన్ యొక్క అత్యంత శక్తివంతమైన మహిళా సమ్మిట్‌లో కనిపించింది. ♦ భర్త హర్‌ప్రీత్ మార్వాహ. 7 , 4 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు. ♦ తొలి ఉద్యోగం: ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్ హైట్స్‌లోని ఆమె తల్లిదండ్రుల డేకేర్‌లో సమ్మర్ క్యాంప్ కౌన్సెలర్ ఇవీ చదవండి: రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 1,999కే సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు -
ట్విటర్ మాజీ సీఈవోపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నెక్ట్స్ బాంబును ట్విటర్‌మాజీ సీఈవో జాక్ డోర్సేపై వేసింది. డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ బ్లాక్ ఇంక్ భారీ అక్రమాలకు పాల్పడిందని గురువారం వెల్లడించింది. దీనికి సంబంధించిన రిపోర్ట్‌ను ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గురువారం ప్రకటించిన రిపోర్టులో జాక్ డోర్సే నేతృత్వంలోని బ్లాక్ సంస్థ అక్రమాలను బైట పెట్టింది. తమ రెండేళ్లలో పరిశోధనలో కీలక విషయాలను గుర్తించినట్టు షార్ట్ సెల్లర్ తన వెబ్సైట్లో ప్రచురించిన నోట్లో పేర్కొంది. ముఖ్యంగా తన కస్టమర్లను ఎక్కువగా చూపించి వారి ఖర్చులను తక్కువ చేసిందని ఆరోపించింది. తన ఫేక్ లెక్కలు,నకిలీ కస్టమర్ల సంఖ్యతో పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడమే బ్లాక్ వ్యాపారం వెనుకున్న "మాయాజాలం"అని వ్యాఖ్యానించింది. బ్లాక్ సంస్థ "అండర్‌బ్యాంక్" కస్టమర్లలో ఎక్కువమంది నేరస్థులు లేదా అక్రమ కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తులు న్నారని కూడా ఆరోపించింది. మోసం, ఇతర స్కామ్‌ల నిమిత్తం ఖాతాలను భారీగా సృష్టించడం, ఆపై అక్రమ నిధులను త్వర త్వరగా మళ్లించడం చేసిందని తెలిపింది. తాము సమీక్షించిన ఖాతాల్లో 40 శాతం నుండి 75 శాతం నకిలీవి, మోసానికి పాల్పడినవీ లేదా ఒకే వ్యక్తితో ముడిపడి ఉన్న అదనపు ఖాతాలని వెల్లడించింది. కాగా 2009లో ఏర్పాటైన బ్లాక్ సంస్థ మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. ఈ నివేదిక తర్వాత ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో బ్లాక్ షేర్లు 18 శాతం కుప్పకూలడం గమనార్హం. NEW FROM US: Block—How Inflated User Metrics and "Frictionless" Fraud Facilitation Enabled Insiders To Cash Out Over $1 Billionhttps://t.co/pScGE5QMnX $SQ (1/n) — Hindenburg Research (@HindenburgRes) March 23, 2023 -
ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!
ట్విటర్‌కు పోటీగా మరో మైక్రోబ్లాగింగ్ సైట్ వస్తోంది. ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్‌డోర్సే ‘బ్లూస్కై’ అనే యాప్ బీటా వర్షన్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్‌లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. టెక్‌క్రంచ్ కథనం ప్రకారం.. బ్లూస్కై ప్రస్తుతం ఇన్వైట్-ఓన్లీ బీటా వర్షన్ అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 17న అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను ఇప్పటివరకు 2 వేల మంది ఎంపిక చేసిన యూజర్లు ఇన్స్టాల్ చేసుకున్నట్లు డేటా.ఏఐ అనే యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంది. ట్విటర్ మాదిరిగానే బ్లూస్కై యూజర్ ఇంటర్ఫేస్ను కూడా చాలా సింపుల్‌గా రూపొందించారు. 256 అక్షరాల వరకు నిడివితో యూజర్లు చాలా తేలికగా పోస్ట్‌లు చేయొచ్చు. ప్లస్ బటన్ క్లిక్ చేయడం ద్వారా సులువుగా ఫొటోలు జోడించొచ్చు. ట్విటర్లో ఉన్న ‘వాట్ ఈజ్ హాపెనింగ్?’ అన్న ఆప్షన్‌కు బదులుగా ఇందులో ‘వాట్స్అప్?’ అనే ఆప్షన్ ఉంది. అలాగే బ్లూస్కైలో షేర్, మ్యూట్, బ్లాక్ అకౌంట్స్ వంటి ఆప్షన్స్‌తో పాటు కొత్తవారిని కూడా యాడ్ చేసే అడ్వాన్స్డ్ ఫీచర్ ఇందులో ఉంది. (ఇదీ చదవండి: లేఆఫ్స్ వేళ ఫ్రెంచ్ కంపెనీ సంచలనం.. కొత్తగా 12 వేల మందికి ఉద్యోగాలు!) యాప్ మధ్యలో ఇచ్చిన డిస్కవర్ ట్యాబ్ ద్వారా.. యూజర్లు ఎవరిని ఫాలో అవ్వాలి, సజెషన్స్, తాజా అప్డేట్స్ ఫీడ్‌ను తెలుసుకోవచ్చు.అలాగే నోటిఫికేషన్స్ ట్యాబ్ ద్వారా లైక్స్, రిపోర్ట్స్, ఫాలోస్, రిప్లయిస్ వంటివి చూసుకోవచ్చు. అయితే ఇందులో ప్రస్తుతానికి డెరెక్ట్ మెసేజ్ (డీఎం) ఫీచర్ లేదు. ట్విటర్ మాదిరిగానే బ్లూస్కైలో కూడా యూజర్లు సెర్చ్, ఫాలో, తమకు పోస్ట్‌లకు సంబంధించిన అప్డేట్లను హోం టైమ్‌లైన్‌లో చూసుకోవచ్చు. ఈ బ్లూస్కై ప్రాజెక్ట్‌ను 2019లోనే అభివృద్ధి చేసినప్పటికీ దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి, మరింతగా అభివృద్ధి చేసి 2022లో స్వతంత్ర కంపెనీగా ఆవిష్కరించారు. జాక్ డోర్సే ట్విటర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈ బ్లూస్కై గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత 2022 అక్టోబర్‌లో ఏ యాప్‌తో అయినా సరే పోటీ విధింగా బ్లూస్కైని రూపొందిస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలియజేశారు. బ్లూస్కై గతేడాది 13బియన్ డాలర్ల నిధులను సమీకరించింది. -
ట్విటర్‌కు కోఫౌండర్ గుడ్‌బై.. మాస్టోడోన్లో చేరిన బిజ్‌స్టోన్!
ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. ట్విటర్ కో ఫౌండర్లలో ఒకరైన బిజ్ స్టోన్ ఆ సంస్థకు గుడ్‌బై చెప్పారు. మస్క్ కొనుగోలు అనంతరం జరుగుతున్న వరుస పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన బిజ్ స్టోన్ ఆ సంస్థకు రిజైన్ చేసి ట్విటర్‌తో పోటీ పడుతున్న మాస్టోడన్‌లో చేరినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2006 మార్చిలో జాక్ డోర్సే, నోహాగ్లాస్, బిజ్ స్టోన్, ఇవాన్ విలియమ్స్‌లు ట్విటర్‌ను స్థాపించారు. అయితే మస్క్ 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఫౌండర్లు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే గతేడాది మే నెలలో గుడ్ బై చెప్పగా..ఇవాన్ విలియమ్స్ మాస్టోడన్‌లో చేరారు. తాజాగా బిజ్ స్టోన్ సైతం వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ట్విటర్ సంస్థలో అసంతృప్తిగా ఉన్నా. గతంలోలా ఉన్నట్లు పరిస్థితులు ఇప్పుడు లేవు. నేను చేసేది తప్పో ఒప్పో తెలియదు. కానీ ట్విటర్ చాలా అనుభవాల్ని నేర్పించింది. ఇకపై ట్వీట్ చేయను. ఏం జరుగుతుందో చూడాలి అంటూ సంస్థ వదిలేస్తున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సంస్థ పట్ల మస్క్ సీరియస్‌గా లేరంటూ బ్లూమ్‌బెర్గ్‌కు తెలిపారు. మాస్టోడాన్‌లో చేరేందుకు ఆ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కుండబద్దలు కొట్టారు. కాగా, బిజ్‌స్టోన్ ట్విటర్ ఫైల్స్ పేరుతో సంస్థలో జరుగుతున్న బాగోతాల్ని బయటపెట్టారు. మస్క్ అనుసరిస్తున్న మార్గాల్ని తీవ్రంగా విమర్శించారు. మస్క్‌ను ఉద్దేశిస్తూ..అతను ట్విటర్‌ను సీరియస్‌గా తీసుకోడు. సంస్థను అంటిపెట్టుకొని ఉన్న వారి జీవితాలతో ఆటలాడుతున్నారంటూ ట్వీట్ చేశారు. ఇక బిజ్ నిర్ణయాన్ని ట్విటర్ కోఫౌండర్లో ఒకరైన ఎవ్ విలియమ్స్ సమర్ధించారు. -
‘ట్విటర్ ఉద్యోగులారా..ప్లీజ్ నన్ను క్షమించండి’: జాక్ డోర్సే
