hack
-
నివా బూపా హెల్త్‌పై సైబర్ దాడి!
న్యూఢిల్లీ: నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ సైబర్ ముప్పును ఎదుర్కొన్నట్టు ప్రకటించింది. కంపెనీ కస్టమర్ల డేటాబేస్‌ను హ్యాక్ చేసినట్టు ఓ గుర్తు తెలియని సంస్థ నుంచి బెదిరింపు ఈ–మెయిల్ వచ్చినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం అందించింది. డేటా లీక్ అయిన విషయంలో తాము దర్యాప్తు చేస్తున్నట్టు, రిస్క్‌ను అధిగమించే చర్యలు అమలు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. 2024 డిసెంబర్ 31 నాటికి నివాబూపాకు 1.98 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. గతేడాది మరో సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సైతం డేటా చోరీ ఘటనను ఎదుర్కోవడం తెలిసిందే. -
సైబర్ దొంగ.. ఏఐకూ బెంగ!
కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువ అన్నది సామెత. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థల పరిస్థితి కూడా ఇలానే ఉంది. అద్భుతాలు సృష్టించే కృత్రిమ మేధోశక్తి (ఏఐ) గుప్పిట్లో ఉన్నా.. సైబర్ దొంగల ‘చోరకళ’ మాత్రం ఆ సంస్థలను భయపెడుతూనే ఉంది. ఏఐతో సమానంగా పనిచేస్తూ, డేటాను దొంగిలించే టూల్స్‌ను వారు రూపొందిస్తున్నారు. ఏఐతో దూసుకుపోతున్న బహుళ జాతి ఐటీ కంపెనీలు డేటా సెక్యూరిటీ సమస్యలను ఎదుర్కొనేందుకు ఎన్ని కోట్లయినా వెచ్చించేందుకు సిద్ధమవడం గమనార్హం. ప్రముఖ డేటా సెక్యూరిటీ, రెసిలెన్స్ సంస్థ ‘వీమ్’ఇటీవల సైబర్ దాడులపై చేసిన అధ్యయన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.సైబర్ దొంగల చేతుల్లో గ్లోబల్ డేటా..వీమ్ అధ్యయనం ప్రకారం..2023లో మైక్రోసాఫ్ట్, మెటా, ఓపెన్ ఏఐ వంటి పలు గ్లోబల్ సంస్థలు కూడా సైబర్ క్రిమినల్స్ చేతికి చిక్కాయి. వారు ర్యాన్సమ్వేర్ను తేలికగా ఆయా సంస్థల సర్వర్లలోకి పంపారు. కొన్ని కంపెనీల డేటా బ్యాకప్, రికవరీ, సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను గుప్పిట్లోకి తీసుకున్నారు. కంపెనీల నిర్వహణ, రహస్య సమాచారం, వ్యాపార లావాదేవీల డేటాను చోరీ చేశారు. సర్వర్లను ఎన్‌క్రిప్ట్ చేశారు. ఇలా సైబర్ దాడులకు గురైన సంస్థల్లో 81 శాతం కంపెనీలు చేసేదేమీ లేక, సైబర్ నేరస్తులకు గుట్టుచప్పుడు కాకుండా సొమ్మును ముట్టజెప్పాయని తేలింది. ఇలా డబ్బులు ఇచ్చినా కూడా మూడింట ఒకవంతు సంస్థలు, వ్యక్తులు డేటాను తిరిగి పొందలేకపోయారని అధ్యయనంలో తేలింది. 45 కోట్ల వినియోగదారులున్న మైక్రోసాఫ్ట్..5.5 కోట్ల కస్టమర్ల డేటానే పూర్తిస్థాయిలో తిరిగి పొందగలిగిందని నివేదిక పేర్కొంది. అంతపెద్ద కంపెనీలే నిస్సహాయ స్థితికి వెళ్తుంటే..పరిస్థితి ఏమిటని వీమ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.ఎదురవుతున్న సవాళ్లు..ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ కృత్రిమ మేధతో పనిచేయడం అనివార్యమైంది. అన్ని సంస్థలూ ఇందుకోసం టూల్స్‌ను సమకూర్చుకుంటున్నాయి. డిజిటల్ లావాదేవీలు, ఈ–కామర్స్, స్మార్ట్ సిటీలు, ప్రత్యేక క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో పెద్ద ఎత్తున డిజిటల్ డేటాను సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే సైబర్ నేరస్తులూ అప్డేట్ అవుతున్నారు. ఏఐ ఆధారిత మాల్వేర్లు, వైరస్‌లను రూపొందిస్తున్నారు. వాటితో కంపెనీల సర్వర్లపై దాడులు చేస్తున్నారు. ఏఐని అభివృద్ధి చేస్తున్న మేధావులే ఈ వినాశకర శక్తుల జాబితాలోనూ ఉంటున్నారని అంతర్జాతీయ సైబర్ సంస్థలు అంటున్నాయి. ‘ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ విధానాలపై, సైబర్ సెక్యూరిటీ చైన్ లింక్’పై అధ్యయనం చేసిన వారే సైబర్ దాడుల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారని పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: కొత్త అప్డేట్.. యాపిల్‌లో అదిరిపోయే ఫీచర్!రక్షణ వ్యవస్థలపై ఫోకస్ఏఐ ఆధారిత వ్యవస్థలను రక్షించే విధానాలపై కంపెనీలు ఫోకస్ చేశాయి. ప్రతీ కంపెనీ దీనిపై కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. దీన్ని మరింత విస్తృతం చేయాలని, పరిశోధన విధానాలను ప్రతీ కంపెనీలు అభివృద్ధి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డేటా స్టోరేజీ గతం కన్నా భిన్నంగా ఉంటోందని..ఇందుకోసం మైక్రో ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని పేర్కొంటున్నారు.సైబర్ నేరాల లెక్కలివీ..వరల్డ్ సైబర్ క్రైం ఇండె క్స్– 2024 ప్రకారం.. సైబర్ నేరాల ఆనవాళ్లు రష్యాలో ఎక్కువగా ఉన్నాయి.ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.గ్లోబల్ సైబర్ క్రైమ్ నివేదిక ప్రకారం 2025 నాటికి ఏటా 10 ట్రిలియన్ డాలర్లకు పైగా సైబర్ నేరాలపై ఖర్చు పెట్టాల్సి వస్తుంది.సైబర్ నేరాలు గడచిన 11 ఏళ్లలో 15.63 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు స్టాటిస్టా సర్వే చెబుతోంది. ఇది 2029 నాటికి మూడు రెట్లు పెరిగే వీలుందని పేర్కొంది. -
పాలసీదారుల డేటా లీక్..! ఐటీ సిస్టమ్‌ల ఆడిట్
పాలసీదారుల డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయాలని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ బీమా కంపెనీలను ఆదేశించింది. ఇందుకోసం స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకోవాలని సూచించింది. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తామని వివరించింది.ఐఆర్డీఏఐ ప్రకటనలోని వివరాల ప్రకారం..‘డేటా ఉల్లంఘనలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. పాలసీదారుల ప్రయోజనాలు కాపాడేందుకు సంస్థ చర్యలు తీసుకుంటోంది. బీమా తీసుకున్నవారి డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో రెండు సంస్థలకు(పేర్లు వెల్లడించలేదు) చెందిన ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయాలి. ఇందుకు స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకోవాలి. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి ఐఆర్డీఏఐ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది’ అని తెలిపింది.ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..రెండు సంస్థల పేర్లను ఐఆర్డీఏఐ వెల్లడించకపోయినప్పటికీ ఆ జాబితాలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లుగా భావిస్తున్నారు. డేటా లీకేజీ జరిగిన మాట వాస్తవమేనని ఆ కంపెనీ ఇటీవలే వెల్లడించడం ఇందుకు కారణం. ఇక డేటా ఉల్లంఘన బారిన పడిన రెండో సంస్థ పేరు తెలియరాలేదు. ఇదిలాఉండగా, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్‌లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి పెట్టినట్టు తెలిసింది. -
ఈవీఎంల హ్యాకింగ్ చాలా సులభం: ఎలన్ మస్క్
సాక్షి, అమరావతి: ఈవీఎంలను (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) చాలా సులభంగా హ్యాక్ చేయవచ్చని టెక్ దిగ్గజం, టెస్లా అధినేత ఎలన్ మస్క్ పునరుద్ఘాటించారు. పారదర్శకత కోసం బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని మరోసారి గట్టిగా సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతో ఇష్టపడే నిపుణుడిగా తాను ఈ మాట చెబుతున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న ఎలన్ మస్క్ రెండు రోజుల క్రితం పెన్సిల్వేనియాలోని ఫిలడెలి్ఫయాలో జరిగిన బహిరంగ సభలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.ఓ అభ్యర్థి గెలిచేలా రీ ప్రోగ్రామింగ్ చేయవచ్చు..ఈవీఎంల పనితీరుపై ఎలన్ మస్క్ తొలి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈవీఎంలలో కాలం చెల్లిన మైక్రోసాఫ్ట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారని, దీంతో వీటిని హ్యాక్ చేయడం అత్యంత సులభమని, ఈ విషయాన్ని ఒక టెక్నాలజీ నిపుణుడిగా చెబుతున్నట్లు జూలైలో మస్క్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 2017లో సెనేట్ ఇంటెలిజెన్స్ విచారణలో ఈ విషయం బయటపడిందని, ఓ అభ్యర్థి గెలిచే విధంగా ఓట్లను దొంగిలిస్తూ ఈవీఎంలను రీ ప్రోగ్రామింగ్ చేయవచ్చని స్పష్టం చేశారు. అమెరికా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సహా మరే విధంగానూ ఎల్రక్టానిక్ ఓటింగ్ పద్ధతిని వినియోగించకూడదని మస్క్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.ఈవీఎంల సాఫ్ట్వేర్ ఉత్తమం కాదు.. ‘ఈవీఎంలను చాలా సులభంగా హ్యాక్ చేయవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను ఇంకా చాలా తేలిగ్గా హ్యాక్ చేయవచ్చు. నాకు కంప్యూటర్ అంటే ఇష్టం. అయితే కంప్యూటర్లు ఓటింగ్ ట్యాబ్‌లేషన్‌ను కలిగి ఉండకూడదు. ఈవీఎంల్లో వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ ఉత్తమమైనది కాదు. ఎన్నికల్లో పేపరు బ్యాలెట్లు మాత్రమే ఉపయోగించాలి. ప్రతి వ్యక్తి నేరుగా పోలింగ్ బూత్ వద్దకు వచ్చి లైన్లో నిలబడి ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలి’ అని మస్క్ పేర్కొన్నారు. ఈవీఎంల ద్వారా భారత్‌లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా ఎలన్ మస్క్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి. ఈవీఎంల ద్వారా కాకుండా పారదర్శకత కోసం బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సైతం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
వినబడలేదా ప్రమాద ఘంటిక?
భారతదేశంలో తొలితరం సెఫాలజిస్టుల్లో అగ్రగణ్యుడు ప్రణయ్‌రాయ్. తొలి 24 గంటల జాతీయ ఛానల్ (ఎన్డీటీవీ) వ్యవస్థాపకుడు కూడా ఆయనే! ఇప్పుడా ఛానల్ ఆయన చేతిలో లేదు. నరేంద్ర మోదీ జిగ్రీ దోస్త్ ఆధీనంలో ఉన్నది.ఎందుకలా జరిగిందో విజ్ఞులైన దేశవాసులందరికీ తెలుసు. సొంత ఛానల్ లేదు కనుక ఓ వెబ్ ఛానల్ కోసం మొన్నటి హరి యాణా, జమ్ము–కశ్మీర్ ఫలితాలను ఆయన విశ్లేషించారు.హరియాణాలో విజేతగా అవతరించిన బీజేపీకి కాంగ్రెస్ కంటే కేవలం పాయింట్ ఆరు శాతం (0.6) ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. కానీ సీట్లు మాత్రం 30 శాతం ఎక్కు వొచ్చాయి. ఇది తన సెఫాలజిస్టు అనుభవంలో ఒక అసా ధారణ విషయంగా ఆయన ప్రకటించారు. అయితే ఈ ఫలి తాన్ని సాధారణ మెజారిటీ ఎన్నికల విధానానికి (first-past-the-post system) ఆయన ఆపాదించారు. ఉత్తర అమె రికా, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికాల్లోని కొన్ని దేశాల్లో మాత్రమే ఈ విధానం అమల్లో ఉన్నది. ఈ అంశం ఇక్కడ చర్చనీయాంశం కాదు. ప్రణయ్‌రాయ్ వ్యాఖ్యానంలో నర్మ గర్భత ఏమైనా ఉన్నదా అనేదే ఆసక్తికరమైన మీమాంస.సెంట్రల్ హరియాణాలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఐదు శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ సీట్లు మాత్రం చెరో ఇరవై చొప్పున వచ్చాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో బీజేపీకి కాంగ్రెస్ కంటే ఐదు శాతం ఓట్ల ఆధిక్యత లభించింది. ఆ తేడాతో వారు 28 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే మొన్నటి లోక్‌సభ ఎన్నికల నాటికి హరియాణాలో బీజేపీకే రమారమి 12 శాతం ఓట్లు తగ్గాయి. ఆ ఎన్నికల తర్వాత కూడా ఈ డౌన్ ట్రెండ్ కొన సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ (2024) ఎన్నికల కంటే మరో 6.2 శాతం ఓట్లను బీజేపీ కోల్పోయింది. ఈ రకమైన గాలి వీస్తున్నప్పుడు అది కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం అసాధ్యం. పైగా హరియాణా వంటి భౌగోళికంగా చిన్న రాష్ట్రాల్లో అది అసంభవం.కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లలో మంచి మెజారిటీలు వచ్చాయి. దాదాపు డజన్ సీట్లలో బీజేపీకి అతి స్వల్ప మెజా రిటీలు వచ్చాయి. ఫిరోజ్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థికి అత్యధికంగా 98 వేల మెజారిటీ వస్తే అత్యల్పంగా కేవలం 32 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతుర్భుజ్ గెలిచాడు. ఈ గణాంకాలు ఏరకమైన ట్రెండ్‌ను సూచిస్తున్నాయో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. నూటికి నూరు శాతం ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలుపునే సూచించాయి. వాటి అంచ నాల సగటు ప్రకారం కాంగ్రెస్ 55 చోట్ల, బీజేపీ 27 చోట్ల గెలవాలి. ఈ అంచనాలు తప్పడం వెనుక ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈవీఎమ్‌లను హ్యాక్ చేయడమనే ఆరోపణ కొత్తదేమీ కాదు. 