వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో హై ప్రొఫైల్ ట్విటర్ అకౌంట్లే లక్ష్యంగా హ్యాకర్లు రెచ్చిపోయారు. వారి ట్విటర్ అకౌంట్లను హ్యాక్ చేసి బిట్‌కాయిన్ అడ్రస్‌కి వెయ్యి డాలర్లు పంపిస్తే, వెంటనే తిరిగి రెట్టింపు సొమ్ము పంపిస్తామంటూ మోసపూరిత ట్వీట్‌లు చేశారు. బ్లూ టిక్ ఉన్న అకౌంట్ల నుంచి ఈ ట్వీట్‌లు రావడంతో నిజమేననుకొని వారి అభిమానులు కొందరు భారీ మొత్తంలో హ్యాకర్లకు డబ్బులు కూడా పంపించినట్టు తెలుస్తోంది. హ్యాకింగ్‌కు గురైన అకౌంట్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్, అపర కుబేరులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, నటి కిమ్ కర్ధాషియన్‌లతోపాటూ పలువురు ప్రముఖులు ఉన్నారు. (అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఊరట)
హ్యాకింగ్ ఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే పేర్కొన్నారు. నష్టాన్ని నివారించే పనిలో ఉన్నామని, హ్యాకింగ్‌కు పాల్పడింది ఎవరనే దానిపై ఆరా తీస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ట్వీట్ చేశారు. (కరోనా: అమెరికాలో రికార్డు స్థాయిలో కేసులు)
Tough day for us at Twitter. We all feel terrible this happened.
— jack (@jack) July 16, 2020
We’re diagnosing and will share everything we can when we have a more complete understanding of exactly what happened.
💙 to our teammates working hard to make this right.
Comments
Please login to add a commentAdd a comment