ట్విటర్ సంస్థలో జరుగుతున్న వరుస పరిణామాలపై ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్ డోర్సే స్పందించారు. ఎలన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. ఈ తరుణంలో మస్క్ నిర్ణయాన్ని డోర్సే తప్పు బట్టారు. ట్విటర్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు తనని క్షమించాలని కోరారు. ఉద్యోగులు నాపై కోపంగా ఉన్నారని తెలుసు, వారు ఎదుర్కొంటున్న కఠిమైన సమయానికి నేను పూర్తి బాధ్యత వహిస్తాను. సంస్థ వృద్ధి కోసం అతి తక్కువ సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని నియమించుకున్నాను. అందుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. Folks at Twitter past and present are strong and resilient. They will always find a way no matter how difficult the moment. I realize many are angry with me. I own the responsibility for why everyone is in this situation: I grew the company size too quickly. I apologize for that. — jack (@jack) November 5, 2022 కాగా, 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎలన్ మస్క్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, విజయ గద్దె వంటి ఉన్నత స్థాయి ఉద్యోగుల్ని తొలగించారు. చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ -
ట్విటర్‌కు పోటీగా..జాక్ డోర్సే కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫామ్
ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలుతో ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వినియోగించేందుకు ఇష్టపడడం లేదా? అయితే మీకో గుడ్ న్యూస్. ట్విటర్‌కు పోటీగా మరో మైక్రోబ్లాగింగ్ సైట్ అందుబాటులోకి రానుంది. ట్విటర్ కో- ఫౌండర్ జాక్ డోర్సే ‘బ్లూస్కై’ పేరుతో సోషల్ మీడియా యాప్‌ను డెవలప్ చేశారు. ప్రస్తుతం ఆ యాప్ బీటా వెర్షన్‌పై టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై జాక్ డోర్సే స్పందించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి కనీసం వారం రోజుల ముందు డోర్సే ఈ కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గురించి ఓ బ్లాగ్‌లో వెల్లడించారు. ప్రారంభ దశలో బ్లూ స్కై అథంటికేటెడ్ ట్రాన్స్ఫర్ ప్రొటోకాల్ (ఏటీ ప్రోటోకాల్) ఆధారంగా పనిచేయనున్నట్లు తెలిపారు. ఇక, సోషల్ మీడియా సైట్లలో యూజర్ల డేటాను వినియోగించుకునేవారికి ప్రత్యామ్నాయంగా నిలవనుందని అన్నారు. ఏటీ ప్రోటోకాల్ అంటే ఒక సోషల్ మీడియా సైట్‌ను మల్టిపుల్ సైట్ల నుంచి ఆపరేట్ చేయడాన్ని ఏటీ ప్రోటోకాల్ అంటారు. జాక్ డోర్సే 2019లో బ్లూస్కై ప్రాజెక్ట్‌ను ఏటీ ప్రోటోకాల్ తరహాలో ప్రారంభించారు. కాగా, ట్విటర్ కో ఫౌండర్ డోర్సే 201 నవంబర్‌లో ఆ సంస్థ సీఈవో పదవి నుంచి, 2022 మే నెలలో బోర్డు పదవి నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. -
ట్విటర్ మాజీ సీఈవో నుంచి సరికొత్త వెబ్ ‘సిరీస్’
ట్విటర్ మాజీ సీఈవో, కో ఫౌండర్ జాక్‌డోర్సే నుంచి సంచలన ప్రకటన వెలువడింది. డేటాప్రైవసీ, ఐడింటిటీల విషయంలో మరింత కట్టుదిట్టంగా ఉండే సరికొత్త ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌ను రెడీ చేసినట్టు ఆయన వెల్లడించారు. వెబ్ 2, వెబ్ 3ల మేలి కలయికగా ఉండబోయే ఈ కొత్త ఇంటర్నెట్ ఫ్లాట్‌ఫామ్‌ను వెబ్ 5గా వ్యవహరిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందులో లావాదేవీలు క్రిప్టోల్లోనే జరుగుతాయని ఆయన వెల్లడించారు. వెబ్ 5 ట్విటర్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత జాక్‌డోర్సే బ్లాక్ చైయిన్ టెక్నాలజీ ఆధారంగా పని చేసే బ్లాక్ సంస్థలో భాగమయ్యారు. ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ అనుబంధ సంస్థల్లో బ్లాక్ ఒకటి. బ్లాక్ ఎంతగానో శ్రమించి మరింత సమర్థంగా ఇంటర్నెట్ సేవలు అందించే వెబ్ 5కి రూకల్పన చేసింది. ఇంటర్నెట్కు తాము అందిస్తున్న గొప్ప కానుక వెబ్5 అని జాక్‌డోర్సే వెల్లడించారు. ఉపయోగాలు వెబ్ 5 ప్రకటన సందర్భంగా నెటిజన్లు జాక్డోర్సేను పలు అంశాలపై ప్రశ్నించారు. వీటికి సమాధానం ఇస్తూ...వెబ్ 2లో డేటా, ఐటింటిటీ సమాచారం చాలా వరకు చోరీ అయ్యిందని, కానీ వెబ్ 5లో ఆ సమస్య ఉండదని వెల్లడించారు. ఇక్కడ ఎవరి పెత్తనాలు పని చేయబోవన్నారు. వెబ్ 3 ఇంకా అందరికి కొరుకుపడటం లేదు కాబట్టే వెబ్ 5కి వచ్చామని కూడా జాక్ డోర్సే అన్నారు. వెబ్ ‘సిరీస్’లు సాధారణంగా ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చిన తర్వాత డాట్‌కామ్ బూమ్, ఈమెయిళ్లు తదితర వాటిని వెబ్1గా వ్యవహరిస్తున్నారు. ఇంటర్నెట్ ఆధారంగా పుట్టుకొచ్చిన యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని వెబ్ 2గా పరిగణిస్తున్నారు. ఇక ఫ్యూచర్ టెక్నాలజీగా చెప్పుకుంటున్న వర్చువల్ రియాలిటీ, మెటావర్స్లను వెబ్ 3గా భావిస్తున్నారు. వీటికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అనుసంధానం చేసి వెబ్ 5గా పేర్కొంటున్నారు జాక్‌డోర్సే. this will likely be our most important contribution to the internet. proud of the team. #web5 (RIP web3 VCs 🤫)https://t.co/vYlVqDyGE3 https://t.co/eP2cAoaRTH — jack (@jack) June 10, 2022 చదవండి: బస్సు డ్రైవర్లు జాగ్రత్త ! పరధ్యానంగా ఉంటే.. -
గుడ్‌బై ట్విటర్.. ఇక సెలవు..
ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో, ప్రస్తుత బోర్డు మెంబర్ జాక్‌డోర్సే కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను పెంచి పోషించిన సంస్థతో పూర్తిగా సంబంధాలు తెంచుకునేందుకున్నాడు. ఈలాన్ మస్క్ ఎంట్రీ ప్రకటన నుంచి అతలాకుతలం అవుతున్న ట్విటర్‌కి తాజా పరిణామాలు మరింత చర్చనీయాంశంగా మార్చాయి. ట్విటర్ సీఈవోగా తన పదవీ బాధ్యతల నుంచి 2022 నవంబరులో జాక్‌డోర్సే తప్పుకున్నారు. అప్పటి నుంచి ట్విటర్ సీఈవోగా ఐఐటీ బాంబే, పూర్వ విద్యార్థి పరాగ్ అగ్రవాల్ కొనసాగుతున్నారు. సీఈవో పోస్టు నుంచి తప్పుకున్నప్పటికీ కీలకమైన ట్విటర్ బోర్డులో సభ్యుడిగా జాక్‌డోర్సే కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం 2022లో జరిగే బోర్డు సమావేశం వరకు ఉంది. అయితే ఆ సమావేశానికి ముందుగానే బోర్డు నుంచి ఆయన వైదొలిగారు. ఈలాన్ మస్క్ 2022 ఏప్రిల్‌లో ట్విటర్‌ను ఏకమొత్తంగా కొనుగోలు చేసేందుకు భారీ డీల్ ఆఫర్ చేశారు. మస్క్ ప్రకటన తర్వాత ట్విటర్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మస్క్ ఆఫర్ చేసిన డీల్ కనుక పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ట్విటర్ బోర్డు కనుమరుగు అవుతుంది. కానీ ప్రస్తుతం ఈ కొనుగోలు ప్రక్రియను హోల్డ్‌లో పెట్టారు ఈలాన్ మస్క్. ఓ వైపు బోర్డు కొనసాగుతుందా లేదా అనే డోలాయమాన పరిస్థితులు ఉండగా మరోవైపు బోర్డులో కీలక సభ్యుడిగా ఉన్న జాక్‌డోర్సే ఆ స్థానం నుంచి తప్పుకున్నారు. ఈలాన్ మస్క్ ఎంట్రీ ప్రకటనతో షేర్హోల్డర్లు సంతోషం వ్యక్తం చేయగా బోర్డు సభ్యులు కొంత ఇబ్బందికి గురయ్యారు. ఆ తర్వాత పరిణామాల్లో బోర్డు పనితీరు సరిగా లేదంటూ మస్క్ అనేక ఆరోపణలు చేశారు. ఇదిలా కొనసాగుతుండగా ట్విటర్లో హై లెవల్ ఎగ్జిక్యూటివ్ ఇద్దరికి ఉద్వాసన పలికారు సీఈవో పరాగ్ అగ్రవాల్. ఈ వేడి చల్లారక ముందే ఈలాన్ మస్క్ ఫేక్ ఖాతాల అంశం లేవనెత్తి మరింత గందరగోళం సృష్టించారు. ఫేక్ అకౌంట్ల జడివాన సద్దుమణగక ముందే బోర్డు నుంచి జాక్‌డోర్సే నిష్క్రమణ జరిగింది. చదవండి: Elon Musk : ట్విటర్ పని అయ్యింది.. ఇప్పుడు ఇన్‌స్టా వంతా? -
వెబ్ 3.0 అంటే ఏమిటి? వాళ్లకు ఎందుకంత కళ్లమంట?