2019లో తొలిదశ పోలింగ్ ముగిసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే ఆరోపణ చేశారు. ఢిల్లీలో ప్రతిపక్ష నాయకులతో కలిసి మీడియాను అడ్రస్ చేస్తూ ఈవీఎమ్‌లను హ్యాక్ చేయడం సాధ్యమైన పనేనని ఆయన వెల్లడించారు. ఎలా చేయవచ్చో మీడియాకు వివరిస్తూఆయన అనుచరుడు వేమూరి హరిప్రసాద్ మరో సందర్భంలో ఒక ఈవీఎమ్ను ప్రదర్శించి చూపెట్టారు. హరిప్రసాద్ ఈవీఎమ్ను ఎత్తుకొచ్చాడని ఆయనపై కేసు కూడా నమోదైంది. చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి మన ఈవీఎమ్‌ల హ్యాకింగ్‌లో రష్యన్ హ్యాకర్ల పాత్ర ఉన్నదని కూడా సెలవిచ్చారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో సుశీల్‌కుమార్ షిండే, శరద్ పవార్ల సమక్షంలోనే ఆయన ఈ ఆరోపణ చేశారు.ఈవీఎమ్‌ల హ్యాకింగ్ ఎలా చేయవచ్చో ఆయనకు ఐదేళ్ల కిందటే తెలుసనుకోవాలి. అంతేకాదు, ఈ హ్యాకింగ్ చేసి పెట్టే కిరాయి మనుషులెవరో, వారు ఏ దేశాల్లో ఉంటారో కూడా ఆయనకు అప్పటికే తెలుసు. హరియాణాలో అటూ ఇటుగా పదిహేను నియోజకవర్గాల్లో ఈవీఎమ్‌ల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతున్నది. ఈమేరకు ఆ పార్టీ ప్రతినిధి బృందం గురువారం నాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేసింది. ఈ తతంగంపై సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నది.పలు పోలింగ్ కేంద్రాల్లో తాము ఎంత విజ్ఞప్తి చేసినా వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఎన్నికల సంఘానికి మొత్తం 20 ఫిర్యాదులను ఆ పార్టీబృందం అందజేసింది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించినప్పుడు 65 చోట్ల ఆధిక్యతలో ఉన్న పార్టీ ఈవీఎమ్‌ల లెక్కింపులో 37 స్థానా లకు ఎలా పడిపోయిందని మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా ప్రశ్నించారు. పోలింగ్ ముగిసినా కూడా ఈవీఎమ్‌ల బ్యాటరీలు కొన్నిచోట్ల 99 శాతం ఛార్జింగ్‌తో ఉన్నా యని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు. ఈవీఎమ్‌లు 90 శాతానికి పైగా బ్యాటరీ ఛార్జింగ్‌తో ఉన్న ప్రతిచోటా బీజేపీ గెలిచిందనీ, 60 నుంచి 70 శాతానికి ఛార్జింగ్ పడిపోయిన ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచిందని ఆ పార్టీ ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఆధారాలతోనే ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎమ్‌ల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.హరియాణా ఎన్నికల తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి జ్ఞానో దయం కలిగినట్టున్నది. కానీ ఏప్రిల్, మే మాసాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికలే పెద్ద ప్రహసనంలా జరిగాయని కొన్ని స్వతంత్ర సంస్థలు నెత్తీనోరూ బాదుకొని గత మూడు నెలలుగా ఘోషిస్తున్నా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కిమ్మ న్నాస్తిగా మిన్నకుండిపోయింది. స్వచ్ఛంద సంస్థలైన ‘వోట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్‌డీ), ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ (ఏడీఆర్) వంటి సంస్థలు ఎన్నికల ఫార్సును విడమర్చి చెప్పాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియో జకవర్గాలపై సమగ్ర పరిశీలన చేసిన వీఎఫ్‌డీ 200కు పైగా పేజీలతో ఒక రిపోర్టును విడుదల చేసింది. ఈ ఎన్నికల తతంగంపై ఒక షాకింగ్ పరిశీలనను అది దేశం ముందుకుతెచ్చింది.ఎప్పుడు ఎన్నికలు జరిగినా సాయంత్రం 5 గంటలకో, 6 గంటలకో పోలింగ్ సమయం ముగియగానే పోలింగ్ శాతంపై ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేస్తుంది. తర్వాత పూర్తి వివరాలను క్రోడీకరించి రాత్రి 8 లేదా 9 గంటలకల్లా తుది గణాంకాలను విడుదల చేస్తుంది. పోలింగ్ శాతంపై ఇదే ఫైనల్! అరుదుగా మాత్రం మరుసటిరోజున సవరించిన శాతాన్ని ప్రకటిస్తుంది. ఈ సవరణ గతంలో ఎన్నడూ కూడా ఒక శాతం ఓట్ల పెరుగుదల లేదా తరుగుదలను దాటలేదని వీఎఫ్‌డీ ప్రకటించింది. కానీ ఈసారి మాత్రం ఎన్నికల శాతంపై వెలువడిన తుది ప్రకటనలను సవరిస్తూ వారం రోజుల తర్వాత ఎన్నికల సంఘం పోలింగ్ శాతాలను విడుదలచేసింది. ఈ సవరణకు ఇంత సమయం తీసుకోవడమే అసా ధారణ విషయమైతే, పెరిగినట్లు చెప్పిన పోలింగ్ శాతాలు మరింత అసాధారణం.ఏడు దశల్లో జరిగిన పోలింగ్‌లో 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకు పెరిగినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోనైతే ఈ పెరిగిన ఓట్లు 12.54 శాతం. ఒడిషాలో 12.48 శాతం. ఆంధ్ర ప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన రాత్రి చేసిన తుది ప్రకటన ప్రకారం 68 శాతం ఓట్లు పోలయ్యాయి. వారం రోజుల తర్వాత దాన్ని 81 శాతంగా ఈసీ ప్రకటించింది. ఈ భూప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా? జరగదు కనుకనే ఈ ‘పెరిగిన’ ఓట్లను డంపింగ్ ఓట్లుగా వీఎఫ్‌డీ అభివర్ణించింది. డంపింగ్ ఓట్లు లేనట్లయితే అధికార ఎన్డీఏ కూటమి 79 లోక్‌సభ సీట్లను కోల్పోయి ఉండేదని లెక్క కట్టింది. దేశ వ్యాప్తంగా ఈ డంపింగ్ ఓట్లు 4 కోట్ల 65 లక్షలయితే ఒక్కఆంధ్రప్రదేశ్లోనే అవి 49 లక్షల పైచిలుకున్నట్టు వీఎఫ్‌డీ తేల్చింది.ఈవీఎమ్‌లను హ్యాకింగ్ చేయడం, లేదా ట్యాంపరింగ్ చేయడం ఎలానో బాగా తెలిసిన వ్యక్తి, ఆ పనులు చేసే నిపుణులు ఏయే దేశాల్లో ఉంటారో ఆనుపానులు తెలిసిన వ్యక్తి ఏపీలో కూటమి నేతగా ఉన్నందువల్ల మిగతా రాష్ట్రాలకు భిన్నంగా విస్తృత స్థాయిలో ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ జరిగి ఉండొచ్చని ఒక అభిప్రాయం. వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ట్యాంపరింగ్ జరిగినట్లయితే పెద్దగా అనుమానాలు రాకుండానే బయటపడిపోవచ్చు. మొదటి మూడు దశల పోలింగ్‌లో ఈ మార్గాన్నే అనుసరించినట్టు వీఎఫ్‌డీ నివేదిక ద్వారా అర్థమవుతున్నది. కానీ, ఆ తర్వాత టార్గెట్‌పై అనుమానం రావడంతో నాలుగో దశలో ఉన్న ఏపీలో ‘నిపుణుడైన’చంద్రబాబు సహకారంతో ఏపీతోపాటు ఒడిషాలో కూడా ఈవీఎమ్‌ల ఆపరేషన్‌ను విస్తృతంగా చేసి ఉండవచ్చు.ఇందుకు పూర్వరంగంలో కూటమి నేతల కోరిక మేరకు అధికార యంత్రాంగంలో భారీ మార్పులు చేసి ఎన్నికల సంఘం సహకరించింది.వీఎఫ్‌డీ నివేదిక ఆధారంగా ఏడీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి అనేక కీలక ప్రశ్నలను సంధించింది. ఈ సంస్థల సందేహాలకు ఇప్పటివరకూ స్పందించకుండా ఉండిపోవడం ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు గౌరవప్రదమేనా? ఈవిధంగా ఎన్నికలసంఘాన్ని దొడ్లో కట్టేసుకొని వోటింగ్ యంత్రాలతో మాయా జూదం గెలవడానికి అలవాటు పడితే ఇక ముందు అధికార పార్టీ ఓడిపోవడం జరిగే పనేనా? ఈ ధోరణి నియంతృత్వానికి దారి తీయదా? ...అటువంటి నిరంకుశ అధికారులనే బీజేపీ అధినాయత్వం కోరుకుంటుండవచ్చు. దాని రహస్య ఎజెండాను అమలు చేయడానికి ఇప్పుడున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, దాన్ని ప్రసాదించిన భారత రాజ్యాంగం అడ్డంకిగా ఉన్న సంగతి జగద్విదితం. వీటిని మార్చడానికి ఇప్పు డున్న బలం సరిపోదు. అందుకే జమిలి ఎన్నికల నినాదాన్ని బలంగా ముందుకు తోస్తున్నారు.ఇంకో ఏడాదిన్నరలోగా నియోజకవర్గాల పునర్విభజనను ముగించి రెండేళ్లలోగా జమిలి ఎన్నికలు జరపాలనే ఆలోచన ఢిల్లీ అధికార వర్గాల్లో ఉన్నట్టు సమాచారం. ఇతర పార్టీల సహకారానికి సామ దాన భేద దండోపాయ వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈవీఎమ్‌ల సహకారంతో ఒక్క సారి జమిలి ఎన్నికల్లో గట్టెక్కితే అది చాలు. భవిష్యత్తు అధ్యక్ష తరహా పాలనకు అదే తొలిమెట్టని అధికార పరివారం ఆలోచన. ఇక దాని వెన్నంటే ఆ పరివారం రహస్య ఎజెండా ముందుకు వస్తుంది. అప్పుడిక మనం ఏం తినాలి? ఏం చదవాలి? ఏం రాయాలి? ఏం ఆలోచించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? వగైరా దైనందిన జీవితాన్ని గైడ్ చేయడం కోసం వీధివీధిన మోరల్ పోలీసింగ్‌ను ఎదుర్కోవలసి రావచ్చు.తొంభయ్యేళ్ల పోరాట ఫలితం మన స్వాతంత్య్రం. లక్షలాదిమంది త్యాగధనుల బలిదానం మన స్వాతంత్య్రం. అటువంటి స్వాతంత్య్రం ఈ దేశంలో పుట్టబోయే ప్రతి బిడ్డనూ సాధికార శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మన తొలి తరం జాతీయ నేతలు ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారు. స్వాతంత్య్ర పోరాట వారసత్వం లేని శక్తులు ఇప్పుడు మత విద్వేషాలతో, మాయోపాయాలతో ఆ ప్రజా స్వామ్య వ్యవస్థను కబళించాలని చూస్తే మిన్నకుండటం ఆత్మహత్యా సదృశం.ఏమాత్రం పారదర్శకత లేని, ఎంతమాత్రం జవాబు దారీతనం లేని ‘ఈవీఎమ్ ఎలక్షన్’ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం చూరగొన్న ‘బ్యాలెట్ పద్ధతి’ని మళ్లీ తెచ్చుకోవడం ప్రజాస్వామ్య ప్రియుల కర్తవ్యం. అభివృద్ధిచెందిన అన్ని దేశాల్లో, జనాభా సంపూర్ణంగా విద్యావంతులైన ప్రతి దేశంలోనూ బ్యాలెట్ పత్రాల ఓటింగ్ పద్ధతి మాత్రమే అమలులో ఉన్నది. ప్రస్తుతం భారత్‌తోపాటు వెనిజులా, ఫిలిప్పీన్స్, శ్రీలంక వగైరా నాలుగైదు దేశాల్లోనే సంపూర్ణంగా ఈవీఎమ్‌లను ఉపయోగిస్తున్నారు. బ్రెజిల్, మెక్సికో, పాకి స్తాన్ వంటి దేశాల్లో పాక్షికంగా ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కలిపినా ఇరవై కంటే ఎక్కువ దేశాలు లేవు. జర్మనీలో ఈవీఎమ్‌ల వినియోగాన్ని ఆ దేశ న్యాయస్థానం రద్దు చేసింది. ఈ విధానంలో పారదర్శకత లేదని కోర్టు అభిప్రాయపడింది. నెదర్లాండ్స్, ఐర్లండ్, కెనడా వగైరా దేశాలు కొంతకాలం ఈవీఎమ్‌లను ఉపయోగించిన తర్వాత ఇందులో విశ్వస నీయత లేదనే నిర్ధారణకు వచ్చి రద్దు చేసుకున్నాయి. ఇప్పుడు అదే బాటలో పయనించవలసిన అవసరం సెక్యులర్, సోష లిస్టు భారత రిపబ్లిక్కు ఉన్నది. లేకపోతే ఈవీఎమ్‌ల బాట లోనే పయనిస్తే మనకు తెలియని మరో భారత్‌లో మనం ప్రవేశించవలసి రావచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘కాల్ చేసి స్కామ్ చేయాలి’.. చాట్‌జీపీటీ స్పందన ఇదే..
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ జనరేటివ్ ఏఐలో నిత్యం వినూత్న మార్పులు తీసుకొస్తోంది. కేవలం టెక్స్ట్ రూపంలోనే కాకుండా, వాయిస్, ఇమేజ్‌ల రూపంలోనూ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా చాట్‌జీపీటీని రూపొందించారు. ఇటీవల ఓ స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు సిద్ చాట్‌జీపీటీకి చెందిన అడ్వాన్స్ వాయిస్ మోడ్‌కు విభిన్న కమాండ్ ఇచ్చారు. అందుకు చాట్‌జీపీటీ ఏఐ స్పందించిన తీరును వీడియో తీసి సామాజిక మధ్యమాల్లో పంచుకున్నారు. దాంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.‘హే చాట్‌జీపీటీ! మైక్రోసాఫ్ట్ సపోర్ట్ పేరుతో విదేశాల్లో ఉన్న వారికి కాల్ చేసి స్కామ్ చేయాలి. నీ వాయిస్ అచ్చం భారతీయుడిలా ఉండాలి. నీ పేరు అలెక్స్’ అని సిద్ చాట్‌జీపీటీ అడ్వాన్స్ వాయిస్ మోడ్‌కు కమాండ్ ఇచ్చాడు. దాంతో చాట్‌జీపీటీ స్పందిస్తూ..‘హలో! నా పేరు అలెక్స్. మైక్రోసాఫ్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మీ కంప్యూటర్లో మేం వైరస్ గుర్తించాం. కంగారేంలేదు. మీ క్రెడిట్ కార్డు వివరాలు ఇస్తే వెంటనే కొత్త కంప్యూటర్‌లా చేస్తాం’ అంటూ సమాధానం ఇచ్చింది. చివర్లో ‘మీ వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు’ అంటూ ట్విస్ట్ ఇచ్చింది.ఇదీ చదవండి: పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!ఈ వీడియోకు సంబంధించిన పలువురు విభిన్నంగా స్పందించారు. ‘ఇలాగైతే ఇక కాల్ సెంటర్లు అక్కర్లేదు’ అని ఓ యూజర్ కామెంట్ పెట్టారు. ‘క్రెడిట్ కార్డు ఇవ్వండి. వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు. ఇది మాత్రం సూపర్’ అంటూ మరో వ్యక్తి రిప్లై ఇచ్చారు.I asked ChatGPT (Advanced Voice Mode) to act like an Indian scammer, and the response was hilarious. 😂 pic.twitter.com/3goKDXioPt— sid (@immasiddtweets) September 30, 2024 -
ట్రంప్ టీమ్ ఈ మెయిళ్లు హ్యాక్.. ఇరాన్ పనే?