Elon Musk Jack Dorsey Hates Web 3.0: web3.. మనలో చాలామందికి ఈ పదం తెలిసి ఉండకపోవచ్చు. కానీ, రాబోయే రోజులు మాత్రం వెబ్3 గురించి పదే పదే వినాల్సి రావడం ఖాయం. ఎందుకంటే.. ఇది ఇంటర్నెట్లో ఓ తరం కాబట్టి. అయితే దీనిపై కొందరు టెక్ మేధావులకు తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకు కారణాలేంటో తెలుసుకునే ముందు.. అసలు వెబ్3 అంటే ఏంటో చూద్దాం. టిమ్ బెర్నర్స్ లీ 1989లో వరల్డ్ వైడ్ వెబ్‌ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిని ‘వెబ్ 1’గా పరిగణనలోకి తీసుకోకపోయినా.. జనాల్ని ఆన్లైన్లోని వెళ్లేలా చేసింది మాత్రం ఇదే. కానీ, ఆ తర్వాతి తరంలో వచ్చిన ఇంటర్నెట్కు వెబ్ 2.0 అనే పేరు అధికారికంగా వచ్చింది. 1999 నుంచి ఇది అనేక రకాలుగా యావత్ ప్రపంచం విస్తరించి కోట్ల మందిని ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు దగ్గర చేసింది. ఇక మూడో తరం ఇంటర్నెట్ పేరే ‘వెబ్ 3.0’. దీనికి బీజం పడింది 2014లోనే!. నో డామినేషన్ 2014లో బ్రిటన్ కంప్యూటర్ సైంటిస్ట్ గావిన్ వుడ్ ‘ఎథెరియం’(క్రిప్టోకరెన్సీ) రూపొందించాడు. ఎథెరియం ప్రకారం.. ఇంటర్నెట్ను వికేంద్రీకరించడమే 3.0 ఉద్దేశం. అంటే.. బ్లాక్‌చెయిన్ ఆధారంగా ఇంటర్నెట్ను డీసెంట్రలైజ్డ్ చేయడం. తద్వారా గూగుల్, ఫేస్‌బుక్‌లాంటి దిగ్గజాల ఆధిపత్యం ఇంటర్నెట్లో నడవదు. ఇంటర్నెట్ యూజర్ కాస్త యజమాని అవుతాడు. ఇందులో భాగంగానే ప్రతీదానికి బ్లాక్చెయిన్స్తో ముడిపడి ఈ తరం ఇంటర్నెట్ నడుస్తోంది. టైం పట్టొచ్చు వెబ్3.0లో ఎలాంటి సేవలు వినియోగించుకోవాలన్నా.. ఎవరి అనుమతులు అక్కర్లేదు. ఎవరూ బ్లాక్ చెయ్యరు. సేవల్ని వినియోగించుకోవడానికి తిరస్కరించరు. టోకెన్స్, క్రిప్టోకరెన్సీల ఆధారంగా చెల్లింపులు చేసే వెసులుబాటు ఉంటుంది. ఒకరకంగా వెబ్ 3.0 వల్లే క్రిప్టో కరెన్సీ, ఎన్ఎఫ్టీలు చాలా ఏళ్ల క్రితమే వాడుకలోకి రాగలిగాయన్నమాట. అయితే ఇది ఇంటర్నెట్ను చూసే తీరును మార్చేస్తుందా? అంటే అవుననే చెప్పొచ్చు. కానీ, అందుకు చాలా టైం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే అది ఎక్కువ మందికి రీచ్ కావాలి కాబట్టి అని చెప్తున్నారు. ఎందుకు మెచ్చట్లేదు థర్డ్ జనరేషన్.. ఈ పదం వినడానికే టెక్ దిగ్గజాలు ఇష్టపడడం లేదు. వినడానికే దరిద్రంగా ఉందంటూ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఇంతకు ముందు కామెంట్ చేశాడు. తాజాగా ‘ఎవరైనా చూశారా? నాకైతే కనిపించలేదు. జస్ట్ అదొక మార్కెటింగ్ బజ్‌వర్డ్’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇక ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే ‘ఇంటర్నెట్ అనేది వెంచర్ క్యాపిటలిస్ట్‌లకు మాత్రమే సొంతమని, జనాలు దానిని పొందలేర’ని సోమవారం ట్వీట్ చేశాడు. వీళ్లిద్దరిదే కాదు యాపిల్ సీఈవో టిమ్ కుక్ సహా చాలామంది అభిప్రాయమూ ఇదే. ఈ తరహా ఇంటర్నెట్ను సాధారణ పౌరులు ఉపయోగించడం కష్టమని, కాబట్టి, ఇదొక విఫలయత్నంగా అభివర్ణిస్తున్నారు. అయితే థర్డ్జనరేషన్ ఇంటర్నెట్ ద్వారా యూజర్ సులువుగా బిలియనీర్ అయిపోవచ్చు. విపరీతంగా సంపాదించొచ్చు. రిస్క్ రేటు తక్కువే. ఈ కారణం చేతనే కుళ్లుకుంటున్నారని వాదించేవాళ్లు లేకపోలేదు. ఇక 90లో ఫోన్ల రాక సమయంలోనూ ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం అయ్యింది. కట్ చేస్తే.. పరిస్థితి ఏంటో తెలిసిందే కదా. అలా థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్ కూడా సక్సెస్ అయ్యి తీరుతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: భార్య చేసిన తప్పు.. వేల కోట్లు చెత్తపాలు! -
Elon Musk: పరాగ్‌పై వివాదాస్పద ట్వీట్.. రచ్చ
ట్విటర్ సీఈవోగా ఒక భారతీయుడు ఎంపిక కావడంపై మన దేశంలోనే కాదు.. మేధావి వర్గం నుంచీ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఉన్నపళంగా జాక్ డోర్సే తప్పుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో స్వతహాగా ఇలాంటి అంశాల్లో తల దూర్చే ఎలన్ మస్క్.. ఓ ట్వీట్ చేసి కాక రేపాడు. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తాజాగా ఓ ఫొటో ట్వీట్ చేశాడు. అది ఒక హిస్టారికల్ అండ్ కాంట్రవర్షియల్ ఫొటో. పై ఫ్రేమ్‌లో యూఎస్ఎస్ఆర్ నియంత జోసెఫ్ స్టాలిన్, స్టాలిన్ అంతరంగికుడు నికోలాయ్ యెజోవ్.. పక్కపక్కనే ఉంటారు. కానీ, కింద ఫ్రేమ్‌లో స్టాలిన్ ఫొటో మాత్రమే ఉంటుంది. అందుకు కారణం ఉంది. తొలినాళ్లలో స్నేహితులుగా ఉన్న నికోలాయ్-స్టాలిన్ మధ్య.. రాజకీయ పరిణామాలతో వైరం మొదలవుతుంది. ఈ తరుణంలో స్టాలిన్ ఆదేశాల మేరకే నికోలాయ్ హత్య కూడా జరిగిందని చెప్తారు. ఈ కారణంతోనే వీళ్లిద్దరూ సరదాగా గడిపిన ఫొటో తర్వాతి రోజుల్లో రష్యాలో సెన్సార్‌షిప్‌కు గురైంది. అలా స్టాలిన్ పక్క నుంచి నికోలాయ్ యెజోవ్ ఫొటోను తొలగించారు. అయితే ఈ సీరియస్ అంశాన్ని.. తర్వాతి రోజుల్లో సరదా కోణంలో వాడేసుకుంటున్నారు కొందరు. ఇక మస్క్ దానిని మరీ మించి వాడేశాడు. స్టాలిన్ బాడీకి ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ అగర్వాల్ తలను, నికోలాయ్ బాడీకి ట్విటర్ మాజీ సీఈవో డోర్సే తలను అంటించాడు. పైగా రెండో టెంప్లేట్లో డోర్సే పక్కనే ఉన్న కాలువలోకి విసిరివేయబడ్డట్లు ఫన్నీ కోణంలో ఉంది. దీంతో నెటిజనులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మస్క్‌ను తిట్టిపోస్తున్నారు. అదే టైంలో మస్క్‌కు తగ్గట్లుగానే కౌంటర్ మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. pic.twitter.com/OL2hnKngTx — Elon Musk (@elonmusk) December 1, 2021 ఇదిలా ఉంటే ఎలన్ మస్క్‌కు, జాక్ డోర్సేకు మాంచి స్నేహం ఉంది. ఇద్దరూ క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేయడమే కాదు.. గంజాయి ప్రియులు కూడా అంటూ గతంలో బోలెడు కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు కిందటి ఏడాది జాక్ ట్విటర్ సీఈవో పదవికి గండం ఏర్పడినప్పుడు.. జాక్కి మద్దతుగా నిలిచాడు కూడా. Just want say that I support @Jack as Twitter CEO. He has a good ❤️. — Elon Musk (@elonmusk) March 3, 2020 pic.twitter.com/IYAQasGJg3 — Patel Meet (@mn_google) December 1, 2021 pic.twitter.com/tUqINMQl8s — evolve (@evolvedzn) December 1, 2021 pic.twitter.com/tUqINMQl8s — evolve (@evolvedzn) December 1, 2021 ఇదీ చదవండి: పరాగ్ ఎంపికపై ఎలన్ మస్క్ ఏమన్నాడంటే.. -
ట్విటర్ కొత్త సీఈఓ నియామకంపై కంగనా ఆసక్తికర కామెంట్.. అలా అందేంటీ ?