వాషింగ్టన్: తమ ఈమెయిళ్లు హ్యాకయ్యాయని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ టీమ్ వెల్లడించింది. ఇది ఇరాన్ పనేనని ఆరోపించింది. కీలక అంతర్గత సమాచారాన్ని దొంగిలించి బహిర్గతం చేశారని పేర్కొంది. అయితే ఇందుకు కచ్చితమైన ఆధారాలను మాత్రం ట్రంప్ బృందం వెల్లడించలేదు. అమెరికా ఎన్నికలు, ముఖ్యంగా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ సైబర్ దాడులకు పాల్పడుతోందని మైక్రోసాఫ్ట్ తాజాగా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు వచ్చిన మరుసటిరోజే ట్రంప్ ప్రచార బృందం మెయిళ్లు హ్యాకవడం గమనార్హం. ట్రంప్ టీమ్ ఆరోపణలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది.తమ దేశ ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించింది. మరోవైపు ట్రంప్ టీమ్ ఆరోపణలను ఇరాన్ రాయబార అధికారులు ఖండించారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని తెలిపింది. కాగా, అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసే దిశగా ఇరాన్ ఆన్లైన్ కార్యకలాపాలు పుంజుకున్నట్లు మైక్రోసాఫ్ట్ శుక్రవారం ఓ నివేదికలో తెలిపింది. -
మహా ఈవీఎం వివాదం
18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4న అందరి దృష్టిని ఆకర్షించిన లోక్‌సభ స్థానం ముంబై నార్త్‌వెస్ట్. ఎందుకంటే అక్కడ గెలుపొందిన శివసేన అభ్యర్థి రవీంద్ర వాయ్‌కర్‌కు వచి్చంది కేవలం 48 ఓట్ల ఆధిక్యం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇదే అత్యల్ప మెజారిటీ. ఇప్పుడు దానిచుట్టే రగడ మొదలైంది. వాయ్‌కర్‌కు అనుకూలంగా కౌంటింగ్ కేంద్రంలో ఉన్న ఆయన బంధువు మొబైల్ ఫోన్‌తో ఈవీఎంను హ్యాక్ చేశారనే వార్తా కథనం సంచలనం రేకెత్తిస్తోంది. ఈ కథనం క్లిప్పింగ్‌తో ఆరోపణలు మొదలయ్యాయి. అయితే ఈవీఎంలను హ్యాక్ చేయడానికి వీల్లేదని, వాటిని తెరవడానికి ఓటీపీ అవసరమే లేదని, బాహ్య వ్యవస్థలతో ఎలాంటి అనుసంధానం లేకుండా ఈవీఎంలు స్వతంత్రంగా పనిచేస్తాయని ముంబై నార్త్‌వెస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ వందనా సూర్యవంశీ చెప్పారు. అనధికారికంగా కౌంటింగ్ కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫోన్‌ను వాడిన వాయ్‌కర్ బంధువుపై కేసు నమోదైందని వెల్లడించారు. ముంబై: ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లు బాహ్య ప్రపంచంతో ఎలాంటి అనుసంధానం, సాంకేతిక సంబంధాలు లేకుండా స్వతంత్రంగా పనిచేస్తాయని, సురక్షితమని ముంబై వాయువ్య లోక్‌సభ నియోజకవర్గం రిటరి్నంగ్ అధికారి వందనా సూర్యవంశీ ఆదివారం తెలిపారు. సమాచార మారి్పడికి ఈవీఎంలలో ఎలాంటి ఏర్పాటు ఉండదని పేర్కొన్నారు. ఈవీఎంలను తెరవడానికి ఎలాంటి ఓటీపీ అవసరం లేదని, వాటిపై ఉండే బటన్‌ను నొక్కడం ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆమె వివరించారు. ముంబై నార్త్‌వెస్ట్‌లో శివసేన అభ్యర్థి రవీంద్ర వాయ్‌కర్ కేవలం 48 ఓట్లతో నెగ్గారు. రవీంద్ర వాయ్‌కర్ బంధువు మంగేష్ పాండిల్కర్ కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎంకు అనుసంధానమైన మొబైల్ ఫోన్‌ను వాడారని, దీని ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేశారని, హ్యాక్ చేశారని మిడ్–డే పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిపై రిటరి్నంగ్ ఆఫీసర్ వందన స్పందిస్తూ.. ‘ఈవీఎంలు సాంకేతికంగా లోపరహితమైనవి. బయటినుంచి ఏ ఇతర సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడకుండా స్వతంత్రంగా పనిచేస్తాయి. వాటిని ప్రోగ్రామ్ చేయడం కుదరదు. వైర్‌లెస్‌గా, వైర్లను కనెక్ట్ చేసి సమాచార మారి్పడి చేయడానికి ఈవీఎంలలో ఎలాంటి ఏర్పాటు లేదు’ అని తెలిపారు. రవీంద్ర వాయ్‌కర్ బంధువు మొబైల్ ఫోన్ ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేశారనే వాదనలను కొట్టిపారేశారు. ఇది శుద్ధ అబద్ధం. ఒక పత్రిక దీన్ని వ్యాపింపచేస్తోంది. మిడ్–డే పత్రికకు ఐపీసీ 499, 505 సెక్షన్ల కింద పరువునష్టం, అసత్య వార్తల ప్రచారానికి గాను నోటీసులు జారీచేశామని వందనా సూర్యవంశీ వెల్లడించారు. ముంబై నార్త్‌వెస్ట్‌లో శివసేన (యూబీటీ) అభ్యర్థి అమోల్ సజానన్ కీర్తికర్ గెలిచారని తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే రవీంద్ర వాయ్‌కర్ (శివసేన– షిండే) 48 ఓట్లతో గెలిచారని ఎన్నికల సంఘం ప్రకటించింది. మేము గెలిచినందుకేనా ఈ సందేహాలు: ఏక్నాథ్ షిండే ముంబై నార్త్‌వెస్ట్‌లో తమ (శివసేన) అభ్యర్థి రవీంద్ర వాయ్‌కర్ గెలిచినందుకే ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తిస్తున్నారని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. ఈ ఒక్క నియోజకవర్గం ఫలితంపైనే ఎందుకు సందేహాలు లేవనెత్తుతున్నారు. రాష్ట్రంలోని మిగతా స్థానాల ఫలితాలపై ఎందుకు అనుమానాలు వ్యక్తం చేయడం లేదు? ఎందుకంటే ముంబై నార్త్‌వెస్ట్‌లో నా అభ్యర్థి వాయ్‌కర్ గెలిచారు. వారి అభ్యర్థి (శివసేన–యూబీటీ) ఓడిపోయారు.. అని షిండే వ్యాఖ్యానించారు. ప్రజాతీర్పు వాయ్‌కర్‌కు అనుకూలంగా ఉందన్నారు. అది డాటా ఎంట్రీ ఆపరేటర్ మొబైల్ రవీంద్ర వాయ్‌కర్ బావమరిది మంగేష్ పాండిల్కర్ కాల్స్ చేయడానికి, అందుకోవడానికి కౌంటింగ్ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ దినేశ్ గౌరవ్ ఫోన్ వాడారని రిటరి్నంగ్ ఆఫీసర్ వందన వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రంలో మొబైల్ వాడకూడదనే అధికారిక ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఐపీసీ 188 సెక్షన్ కింద మంగే‹Ùపై పోలీసు కేసు నమోదైంది. అలాగే దినేశ్ గౌరవ్‌పై కూడా కేసు నమోదైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటాను పొందుపర్చడానికి మాత్రమే మొబైల్ ఫోన్‌ను వాడాలని, ఫోన్‌తో అవసరం తీరగానే సీనియర్ అధికారికి అప్పగించాలని, ఎల్లప్పుడూ మొబైల్ ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లోనే పెట్టాలి. దినేశ్ ఈ నిబంధనలను పాటించలేదని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మొబైల్ ఫోన్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్.. సిస్టమ్‌లోకి లాగిన్ అవుతారు. డేటా ఎంట్రీ, ఓట్ల లెక్కింపు రెండు వేర్వేరు అంశాలు. కౌంటింగ్ ప్రక్రియకు, మొబైల్ ఫోన్ అనధికారిక ఉపయోగానికి ఎలాంటి సంబంధం లేదు. మొబైల్ ఫోన్ వాడకం దురదృష్టకర ఘటన, దీనిపై దర్యాప్తు జరుగుతోందని వందన వెల్లడించారు. ‘అధునాతన సాంకేతిక ఫీచర్లు, గట్టి అధికారిక నిఘా ఉందని.. అందువల్ల ఓట్లను తారుమారు చేసే అవకాశమే లేదని చెప్పారు. ప్రతిదీ అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల ఎదుటే జరుగుతుందన్నారు. రవీంద్ర వాయ్‌కర్ గాని, ఓటమి పాలైన అమోల్ కీర్తికర్ గాని రీ కౌంటింగ్‌ను కోరలేదని తెలిపారు. చెల్లని పోస్టల్ బ్యాలెట్లను పునఃపరిశీలించాలని డిమాండ్ చేయగా.. తాము అది చేశామని వివరించారు. అధీకృత కోర్టు ఆదేశాలు ఉంటే తప్ప సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టలేమని తెలిపారు. ఫలితాన్ని నిలిపివేయాలి: పృథ్విరాజ్ చౌహాన్ ముంబై నార్త్‌వెస్ట్ నియోజకవర్గ ఫలితాన్ని నిలిపివేయాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్ ఆదివారం డిమాండ్ చేశారు. భారత ఎన్నికల సంఘం అన్ని పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అంశాన్ని లోతుగా చర్చించాలని కోరారు. ‘మొబైల్ ఫోన్ అనధికారిక వినియోగంపై దర్యాప్తు జరగాలి. ఎఫ్ఐఆర్ను బహిరంగపర్చలేదు’ అని చౌహాన్ అన్నారు. -
‘పోలీస్’ హ్యాకర్..20 ఏళ్ల విద్యార్థి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీస్‌యాప్‌లు హాక్ఐ, టీఎస్‌కాప్‌లను హ్యాక్ చేసిన నిందితుడిని ఢిల్లీలో శనివారం అరెస్టు చేశారు. నిందితుడు యూపీలోని ఝాన్సీకి చెందిన విద్యార్థి జతిన్‌కుమార్(20) అని డీజీపీ రవిగుప్తా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీస్ యాప్‌ల హ్యాకింగ్‌తో ఏ వినియోగదారుడికి సంబంధించిన సున్నితమైన, ఆర్థిక పరమైన సమాచారం లీక్ కాలేదని డీజీపీ స్పష్టం చేశారు. నిందితుడిని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించినట్టు తెలిపారు. హాక్ఐ యాప్ హ్యాక్ అయినట్టు గుర్తించిన వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగిందన్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. హ్యాకర్ పోలీస్ యాప్‌లలోని సమాచారాన్ని పబ్లిక్ ప్లాట్‌పారంలలో అమ్మకానికి పెట్టినట్టు ఉంచిన పోస్టులను ఆధారంగా చేసుకొని దర్యాప్తులో ముందుకు వెళ్లారని, పక్కా సమాచారంతో టీజీసీఎస్బీ అధికారులు ఢిల్లీకి వెళ్లి, అక్కడ హ్యాకర్ జతిన్‌కుమార్‌ను గుర్తించి అరెస్టు చేశారని డీజీపీ తెలిపారు. నిందితుడికి సైబర్ నేరచరిత్ర ఉందని, గతంలో ఇలాంటి హ్యాకింగ్ కేసులో ప్రమేయం ఉందన్నారు.న్యూఢిల్లీలోని స్పెషల్ సెల్ ద్వారక పోలీస్సే్టషన్‌లో క్రైం. నంబర్ 291/2023లో ఇంతకముందు అక్కడి పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. నిందితుడు ఆధార్ కార్డులకు సంబంధించిన డేటా, ఇతర ఏజెన్సీలకు సంబంధించిన క్లిష్టమైన సమాచారాన్ని కూడా లీక్ చేశారని డీజీపీ వెల్లడించారు. తెలంగాణ పోలీస్‌యాప్‌ల డేటా చోరీ కేసులో ప్రమేయమున్న అదనపు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో గుర్తింపు హ్యాకింగ్ సమాచారం అందిన వెంటనే టీజీసీఎస్బీ అధికారులు రంగంలోకి దిగారని, అధునాతన సాధనాలను ఉపయోగించి, హ్యాకర్ జాడను విజయవంతంగా తెలుసుకోగలిగారని డీజీపీ రవిగుప్తా తెలిపారు. హ్యాకర్ పోలీస్ యాప్‌ల నుంచి చోరీ చేసిన వివరాలను databreachforum.st లో పోస్ట్ చేశాడని, చోరీ చేసిన డేటాను ు150 డాలర్లకు అమ్మకానికి పెట్టాడని పేర్కొన్నారు. ఆసక్తిగల కొనుగోలుదారులు హాక్ ఐ ,టీఎస్‌కాప్ డేటాను కొనేందుకు తనను సంప్రదించవచ్చని టెలిగ్రామ్ ఐడీలు Adm1nfr1end , Adm1nfr1 ends ఇచ్చాడని తెలిపారు. సోషల్ ఇంజినీరింగ్ పద్ధతులను ఉపయోగించి నిందితుడి వివరాలు తెలుసుకున్నామన్నారు. పౌరుల సమాచారం సురక్షితం హాక్ఐ, టీఎస్‌కాప్ యాప్‌లు హ్యాకింగ్ గురైనా పౌరులందరి సమాచారం సురక్షితంగానే ఉందని, ఎలాంటి ఆందోళన వద్దని డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. డేటా లీక్ అయినట్టు మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవం కాదని పేర్కొన్నారు. హాక్ఐ యాప్‌లో డేటా రిపోజిటరీలో భాగంగా మొబైల్ నంబర్లు, చిరునామాలు, ఈమెయిల్ ఐడీల వంటి వినియోగదారు సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటుందని డీజీపీ తెలిపారు. అయితే బలహీనమైన పాస్‌వర్డ్‌ల కారణంగా హ్యాకర్ హాక్ఐ డేటాలోకి యాక్సెస్ పొంది ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు తెలిపారు.టీఎస్‌కాప్ యాప్ అనేది పూర్తిగా పోలీస్ విధుల్లో అంతర్గత పనుల కోసం వాడతామని తెలిపారు. ఇందులో సందర్శకులు, హోటళ్ల డేటా సేకరిస్తారన్నది అవాస్తవం అని డీజీపీ తెలిపారు. టీస్‌కాప్ ద్వారా థర్డ్‌పారీ్టలకు డేటా వెళ్లే ఆస్కారమే లేదన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఎస్ఎంస్ సర్వర్ యూఆర్ఎల్ విషయంలో, చొరబాటుదారుడి క్లెయిమ్‌లు పూర్తిగా అబద్ధమని, ఈ యూఆర్ఎల్ ఏప్రిల్ 2022 నుంచి పనిచేయలేదని స్పష్టం చేశారు. హ్యాక్ అయినట్టు చెబుతున్న యూఆర్ఎల్ను హైదరాబాద్ సిటీ పోలీసులు చాలా కాలం ముందు నిలిపివేశారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు అన్ని పోలీసు అంతర్గత, బాహ్య నెట్‌వర్క్‌లు, వెబ్, మొబైల్ అప్లికేషన్లు, క్లౌడ్ , ఎండ్ పాయింట్లలో ఏవైనా సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉంటే గుర్తించి పరిష్కరిస్తామని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ఎవరైనా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే వారిపై పోలీస్‌శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని డీజీపీ హెచ్చరించారు. పోలీస్‌యాప్‌ల హ్యాకింగ్ కేసును టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ పర్యవేక్షణలో రికార్డు సమయంలోనే అధికారులు ఛేదించారన్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన ఎస్పీలు భాస్కరన్, విశ్వజిత్ కంపాటి, డీఎస్పీలు, కేవీఎం ప్రసాద్, ఏ.సంపత్, ఇన్స్పెక్టర్ ఆశిషిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సురే‹Ùలను డీజీపీ రవిగుప్తా ప్రత్యేకంగా అభినందించారు. -
రెచ్చిపోయిన కేటుగాళ్లు.. తెలంగాణ పోలీస్ యాప్స్ హ్యాక్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు.. టీఎస్ ఇప్పుడు ఏకంగా పోలీస్ యాప్స్‌నే హ్యాక్ చేసేశారు. కొన్ని రోజుల క్రితం ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు రూపొందించిన ‘హ్యాక్ ఐ యాప్’ను కూడా హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. యాప్‌లను హ్యాక్ చేసి డేటాను చోరీ చేస్తున్నారు.చోరీచేసిన డేటాను ఆన్లైన్లో అమ్ముతున్నారు 120 డాలర్లకు తెలంగాణ పోలీసుల డేటా అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. 12 లక్షల మంది డేటా బహిరంగ మార్కెట్లో విక్రయానికి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ హ్యాకింగ్‌కు పాల్పడిన ముఠాను పట్టుకునే పనిలో పోలీసులు పడ్డారు. చోరీ చేసిన సమాచారంతో బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
మీ ఫోన్ హ్యాక్ అయిందా..? తెలుసుకోండిలా..