Kangana Ranaut Comment On New Twitter CEO: కంగనా రనౌత్ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆమె దర్శకురాలిగా, నిర్మాతగా కూడా మారిన నటి. కానీ కంగనా పని చేయనప్పుడు, ఆమె ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఇష్టపడుతుంది. ఆమె ఎప్పుడూ ప్రతిదాని గురించి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది మరియు చాలా తరచుగా తన వ్యాఖ్యలతో వివాదాలను రేకెత్తిస్తుంది. ట్విట్టర్ సీఈఓగా జాక్ డోర్సీ స్థానంలో పరాగ్ అగర్వాల్ నియమితులవుతున్నట్లు ప్రకటించినప్పుడు ఈసారి కూడా అలాంటిదే జరిగింది. ఢాకాడ్ నటి ఈ వార్తలపై త్వరగా స్పందించింది మరియు అనేక మంది అభివృద్ధిని మరియు గర్వించదగిన క్షణాన్ని జరుపుకుంటున్నట్లుగా, కంగనా కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ట్విటర్ కొత్త సీఈఓ నియామకంపై కంగనా 'బై చాచా జాక్' అని రాసుకొచ్చింది. అయితే ఇంతకుముందు తన అభ్యంతరకరమైన ట్వీట్ల వల్ల ఆమెను ట్విటర్ నుంచి నిషేంధించారు. ఈ కొత్త అధికార మార్పుతో కంగనా మళ్లీ ట్విటర్‌లోకి అడుగుపెడుతుందేమో చూడాలి. ఇటీవల కూడా ఆమె ఒక పోస్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక జంట ఒకరినొకరు తమ చేతుల్లో పట్టుకున్న స్కెచ్‌ను షేర్ చేస్తూ 'నీ కోసమే మేము జీవిస్తున్నాం' అంటూ తన ప్రేమ జీవితం గురించి హింట్ ఇచ్చింది. ఇది చూసిన కంగనా అభిమానులు ఆమె ఎవర్నో ఒకర్ని మిస్ అవుతుందని అనుకుంటున్నారు. అంతకుముందు కూడా తన జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడని, రాబోయే కొన్నేళ్లలో తాను పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కనాలనుకుంటున్నానని పోస్ట్ చేసింది కంగనా. ఇది చదవండి: మిస్టర్ కంగనా రనౌత్ గురించి త్వరలోనే చెబుతా -
భారతీయుడి చేతికి ట్విట్టర్ పగ్గాలు.. సీఈవోగా ఐఐటీ ముంబై పూర్వ విద్యార్థి
శాన్ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ ప్రపంచంపై మరో భారతీయ అమెరికన్ తనదైన ముద్ర వేయనున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విట్టర్’ సీఈవోగా భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవో స్థానంలో ఉన్న సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్‌డార్సే సోమవారం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీతోపాటు.. డార్సే సైతం ట్విట్టర్లో ప్రకటించారు. పరాగ్ అగర్వాల్ ఇప్పటి వరకు ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో)గా పనిచేశారు. ఫైనాన్షియల్ పేమెంట్స్ కంపెనీ ‘స్క్వేర్’కు సైతం డార్సే చీఫ్‌గా ఉన్నారు. దీంతో సంస్థలో వాటాలు కలిగిన పెద్ద ఇన్వెస్టర్లు.. డార్సే రెండు బాధ్యతలను సమర్థవంతంగా నడిపించగలరా? అన్న సందేహాలను వ్యక్తం చేశారు. దీంతో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. వెళ్లిపోయే సమయం వచ్చింది ‘‘కంపెనీ వ్యవస్థాపకుడి నుంచి సీఈవో, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వరకు 16 ఏళ్లలో ఎన్నో బాధ్యతల్లో పనిచేశాను. కంపెనీని వీడే సమయం వచ్చిందన్న నిర్ణయానికి వచ్చేశాను. ఎందుకని? వ్యవస్థాపకుల నేతృత్వంలోని సంస్థ ప్రాముఖ్యం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. అంతిమంగా ఇది ఎన్నో పరిమితులకు దారితీస్తుందని, వైఫల్యానికి ఏకైక అంశంగా మారుతుందని భావిస్తున్నాను’’ అంటూ ట్విట్టర్ పేజీలోని తన పోస్ట్‌లో డార్సే వివరించారు. ఏకాభిప్రాయంతో ఎంపిక: ‘‘బోర్డు విస్తృత ప్రక్రియ, అన్ని ఆప్షన్లను పరిశీలించి ఏకాభిప్రాయంతో పరాగ్‌ను సీఈవోగా నియమించింది. కంపెనీని ఎంతో లోతుగా అర్థం చేసు కున్న పరాగ్ ముందు నుంచి నా ఎంపికే. సంస్థలో ప్రతీ కీలక నిర్ణయం వెనుక ఆయన ఉన్నా రు. పరాగ్ ఎంతో ఆసక్తి, పరిశీలన, సృజనాత్మకత, స్వీయ అవగాహన, వినయం కలిగిన వ్యక్తి. మనస్ఫూర్తిగా సంస్థను నడిపిస్తారు. నేను నిత్యం ఆయన నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను. సీఈవోగా ఆయన పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది’’అని డార్సే అన్నారు. 2022 లో డార్సే పదవీకాలం పూర్తయ్యే వరకు ట్విట్టర్ బోర్డులో కొనసాగుతారని కంపెనీ తెలిపింది. 11 ఏళ్లలోనే కీలక స్థానానికి.. పరాగ్ అగర్వాల్ ఐఐటీ బోంబేలో బీటెక్ విద్య పూర్తయిన తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. పదేళ్ల క్రితం 2011లో ట్విట్టర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరారు. ఆ సమయంలో సంస్థ ఉద్యోగులు 1,000 మందే ఉండడం గమనార్హం. 2018లో సీటీవో అయ్యారు. సీఈవోగా ఎంపిక కావడం తనకు గర్వకారణమని పరాగ్ ప్రకటించారు. ‘‘మీ (జాక్‌డార్సే) మార్గదర్శకత్వం, స్నేహానికి జోహార్లు. మీరు నిర్మించిన పని విధానం, సంస్కృతికి ధన్యుడను. సంస్థను కీలకమైన సవాళ్ల మధ్య నడిపించారు. దశాబ్దం క్రితం.. ఆ రోజులను నిన్నటిగానే భావిస్తాను. మీ అడుగుల్లో నడిచాను. ఉద్దాన, పతనాలు, సవాళ్లు, అడ్డంకులు, విజయాలు, తప్పులను స్వయంగా చూశాను. వీటన్నింటినీ మించి గొప్ప విజయాలను చూస్తున్నాను. గొప్ప అవకాశాలు మా ముందున్నాయి’’అని అగర్వాల్ ప్రకటించారు. భారతీయుల ముద్ర భారతీయుల అపార ప్రతిభా సామర్థ్యాలకు నిదర్శనంగా ఇప్పటికే పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను జన్మతః భారతీయులైన వారు దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈ జాబితాలోకి పరాగ్ అగర్వాల్ కూడా చేరిపోయారు. గూగుల్ (ఆల్ఫాబెట్) సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ, అడోబ్ సీఈవో శంతను నారాయణన్, మాస్టర్‌కార్డ్ సీఈవోగా అజయ్‌పాల్ సింగ్ బంగా తదితరులు తమ సత్తా చాటుతుండడం గమనార్హం. -
కోవిడ్ సంక్షోభం: భారత్‌కు మద్దతుగా ట్విటర్ భారీ విరాళం
వాషింగ్టన్: భారత్‌లో ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు నాలుగు లక్షలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. ఆక్సిజన్ కొరతతో రోజు వందల మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు, నటీనటులు, మల్టీనేషనల్ కంపెనీలు భారత్‌కు అండగా నిలుస్తున్నారు. కరోనాపై భారత్ చేస్తోన్న యుద్ధంలో ప్రపంచంలోని ఇతర దేశాలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయి.అంతేకాకుండా ప్రపంచంలోని టెక్ దిగ్గజ కంపెనీలు గూగల్, మైక్రోసాఫ్ట్ భారీ మొత్తంలో భారత్‌కు విరాళాలను ఇచ్చాయి. తాజాగా కరోనాపై భారత్ చేస్తోన్న పోరులో ట్విటర్ భారీ విరాళాన్ని కేటాయించింది. ట్విటర్ అధినేత జాక్ పాట్రిక్ డోర్సే సుమారు 15 మిలియన్ డాలర్లు (సుమారు రూ.110 కోట్ల) విరాళాన్ని భారత్‌కు అందిస్తున్నట్లు ట్విటర్లో తెలిపారు. భారత్‌లో కోవిడ్-19 ఎదుర్కొనేందుకుగాను పాటుపడుతున్న మూడు ఎన్జీవో సంస్థలకు విరాళాన్ని అందించాడు. ఈ విరాళాన్ని కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యుఎస్ఎ అనే మూడు ప్రభుత్వేతర సంస్థలకు విరాళంగా ఇచ్చినట్లు ట్విటర్ సీఈఓ జాక్ పాట్రిక్ డోర్సే సోమవారం ట్వీట్ చేశారు. కేర్ స్వచ్చంద సంస్థకు 10 మిలియన్ డాలర్లు, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషన్ యూఎస్ఏలకు 2.5 మిలియన్ డాలర్ల చొప్పున విరాళాన్ని కేటాయించాడు. ఈ విరాళాలతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్‌ట్రెటర్‌లు, వెంటిలేటర్లు, ఇతర మెడికల్ సౌకర్యాలను భారత్‌కు అందించనున్నారు.కాగా గత 24 గంటల్లో దేశంలో రికార్డుస్థాయిలో 3.66 లక్షలకు పైగా కొత్త కోవిడ్-19 కేసులు, 3754 మరణాలు నమోదైనాయి.దేశంలో కరోనా పరిస్థితులు, ఆక్సిజన్, నిత్యావసర మందుల సరఫరా కొరత నేపథ్యంలో బ్రిటన్, అమెరికా, సౌదీ అరేబియా, సింగపూర్ లాంటి దేశాలు ఇప్పటికే తమ సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. $15 million split between @CARE, @AIDINDIA, and @sewausa to help address the COVID-19 crisis in India. All tracked here: https://t.co/Db2YJiwcqc 🇮🇳 — jack (@jack) May 10, 2021 చదవండి: కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం -
భారీ ధర పలికిన జాక్ తొలి ట్వీట్.. ఎంతో తెలుసా?
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులకు కబుర్లు చెప్పేందుకు వచ్చిన సంస్థే ట్విటర్. మరి ఈ ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ తొలిసారిగా ట్విట్ చేసిన ట్విట్ ఏంటో తెలుసా?. మార్చి 21, 2006లో తొలి సారిగా ‘‘జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విటర్’’ అని జాక్ డోర్సీ పోస్టు చేశాడు. ఈ పోస్టు పెట్టి 2021 మార్చి 21నాటికి సరిగ్గా పదిహేను ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ ట్విట్ ప్రత్యేకత ఏంటో తెలుసా?. మీరు ఊహించని ధరకు అమ్ముడుపోవడమే. ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగమైన ట్విటర్లో పెట్టిన తొలి ట్వీట్‌ను జాక్ డోర్సీ ‘వాల్యుయబుల్స్ బై సెంట్’ వెబ్సైట్లో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని జాక్ డోర్సీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. జాక్ డోర్సీ 15 ఏళ్ల ట్వీట్ ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పటి వరకు పెట్టిన అత్యంత ప్రసిద్ధ ట్వీట్లలో ఇది ఒకటి. ఇప్పటి వరకు లక్షల మంది ఈ ట్వీట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ బిడ్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు దీనికి అందిన అత్యధిక ఆఫర్ 29,15,835.47 డాలర్లు(సుమారు రూ.21 కోట్లు). ఇంత ధర పెట్టి బ్రిడ్జ్ ఒరాకిల్ సంస్థ సీఈఓ సీనా ఎస్టావీ దీన్ని సొంతం చేసుకున్నారు. ఈ ట్వీట్‌ను కొనుగోలు చేసిన వారికి ట్విటర్ సీఈవో డిజిటల్‌గా ఆటోగ్రాఫ్ చేసిన డిజిటల్ సర్టిఫికెట్‌ను పొందుతారు. ట్విటర్ సీఈవో సంతకాన్ని క్రిప్టోగ్రఫీని ఉపయోగించి సంతకం చేస్తారు. ఇందులో అసలు ట్వీట్ యొక్క మెటాడేటాతో పాటు అది పోస్ట్ చేసిన సమయం వంటి వివరాలు ఉంటాయి. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని బిట్‌కాయిన్ రూపంలోకి మార్చి ‘గివ్ డైరెక్ట్లీస్ ఆఫ్రికా రెస్పాన్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని డోర్సీ ప్రకటించారు. ఈ సంస్థ ఆఫ్రికాలో కరోనా వైరస్ కారణంగా భాదపడుతున్న కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. చదవండి: తొలి ట్వీట్ ఖరీదు రూ.18.30 కోట్లు! -
తొలి ట్వీట్ ఖరీదు రూ.18.30 కోట్లు!
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులకు కబుర్లు చెప్పేందుకు వచ్చిన సంస్థే ట్విటర్. మరి ఈ ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ తొలిసారిగా ట్విట్ చేసిన ట్విట్ ఏంటో తెలుసా?. మార్చి 21, 2006లో తొలి సారిగా ‘‘జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విటర్’’ అని జాక్ డోర్సీ పోస్టు చేశాడు. మరి ఇది అంత మీకు ఎందుకు చెబుతున్నాను అంటే. ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగమైన ట్విటర్లో పెట్టిన తొలి ట్వీట్‌ను జాక్ డోర్సీ ‘వాల్యుయబుల్స్ బై సెంట్’ వెబ్సైట్లో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని జాక్ డోర్సీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. డోర్సే 15 ఏళ్ల ట్వీట్ ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పటి వరకు ఉన్న అత్యంత ప్రసిద్ధ ట్వీట్లలో ఇది ఒకటి. ఇప్పటి వరకు లక్షల మంది ట్వీట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ బిడ్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు దీనికి అందిన అత్యధిక ఆఫర్ 2.5మిలియన్ డాలర్లు(దాదాపు రూ.18.30 కోట్లు). 2.5మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఓ ఔత్సాహికుడు ముందుకు వచ్చారు. ఈ ట్వీట్‌ను కొనుగోలు చేసిన వారికి ట్విటర్ సీఈవో డిజిటల్‌గా ఆటోగ్రాఫ్ చేసిన డిజిటల్ సర్టిఫికెట్‌ను పొందుతారు. ట్విటర్ సీఈవో సంతకాన్ని క్రిప్టోగ్రఫీని ఉపయోగించి సంతకం చేస్తారు. ఇందులో అసలు ట్వీట్ యొక్క మెటాడేటాతో పాటు అది పోస్ట్ చేసిన సమయం వంటి వివరాలు ఉంటాయి. just setting up my twttr — jack (@jack) March 21, 2006 చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త! -
ట్రంప్ ట్విట్టర్ బ్యాన్.. స్పందించిన డోర్సే
వాషింగ్టన్: గత వారం క్యాపిటల్ హిల్ భవనంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం ట్విట్టర్ ట్రంప్ అకౌంట్‌ని శాశ్వతంగా బ్యాన్ చేసింది. మరోసారి ఇలాంటి విధ్వంసకర చర్యలు జరగకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా చర్యగా ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ని బ్యాన్ చేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే ట్రంప్ అకౌంట్ బ్యాన్పై స్పందించారు. ఈ నిర్ణయం సరైనదే కానీ ఇందుకు తానేం గర్వపడటం లేదని.. పైగా ఇలాంటి చర్యలతో మాట్లాడే స్వేచ్ఛను హరించినట్లే అని అభిప్రాయపడ్డారు. ‘స్పష్టమైన మినహాయింపులు ఉన్నప్పటికీ.. చివరకు నిషేధం విధించాల్సి వచ్చింది అంటే మేం ఆరోగ్యకరమైన సంభాషణను ప్రోత్సహించడంలో విఫలమయ్యామని నేను భావిస్తున్నాను అన్నారు’ డోర్సే. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్స్ చేశారు. (చదవండి: ట్రంప్ బ్యాన్ : ట్విటర్ నష్టం ఎంతో తెలుసా? ) ‘ఆన్లైన్ ప్రసంగం వల్ల ఆఫ్‌లైన్‌లో హానీ కలగడం అనేది వాస్తవం. అందువల్ల బ్యాన్ విధించడం కరెక్టే. కానీ అది ప్రజా సంభాషణని విచ్ఛిన్నం చేస్తుంది. విభజన, స్పష్టత, విముక్తి, అభ్యాసం సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి.. ఇలాంటి ముందస్తు చర్యలు ప్రమాదకరమైనవని నేను భావిస్తున్నాను’ అన్నారు డోర్సే. అంతేకాక ఇలాంటి చర్యల వల్ల ఒపెన్ ఇంటర్నెట్ ఉద్దేశం, ప్రయోజనాలు దెబ్బతింటాయని డోర్సే ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్‌పై నిషేధం విధించడాన్ని పలువురు రిపబ్లికన్లు తప్పు పట్టారు. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కూడా వీరి జాబితాలో ఉన్నారు. ఈ మేరకు మెర్కెల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పరిమితులను శాసనసభ సభ్యులు నిర్ణయించాలి తప్ప ప్రైవేటు సంస్థలు కాదు’ అన్నారు మెర్కెల్. (చదవండి: అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్) I do not celebrate or feel pride in our having to ban @realDonaldTrump from Twitter, or how we got here. After a clear warning we’d take this action, we made a decision with the best information we had based on threats to physical safety both on and off Twitter. Was this correct? — jack (@jack) January 14, 2021 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని సవాలు చేస్తూ ట్రంప్ పదేపదే నిరాధారమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారం రోజుల క్రితం అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు కాంగ్రెస్ సమావేశం అయ్యింది. ఇదే సమయంలో ట్రంప్ మద్దతుదారలు క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ట్రంప్ అభిశంసనను ఎదుర్కొన్నారు. ఇక అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. -
అమెరికాలో హ్యాకింగ్ కలకలం..
-
అమెరికాలో హ్యాకింగ్ కలకలం..
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో హై ప్రొఫైల్ ట్విటర్ అకౌంట్లే లక్ష్యంగా హ్యాకర్లు రెచ్చిపోయారు. వారి ట్విటర్ అకౌంట్లను హ్యాక్ చేసి బిట్‌కాయిన్ అడ్రస్‌కి వెయ్యి డాలర్లు పంపిస్తే, వెంటనే తిరిగి రెట్టింపు సొమ్ము పంపిస్తామంటూ మోసపూరిత ట్వీట్లు చేశారు. బ్లూ టిక్ ఉన్న అకౌంట్ల నుంచి ఈ ట్వీట్లు రావడంతో నిజమేననుకొని వారి అభిమానులు కొందరు భారీ మొత్తంలో హ్యాకర్లకు డబ్బులు కూడా పంపించినట్టు తెలుస్తోంది. హ్యాకింగ్‌కు గురైన అకౌంట్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్, అపర కుబేరులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, నటి కిమ్ కర్ధాషియన్లతోపాటూ పలువురు ప్రముఖులు ఉన్నారు. (అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఊరట) హ్యాకింగ్ ఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే పేర్కొన్నారు. నష్టాన్ని నివారించే పనిలో ఉన్నామని, హ్యాకింగ్‌కు పాల్పడింది ఎవరనే దానిపై ఆరా తీస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ట్వీట్ చేశారు. (కరోనా: అమెరికాలో రికార్డు స్థాయిలో కేసులు) Tough day for us at Twitter. We all feel terrible this happened. We’re diagnosing and will share everything we can when we have a more complete understanding of exactly what happened. 💙 to our teammates working hard to make this right. — jack (@jack) July 16, 2020 -
నిజం కాదు: అక్రమం అంతకంటే కాదు!