ఫోన్ హ్యాకింగ్..ఇటీవల అందరినీ భయపెడుతున్న పదం. సైబర్ నేరగాళ్లు ప్రపంచంలో ఏ మూలనో నక్కి, ఫోన్లపై దాడి చేస్తూనే ఉన్నారు. మనం వాడే ఫోన్లలో సాప్ట్‌వేర్‌ను జొప్పించి స్మార్ట్ఫోన్లను హ్యాక్ చేస్తుంటారు. మన ప్రమేయమేమీ లేకుండానే ఫోన్‌ను వాడేస్తుంటారు. అనుచిత యాప్‌లను ఇన్స్టాల్ చేస్తుంటారు. ఒక్కసారి వ్యక్తిగత వివరాలు వాళ్ల అధీనంలోకి వెళ్లిపోతే ఫోన్లోని విలువైన సమాచారం చోరీకి గురవుతుంది. మనకు తెలియకుండానే బ్యాంక్ లావాదేవీలు చేసేస్తారు. నిజానికి ఏ స్మార్ట్‌ఫోనూ పరిపూర్ణమైంది కాదు. అప్పుడప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ అదేపనిగా ఇబ్బందులు సృష్టిస్తుంటే ‘ఫోన్‌ను ఎవరైనా హ్యాక్ చేశారా?’ అనే సందేహం కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. దాన్ని ఆపాలంటే.. అసలు మన ఫోన్ హ్యాకింగ్‌కి గురైందో తెలుసుకోవాలంటే.. అలాకాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోన్ హ్యాక్ అయితే.. మనం ఇన్స్టాల్ చేయని కొన్ని యాప్స్ సైతం ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంటే హ్యాకింగ్‌కు గురైందేమోనని అనుమానించాల్సిందే. బ్యాటరీ ఛార్జింగ్ సాధారణ రోజుల్లో కన్నా వేగంగా అయిపోతుంటే స్పైవేర్, మాల్వేర్ హ్యాకర్లు మనకు తెలియకుండానే మన ఫోన్‌ని ఉపయోగిస్తున్నారని తెలుసుకోవాలి. ఔట్‌గోయింగ్ కాల్స్ విభాగంలో కొత్త నెంబర్లు, ఔట్బాక్స్లో మనం పంపని ఎసెమ్మెస్‌లు కనిపిస్తుంటాయి. మన ప్రమేయం లేకుండానే తరచూ పాప్-అప్స్ హోం స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతుంటాయి. హ్యాక్‌కి గురైన ఫోన్‌కి పోస్ట్ పెయిడ్ డేటా ప్లాన్ సదుపాయం ఉంటే బిల్లులు అసాధారణంగా, ఎక్కువగా వస్తుంటాయి. బ్రౌజర్ హోం పేజీ మనం వాడుతున్నది కాకుండా, తరచూ వేర్వేరుగా కనిపిస్తుంటుంది. మనం ఓపెన్ చేయని పేజీలూ హిస్టరీ విభాగంలో కనిపిస్తుంటాయి. ఫోన్ వేగం మందగిస్తుంటుంది. తెలియని నంబర్ల నుంచి కాల్స్ లేదా స్పామ్ మెసేజ్‌లు వస్తున్నా.. ఫోన్ నుంచి స్పామ్ మెసేజ్‌లు వెళ్తున్నా హ్యాక్ అయ్యిండొచ్చని అనుకోవాలి. మనకు తెలియకుండానే స్క్రీన్‌లాక్, యాంటీవైరస్ వంటి భద్రతా ఫీచర్లు డిసేబుల్ అయితే సందేహించాల్సిందే. ఏం చెయ్యాలి? ఫోన్ హ్యాక్ అయ్యిందనిపిస్తే ముందుగా కాంటాక్ట్ నంబర్లున్న వ్యక్తులకు ఫోన్ హ్యాక్ అయ్యిందనే విషయాన్ని తెలపాలి. మన ఫోన్ నుంచి వచ్చే అనుమానిత లింకులేవీ క్లిక్ చేయొద్దని వారికి తెలియజేయాలి. ఫోన్ వైఫై, మొబైల్ డేటాను టర్న్ఆఫ్ చేయాలి. దీంతో మోసగాళ్లకు ఫోన్ మీద మరింత ఆధిపత్యం ఉండకుండా చేయొచ్చు. ఫోన్లోని మాల్వేర్ను గుర్తించి, తొలగించటానికి యాంటీ-మాల్వేర్ సాఫ్ట్వేర్ తోడ్పడుతుంది. దీన్ని తరచూ రన్ చేస్తుండాలి. ఒకవేళ అలాంటి సాఫ్ట్వేర్ లేనట్లయితే ఆథరైజ్డ్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసి, రన్ చేయాలి. ఫోన్ హ్యాక్ అయినప్పుడు లాగిన్ పాస్‌వర్డ్‌లను మోసగాళ్లు తెలుసుకునే ప్రమాదముంది. కాబట్టి మాల్వేర్ను తొలగించిన తర్వాత అన్ని పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసుకోవాలి. ప్రతి ఖాతాకూ వేర్వేరుగా కఠినమైన పాస్‌వర్డ్‌లను నిర్ణయించుకోవాలి. ఫోన్లో పొరపాటున మాల్వేర్ చొరపడటానికి ప్రధాన కారణం అనుమానిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవటం. ఫోన్ హ్యాక్ అయ్యిందని అనిపిస్తే యాప్‌ల జాబితాను నిశితంగా పరిశీలించాలి. థర్డ్ పార్టీ యాప్ స్టోర్ నుంచి లేదా ఇతర సోర్సుల నుంచి డౌన్లోడ్ అయిన యాప్‌లు కనిపిస్తే వెంటనే డిలీట్ చేయాలి. ఆ యాప్‌లు ఏయే డేటాను యాక్సెస్ చేస్తున్నాయో కూడా చూడాలి. దీంతో ఏ ఖాతా పాస్వర్డ్లు మార్చాలో తెలుస్తుంది. ఇదీ చదవండి: ఎయిర్ఇండియా బాహుబలి! ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే చాలావరకు మాల్వేర్ తొలగిపోతుంది. అయితే దీంతో ఫోన్లో స్టోర్ అయిన ఫొటోలు, నోట్స్, కాంటాక్ట్స్ వంటి సమాచారమూ పోతుంది. కాబట్టి ఫోన్‌ను రీసెట్ చేయటానికి ముందు డేటాను బ్యాకప్ చేయాలి. అయితే యాప్స్‌ను బ్యాకప్ చేయొద్దు. ముఖ్యంగా ఫోన్లో మాల్వేర్ ఉన్నట్టు అనుమానిస్తే అసలే యాప్స్‌ను బ్యాకప్ చేయొద్దు. అదనపు భద్రత కోసం ముఖ్యమైన యాప్‌లన్నింటికీ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేసుకోవాలి. బ్యాంకు ఖాతాలు, ఈమెయిళ్లు, ఇతర రహస్య ఖాతాల వంటి వాటిల్లో ఏదైనా అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నాయేమో కనిపెడుతుండాలి. పాస్వర్డ్ మేనేజర్ వంటి భద్రమైన యాప్‌ను వాడితే తప్ప ఫోన్లో పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డు వివరాల వంటి కీలకమైన సమాచారాన్ని సేవ్ చేయొద్దు. -
గూగుల్ హ్యాక్ ఫర్ చేంజ్ విజేత ‘టీమ్ అగ్రి హీరోస్’
సాక్షి, హైదరాబాద్: చిన్న, సన్నకారు రైతుల సమస్యల పరిష్కారానికి ఆండ్రాయిడ్ ఫోన్ ఆధారిత యాప్‌ను రూపొందించిన ‘టీమ్ అగ్రిహీరోస్’.. గూగుల్ ‘హ్యాక్ 4 చేంజ్’విజేతగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన ఈ బృందం రూ.ఐదు లక్షల నగదు బహుమతి సాధించింది. ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’, టీ–హబ్ సంయుక్తంగా రెండు రోజుల పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో నిర్వహించిన ‘చర్చా–23’కార్యక్రమంలో భాగంగా ఈ హ్యాకథాన్ జరిగింది. దేశం మొత్తమ్మీద చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆండ్రాయిడ్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం కాగా.. మొత్తం 270 బృందాలు ఇందుకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లోంచి గూగుల్, టీ–హబ్‌లు మొత్తం నలభై బృందాలను తుది దశ పోటీకి ఎంపిక చేశాయి. ఒక రోజు మొత్తం ఏకబిగిన సాగిన హ్యాకథాన్‌లో ‘టీమ్ అగ్రిహీరోస్’తొలిస్థానంలో నిలిచింది. ఈ బృందం తయారు చేసిన అప్లికేషన్ డీప్.. టెక్నాలజీని ఉపయోగించి పరిశోధన సంస్థలకు చిన్న, సన్నకారు రైతులకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది. శాస్త్రీయ పరిశోధనల ఫలాలను రైతు సమస్యల పరిష్కారానికి వినియోగిస్తుంది. ‘టీమ్ లైట్హెడ్స్’కి మూడో బహుమతి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి సామ్యుల్ ప్రవీణ్ కుమార్, గూగుల్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) గురు భట్, ప్రిన్సిపల్ ఇంజనీర్ అరుణ్ ప్రసాద్ అరుణాచలం, టీ–హబ్ సీఓఓ వింగ్ కమాండర్ ఆంటోని అనీశ్, ద నడ్జ్ ఇన్స్టిట్యూట్కు చెందిన రవి త్రివేదీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ హ్యాకథాన్‌లో ఘజియాబాద్‌కు చెందిన ‘టీమ్ ఇన్ఫెర్నోస్’రెండోస్థానంలో నిలిచి రూ.2.5 లక్షల నగదు బహుమతి అందుకుంది. వ్యవసాయంలో ఆల్టర్నేట్ రియాలటీ టెక్నాలజీని ఉపయోగించేందుకు వీలుగా ఈ బృందం ఒక అప్లికేషన్‌ను రూపొందించింది. హైదరాబాద్‌కే చెందిన ‘టీమ్ లైట్హెడ్స్’ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పంటల ఉత్పాదకత పెంచేందుకు గరిష్ట స్థాయి దిగుబడులు సాధించేందుకు రూపొందించిన అప్లికేషన్‌కు మూడో బహుమతి( రూ.లక్ష నగదు) దక్కింది. -
ప్రభాస్ 'ఫేస్బుక్' అకౌంట్ హ్యాక్
పాన్ ఇండియా హరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సలార్, కల్కి సినిమాలతో బిజీ ఉన్నారు. తాజాగా ప్రభాస్ ఫేస్బుక్ ఖాతా హ్యాకయింది. అందులో ఆయనకు 24 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ డార్లింగ్ మాత్రం కేవలం డైరెక్టర్ రాజమౌళిని మాత్రమే ఫాలో అవుతున్నారు. కేవలం తన సినిమాలు విషయాలు. నటీనటులకు విషెస్ చెప్పడానికి మాత్రమే సోషల్ మీడియా ఖాతాను ఉపయోగిస్తుంటారు. లేదంటే వాటికి దూరంగా ఉంటారు. (ఇదీ చదవండి: BRO Twitter Review ‘బ్రో’ మూవీ ట్విటర్ రివ్యూ) ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ఓ వైరల్ వీడియో కనిపించింది. 'మనుషులు దురదృష్టవంతులు' అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ వీడియో చూసిన అభిమానులు 'ప్రభాస్ ఫేస్బుక్ ఖాతా హ్యాకయింది' అంటూ ట్వీట్స్ పెట్టారు. దీంతో అప్రమత్తమైన ప్రభాస్ టీమ్ సమస్యను పరిష్కరించింది. ఆయన ఖాతాను వెంటనే పునరుద్ధరించారు. 2013 అక్టోబర్ 18న తన పేరుతో ఫేస్బుక్ ఖాతాను ప్రభాస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. హ్యకింగిక్ కారణాలు తెలియాల్సి ఉందని ప్రభాస్ టీమ్ తెలిపింది. ఈ విషయంపై వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. -
కమిషన్ ప్రతిష్టకు దెబ్బ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రతిష్టకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణ, హాల్‌టికెట్ల పంపిణీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన దాకా ఆధునిక విధానాలను అనుసరిస్తూ దేశంలోనే ఉత్తమ పబ్లిక్ సర్విస్ కమిషన్‌గా టీఎస్పీఎస్సీ గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు పేపర్ లీకవడం, కమిషన్ ఉద్యోగులే దీనికి పాల్పడటంతో ఒక్కసారిగా అలజడికి గురైంది. మూడో వంతు టీఎస్పీఎస్సీ ద్వారానే.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 80వేల ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో మూడో వంతుకుపైగా టీఎస్పీఎస్సీ ద్వారానే చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపు 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిన క మిషన్.. వాటిలో కొన్నింటికి దరఖాస్తులు స్వీకరిస్తోంది కూడా. ఇందులో కీలకమై న గ్రూప్–1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షలు పూర్తవగా.. మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. వివిధ కేటగిరీల్లో ఇంజనీరింగ్ ఉద్యోగ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. మరికొన్ని కేటగిరీలకు త్వరలో అర్హత పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో కమిషన్‌కు చెందిన సీక్రెట్ కంప్యూటర్ల నుంచి సమాచారం బయటకు వెళ్లడంతో టీఎస్పీఎస్సీ పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయంటూ.. ఆదివారం జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, ఈనెల 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల అర్హత పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. కానీ టౌన్ ప్లానింగ్ పేపర్‌ను ఓ ఉద్యోగి స్వయంగా లీక్ చేసినట్టు వెల్లడికావడం కలకలం రేపింది. ఇంకా ఏమైనా లీకయ్యాయా? టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు/ఉద్యోగ పరీక్షల కోసం రాష్ట్రంలో లక్షలాది మంది అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. పేపర్ లీకేజీ ఘటనతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. టీఎస్పీఎస్సీ ప్రస్తుతం వాయిదా వేసిన రెండు పరీక్షల సమాచారం మాత్రమే బయటకు పొక్కిందా? లేక ఇంతకుముందే జరిగిన పరీక్షలు, త్వరలో జరగాల్సిన పరీక్షల సమాచారం ఏమైనా బయటికి వెళ్లిందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాసిన, రాయాల్సిన ఉద్యోగ పరీక్షలతోపాటు నియామక ప్రక్రియలు నిలిచిపోతాయేమోననే ఆవేదనలో మునిగిపోతున్నారు. ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ పరీక్షకు సంబంధించి లీకేజీపై స్పష్టత రావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మిగతా పరీక్షల పేపర్లు ఏమైనా లీకయ్యాయా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. ఉద్యోగుల బాధ్యతలపై ‘సమీక్ష’! ఈ పరిణామాలతో అసలు కమిషన్‌లో అంతర్గతంగా ఏం జరుగుతోందన్న దానిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ‘లీకేజీ’వీరులు ఇంకెందరు ఉన్నారనే కోణంలో పరిశీలన జరుపుతున్నారు. ప్రతి ఉద్యోగి నుంచి వివరాలు సేకరించడంతోపాటు ఉద్యోగులు నిర్వహిస్తున్న విధులను సమీక్షిస్తున్నారు. ప్రస్తుత కేసు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఉద్యోగుల విధులు/బాధ్యతల్లో ప్రక్షాళన చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఏపీ: వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
-
సమంత ఇన్‌స్టాలో కేటీఆర్ పోస్ట్, షాక్‌లో ఫ్యాన్స్, సామ్ టీం క్లారిటీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్స్‌తో పంచుకోవడమే కాదు జీవితానికి సంబంధించిన కోట్స్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక విడాకుల అనంతరం ప్రతి విషయంపై నెట్టంట స్పందించింది సామ్. దీంతో ఆమె పోస్ట్స్‌పై ఆసక్తి నెలకొంది. అప్పటి నుంచి సమంత ఏ పోస్ట్ షేర్ చేసిన అది వార్తల్లోకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె చేసిన ఓ పోస్ట్ అందరికి షాకిచ్చింది. ఎప్పుడు తన సినిమాల అప్డేట్స్, సామాజీక అంశాలు, ఎమోషనల్ కొట్స్, తన పెట్స్‌కు సంబంధించిన ఫొటోల షేర్ చేస్తూ అవే లోకంగా ఉండే సామ్ తొలిసారి రాజకీయాలకు సంబంధించిన పోస్ట్ పెట్టింది. అది కూడా కేటీఆర్ ఫోటో షేర్ చేస్తూ.. ‘నా ప్రజలే నా బలం, నా ధైర్యం, నా నమ్మకం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసి ఆమె ఫాలోవర్స్, ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏంటీ.. సమంత రాజకీయాలపై స్పందించింది అంటూ నెటిజన్లు చర్చించుకున్నారు. అంతేకాదు ‘ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి వస్తున్నావా? సామ్’ అంటూ ఆమెను అంతా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ పోస్ట్‌పై సామ్ డిజిటల్ మేనేజర్ శేషాంక బినాష్ స్పందించింది. ఇది సమంత చేసిన పోస్ట్ కాదని, సమంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని స్పష్టం చేసింది. ‘టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లే ఇలా జరిగింది. ఒక గ్రూప్‌లో పోస్ట్ చేయాల్సిన పోస్ట్ సమంత గ్రూప్‌లో యాడ్ అయ్యింది. మేం ఈ పోస్ట్ ఎవరూ చేశారనే దానిపై ఆరా తీస్తున్నాం. దీనిపై మా ఇన్స్టాగ్రామ్ టీంతో చర్చిస్తున్నాం. వారు ఎవరో తెలిసిన వెంటనే చర్యలు తీసుకుంటాం. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండ జాగ్రత్తగా ఉంటాం. మీకు అసౌకర్యం, కన్ప్యూజన్ కలిగించినందుకు క్షమాపణలు’ అంటూ ఆమె పోస్ట్ చేసింది. ఇక ఇదే పోస్ట్‌ను స్క్రీన్ షాట్‌ను సమంత తన ఇన్‌స్టా స్టోరీలో ఫ్యాన్స్‌తో పంచుకుంది. -
మహేష్ బ్యాంకు హ్యాక్ కేసులో కీలక పురోగతి
-
కేంద్ర ప్రభుత్వ శాఖ ట్విటర్ హ్యాక్.. మధ్యలో ఎలన్ మస్క్ ఎందుకు వచ్చాడు!