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ల మధ్య వార్ కొనసాగుతోంది. ట్విటర్ తీసుకునే నిర్ణయాలు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉండటంతో ఆయన మండిపడుతున్నారు. జూన్ 3వ తేదీన జార్జ్ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలంటూ చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ట్రంప్ విడుదల చేసిన వీడియోను కాపీరైట్ సమస్య పేరిట ట్విటర్ తొలిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్ నిర్ణయంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ట్విటర్ చర్యలు డెమోక్రట్స్‌కు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయన్నారు. ‘‘శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారికి ట్రంప్ సానుభూతి తెలుపుతున్నారు. వాళ్లు(ట్విటర్) రాడికల్ లెఫ్ట్ డెమోక్రట్స్ కోసం పోరాడుతున్నారు. ( బఫెట్ తప్పు చేశారు: ట్రంప్ ) ఒకరి పక్ష్యం వహిస్తున్నారు. సెక్షన్ 230 ప్రకారం ఇది అక్రమం’’ అంటూ ఓ పత్రిక ప్రచురించిన వార్తను ట్రంప్ ట్వీట్ చేశారు. అనంతరం యూఎస్ లా ‘‘ఇంటరాక్టివ్ కంప్యూటర్ సర్వీస్’’ను గుర్తు చేశారు. అయితే దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే .. ‘‘ ట్రంప్ ట్వీట్‌పై కాపీరైట్ సమస్య వచ్చింది. ఓ వ్యక్తి దానిపై ఫిర్యాదు చేశాడు. అందుకే దాన్ని తొలిగించాము. ఆయన ఆరోపణలు నిజం కాదు.. అక్రమం అంతకంటే కాదు’’ అని పేర్కొన్నారు. -
ట్విటర్ గూటికి గూగుల్ మాజీ సీఎఫ్ఓ
సాక్షి, న్యూఢిల్లీ: ట్విటర్ చైర్మన్ గా గూగుల్ మాజీ సీఎఫ్ఓ పాట్రిక్ పిచెట్ నియమితులయ్యారు. ప్యాట్రిక్ పిచెట్ను బోర్డు ఛైర్మన్‌గా నియమించినట్లు ట్విటర్ నిన్న ( జూన్ 2, మంగళవారం) ప్రకటించింది. ప్రస్తుత డైరెక్టర్ ఓమిడ్ కోర్డెస్టా స్థానంలో తాజా నియామకం జరిగినట్టు తెలిపింది. ఓమిడ్ స్వతంత్ర డైరెక్టరుగా కొనసాగుతారని ట్విటర్ వెల్లడించింది. ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జాక్ డోర్సీని కొనసాగించడానికి అనుమతించే ఒప్పందంలో భాగంగానే ఈ నియామకమని భావిస్తున్నారు. ట్విటర్ అతిపెద్ద పెట్టుబడిదారు ఇలియట్ మేనేజ్మెంట్ సంస్థ డోర్సీని తొలగించేందుకు యత్నించిన మూడు నెలల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఛైర్మన్‌గా, పిచెట్ సంస్థ నిర్వహణ స్థిరత్వానికి, ఆర్థిక సాధికారితపై దృష్టి కేంద్రీకరించనున్నారని అంచనా. మరోవైపు తన నియామకంపై స్పందించిన పిచెట్ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దే క్రమంలో తన నియామకమనీ, ట్విటర్ మంచి పాలన పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ట్విటర్ ఫ్యాక్ట్ చెక్ వివాదంలో ట్విటర్ వైఖరిని పిచెట్ బహిరంగంగా సమర్థించారు. 2008-15 వరకు గూగుల్ సీఎఫ్ఓగా పనిచేసిన పిచెట్, కెనడియన్ వెంచర్ క్యాపిటల్ సంస్థ ఇనోవియా క్యాపిటల్‌లో సాధారణ భాగస్వామిగా ఉన్నారు. 2015 వరకు ట్విటర్ బోర్డు ఛైర్మన్ గా ఉన్న ఓమిడ్ కూడా గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ కావడం విశేషం. -
నేను రెడీ, ఉద్యోగులను లాగొద్దు : ట్విటర్ సీఈఓ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్, సామాజిక మాధ్యమం ట్విటర్ మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతోంది. బిగ్ యాక్షన్ ఉండబోతోంది అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ట్వీట్‌పై ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే స్పందించారు. ‘ఓ కంపెనీగా, సంస్థ చర్యలకు ఎవరో ఒకరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు నేను సిద్ధం. దయచేసి నా ఉద్యోగులను ఈ వ్యవహారంలోకి లాగొద్దు. ట్విటర్ కొనసాగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల గురించి తప్పుడు వార్తలు లేదా వివాదాస్పద సమాచారాన్ని ఎత్తి చూపుతూనే ఉంటుంది. మేము ఏవైనా తప్పులు చేస్తే అంగీకరించి సరిచేసుకుంటాము’ అని డోర్సే పేర్కొన్నారు. ‘‘ఫ్యాక్ట్ చెకింగ్ అనేది మమ్మల్ని సత్యానికి మధ్యవర్తిగా చేయదు. మా ఉద్దేశ్యం విరుద్ధమైన ప్రకటనలను గుర్తించి, వివాదంలో ఉన్న సమాచారాన్ని ఎత్తిచూపడం మాత్రమే. తద్వారా ప్రజలు తమకు తాముగా ఏది సత్యమో తెలుసుకోవొచ్చు. మా నుండి మరింత పారదర్శకత చాలా కీలకం కాబట్టి మా చర్యల వెనుక ఉన్న కారణాలను ప్రజలు స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది’’ అని డోర్సే ట్వీట్ చేశారు. ట్రంప్ చేసిన ట్వీట్లు రెండింటి కింద ‘నిజానిజాలు నిర్ధారించుకోవాల్సి ఉంది’ అనే ట్యాగ్‌ను ట్విటర్ తగిలించడం ట్రంప్‌కు కోపం తెప్పించిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్లతో అవకతవకలు జరిగే చాన్సుందని ట్రంప్ మంగళవారం ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు దిగువభాగంలో నీలిరంగు ఆశ్చర్యార్థకం చిహ్నాన్ని ట్విట్టర్ తగిలించింది. అంటే అందులోని నిజానిజాలను నిర్ధారించుకోవాల్సి ఉందని అర్థం. దీంతో ట్రంప్‌కు కోపమొచ్చింది. ‘ట్విట్టర్ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోంది. మెయిల్ఇన్ బ్యాలెట్లపై నా ప్రకటన సరికాదని వాళ్లు చెబుతున్నారు. ఫేక్ న్యూస్ ప్రసారం చేసే సీఎన్ఎన్, అమెజాన్, వాషింగ్టన్ పోస్ట్‌ల ఆధారంగా నిజానిజాలను నిర్ధారించుకోమంటున్నారు’ అని ట్విటర్‌పై ట్రంప్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సంస్థలనే బంద్ చేయిస్తానంటూ ట్రంప్ చిందులు తొక్కారు. అటువంటి ఎకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకు ఆయనకు అధికారాలు లేకపోయినప్పటికీ ఈ విధంగా తన కోపాన్ని ప్రదర్శించారు. సంప్రదాయిక అభిప్రాయాల గొంతునొక్కేందుకు టెక్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అలా జరిగే లోపే వాటిని కట్టిడి చేసేందుకు, లేదా బంద్ చేసేందుకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా చట్టాల ప్రకారం కంపెనీలను మూసేసే చట్టం తీసుకురావాలంటే అందుకు తొలుత చట్ట సభల ఆమోదం కావాలి. ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ సంస్థ అమోదం కూడా అవసరం అవుతుంది. -
కరోనా : ట్విటర్ సంచలన నిర్ణయం
శాన్ఫ్రాన్సిస్కో: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో సోషల్ మీడియా, టెక్ దిగ్గజం ట్విటర్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులు ఎప్పటికీ వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి సంస్థగా ట్విటర్ అవతరించింది. ట్విటర్ సీఈవో జాక్ డోర్సే మంగళవారం కంపెనీ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకి ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రిమోట్‌గా పనిచేసుకునే అవకాశమున్న తమ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటినుంచే పనిచేసుకోవచ్చని ట్విటర్ ప్రకటించింది. సెప్టెంబరుకు ముందు చాలా కార్యాలయాలను తిరిగి తెరిచే అవకాశం లేనందున ఆఫీసుకు రావాలా వద్దా అనేది స్వయంగా వాళ్లే నిర్ణయించుకోవచ్చని వెల్లడించింది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విటర్ హెచ్ ఆర్ చీఫ్ జెన్నిఫర్ క్రైస్ట్ వెల్లడించారు. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో ఇది ఊహించని నిర్ణయమని పేర్కొన్నారు. సీఈవో జాక్ డోర్సే 2020 మధ్యలో మూడు నుండి ఆరు నెలల వరకు ఆఫ్రికాకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ ప్రస్తుత సంక్షోభ కాలంలో దానిని వాయిదా వేసుకున్నారు. (మెగా ప్యాకేజీ : భారీ లాభాలు) మరోవైపు కరోనా , లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే ఫేస్బుక్, గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులలో చాలా మందిని ఈ సంవత్సరం చివరి వరకు ఇంటినుంచే పనిచేయడానికి అనుమతించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన సన్నాహకాలకుగాను మే 22 న ఒక రోజు సెలవు తీసుకోవాలని ఉద్యోగులను కోరినట్లు గూగుల్ గత వారం తెలిపింది. కాగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 4.2 మిలియన్లకు పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. చాలా దేశాలలో కఠినమైన లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రజారవాణా, వ్యాపార వ్యవస్తలు స్థంభించిపోయీయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పరిస్థితులలో, పనివేళ్లలో కీలక మార్పుల చోటు చేసుకోనున్నాయి. -
కరోనా : ట్విటర్ సీఈఓ భారీ విరాళం