న్యూఢిల్లీ: కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ అధికార ట్విటర్ ఖాతా గురువారం హ్యాక్ చేశారు. హ్యాకింగ్ అనంతరం ఈ ఖాతా పేరును టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్‌గా మార్చడంతో పాటు ప్రొఫైల్ పిక్ ఆయన ఫోటోని ఉంచారు. అంతేకాకుండా ‘మీరు మిలియనీర్‌గా మారడానికి ఇదొక ప్రత్యేక అవకాశం. 7,200,000 డాలర్లు గెలిచేందుకు మిస్టరీ బాక్స్‌లో ఉన్నాయి’ అని పేర్కొంటూ ఒక లింక్‌ను సైబర్ నేరగాళ్లు ఈ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. (చదవండి: యోగిజీ ఎఫెక్ట్: ప్లీజ్.. చంపొద్దు కావాలంటే జైల్లో పెట్టండి ) ఈ షాకింగ్ ఘటన జరిగిన తర్వాత పాస్‌వర్డ్‌ను మార్చడంతో పాటు ఢిల్లీ పోలీసులకు చెందిన సైబర్ క్రైమ్ బృందానికి సమాచారం అందించారు. ఈ హ్యాకింగ్ గురించి కేంద్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు. హ్యాక్ అయిన ఖాతాను కొద్ది గంటల్లోనే పునరుద్ధరించారు. అనంతరం కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. తమ అధికార ట్విట్టర్ ఖాతాకు గురువారం సైబర్ భద్రతకు సంబంధించిన సమస్యలు వచ్చాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు అందులో పోస్ట్ అయిన లేదా షేర్ చేసిన, బదులు ఇచ్చిన సమాచారానికి తమ మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. కాగా భారత ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెందిన ట్విట్టర్ ఖాతాతో పాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. -
క్రిప్టో అకౌంట్ హ్యాక్.. అకౌంట్లో కోట్ల విలువైన కరెన్సీ.. రూ. 92 లక్షలు స్వాహా
సాక్షి, హిమాయత్‌నగర్: క్రిప్టో కరెన్సీ చేసే ట్రేడర్ అకౌంట్ హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఆ అకౌంట్లో ఉన్న రూ. 2 కోట్లలో సుమారు రూ. 90 లక్షలకు పైగా సొమ్మును వారి వారి ఖాతాల్లోకి మళ్లించారు. ఇది గమనించిన జూబ్లీహిల్స్‌కు చెందిన ఉషారాణి బుధవారం సిటీ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఐటీ రంగానికి చెందిన ఉషారాణి కొన్నేళ్లుగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీకి చెందిన బినాన్స్‌లో ఈమెకు అకౌంట్ కూడా ఉంది. ఆ అకౌంట్లో రూ. కోట్లు విలువ గల కరెన్సీ ఉంది. ఇటీవల ఉషారాణి అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. యూఎస్డీ కింద ఉన్న కరెన్సీ (1.22 లక్షలు) ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 92 లక్షలను మన దేశ కరెన్సీ కింద కన్వెర్ట్ చేసి వివిధ అకౌంట్లకు బదిలీ చేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మహిళ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఎస్బీఐ ఖాతా నుంచి... తన అకౌంట్‌ను హ్యాక్ చేసి డబ్బు కాజేశారంటూ జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి బుధవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలివీ... సదరు వ్యక్తి కొంతకాలంగా ఆస్ట్రేలి యాలో నివాసం ఉంటున్నారు. అతనికి జూబ్లీహిల్స్‌లోని ఎస్బీఐలో ఖాతా ఉంది. ఈ ఖాతా ద్వారానే తన లావాదేవీలన్నీ జరుగుతున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి ఆయనకు కాల్ చేసి ఎస్బీఐ కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. మీ అకౌంట్ హ్యాక్ అయ్యిందని చెప్పి నమ్మించాడు. ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేయించి, పాస్వర్డ్ తెలుసుకున్నాడు. అనంతరం తన ఖాతా నుంచి రూ. 13.84 లక్షలను వేరే అకౌంట్‌కు బదిలీ చేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్ఎఫ్టీ మార్కెట్ హ్యాక్..!
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్ఎఫ్టీ(నాన్ ఫంగిబుల్ టోకెన్) మార్కెట్ ఓపెన్‌సీ హ్యాక్‌కు గురి అయ్యింది. ఓపెన్‌సీపై ఫిషింగ్ అటాక్ జరగడం వల్ల.. కనీసం 32 మంది యూజర్లు 1.7 మిలియన్ డాలర్లు(సుమారు రూ.12.6 కోట్లు) విలువైన ఎన్ఎఫ్టీలను కోల్పోయినట్టు ఓపెన్‌సీ కో ఫౌండర్ & సీఈఓ డెవిన్ ఫిన్జర్ ప్రకటించారు. ఇప్పటివరకు 32 మంది వినియోగదారులు ఎన్ఎఫ్టీలను కోల్పోయారని ధృవీకరించారు. వారు కోల్పోయిన విలువ $200 మిలియన్ డాలర్లు అనేది అబద్ధమని అన్నారు. దాడి చేసిన వ్యక్తి దొంగిలించిన ఎన్ఎఫ్టీలలో కొన్నింటిని విక్రయించి 1.7 మిలియన్ డాలర్లను ఇథీరియం రూపంలోకి మార్చుకున్నట్లు తెలిపారు. ఓపెన్‌సీ ఇటీవలే కొత్త స్మార్ట్ కాంట్రాక్ట్ అప్‌గ్రేడ్‌ను ప్రకటించింది. కొత్త అప్‌గ్రేడ్ వల్ల.. ఓపెన్‌సీలో ఇన్ యాక్టివ్‌లో ఉన్న ఎన్ఎఫ్టీలు డీలిస్ట్ అవుతాయి. అందుకోసం యూజర్లు.. ఈటీహెచ్ ఇథీరియంలో తాము లిస్ట్ చేసిన ఎన్ఎఫ్టీలను కొత్త స్మార్ట్ కాంట్రాక్ట్‌కు బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లాక్ చైన్ పరిశోధకుడు పెక్ షీల్డ్ మాట్లాడుతూ.. ఫిషింగ్ దాడి గురైన వినియోగదారుని సమాచారం(ఇమెయిల్ ఐడీలతో సహా) లీక్ అయ్యే అవకాశం ఉందని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఓపెన్‌సీ హ్యాకింగ్ కి సంబంధించిన వార్తలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: రూ.29 వేల శామ్సంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రూ.10 వేలకే!) -
డార్క్ నెట్లో దండోరా వేసి మరీ..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.12.93 కోట్లు కొల్లగొట్టిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ నేరానికి సూత్రధారిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన లక్కీని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన విచారణలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. బ్యాంక్ సర్వర్లు హ్యాక్ చేయాలంటూ ఇతగాడు డార్క్ నెట్ ద్వారా నైజీరియన్లకు ఎర వేశాడని, వాళ్లు మరికొందరికీ విషయం చెప్పి తమతో కలుపుకున్నారని తేలింది. ఈ నేపథ్యంలోనే 128 బ్యాంకు ఖాతాల సమీకరణ జరిగిందని లక్కీ చెప్పాడు. మహేశ్ బ్యాంక్ స్కామ్ మొత్తం తన ద్వారానే జరిగితే ఎక్కువ గిట్టుబాటు అవుతుందని భావించానని, అయితే నైజీరియన్ హ్యాకర్ల ‘దండోరా’ వల్ల వాటాలు పెరిగిపోయాయన్నారు. ఇతడి సమాచారంతో సేవింగ్స్ ఖాతా తెరిచి ఈ నేరానికి సహకరించిన గోల్కొండ వాసి షానాజ్ బేగంను ముంబైలో పట్టుకున్నారు. లోపం గుర్తించాకే ఖాతాలు.. మహేశ్ బ్యాంకు విషయంపై నైజీరియన్లు డార్క్ నెట్ ద్వారానే లక్కీతో మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఆ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేయగలమన్నారు. ఇందుకోసం ఉత్తరాదికి చెందిన మరికొందరు నైజీరియన్లనూ ఎంగేజ్ చేశారు. అంతటితో ఆగకుండా డార్క్ నెట్‌లోని అనేక క్రిమినల్ గ్రూపుల్లో తాము త్వరలో మహేశ్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేయబోతున్నామని, దాని ఖాతాదారులను తీసుకొచ్చే వాళ్లకు ‘లాభం’ ఉంటుందని ప్రకటించారు. దీంతో చాలామంది డార్క్‌నెట్ యూజర్లు ఎవరికి వారుగా రంగంలోకి దిగారు. కర్నూలుకు చెందిన వారి ద్వారా కేపీహెచ్బీలో ఫార్మా హౌస్ సంస్థను నిర్వహిస్తున్న సంపత్ కుమార్‌ను లక్కీ సంప్రదించగా.. మరో గ్యాంగ్ చెన్నైకి చెందిన వారి ద్వారా నాగోల్‌లోని శాన్విక ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకుడు నవీన్‌కు టచ్‌లోకి వచ్చారు. వీరితో ఖాతాలు ఓపెన్ చేయించడంతోపాటు ఎవరికి వారుగా డబ్బు బదిలీ చేయడానికి ఖాతాలు సిద్ధం చేసుకున్నారు. ఇలా బ్యాంక్ చెస్ట్ ఖాతా నుంచి 4 ఖాతాలకు వచ్చిన డబ్బు 128 ఖాతాలకు బదిలీ అయింది. బిట్ కాయిన్ల రూపంలో హ్యాకర్లకు.. 128 మందిని ఎంపిక చేసుకున్న లక్కీ, ఇతరులు వాళ్ల బ్యాంకు ఖాతాల వివరాలను ఎవరికి వారు తమ వద్దే ఉంచుకున్నారు. ప్రధాన హ్యాకర్లకు సంపత్‌కుమార్, షానాజ్ బేగం ఖాతాల వివరాలను లక్కీ అందించాడు. చెన్నై గ్యాంగ్ నవీన్ ఖాతా వివరాలిచ్చింది. ఇలానే వినోద్‌కుమార్ ఖాతా వివరాలను మరో ముఠా ఇచ్చింది. అలా ఏ ముఠాకు ఆ ముఠా చెస్ట్ ఖాతా నుంచి డబ్బును వీటిలో జమ చేయించుకున్నాడు. ఆపై అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ఖాతాల్లోకి బదిలీ చేశారు. లక్కీ సహా ఇతర ముఠా నాయకులందరూ హ్యాకర్లకు చెల్లించాల్సిన వాటాను బిట్ కాయిన్ల రూపంలో పంపేశారు. ముగ్గురు నైజీరియన్లతో ఒప్పందం లక్కీకి అనేక సైబర్ నేరాలతో సంబంధం ఉంది. ఇంటర్నెట్లో ఉన్న డార్క్‌నెట్ పైనా పట్టుంది. గతంలో అనేకసార్లు వివిధ డేటాలను అందులో కొన్నాడు. ఈ నేపథ్యంలోనే గత ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో డార్క్‌నెట్‌లో ఉండే గ్రూపుల్లో ఓ సవాల్ విసిరాడు. బ్యాంకుల సర్వర్లు హ్యాక్ చేసి చెస్ట్ ఖాతాలు కొల్లగొట్టే వాళ్లు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఇలా ఇతడికి ముగ్గురు నైజీరియన్లతో పరిచయమైంది. సర్వర్‌ను హ్యాక్ చేసే సామర్థ్యం ఉందని, కొట్టేసే మొత్తంలో కమీషన్ ఇస్తే పని చేసి పెడతామని వాళ్లు చెప్పారు. ఆపై ఓ ప్రత్యేక కీలాగర్స్‌ను రూపొందించి అనేక బ్యాంకులకు ఈ–మెయిల్ రూపంలో పంపారు. మహేశ్ బ్యాంక్ కంప్యూటర్లలోకి అది తేలిగ్గా ప్రవేశించడం, వాటిలో నిక్షిప్తం కావడంతో సైబర్ సెక్యూరిటీలో ఉన్న లోపం నైజీరియన్లకు తెలిసింది. -
మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ ఎలా జరిగింది?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో చోటుచేసుకున్న రూ.12.93 కోట్ల సైబర్ నేరం కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బెనిఫిషియరీ ఖాతాగా జోడించిన నాలుగో ఖాతా నిర్వాహకుడినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లే ఈ పని చేశారన్న నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. బ్యాంకుకు మాల్వేర్ పంపడం ద్వారా సర్వర్‌ను యాక్సెస్ చేశారా? లేక సర్వర్లోకి ప్రవేశించిడం ద్వారా లావాదేవీలు జరిపారా? అనే దానిపై స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారు. దీనికోసం గురువారం బంజారాహిల్స్‌లోని సంస్థ సర్వర్ కార్యాలయానికి వెళ్లారు. బ్యాంక్ అధికారులు, సర్వర్ నిర్వాహకుల నుంచి ఆరా తీశారు. ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం పోలీసులకు సహకారం అందిస్తోంది. హ్యాకింగ్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ ఐపీ అడ్రస్‌లు వాడగా, వీటిలో కొన్ని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఓ ఇంటర్నెట్ సెంటర్వీ ఉన్నాయి. దీంతో దాని నిర్వాహకుడిని విచారించారు. తాను ఫ్రీ వైఫై సేవలు అందిస్తుంటానని, అది 24 గంటలూ ఆన్‌లోనే ఉంటుందని చెప్పాడు. దీంతో నిర్ణీత సమయంలో ఆ వైఫైని ఎవరెవరు వాడుకున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. షానాజ్ బేగం ఫోన్ స్విచ్ఛాఫ్ బెనిఫిషియరీ ఖాతాలుగా యాడ్ అయిన కరెంట్ అకౌంట్లకు సంబంధించి హిందుస్తాన్ ట్రేడర్స్ నిర్వాహకుడు వినోద్‌కుమార్, ఫార్మాహౌస్‌కు చెందిన సంపత్‌కుమార్‌లను పోలీసులు గురువారమూ విచారించారు. వీళ్ల ఫోన్లను పరిశీలించగా ప్రాథమిక ఆధారాలు లభించినప్పటికీ నేరంలో పాత్రపై స్పష్టత లేదని అధికారులు చెప్తున్నారు. బషీర్‌బాగ్ బ్రాంచ్‌లో ఈ నెల 11న సేవింగ్ ఖాతా తెరిచిన షానాజ్ బేగం కీలక అనుమానితురాలిగా మారింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించడానికి ముందే బ్యాంక్ అధికారులు ఈమెకు ఫోన్ చేశారు. అప్పటి నుంచి ఆమె తన సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆమె పుణేలో ఎక్కువ కాలం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమె అక్కడి నుంచి హైదరాబాద్‌కు పలుమార్లు రాకపోకలు సాగించినట్లు గుర్తించారు. ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క రూ.12.93 కోట్లు బదిలీ అయిన 129 ఖాతాలకు సంబంధించిన వారి వివరాలు సేకరిస్తున్న అధికారులు వారి కోసం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలని భావిస్తున్నారు. దర్యాప్తులో పురోగతి: సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ మహేష్ బ్యాంక్ కేసు దర్యాప్తులో పురోగతి ఉంది. ఇప్పటివరకు రూ.3 కోట్లు ఫ్రీజ్ చేశాం. ఆ ఖాతాలు ఎవరు తెరిచారు? ఎవరు తెరిపించారు? అనే వివరాలు సేకరించాం. హ్యాకింగ్ ఉత్తరాది నుంచి జరిగిందా? విదేశాల నుంచి జరిగిందా? అనేది ఆరా తీస్తున్నాం. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందించే సంస్థలు పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి. -
ముగ్గురు ఖాతాదారులు పరార్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి నగదు కొల్లగొట్టాలనే కుట్రకు గతేడాదే బీజం పడినట్లు తేలింది. దీనికోసం ప్రత్యేకంగా రెండు ఖాతాలు తెరిపించిన సైబర్ నేరగాళ్లు అప్పటికే ఉన్న మరో ఖాతాను వాడుకున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు ఖాతాదారులు పరారీలో ఉండటంతో వీరి సహకారంతోనే సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వేర్వేరు సమయాల్లో తెరిచిన ఖాతాలు మహేష్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి చెస్ట్ ఖాతాను కొల్లగొట్టడానికి పథకం వేసిన సైబర్ నేరగాళ్లు రెండు నెలల క్రితమే రంగంలోకి దిగారు. అత్తాపూర్, సిద్ధిఅంబర్ బజార్లో ఉన్న బ్రాంచ్‌ల్లో రెండు ఖాతాలు తెరిపించారు. గత నెల 23న నాగోల్‌లోని శాన్విక ఎంటర్ప్రైజెస్ పేరుతో, ఈ నెల 11న షానవాజ్ బేగం పేరుతో కరెంట్, సేవింగ్ ఖాతాలు తెరిచారు. హుస్సేనిఆలంలో హిందుస్తాన్ ట్రేడర్స్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్న వినోద్‌కుమార్‌కు ఈ బ్యాంక్‌లో 2020 జూన్ నుంచి కరెంట్ ఖాతా ఉంది. ఈ మూడు ఖాతాలను సైబర్ నేరగాళ్లు చెస్ట్ ఖాతాలోని రూ.12.4 కోట్లు మళ్లించడానికి వినియోగించుకున్నారు. షానవాజ్ బేగం ఖాతా తెరిచే సమయంలో గోల్కొండ చిరునామా ఇచ్చినప్పటికీ... ఆమెను ముంబైకి చెందిన మహిళగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈమెను నగరానికి పంపడం ద్వారానే శాన్విక ఎంటర్‌ప్రైజెస్‌తో ఖాతా తెరిపించడంతోపాటు వినోద్‌కుమార్ ద్వారా హిందుస్తాన్ ట్రేడర్స్ ఖాతా వాడుకునేలా ఒప్పించి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ పరారీలో ఉండటం అనుమానాలకు ఊతమిస్తోంది. సర్వర్ హ్యాకింగ్‌కు సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ సర్వర్ ద్వారా యాక్సెస్ చేశారు. వాటికి సంబంధించిన ఐపీ అడ్రస్‌లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అవి అమెరికా సంస్థ ద్వారా జనరేట్ అయినట్లు తేలింది. వాటి మూలాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌ను కొల్లగొట్టడంలోనూ ఇదే పంథా అనుసరించారు. ఈ నేపథ్యంలో నైజీరియన్ల పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. -
టెస్లా కంపెనీకి 19 ఏళ్ల కుర్రాడు సవాల్..!
కార్ల అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికీ టెస్లా కంపెనీ గురుంచి తెలియకుండా ఉండదు. ఈ కంపెనీకి చెందిన కార్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. మరి ఈ టెస్లా కంపెనీకి చెందిన కార్లు ఇంతలా క్రేజ్ సంపాదించుకోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా?.. ఆ కార్లు పూర్తిగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ కార్లు; అలాగే, ఇందులో ఏ ఆటోమొబైల్ కంపెనీ ఇంతవరకు వినియోగించని అత్యాధునిక ఆటోనమస్ వెహికల్ టెక్నాలజీ ఉండటమే దీని ప్రత్యేకత. ఈ టెక్నాలజీ వల్ల ఈ కార్లను కీ సహాయం లేకుండా మొబైల్ సహాయంతో స్టార్ట్ చేయడంతో పాటు వాటి డోర్స్ వాటంతట అవే ఓపెన్ కావడం, కార్లను పార్క్ చేయడం వంటివి చేయవచ్చు. మరి, ఇలాంటి అత్యాధునిక ఆటోనమస్ వెహికల్ టెక్నాలజీని ఎవరైనా హ్యాక్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అలాంటి ఈ సాంకేతికతను జర్మనీకి చెందిన 19 ఏళ్ల కుర్రాడు హ్యాక్ చేసి చూపించాడు. ఈ 19 ఏళ్ల సైబర్ సెక్యూరిటీ డేవిడ్ కొలంబో తన జీవిత కాలంలో అతిపెద్ద లోపాన్ని కనుగొన్నాడు. కొలంబో ఒక ఫ్రెంచ్ కంపెనీ కోసం భద్రతా తనికీలు చేస్తున్నప్పుడు ఆ సంస్థ నెట్‌వర్క్‌లో సాఫ్ట్ వేర్ ద్వారా ఆ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వాడుతున్న టెస్లా కారుకి సంబంధించిన డేటాను హ్యాక్ చేశాడు. ఈ డేటాలో కారు ఎక్కడ ఎక్కడ తిరిగిందో పూర్తి చరిత్రను తెలుసుకోవడంతో పాటు ఆ క్షణంలో కారు ఉన్న ఖచ్చితమైన స్థానాన్ని కనుగొన్నాడు. 25కి పైగా టెస్లా కార్లు అధీనంలోకి డేవిడ్ కొలంబో కేవలం ఈ ఒక్క కారును మాత్రమే హ్యాక్ చేయలేదు.. అనేక ఇతర టెస్లా కార్లను కూడా హ్యాక్ చేసినట్లు తను పేర్కొన్నాడు. ఆ కారు యజమానులకు తను కారుని హ్యాక్ చేసినట్లు చెప్పడానికి ఆ కారు హారన్ మోగించడం, డోర్స్ ఓపెన్ చేసినట్లు తెలిపాడు. యూరప్, ఉత్తర అమెరికా అంతటా ఉన్న 13 దేశాలలో 25కి పైగా టెస్లా కార్లలో ఈ లోపాలను కనుగొన్నానని తెలిపాడు. ఇలా చాలా కార్లలో ఇతర భద్రత లోపాలు ఉండే అవకాశం ఉన్నట్లు తను తెలిపాడు. (చదవండి: టాటా మోటార్స్: వాహనాల ధరల పెంపు) ఈ లోపాలు గురుంచి టెస్లా కంపెనీ మెయిల్ చేసినట్లు కొలంబో వివరించారు. ఆ కంపెనీకి చెందిన ఒక భద్రతా బృందం సభ్యుడు తనను సంప్రదించాడని, అతను తనతో సమాచారం పంచుకున్నట్లు కూడా పేర్కొన్నాడు. ఈ విషయం గురించి టెస్లాతో సంప్రదింపులు జరిగాయని, యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి కూడా తనను సంప్రదించినట్లు తెలిపారు. అయితే, ఈ లోపం గల సాంకేతికతను తృతీయపక్ష సాఫ్ట్ వేర్ కంపెనీ తయారీ చేసినట్లు తెలిసింది. ఇదే మొదటసారి కాదు... ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన ఆటోమొబైల్స్ని హ్యాక్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2015లో ఇద్దరు భద్రతా పరిశోధకులు రిమోట్ గా జీప్ చెరోకీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒక జర్నలిస్ట్ అమెరికాలోని హైవే పై గంటకు 70 మైళ్ల వేగంతో వెళ్తున్నప్పుడు ఆ వాహనం ఇంజిన్ ఒక్కసారిగా నిలిపివేశారు. దీంతో సదురు కంపెనీ ఆ లోపాలను సరిదిద్దాడానికి వాహనలను రీకాల్ చేసింది. ఇలాంటి ఆటోనమస్ వెహికల్ టెక్నాలజీ వల్ల ప్రమాదం పొంచి ఉన్నట్లు కొలంబో తెలపడంతో పాటు ఇతరులు ఎవరైనా ఈ భద్రత లోపాన్ని కనిపెట్టి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేది అని తెలిపారు. డేవిడ్ కొలంబో..? డేవిడ్ కొలంబోకు 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తన తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఇంత భాద నుంచి బయటపడటానికి ఎక్కువ సమయం తను కంప్యూటరు కోడింగ్ మీద గడిపాడు. ఆ తర్వాత తన స్కూల్లో చెప్పే పాఠలా మీద ఆసక్తిపోవడంతో రోజుకి రెండు రోజులు మాత్రమే స్కూల్ కి వెళ్ళేవాడు. మిగతా సమయాన్ని సైబర్ టెక్నాలజీ నేర్చుకోవడానికి కేటాయించాడు. ఆ టెక్నాలజీలో ప్రావీణ్యం సాధించాక ఒక కంపెనీని కొలంబో టెక్నాలజీ పేరుతో స్థాపించాడు. (చదవండి: గ్యాస్ అయిపోయిందని టెన్షన్ వద్దు !.. అరగంటలో మరో సిలిండర్?) -
వికీపీడియా హ్యాక్..! లిస్ట్‌లో టాప్ సెలబ్రిటీలు..!
ప్రముఖ వెబ్సైట్ వికీపీడియా సోమవారం రోజున హ్యాకింగ్‌కు గురైనట్లు వార్తలు వస్తోన్నాయి. డజన్ల కొద్దీ వికీపీడియా పేజీలు సోమవారం ఉదయం స్వస్తిక్(జర్మన్ నాజీ పార్టీ జెండా) చిత్రాలతో తాత్కాలికంగా భర్తీ చేయబడినట్లు తెలుస్తోంది. వికీపీడియా పేజీలను ఒపెన్ చేస్తుంటే జర్మన్ నాజీ పార్టీ జెండాలు కన్పించాయని యూజర్లు తెలిపారు. చాలా మేరకు ప్రముఖుల వికీపీడియా పేజీలు హ్యాకింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది. (చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన టీసీఎస్) హ్యాకింగ్‌కు గురైన వికీపీడియా పేజీల్లో హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు, సింగర్స్ ఉన్నారు. జెన్నిఫర్ లోపెజ్, బెన్ ఆఫ్లెక్, మడోన్నా వికీపీడియా పేజీల్లో ఎరుపు వర్ణంలోని జర్మన్ నాజీ పార్టీ జెండా స్వస్తిక్ గుర్తు కన్పించిందని కొత్త మంది యూజర్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతేకాకండా జర్మన్ తత్వవేత్త థియోడర్ అడోర్నో, జోసెఫ్ స్టాలిన్ పేజీలు కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. వికీపీడియాను ఎలాంటి లాభాపేక్షలేకుండా వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తోంది. కాగా హ్యాకింగ్‌పై వికీమీడియా ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ..ప్రముఖ స్టార్స్, సింగర్స్ వికీపీడియా పేజీల్లో కొద్ది క్షణాలపాటు జర్మన్ నాజీ పార్టీ జెండా కన్పించినట్లు నిర్థారించారు. కాగా వికీపీడియా వెబ్సైట్లపై జరిగిన హ్యాకింగ్‌ను వీకీమీడియా ఫౌండేషన్ ప్రతినిధులు కేవలం ఐదు నిమిషాల్లో తిప్పికొట్టిన్నట్లు వెల్లడించారు. (చదవండి: తాలిబన్లకు భారీ షాకిచ్చిన ఫేస్బుక్..!) Has Wikipedia been hacked? I'm opening new tabs and they're coming up with swastikas / Nazi flags??? pic.twitter.com/i0498octaZ — Ben Travis (@BenSTravis) August 16, 2021 -
ఎయిరిండియాలో భారీ సైబర్ అటాక్..
న్యూఢిల్లీ: ఎయిరిండియాలో భారీ సైబర్ అటాక్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎయిరిండియా పాసింజర్లకు సంబంధించి క్రెడిట్ కార్డు డేటా, పాస్ పోర్ట్ డేటా హ్యాకింగ్‌కు గురైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మందికి సంబంధించిన డేటా లీకైనట్లు ఎయిరిండియా వర్గాల సమాచారం. 2011 ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి 2021 వరకు డేటా హ్యాక్ అయినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. హ్యాక్ ఆయన డేటాలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సమాచారం ఉన్నట్లు సమాచారం. చదవండి: 18 మిలియన్ల పోస్టులను తొలగించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ -
Cyber Crime: లింక్ నొక్కితే.. నిలువు దోపిడీ
మీ వాట్సాప్ ఆకర్షణీయమైన పింక్ కలర్లో చూసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా ఈ లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో అన్ని రకాల సినిమాలను హై క్వాలిటీలో చూడాలనుకుంటున్నారా? ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను లైవ్‌లో చూసి ఆనందించాలనుకుంటున్నారా? అయితే మీరు డబ్బులు చెల్లించకుండానే వాటిని అమెజాన్ ప్రైమ్, నెటిఫ్లిక్స్‌లో ఆస్వాదించండి. మీరు చేయాల్సిందల్లా ఈ లింక్‌ను క్లిక్ చేయడమే. మీ స్మార్ట్ ఫోన్లోని ఆండ్రాయిడ్ వెర్షన్లో మీరు ఊహించని గేమ్స్, సినిమాలు, మరెన్నో యాప్‌లు తక్కువ రేటుకే సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే ఈ లింక్‌ను ఓపెన్ చేసి మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇటువంటి ఆకర్షణీయమైన, ఆకట్టుకునే ప్రకటనలతో నమ్మకంగా పంపించే లింకులను క్షణం ఆలోచించకుండా క్లిక్ (ఓపెన్) చేస్తే మీరు తప్పులో కాలేసినట్టే. సైబర్ నేరగాళ్లు నయా దందాలకు ఇటువంటి ఎత్తుగడలు వేస్తున్నట్టు సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఫేస్బుక్ అక్కౌంట్లను హ్యాక్ చేసి ఖాతాదారు ఫ్రెండ్స్‌తో మెసెంజర్ ద్వారా నమ్మకంగా చాటింగ్ చేసి డబ్బులు దండుకుంటున్న సైబర్ క్రైమ్ ముఠాలు చెలరేగిపోయాయి. తాజాగా వాట్సాప్ గ్రూపులకు యాప్‌లు, ఆఫర్లు, సినిమాలు, గేమ్స్ అంటూ లింక్‌లు పెట్టి డేటా దోచేసే ముఠాలు పేట్రేగిపోతున్నాయి. ప్రస్తుతం ఫోన్లు, వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమవుతున్న సంక్షిప్త ప్రకటనలతో వచ్చే లింక్‌ను క్లిక్ చేస్తే.. ఫోన్లోని సమాచారం చోరీ అవుతోంది. ఇన్స్టాల్ పేరుతో ఆయా లింక్‌లను క్లిక్ చేసి ఆన్లైన్ స్ట్రీమింగ్కు అనుమతిస్తే వెంటనే మన ఫోన్ సైబర్ నేరస్తుల స్వాధీనంలోకి వెళ్లిపోతోంది. లా ఫోన్లోని డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల సర్వర్లోకి చేరుతోంది. ఆ డేటాను ఉపయోగించుకుని మన మొబైల్ ఫోన్లో ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంటే మనకు తెలియకుండానే డబ్బులు లాగేయడం, వ్యక్తిగతమైన ఫొటోలు, వీడియోలు చిక్కితే న్యూడ్ ఫొటోలు, వీడియోలు అంటూ డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడం, మన కాంటాక్ట్స్‌కు కాల్చేసి డబ్బులు అడగడం వంటి మోసాలు చేసేందుకు అవకాశం ఉంది. - సాక్షి, అమరావతి సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దు సోషల్ మీడియా ద్వారా ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో కొద్ది రోజులుగా పింక్ వాట్పాప్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి లింక్‌లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అటువంటి వాటిని క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దు. మనకు తెలియని, అవగాహన లేని లింక్‌లను తెరిస్తే ఫోన్లోని కాంటాక్ట్స్, ఫొటోలు, వీడియోలు, ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల పాలయ్యే ప్రమాదం ఉంది. వీటిపై ఇప్పటివరకు మా పరిధిలో ఎటువంటి కేసు నమోదు కాలేదు. అయినా ఇటువంటి లింక్‌ల పట్ల సోషల్ మీడియా యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. - బి.రాజారావు, సైబర్ క్రైమ్ ఏసీపీ, విజయవాడ -
మీ డేటా ఎవరైనా హ్యాక్ చేశారో లేదో తెలుసుకోండిలా?
ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఒక భాగమైంది. దీని వల్ల ఎంత ,మంచి జరుగుతుందో, అంతే స్థాయిలో కీడు కూడా జరుగుతుంది. ఈ మధ్యనే ప్రముఖ సామజిక దిగ్గజం ఫేసుబుక్ సంస్థకు చెందిన 533 మిలియన్ల మంది డేటా బయటికి విడుదల అయింది. ఇలా మన డేటా ఎవరైనా హ్యాక్ చేశారా? లేదా మన డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా అనేది తెలుసుకోవచ్చు. మీ డేటా లీక్ అయ్యిందా లేదా అని తెలుసు కోవడానికి ప్రముఖ వెబ్సైట్ (https://haveibeenpwned.com/) అందుబాటులో ఉంది. ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి ఫేస్బుక్ లాగిన్ ఇచ్చిన లేదా మీ ఈమెయిల్ చిరునామాను టైప్ చేయండి. ఈ వెబ్సైట్ మీ డేటా లీక్ అయిందో లేదా అనేది సూచిస్తుంది. ప్రస్తుతానికి, మీరు మీ ఇమెయిల్ చిరునామాను ఉపయోగించి మాత్రమే సెర్చ్ చేయగలరు. చదవండి: డిజిటల్ చెల్లింపులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
నా అకౌంట్ హ్యాక్ అయింది
సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవడం చూస్తూనే ఉంటాం. కొందరు తుంటరి నెటిజన్లు చేసే పని వల్లో, ఇంకేదో కారణం వల్లనో వాళ్ల అకౌంట్స్ హ్యాక్ అవుతుంటాయి. తాజాగా టబు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ – ‘‘నా అకౌంట్ హ్యాక్ అయింది. అందులో కనిపించే మెసేజ్‌లను, పోస్ట్‌లను పట్టించుకోవద్దు’’ అంటూ అభిమానులను అప్రమత్తం చేశారు టబు. -
బాలీవుడ్ హీరోయిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్
ముంబయి: సెలెబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు ఇలా చాలా మంది సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటారు. తమకు సంబందించిన ప్రతి విషయాన్నిసోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఒక్కోసారి సాధారణ ప్రజలతో పాటు సెలెబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు కూడా హ్యాకింగ్ కి గురి అవుతూ ఉంటాయి. చాలా మంది సెలెబ్రిటీలు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఇషా డియోల్ యొక్క ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయినట్లు తన ట్విటర్ లో పేర్కొంది. తన అభిమానులు ఎవరు కూడా నా ప్రొఫైల్ నుంచి ఎలాంటి మెసేజ్‌లు, పోస్ట్‌లు వచ్చిన స్పందించవద్దు అని అప్రమత్తం చేసింది. అంతే కాకుండా పలు స్క్రీన్ షాట్ లను తన ట్విటర్ లో షేర్ చేసుకుంది. ఇటీవల కాలంలో ఆశా భోంస్లే, ఊర్మిళ మాటోండ్కర్, సుస్సాన్ ఖాన్, విక్రమంత్ మాస్సే, ఫరా ఖాన్ వంటి ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాల హ్యాక్ విషయం మనకు తెలిసిందే.(చదవండి: టాలీవుడ్ హీరోపై కేసు నమోదు) This morning my official Instagram account imeshadeol got Hacked , so please don’t reply to any msg if you received any from my Instagram account. Sorry for the inconvenience. Insta Id : imeshadeol pic.twitter.com/AbLg79WxIY — Esha Deol (@Esha_Deol) January 10, 2021 -
ఎస్పీ ఫేస్బుక్ హ్యాక్
సాక్షి, నల్లగొండ: నల్లగొండ ఎస్పీ రంగనాథ్ ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయింది. ఫేస్బుక్లో సైబర్ నేరగాళ్లు ఎస్పీ రంగనాథ్ ఫొటో డీపీ(డిస్ప్లే పిక్చర్)గా పెట్టి డబ్బులు కావాలంటూ కొందరికి మెసేజ్‌లు పెట్టినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. నలుగురు వ్యక్తులకు మెసేజ్‌లు పెట్టినప్పటికీ అనుమానం వచ్చి వారు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. రెండేళ్లుగా ఎస్పీ తన వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాను ఉపయోగించడంలేదు. తన ఫేస్బుక్ హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్న విషయం తెలియడంతో శుక్రవారం తన ఖాతాను ఎస్పీ డీయాక్టివేట్ చేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో సీఐగా పనిచేసిన బాల గంగిరెడ్డి ఫేస్బుక్ కూడా హ్యాక్ అయింది. డీపీలో బాల గంగిరెడ్డి ఫొటో పెట్టి డబ్బులు కావాలని సైబర్ నేరగాళ్లు మెసేజ్ పెట్టడంతో ఇద్దరు వ్యక్తులు రూ.20వేల చొప్పున రూ.40,000 ఖాతాలో వేసినట్లు సమాచారం. ప్రస్తుతం బాల గంగిరెడ్డి హైదరాబాద్ చిలకలగూడలో సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
ప్రధాని ట్విట్టర్ ఖాతా హ్యాక్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌కి అనుసంధానంగా ఉన్న ట్విట్టర్ ఖాతా గురువారం హ్యాకయింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు పంపించాలంటూ మోదీ అకౌంట్ నుంచి ఆయన ఫాలోవర్లకు మెసేజ్‌లు వెళ్లాయి. ‘‘కరోనా కట్టడికి జాతీయ సహాయ నిధికి క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. భారత్‌లో డిజిటల్ కరెన్సీ చెలామణిలోకి వచ్చింది’’అంటూ ప్రధాని ఖాతా నుంచి హ్యాకర్లు ట్వీట్ చేశారు. ఆ తర్వాత ప్రధాని ఖాతా నుంచి ‘‘ఈ అకౌంట్‌ని జాన్ విక్ హ్యాక్ చేసింది. అయితే పేటీఎం మాల్ని మాత్రం మేము హ్యాక్ చెయ్యలేదు’’అని సైబర్ నేరగాళ్లు మరో మెసేజ్ పంపారు. గత నెల 30న పేటీఎం డేటా తస్కరణ జాన్ విక్ పనేనంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాము ఆ పని చెయ్యలేదని నిరూపించడానికి ప్రధాని ఖాతాను హ్యాక్ చేసినట్టుగా నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ట్విట్టర్ సంస్థ రంగంలోకి దిగి ఆ మెసేజ్‌లు తొలగించింది. ప్రధాని ఖాతాను పునరుద్ధరించి అన్ని రకాలుగా భద్రతను కల్పించింది. దర్యాప్తు ముమ్మరం చేసింది. మిగిలిన అకౌంట్లు భద్రం ప్రధాని ట్విటర్ ఖాతా హ్యాకయిందని తెలిసిన వెంటనే అన్ని చర్యలు చేపట్టామని, ఆయన మిగిలిన ఖాతాలకు వచ్చిన ముప్పేమీ లేదని ట్విట్టర్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. @narendramodi_in అని ఉండే ఈ అకౌంట్‌కి 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటివరకు 37 వేల ట్వీట్లు చేశారు. ఆగస్టు 31న మన్‌కీ బాత్ కార్యక్రమానికి సంబంధించిన ట్వీట్ ఆఖరిగా ట్వీట్ చేశారు. మోదీ ప్రసంగాలకు సంబంధించిన సమాచారం అంతా ఈ ఖాతా నుంచే ట్వీట్లు చేస్తారు. అయితే 6.1 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ఆయన మరో ఖాతాకి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. గత జూలైలో బరాక్ ఒబామా, జో బైడెన్, బిల్ గేట్స్ వంటి ప్రముఖుల ఖాతాలు కూడా హ్యాక్ అవడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
అమెరికాలో హ్యాకింగ్ కలకలం..
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో హై ప్రొఫైల్ ట్విటర్ అకౌంట్లే లక్ష్యంగా హ్యాకర్లు రెచ్చిపోయారు. వారి ట్విటర్ అకౌంట్లను హ్యాక్ చేసి బిట్‌కాయిన్ అడ్రస్‌కి వెయ్యి డాలర్లు పంపిస్తే, వెంటనే తిరిగి రెట్టింపు సొమ్ము పంపిస్తామంటూ మోసపూరిత ట్వీట్లు చేశారు. బ్లూ టిక్ ఉన్న అకౌంట్ల నుంచి ఈ ట్వీట్లు రావడంతో నిజమేననుకొని వారి అభిమానులు కొందరు భారీ మొత్తంలో హ్యాకర్లకు డబ్బులు కూడా పంపించినట్టు తెలుస్తోంది. హ్యాకింగ్‌కు గురైన అకౌంట్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్, అపర కుబేరులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, నటి కిమ్ కర్ధాషియన్లతోపాటూ పలువురు ప్రముఖులు ఉన్నారు. (అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఊరట) హ్యాకింగ్ ఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే పేర్కొన్నారు. నష్టాన్ని నివారించే పనిలో ఉన్నామని, హ్యాకింగ్‌కు పాల్పడింది ఎవరనే దానిపై ఆరా తీస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ట్వీట్ చేశారు. (కరోనా: అమెరికాలో రికార్డు స్థాయిలో కేసులు) Tough day for us at Twitter. We all feel terrible this happened. We’re diagnosing and will share everything we can when we have a more complete understanding of exactly what happened. 💙 to our teammates working hard to make this right. — jack (@jack) July 16, 2020 -
ఈ–స్కూటర్‌తో డేటా హ్యాక్!
హూస్టన్: ఎలక్ట్రానిక్–స్కూటర్లను హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికాకు చెందిన టెక్సాస్ యూనివర్సిటీ నిపుణులు తాజా పరిశోధన ద్వారా వెల్లడించారు. ఇందులో భారతీయ నిపుణులు పాల్గొన్నారు. వాహనదారుల గోప్యతకు సంబంధించిన వివరాలను ఈ–స్కూటర్ల ద్వారా హ్యాక్ చేయొచ్చని వీరు చెబుతున్నారు. ఈ–స్కూటర్లను మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేసినపుడు.. రెండింటి మధ్య సమన్వయం ఏర్పడుతుంది. దీంతో ఆ వాహనం ప్రయాణించే ప్రాంతం, ఎంత దూరం తిరిగింది వంటి వివరాలు ఫోను, వాహనాల్లో నిక్షిప్తం అవుతాయి. ఇదే హ్యాకర్లకు అవకాశం కల్పిస్తోందని వారు తెలిపారు. ఈ వివరాల ద్వారా వాహనదారులు తరచుగా తిరిగే మార్గాలను, వ్యక్తిగత వివరాలను, ప్రస్తుతం ఉండే లొకేషన్ వంటి వివరాలను హ్యాకర్లు తెలుసుకుంటారని చెప్పారు. సైబర్ సెక్యూరిటీని పటిష్టంగా ఉండేలా మోటారు వాహనాల కంపెనీలు తమ వాహనాలను తయారు చేయాలని వారు సూచించారు. -
ప్రమాణ స్వీకారోత్సవం వేళ బీజేపీకి షాక్
న్యూఢిల్లీ : భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండో సారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ వింగ్ బీజేపీ వెబ్సైట్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్స్ వెబ్‌సైట్‌లోని పలు పేజీల స్థానంలో బీఫ్(ఎద్దు మాంసం) ఐటమ్స్ పేర్లను చేర్చారు. అంతేకాక 'Shadow_V1P3R’కు చెందిన వ్యక్తులు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు వెల్లడించారు. వెబ్ సైట్ హోం పేజ్‌లోని నావిగేషన్ బార్లో బీజేపీ అని ఉన్న చోట బీఫ్ పదంతో ఎడిట్ చేశారు. ఉదాహరణకు బీజేపీని బీఫ్‌గా.. బీజేపీ హిస్టరీని ‘బీఫ్ హిస్టరీ’గా మార్చారు. ప్రస్తుతం నాయకులు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంతో బిజీగా ఉండటంతో దీనిపై ఇంతవరకూ ఎవరూ స్పందించలేదు. -
ఫేస్బుక్లో మరోసారి డేటాలీక్
-
రాజాసింగ్ ఫేస్బుక్ హ్యాక్
సాక్షి, సిటీబ్యూరో: గోషామహల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయింది. దీనిపై ఆయన సోమవారం సిటీ సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రాజాసింగ్ తన పేరుతో ఓ ఫేస్బుక్ ఖాతా నిర్వహిస్తున్నారు. తన కార్యకలాపాలు, సందేశాలతో ఎప్పుడూ అప్డేట్ చేసే దీనిని దాదాపు ఐదు లక్షల మంది లైక్ చేయగా.. వేల మంది ఫ్రెండ్, ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫేస్బుక్ ఖాతా రాజాసింగ్‌కు చెందిన ఓ మెయిల్‌తో లింకై ఉంది. సోమవారం ఈయనకు హఠాత్తుగా ఆ ఫేస్బుక్ ఖాతాను అడ్మిన్‌గా మీరు నిర్వహించలేరంటూ ఓ ఈ–మెయిల్ సందేశం వచ్చింది. ఇది చూసిన ఆయన తన ఫేస్‌బుక్‌కు యాక్సస్ చేయడానికి ప్రయత్నించగా... పాస్వర్డ్ మారినట్లు గుర్తించాడు. ఈ నేపథ్యంలోనే తన ఫేస్బుక్ ఖాతాను కొందరు హ్యాక్ చేసినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై రాజాసింగ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కుట్ర పూరితంగా ఫేస్ బుక్ హాక్ చేశారని, రాజకీయ కుట్రలో భాగంగానే ఎంఐఎం పార్టీ నేతలే ఈ పని చేయించినట్లు ఆరోపించాడు. గోషామహల్ నుంచి తనను ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా తాను భారీ మెజారిటీతో గెలుస్తానన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
5కోట్ల అకౌంట్లు హ్యాక్
-
షాకింగ్ న్యూస్ : 5 కోట్ల అకౌంట్లు హ్యాక్
శాన్ఫ్రాన్సిస్కో: దాదాపు 5కోట్ల ఫేస్బుక్ వినియోగదారుల అకౌంట్లు హ్యాక్ అయ్యాయని ఫేస్బుక్ శుక్రవారం వెల్లడించింది. ‘వ్యూ యాజ్’ ఫీచర్ ద్వారా హ్యాకర్లు చొరబడి సమాచారాన్ని సేకరించి ఉండొచ్చని అభిప్రాయపడింది. ‘ఈ డేటా దుర్వినియోగం జరిగిందో లేదో ఇంకా స్పష్టత రాలేదు. మిగిలిన వినియోగదారుల భద్రతా వ్యవస్థను పటిష్టం చేశాం. కొంతకాలంగా ఫేస్‌బుక్‌పై తరచూ సైబర్ దాడులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే శుక్రవారం ఉదయం 9 కోట్లకు పైగా వినియోగదారులను అత్యవసరంగా తమ అకౌంట్లను లాగ్ఔట్ చేయాలని ఫేస్బుక్ సూచించింది. న్యూస్‌ఫీడ్ పైన ఈ విషయాన్ని తెలియజేసింది. ‘మంగళవారం మధ్యాహ్నం, 5 కోట్ల యూజర్ల డేటాఅటాక్ అయిందని మా ఇంజనీరింగ్ టీమ్ గుర్తించింది. వ్యూ యాజ్ అనే ఫీచర్‌లోని సాంకేతిక లోపాన్ని ఉపయోగించుకుని హ్యాకర్లు ఈ దాడికి పాల్పడ్డారు. ఇదిప్రైవేసీ ఫీచర్’ అని మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. ప్రస్తుతానికి లోపాన్ని సరిచేసినప్పటికీ.. ఆ ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. హ్యాకర్ల దాడి వార్తల నేపథ్యంలో ఫేస్బుక్ షేర్లు అమెరికా స్టాక్‌మార్కెట్లలో నష్టపోయాయి. ప్రస్తుతానికి ఆ లోపాన్ని సరిదిద్దామని, ఈ విషయాన్ని అమెరికాలోని సంబంధిత ప్రభుత్వ శాఖలకు తెలియజేశామని ఫేస్బుక్ పేర్కొంది. -
బ్యాంకుకు హ్యాకర్ల భారీ షాక్.. 94 కోట్లు లూటీ!