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారిపై పోరుకు మద్దుతుగా ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో జాక్ డోర్సే ముందుకొచ్చారు. కరోనా సంక్షోభ సమయంలో తన వంతు బాధ్యతగా వంద కోట్ల (ఒక బిలియన్) డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్-19 సహాయక చర్యలకు మద్దతుగా ఈ నిధులను అందిస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. తన సంపదలో 28 శాతం తన ఛారిటీ సంస్థ స్టార్ట్ స్మాల్ ఎల్ఎల్సి ద్వారా గ్లోబల్ కోవిడ్ -19 రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్టు డోర్సే ట్వీట్ చేశారు. ప్రజలకు సహాయపడటానికి ఈ రోజు మనం చేయగలిగినదంతా చేద్దామని, తన నిర్ణయం ఇతరులకు ప్రేరణగా నిలవాలని ఆశిస్తున్నానంటూ వరుస ట్వీట్లలో వెల్లడించారు. డిజిటల్ పేమెంట్ గ్రూప్‌నకు సంబంధించిన తన వాటా నుంచి ఈ మొత్తాన్ని బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం జాక్ డోర్సీ ఆదాయం 3.3 బిలియన్ డాలర్లు. తన సంపదలో నాలుగింట ఒక వంతు మొత్తాన్ని అతని ఛారిటీ ఫండ్‌కు విరాళంగా ఇస్తానని, అన్ని విరాళాల వివరాలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుంటాంటూ దీనికి సంబంధించిన లింక్ ను కూడా షేర్ చేశారు జాక్ డేర్సే. ఈ మహమ్మారి నుంచి బయటపడిన అనంతరం తాము కనీస ఆదాయం పథకం, బాలికల ఆరోగ్యం , విద్యపై దృష్టిని కేంద్రీకరిస్తామని చెప్పారు. I’m moving $1B of my Square equity (~28% of my wealth) to #startsmall LLC to fund global COVID-19 relief. After we disarm this pandemic, the focus will shift to girl’s health and education, and UBI. It will operate transparently, all flows tracked here: https://t.co/hVkUczDQmz — jack (@jack) April 7, 2020 -
వారానికి ఏడుసార్లే. మరోసారి వార్తల్లో ట్విటర్ సీఈవో
సెలబ్రెటీల జీవన విధానాలు తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ట్విటర్ సీఈవో జాక్ డోర్సీ మరోసారి తన ఆరోగ్యం, ఆహారంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తను వారానికి ఏడుసార్లు మాత్రం భోజనం చేస్తానని వెల్లడించి వార్తల్లో నిలిచాడు. డార్సే బుధవారం యూట్యూబ్ యూజర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అలాగే ఆహార నియమాల గూర్చి మరోసారి ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. తాను వారంలో ఏడు సార్లు భోజనం చేస్తానని..అది కూడా రాత్రి డిన్నర్ మాత్రమే చేస్తానని తెలిపారు. దైనందిన జీవన శైలిలో యోగ విపాసనను పాటిస్తానని..అప్పుడప్పుడు ఉపవాసాలు కూడా ఉంటానని తెలిపాడు. తాను నిత్యం ఐస్ బాత్‌తో (మంచు) స్నానం చేసి రెండు గంటల పాటు ధ్యానం చేస్తానని అన్నాడు. ఈ సందర్భంగా చాలా ప్రశ్నలు ఎడిట్ బటన్, స్పెల్ చెక్ లాంటి సాంకేతిక అంశాలపై అడిగినప్పటికీ, వ్యక్తిగత ప్రశ్నలు, ఆయన జీవన శైలికి సంబంధించిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. కొంత మంది నెటిజన్లు ఆయనపై సెటైర్లు కూడా పేల్చారు. గతంలోవారానికి అయిదుసార్లు అని ప్రకటించిన డోర్సీ, ఇపుడు ఆ కోటాను 7కు పెంచాడని చమత్కరించడం గమనార్హం. తన ఆహారంలో (డిన్నర్) చేపలు, చికెన్, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటానని గత మార్చిలో చెప్పిన విషయం తెలిసిందే. తాను ప్రతి రోజు ఉత్సాహంగా పని చేస్తానని..ఈ నేపథ్యంలోనే మంచంపై ఒరిగిన పది నిముషాల్లోనే నిద్ర తనను పలకిరస్తుందని చెప్పుకొచ్చారు. ప్రతి రోజు విటమిన్ ‘సీ’ ని తీసుకుంటానని అన్నారు. ఉదయం ఐస్‌బాత్ చేస్తానని దీంతో కేవలం పదిహేను నిముషాల్లోనే తన మెదడు ఉత్సాహవంతంగా పనిచేస్తుందని అన్నారు. సాయంత్రం మరోసారి మూడు నిమిషాల పాటు ఐస్ బాత్ చేసి సేద తీరుతానని డోర్సీ తెలిపారు. చదవండి: ట్విటర్ సీఈవో అకౌంట్ హ్యాక్ -
రాజకీయ ప్రచారానికి ట్విట్టర్ నో!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వేదికపై రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. వాణిజ్య ప్రకటనలకు ట్విట్టర్ శక్తిమంతమైన వేదికైనప్పటికీ రాజకీయాల విషయానికి వచ్చేసరికి ఎన్నో సమస్యలున్నాయని, ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాడుకుంటే కోట్లాదిమందిపై ప్రభావం పడుతుందని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ చెప్పారు. -
ట్విటర్ సంచలన నిర్ణయం
సోషల్‌మీడియా దిగ్గజం ట్విటర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఫేక్‌న్యూస్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రకటనలు, రాజకీయ ప్రకటనలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అన్ని రాజకీయ ప్రకటనలను తన వేదిక నుండి నిషేధించింది. వచ్చే నెల నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. తన వేదికపై రాజకీయ ప్రకటనలను నిషేధిస్తుందని ట్విటర్ చీఫ్ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే బుధవారం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో అన్ని రాజకీయ ప్రకటనలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాము. రాజకీయ సందేశాలు ప్రజలకుచేరాలి తప్ప కొనకూడదు" అని డోర్సే ట్వీట్ చేశారు. ఈ విధానం గురించి మరిన్ని వివరాలను నవంబర్ 15న వెల్లడిస్తామని, నవంబర్ 22 వ తేదీ నుంచి అన్ని రాజకీయ ప్రకటనలను అంగీకరించడం మానేస్తామని డోర్సే చెప్పారు. మరోవైపు ట్విటర్ తీసుకున్న ఈ నిర్ణయం డెమొక్రాట్ల ప్రశంసంలందుకోగా డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార కమిటీ అపహాస్యం చేయడం గమనార్హం. We’ve made the decision to stop all political advertising on Twitter globally. We believe political message reach should be earned, not bought. Why? A few reasons…🧵 — jack 🌍🌏🌎 (@jack) October 30, 2019 We’ll share the final policy by 11/15, including a few exceptions (ads in support of voter registration will still be allowed, for instance). We’ll start enforcing our new policy on 11/22 to provide current advertisers a notice period before this change goes into effect. — jack 🌍🌏🌎 (@jack) October 30, 2019 -
ట్విటర్ సీఈవో అకౌంట్ హ్యాక్
ట్విటర్ సీఈవో, సహ వ్యవస్థపాకుడు జాక్ డోర్సీ ట్విటర్ ఖాతాకే దిక్కులేకుండా పోయింది. డోర్సీ ఖాతాను శుక్రవారం మధ్యాహ్నం హ్యాక్ చేసిన హ్యాకర్లు వివాదాస్పద ట్వీట్లతో దడ పుట్టించారు. ప్రధానంగా ట్విటర్ ప్రధాన కార్యాలయంలో బాంబు వుందంటూ ట్వీట్ చేయడం కలకలం రేపింది. దీంతోపాటు జాత్యహంకార, దేశ విద్రోహపూరిత కామెంట్లు ఉండటంతో కొంతమంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. దాదాపు 4 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్న ట్విటర్ సీఈవో ఎకౌంట్‌నే హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు భారీ షాకిచ్చారు. స్వయంగా సంస్థ సీఈవో ఖాతాకు భద్రత లోపించడం చర్చనీయాంశమైంది. దాదాపు పదిహేను నిమిషాల పాటు ఆయన ఖాతాను స్వాధీనం చేసుకున్న హ్యకర్లు అనుచిత ట్వీట్లు చేశారు. నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ నిర్దోషి, అమాయకుడంటూ ట్వీట్ చేశారు. నల్లజాతీయులు, యూదుల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ట్విటర్ ప్రధాన కార్యాలయంలో బాంబు ఉందని సూచించే ట్వీట్ కూడా ఉంది. అయితే హ్యాకింగ్‌ను పసిగట్టిన భద్రతా సిబ్బంది డోర్సీ ఖాతాను వెంటనే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒక గంటలోపు సదరు ట్వీట్లను, రీట్వీట్లను తొలగించారు. కొన్ని ట్విటర్ ఖాతాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసారు.. మరోవైపు డోర్సీ ట్విటర్ ఎకౌంట్ ఎలా హ్యాక్ అయిందన్న దానిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు ట్విటర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. భద్రతా పరిశోధకుడు బ్రియాన్ క్రెబ్స్ మాట్లాడుతూ, సిమ్ మార్పిడి లేదా బాధితుడి ఫోన్ నంబర్‌ద్వారా హ్యాకింగ్ జరిగినట్టు గుర్తించామన్నారు. మొబైల్ ప్రొవైడర్ భద్రతా లోపం కారణంగా అకౌంట్ తో లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను హ్యక్ చేసారన్నారు. కాగా డోర్సీ ఖాతా హ్యాక్ అవడం ఇదే మొదటిసారి కాదు. 2016లో కూడా ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంది. దీంతోపాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ట్విట్టర్ ఖాతాలను కూడా హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. -
ట్విట్టర్‌కి అల్టిమేటం జారీ చేసిన పార్లమెంటరీ కమిటీ
-
ట్విటర్ సీఈవోపై భగ్గుమన్న బ్రాహ్మణులు
న్యూఢిల్లీ : ట్విటర్ సీఈవో జాక్ డోర్సీ ప్రదర్శించిన ఓ పోస్టర్ వివాదాస్పదమైంది. భారత పర్యటనలో భాగంగా ఇటీవల కొంత మంది మహిళా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. ఓ ఫొటోకు ఫోజిస్తూ.. ఓ పోస్టర్‌ను ప్రదర్శించారు. ఈ ఫొటోను ఆ సమావేశానికి హాజరైన ఓ జర్నలిస్ట్ తన ట్విటర్ ఖాతాలో ‘మహిళా జర్నలిస్టులు, రచయితలు, సామాజిక కార్యకర్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భాగమయ్యాను. భారత్‌లో ట్విటర్ అనుభవంపై చర్చించాం. చాలా సంతోషంగా ఉంది.. ఈ సంభాషణను వర్ణించడానికి మాటలు రావడం లేదు’ అని క్యాఫ్షన్‌గా పేర్కొన్నారు. అయితే ఈ ఫొటోలో జాక్ డోర్సీ ప్రదర్శించిన పోస్టర్లో ‘బ్రాహ్మణిక పితృస్వామ్యం నశించాలి’ అని రాసుంది. దీంతో బ్రాహ్మణుల అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కేవలం వామపక్షవాదులతోనే ఎందుకు సమావేశమయ్యారని నిలదీస్తున్నారు. ట్విటర్ ఒక వర్గానికే కొమ్ము కాస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘాటు కామెంట్లతో స్పందించిన ట్విటర్.. జాక్ డోర్సీ కావాలని ఆ పోస్టర్ ప్రదర్శించలేదని, ఆ సమావేశానికి వచ్చిన ఓ దళిత కార్యకర్త ఆమె అనుభవాలు పంచుకోవడంతో పాటు.. ఆ పోస్టర్‌ను ఆఫర్ చేయడంతో పట్టుకున్నారని వివరణ ఇచ్చింది. ట్విటర్ అందరి వాదనలు వింటుందని స్పష్టం చేసింది. -
ట్విట్టర్ భలే బీట్ చేసింది!
ట్విట్టర్ తెలియని వారెవరూ ఉండరు. సామాజిక మాధ్యమంలో దీనికెంతో పేరుంది. అయితే కొన్ని క్వార్టర్లుగా కంపెనీ యూజర్ల బేస్ తగ్గి, లాభాలు రాక, నష్టాల్లో మునిగితేలుతోంది. ఈ కంపెనీని అమ్ముదామనుకుని శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, ఆర్థిక నష్టాలను తలకెత్తుకోవడానికి ఏ కంపెనీ ఆసక్తి చూపలేదు. ఆసక్తికరంగా ఎన్నో క్వార్టర్లలో నిరాశపరిచే ఫలితాలను ప్రకటించిన ట్విట్టర్ మొదటిసారి అంచనాలను అధిగమించింది. ఆదాయాలు, రాబడులలో అంచనావేసిన దానికంటే మెరుగ్గా బుధవారం తన ఫలితాలను ప్రకటించింది. ఈ కంపెనీ యాక్టివ్ యూజర్ల బేస్ నెలకు 328 మిలియన్లకు చేరినట్టు ట్విట్టర్ తెలిపింది. ఇది అంచనావేసిన దానికంటే ఏడు మిలియన్లు ఎక్కువని తెలిసింది. అదేవిధంగా గత క్వార్టర్ కంటే కూడా 9 మిలియన్లు ఎక్కువట. అదేవిధంగా కంపెనీ రెవెన్యూలు 548 మిలియన్ డాలర్లుగా ఉన్నాయని కంపెనీ సీఈవో జాక్ డోర్సే ప్రకటించారు. ఒక్క షేరుపై ఆర్జించే ఆదాయం కూడా 11 శాతం ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ రెండూ వాల్ స్ట్రీట్ అంచనావేసిన దానికంటే ఎక్కువని తెలిసింది. అయితే ఒక్కో షేరుపై ఈపీఎస్ 1 శాతం మాత్రమే ఉంటుందని విశ్లేషకులు అంచనావేశారు. అదేవిధంగా రెవెన్యూలు కూడా 511.9 మిలియన్ డాలర్లుగానే ఉంటాయని తెలిపారు. వీరి అంచనాలను ట్విట్టర్ బీట్ చేసింది. రోజువారీ వాడకం వరుసగా నాలుగో క్వార్టర్ లోనూ ఏడాది ఏడాదికి 14 శాతం పెంచుకున్నట్టు కంపెనీ పేర్కొంది. అయితే డైలీ యాక్టివ్ యూజర్ నెంబర్ ను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఫలితాల ప్రకటనాంతరం ప్రీమార్కెట్ ట్రేడింగ్ లో కంపెనీ షేర్లు 11 శాతం పైకి ఎగిశాయి. ట్వీట్లకు తేలికగా రిప్లై ఇవ్వడానికి, సంభాషణ కొనసాగించడానికి కంపెనీ పలు మార్పులను చేపట్టినట్టు డోర్సే చెప్పారు. సెర్చ్, బ్రౌజ్, లైవ్ కంటెంట్ అందించే సామర్థ్యాన్ని పెంచామన్నారు. -
ట్విట్టర్ యూజర్లకు ఆ ఫీచర్ వచ్చేస్తోంది!
సామాజిక మాధ్యమిక సాధనాల్లో ఒకటైన ట్విట్టర్ తన వినియోగదారులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. యూజర్లు తమ ట్వీట్లను ఎడిట్ చేసుకునేలా అవకాశం కల్పించేందుకు సన్నద్ధమవుతోంది. యూజర్లకు అనుకూలంగా ట్విట్టర్‌ను మార్చాలని భావించిన కంపెనీ సీఈవో జాక్ డోర్సే ప్రజల అభిప్రాయాల కోసం గురువారం ఓ ట్వీట్ చేశారు. 2017 ట్విట్టర్లో మెరుగుపరచదలిచిన లేదా సృష్టించదగిన అత్యంత ముఖ్యమైన విషయమేమిటని ట్విట్టర్లో కోరారు. దీనికి సమాధానంగా చాలామంది యూజర్లు ఎడిటింగ్ ట్వీట్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తేవాలని కోరారు. అదేవిధంగా ట్వీట్లను ఆర్గనైజ్ చేసుకునేలా అవకాశం కల్పించాలన్నారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగా త్వరలోనే ట్వీట్లను ఎడిట్ చేసుకునే ఫీచర్‌ను తీసుకొస్తామని డోర్సే పేర్కొన్నారు. ఒకే ట్వీట్‌పైనే వివిధ వెర్షన్లలో యూజర్లు సమీక్షించాల్సినవసరం కూడా ఉందన్నారు. అదేవిధంగా ట్విట్టర్లో వచ్చే అంశాలపై కూడా పారదర్శకత తీసుకురావడానికి అత్యధిక ప్రాముఖ్యం ఇవ్వాలని యూజర్లు కోరారు. సోషల్ నెట్వర్కింగ్లో ఎక్కువగా పాపులర్ అయిన ట్విట్టర్ ఎన్నికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన యూజర్ల వృద్ధి రేటును మాత్రం పెంచుకోలేకపోతోంది. ప్రజల ట్వీట్ల మేరకు ట్విట్టర్‌ను రీడిజైన్ చేయాలని భావిస్తోంది. 140 క్యారెక్టర్ లిమిట్ నుంచి వీడియోలను, ఫోటోలను ట్విట్టర్ వైదొలగించింది. సైట్‌పై లైవ్ 360 డిగ్రీ వీడియోలను నిన్ననే ట్విట్టర్ ఆవిష్కరించింది. Following in the footsteps of Brian Chesky: what's the most important thing you want to see Twitter improve or create in 2017? #Twitter2017 @jack Ability to edit tweets and organize Twitter lists. — Anthony Quintano (@AnthonyQuintano) December 29, 2016 -
ట్విట్టర్ సీఈవో అకౌంట్ కూడా..
ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ ట్విట్టర్ అకౌంట్ కూడా శనివారం హ్యాకింగ్‌కు గురయింది. ఇటీవలే ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ల సోషల్ మీడియా అకౌంట్లను అవర్ మైన్ గ్రూప్ హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. జాక్ డార్సీ ట్విట్టర్ అకౌంట్ ను అవర్ మైన్ గ్రూప్ హ్యాక్ చేసి, అదే అకౌంట్లో హ్యక్ చేసినట్టు వెల్లడించింది. జాక్ డార్సీ ఫాలోవర్స్ 3.73 మిలియన్ల మందికి ఈ హ్యాకింగ్ విషయాన్ని అవర్ మైన్ ప్రచారం చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ లను తొలగించినా.. ఆ హ్యాకింగ్ స్క్రీన్ షాట్ లు బయటికి వెల్లడించింది. కానీ ఈ గ్రూప్ అకౌంట్ల హ్యాకింగ్ కు ఎలా పాల్పడుతుందో క్లియర్ గా తెలియడం లేదు. సోషల్ నెట్ వర్క్ ల సిస్టమ్ దొంగతనం వల్ల హ్యాకింగ్ కు పాల్పడటం లేదని మాత్రం తెలిసింది. అయితే అవర్ మైన్ గ్రూప్, తనకు తాను భద్రతా సంస్థగా అభివర్ణించుకుంటోంది. ఈ హ్యాకింగ్ ఘటనలు మళ్లీ జరగకుండా, సర్వీసులను ఆఫర్ చేస్తుందని వెల్లడిస్తోంది. వెబ్ సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు, కంపెనీల భద్రతా వలయాలను స్కాన్ చేసి, తన సైట్ లో భద్రతకు సంబంధించి ప్రచార సేవలను అందిస్తున్నట్టు చెబుతోంది. -
ట్విట్టర్ సీఈవోకు జీతం లేదట!
ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదు. అయితే తన వ్యక్తిగత, నివాస భద్రత కోసం మాత్రం రూ. 46 లక్షలు తీసుకుంటున్నారట. ఆయనకంటే ముందున్న సీఈవో డిక్ కాస్టోలో రూ.62 లక్షల జీతం తీసుకున్నారు. అందులో వేతనతంతో పాటు కారు సర్వీసు, సెక్యూరిటీ ఖర్చులన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ట్విట్టర్‌కు దాదాపు 30 కోట్ల మంది యాక్టివ్ యూజర్లున్నారు. అయితే ఫేస్‌బుక్‌కు మాత్రం ఏకంగా 150 కోట్ల మంది యూజర్లున్నారు. దాంతో మార్కెటింగ్ వర్గాలు కూడా ట్విట్టర్ కంటే ఫేస్బుక్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి 30.7 కోట్ల మంది యూజర్లుండగా, ఈ త్రైమాసికం చివరకు 30.5 కోట్ల మంది ఉన్నారు. యూజర్లు పెద్దగా పెరగకపోవడంతో ట్విట్టర్ షేరు ధర కూడా దాదాపు 13 శాతం వరకు పడిపోయిందని టెక్ క్రంచ్ తెలిపింది. ట్విట్టర్లో చాలా మార్పులు చేయాలని అనుకుంటున్నామని, ప్రస్తుతమున్న 140 క్యారెక్టర్ల పరిమితి ఇబ్బందిగా ఉందని, అయితే దానివల్ల తక్కువ మాటల్లో బలమైన స్టేట్మెంట్లు ఇవ్వడానికి కూడా వీలవుతోందని డోర్సీ అన్నారు. దీనివల్లే ట్విట్టర్‌కు విభిన్నమైన గుర్తింపు కూడా వస్తోందని తెలిపారు. -
బాస్ అంటే ఇతడేరా!
కాలిఫోర్నియా: జీవితాల్లో వెలుగులు నింపే తల్లి, తండ్రి, గురువు, అతిథుల తర్వాతి స్థానాన్ని బాస్కే ఇచ్చేయాలని ట్విట్టర్ ఉద్యోగులు కోరుతూ ఉండొచ్చు! ఎందుకంటారా.. వాళ్ల బాస్, అదేనండీ ట్విట్టర్ కంపెనీ సీఈవో జాక్ డోర్సీఉద్యోగులకు భారీ బొనాంజా ప్రకటించాడు. కంపెనీలో తనకున్న షేర్లలో 33 శాతాన్ని ఉద్యోగుల సహాయ నిధికి ధారాదత్తం చేశాడు. ఉద్యోగుల పేరిట బదిలీ చేసిన ఆ షేర్ల విలువ 197 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో దాదాపు 1,277 కోట్ల రూపాయలు! షేర్లు ఇవ్వడాన్ని ఉద్యోగులపై తిరిగి పెట్టుబడిపెడుతున్నట్లు (రీఇన్వెస్ట్మెంట్)గా జాక్ అభివర్ణించినా, అతడి నిర్ణయం వేలాది ఉద్యోగుల జీవితాల్లో భారీ మార్పులకు నాంది పలకడం ఖాయం. వేలకోట్ల విలువైన ట్విట్టర్ కంపెనీలో అతడికి 3.2 శాతం వాటా ఉంది. అందులో నుంచి 33 శాతం అంటే కంపెనీలో 1 శాతం విలువైన షేర్లు ఉద్యోగులకు పంచేయడం ద్వారా అతని వాటా 2.2 శాతానికి తగ్గింది. అయినా సరే ఉద్యోగుల సంక్షేమమే ప్రధానమన్నది ఆయన తలంపు. అయితే సీఈవోగా బాధ్యతలు స్వీకరించి నెల రోజులైనా గడవక ముందే జాక్ ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక మతలబూ ఉంది! గత వారమే 336 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. మిగతా ఉద్యోగులకు తనపట్ల నమ్మకాన్ని, పని పట్ల మరింత ప్రేమను కల్గించేందుకే షేర్ల గాలం వేసినట్లు తెలిసింది. లోగుట్టు ఏదైనా.. ఉద్యోగులు మాత్రం మంచి ఖుషీగా ఉన్నారు.