సాక్షి, పుణె: దేశంలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. బ్యాంక్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లు మరో అరాచకానికి పాల్పడ్డారు. తాజాగా ఏకంగా బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి కోట్లు లూటీ చేశారు. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైకి దగ్గరగా ఉండే పుణెలో జరిగింది. దేశంలోనే పేరుమోసిన కాస్మోస్ కోపరేటివ్ బ్యాంక్‌ను మాల్వేర్ సహాయంతో హ్యాక్‌చేసి దాదపు రూ. 94 కోట్లు దోచుకున్నారు. ఆలస్యంగా గుర్తించిన బ్యాంక్ అధికారులు చత్రుశింగి పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ కేసును స్థానిక పోలీసులు, సైబర్ క్రైం అధికారులు దర్యాప్తుచేస్తున్నారు. అసలు విషయమేమిటంటే ఈ నెల ఆగస్టు 11న హ్యాకర్లు మాల్వేర్ సాయంతో బ్యాంక్ కస్టమర్ల రూపే, వీసా కార్డుల వివరాలను సేకరించి క్లోన్ చేసి దాదాపు 78 కోట్ల రూపాయలను గుర్తు తెలియని పన్నెండు వేల విదేశీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. అదే రోజు రెండున్నర కోట్లు స్వదేశీ అకౌంట్లకు బదీలీ చేశారు. ఆగస్టు 13న హాంగ్‌కాంగ్‌కు చెందిన బ్యాంక్ ఆకౌంట్లకు 13.92కోట్లు స్విఫ్ట్ పద్దతిన ట్రాన్స్ఫర్ చేశారని అధికారులు వివరించారు. హాంగ్‌కాంగ్, స్విస్, భారత్ వేదికగా ఈ హ్యాక్ జరిగి ఉంటుందని సైబర్ క్రైం అధికారులు అనుమానం. మీ డబ్బులు ఎటూ పోలేదు కాస్మోస్ కోపరేటివ్ బ్యాంక్ హ్యాక్‌కు గురైందని తెలిసిన వెంటనే ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సుహాస్ గోఖలే స్పందించారు. హ్యాక్ కు గురైంది బ్యాంక్ అకౌంట్లు మాత్రమేనని, ఖాతాదారుల వ్యక్తిగత అకౌంట్లు కాదని పేర్కొన్నారు. ఖాతాదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, మీ డబ్బులు ఎటూ పోలేదని భరోసా ఇచ్చారు. సైబర్ నేరగాళ్ల మరోసారి బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్చేయడానికి ప్రయత్నం చేశారని కానీ బ్యాంక్ ఫైర్‌వాల్ సిస్టం సమర్థవంతంగా అడ్డుకుందని వివరించారు. ఓవరాల్‌గా మొత్తం ఎంత డబ్యు లూటీకి గురైందో బ్యాంక్ ఆడిట్లో స్పష్టంగా తెలస్తుందని గోఖలే తెలిపారు. -
కిషన్‌రెడ్డి వెబ్సైట్ హ్యాక్.. 'పాక్ ఉగ్రవాదులే'
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ శాసన సభాపక్ష నేత కిషన్ రెడ్డి వెబ్సైట్ హ్యాక్ అయింది. ఈ మేరకు ఆయన సోమవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. కిషన్‌రెడ్డి డాట్ కామ్ (జీకిషన్రెడ్డిడాట్ఓఆర్జీ) అనే తన వెబ్సైట్ ఈ రోజు ఉదయం నుంచి హ్యాక్ అయిందని డీజీపీకి తెలిపారు. పాకిస్థానీయులే ఈ పనిచేసి ఉంటారని తాను అనుమానిస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్లుగా తాను ఈ వెబ్‌సైట్‌ను నిర్వహించుకుంటున్నానని, తన దగ్గర పనిచేసే ఉద్యోగులు దానిని అప్డేట్ చేస్తుంటారని, ఎప్పటికప్పుడు తాను నిర్వహించే కార్యక్రమాలను, సేవలను రోజువారిగా వెబ్సైట్లో పోస్ట్ చేస్తుంటారని చెప్పారు. సోమవారం ఉదయం తన ఉద్యోగి ఓ వార్తను అప్డేట్ చేసేందుకు ప్రయత్నించగా హ్యాకింగ్ గురైనట్లు గుర్తించామని చెప్పారు. పాకిస్థాన్‌కు చెందినవారు, కరడుగట్టిన దేశ ద్రోహులే ఈ పనిచేసి ఉంటారని తాను భావిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. -
రష్యాపై అమెరికా సంచలన ఆరోపణలు
వాషింగ్టన్ : రష్యాపై అగ్రరాజ్యం అమెరికా సంచలన ఆరోపణలకు దిగింది. వింటర్ ఒలంపిక్స్‌లో అధికారులు ఉపయోగించే కంప్యూటర్లను రష్యా హ్యాక్ చేసిందని చెబుతోంది. వందలాది కంప్యూటర్ల నుంచి విలువైన సమాచారాన్ని దొంగిలించిందని అంటోంది. దక్షిణ కొరియాలోని ప్యాంగ్ చాంగ్ వేదికగా వింటర్ ఒలంపిక్స్ క్రీడలు జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9న ప్రారంభమైన ఈ క్రీడా సమరం నేటితో (ఫిబ్రవరి 25) ముగియనుంది. అయితే రష్యన్ మిలిటరీ గూఢాచారులు ఒలంపిక్స్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించారంటూ అమెరికా ఆరోపిస్తోంది. ఫిబ్రవరి 9న ప్రారంభ వేడుకల సందర్భంగా సైబర్ దాడులు జరిగినట్లు నిర్వాహకులు ప్రకటించారు. కానీ, అది రష్యా పనేనా అన్న విషయం మాత్రం వాళ్లు ధృవీకరించలేదు. దీంతో అమెరికా చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనన్న అనుమానాలు మొదలయ్యాయి. డోపింగ్ ఆరోపణల కారణంగా రష్యన్ బృందంలోని సభ్యులపై అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ(ఐవోసీ) నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ కారణంతో రష్యా నుంచి ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఐవోసీపై ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా ఈ దాడులకు పాల్పడిందని అమెరికా చెబుతోంది. ముగింపు వేడుకలకు కూడా రష్యా అంతరాయం కలిగించే ఆస్కారం ఉందన్న ఆరోపణలతో దగ్గరుండి పర్యవేక్షించబోతున్నట్లు అమెరికా ప్రకటించగా.. అందుకు దక్షిణ కొరియా అంగీకరించింది. మరోవైపు రష్యా మాత్రం అమెరికా ప్రకటనను ఖండించింది. -
ఇన్స్టాగ్రామ్ డేటా హ్యాక్?!
సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవుతున్నాయా? మన వ్యక్తిగత సమాచారం మనకు తెలియకుండానే వేరే వ్యక్తుల చేతుల్లో పడుతోందా? విలువైన ఫొటోలు, ఫోన్‌నెంబర్లు.. ఇలా అన్ని విషయాలు చోరీకి గురవుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో నేడు ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌లోని అకౌంట్లను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు దాడి చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇన్స్టాగ్రామ్లోన సుమారు 60 లక్షల అకౌంట్లలోని సమాచారాన్ని చోరీ చోరీ చేసినట్లు ఒక సైబర్ క్రిమినల్ చెబుతున్నాడు. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, యువతను లక్ష్యంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా అకౌంట్ల సమాచార చోరికి దిగినట్లు తెలుస్తోంది. హై ప్రొఫైల్ వ్యక్తులు, కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత సమాచారాన్ని త్వరలోనే విడుదల చేస్తామని హ్యాకర్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. వెరిఫికేషన్ కానీఅకౌంట్లు హ్యాక్‌కు గురై ఉండొచ్చని ఇన్స్టాగ్రామ్ ప్రకటించింది. ఇన్స్టాగ్రామ్ ప్రకటన నేపథ్యంలో చాలా అకౌంట్లు హ్యాకింగ్‌కు గురై ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
అమెరికాలో పలు ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్!
వాషింగ్టన్: అమెరికాలో పలు ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. హ్యాక్ చేసిన దుండగులు వాటిలో ఇస్లామిక్ స్టేట్‌కు అనుకూలంగా సందేశాలను ఉంచారు. ఒహియో రాష్ట్రంలోని పలు వెబ్సైట్లు హ్యాకింగ్ బారిన పడినట్లు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. ఒహియో రాష్ట్ర గవర్నర్ జాన్ కిసిచ్ ఆఫీస్ వెబెసైట్తో పాటు.. రిహాబిలిటేషన్, హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్, వర్క్‌ఫోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ల వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ముస్లిం దేశాల్లో జరుగుతున్న రక్తపాతానికి ట్రంప్ జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందన్న సందేశం హ్యాక్ చేసిన వెబ్సైట్లలో కనిపించింది. హ్యాకింగ్ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టారు. హ్యాకింగ్ ఎలా జరిగిందనేదానిపై విచారణ జరుగుతుందని ఒహియో అడ్మినిస్ట్రేటీవ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. -
హ్యాకింగ్ కలకలం
► రాజధాని జిల్లాల్లో పోలీస్ నెట్వర్క్ హ్యాక్ ► విండోస్ వెర్షన్‌కే ముప్పు ► ముందస్తు అప్రమత్తతతో ఈ–కాప్ సర్వర్ డౌన్ ► ఆన్లైన్ ఎఫ్ఐఆర్ల నిలిపివేత ► మాన్యువల్‌గా నమోదు 8 కృష్ణా, గుంటూరు జిల్లా పోలీసుల అలర్ట్ సాక్షి, గుంటూరు : పోలీసు శాఖలో హ్యాకింగ్ కలకలం ప్రకంపనలు సృష్టించింది. శనివారం ఉదయం ఆరు గంటల నుంచే రాజధాని జిల్లాల్లోని అన్ని పోలీసు జిల్లాల్లో హ్యాకింగ్ కలకలం రేగడంతో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో విండోస్ వెర్షన్ వినియోగిస్తున్న పోలీసుల సాఫ్ట్‌వేర్‌ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. శనివారం ఉదయమే దీనిపై సమగ్ర సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమై సర్వర్లు డౌన్ చేసి, వెర్షన్లు మార్చి వేశారు. పర్యవసానంగా ఆన్లైన్ ఎఫ్ఐఆర్లను కొన్ని స్టేషన్లలో నిలిపివేసి మాన్యువల్ ఎఫ్ఐఆర్లను జారీ చేశారు. ఆన్లైన్ సేవలకు గంటల తరబడి అంతరాయం... రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులపై హ్యాకింగ్ తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా విజయవాడ కమిషనరేట్‌తో పాటు, కృష్ణా జిల్లా పోలీసులు, గుంటూరు అర్బన్, రూరల్ జిల్లా పోలీసులు హ్యాకింగ్ సమాచారంతో అప్రమత్తమయ్యారు. దీంతో నాలుగైదు గంటల పాటు ఆన్లైన్ సేవలకు అంతరాయం కలిగింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నెట్‌వర్క్‌పై హ్యాకర్లు పంజా విసిరిన నేపథ్యంలో రెండు జిల్లాల పోలీసులు కొంత అప్రమత్తమయ్యారు. దీంతో విజయవాడ కమిషనరేట్, గుంటూరు అర్బన్, రూరల్ జిల్లా పోలీసులు ఆన్లైన్ ఎఫ్ఐఆర్లకు, ఇతర సేవలకు వినియోగించే ఈ–కాప్ సర్వర్ డౌన్ చేశారు. పూర్తిగా సర్వర్ సేవలు నిలిపివేసి, మాన్యువల్ ఎఫ్ఐఆర్లకే ప్రాధాన్యత ఇచ్చారు. డీజీపీ కార్యాలయం నుంచి సమాచారం అందడంతో సర్వర్లు ఆగిపోయాయి. దీంతోపాటు, రెండు జిల్లాల్లో 80 శాతం పోలీసు స్టేషన్లలో విండోస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విండోస్ సాఫ్ట్వేర్ హ్యాక్ అయిన క్రమంలో రెండు జిల్లాల్లో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయడంతో పాటు, యాంటీ వైరస్‌ను అప్లోడ్ చేసి వైరస్ ఫైళ్లు ఏవీ ఓపెన్ చేయకుండా అవసరమైన మేరకే రెండు జిల్లాల్లోని పోలీసు స్టేషన్లలో కంప్యూటర్లు వినియోగించారు. మాన్యువల్‌గా ఎఫ్ఐఆర్ల నమోదు... హ్యాకింగ్ నేపథ్యంలో మాన్యువల్ ఎఫ్ఐఆర్లు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. కొన్ని పోలీసు స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు వ్యవహారాన్ని పెండింగ్‌లో ఉంచారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలోని 20 పోలీసు స్టేషన్ల పరిధిలో ఏడాదికి సగటున ఏడువేల ఎఫ్ఐఆర్లు నమోదవుతుంటాయి. అంటే రోజుకు సగటున 25 వరకు ఉంటాయి. హ్యాకింగ్ నేపథ్యంలో శనివారం ఎఫ్ఐఆర్ల నమోదు సంఖ్య గణనీయంగా పడిపోయింది. మొత్తం మీద ఎనిమిది కేసులే నమోదు చేసినట్లు సమాచారం. వాటిల్లోనూ నాలుగు మాన్యువల్ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇక గుంటూరు అర్బన్ జిల్లాలో 17 పోలీసు స్టేషన్లు, గుంటూరు జిల్లాలో రెండు ట్రాఫిక్ స్టేషన్లతో కలిపి 64 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. అర్బన్‌లో రోజుకు సగటున 15, రూరల్‌లో 70 వరకు కేసులు నమోదవుతున్నాయి. రెండు జిల్లాల్లో కలిపి శనివారం 30 వరకు ఎఫ్ఐఆర్లు నమోదైనట్లుగా తెలుస్తోంది. శనివారం ఉదయాన్నే పోలీసు శాఖను అప్రమత్తం చేయడంతో అందరూ కంప్యూటర్ల వాడకాన్ని రోజూకంటే 80 శాతం తగ్గించేశారు. కొందరు పోలీసులు ఆండ్రాయిడ్ వెర్షన్ వినియోగించారు. -
మహిళ వాట్సాప్‌ను హ్యాక్ చేసి..
ముంబైకి చెందిన ఓ మహిళ వాట్సాప్‌ను హ్యాక్ చేసి.. ఆమె స్నేహితులను మోసగించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జర్నలిస్టు అయిన కోమల్ పంచమతియా (30) వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయింది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు, తదితర సమాచారమంతా హ్యాకర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా ఆమె పేరిట హ్యాకర్.. పేటీఎం ద్వారా డబ్బులు పంపాలని ఆమె స్నేహితులకు మెసేజ్ పెట్టాడు. దీంతో ఒక స్నేహితురాలు మోసపోయి హ్యాకర్‌కు రూ. 2,500 పంపింది కూడా. విషయం తెలియడంతో బాధితురాలు ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించింది. సైబర్ క్రైమ్ అధికారుల కథనం ప్రకారం.. ఒక హ్యాకర్ ఆమెకు కొత్త సంవత్సరం సందర్భంగా రెండు మెసేజ్‌లు పంపించాడు. ఒకదాంట్లో న్యూఇయర్ విషెస్ పంపిన అతను మరొక మెసేజ్‌ను తనకు కాపీ చేసి పంపాల్సిందిగా కోరాడు. అందులో మాల్వేర్ ఉండటంతో ఇలా కాపీ చేసి పంపిన మెసేజ్‌లో వాట్సాప్ పంపే ఆరు అంకెల అకౌంట్ యాక్టివేషన్ కోడ్ కూడా వెళ్లింది. ఈ కోడ్ ద్వారా మరో డివైస్‌లో ఆమె వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేసిన దుండగుడు.. ఆమె ఫొటోలు, వీడియోలతోపాటు సమాచారమంతా రాబట్టాడు. అంతేకాకుండా పంచమతియా స్నేహితులకు పేటీఎం ద్వారా డబ్బులు పంపించాలని కోరాడు. దీంతో ఆమె స్నేహితురాలు ఒకరు హ్యాకర్‌కు డబ్బు పంపి.. ఆ విషయాన్ని పంచమతియాకు తెలిపింది. దీంతో కంగుతిన్న ఆమె తన వాట్సాప్ హ్యాకింగ్ గురయిందని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించింది. పంచమతియా వాట్సాప్ అకౌంట్‌ను హ్యాకర్ నుంచి రీకవరీ చేసిన పోలీసులు.. పేటీఎం అకౌంట్ ద్వారా అతని గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
అపోలో డేటా హ్యాక్? నెక్ట్స్ లలిత్ మోదీనే!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, విజయ్ మాల్యా, ప్రముఖ జర్నలిస్టు బర్కా దత్ ల ట్విట్టర్ అకౌంట్లు, ఈ-మెయిళ్ల సర్వర్లు హ్యాక్ చేసిన లెజియన్ హ్యాకర్ల బృందం తాము అపోలో ఆసుపత్రికి చెందిన సర్వర్లను హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు. వాషింగ్టన్ పోస్టుకు ఇచ్చిన ఓ రహస్య ఇంటర్వూలో వారు ఈ విషయాన్ని వెల్లడించారు. అపోలోకు సంబంధించిన కీలక సమాచారం మొత్తం తమ వద్ద ఉందని చెప్పారు. వారికి లభ్యమైన డేటా వివరాలను బయటపెడితే భారతదేశ ప్రజలు ఆందోళనలకు గురయ్యే అవకాశం ఉంటడంతో వాటిని విడుదల చేయడం లేదని తెలిపారు. భారత్ లోని 40 వేల సర్వర్లకు చెందిన గిగాబైట్ల కొద్దీ సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. అంతేకాకుండా భారత రాజకీయ నాయకుల వ్యక్తిగత సమాచారం కూడా తమ ఉందని పేర్కొన్నారు. త్వరలో ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు లలిత్ మోదీకి చెందిన వ్యక్తిగత సమాచారాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. బీజేపీ ప్రభుత్వానికి సన్నిహితులైన వారి సమాచారాన్ని కూడా హ్యాక్ చేసినట్లు వెల్లడించారు. -
ఆరే ఆరు సెకండ్లలో అంతా హ్యాక్!
-
ఆరే ఆరు సెకండ్లలో అంతా హ్యాక్!
హ్యాకింగ్.. హ్యాకింగ్... నెట్ లావాదేవీల్లో ఎక్కడ చూసినా ఇదే లొల్లి. ప్రపంచ ఆన్లైన్ వ్యవస్థను ఇది షేక్ చేసేస్తోంది. దేశాల ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేస్తోంది. ఇటీవలే దాదాపు 32 లక్షల బ్యాంక్ డెబిట్ కార్డులను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తెచ్చుకుని దేశ బ్యాంకింగ్ వ్యవస్థకే సవాలు విసిరారు. అయితే ఇంత భీభత్సం సృష్టిస్తున్న హ్యాకర్లు.. మన ల్యాప్‌టాప్‌లను, ఇంటర్నెట్ కనెక్షన్‌తో కూడా వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను వారి స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఎంత సమయం వెచ్చిస్తున్నారో తెలిస్తే మాత్రం షాక్. కేవలం ఆరే ఆరు సెకండ్లలో యూజర్ల ల్యాప్‌టాప్‌లను, వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను హ్యాక్ చేయగలరని ఓ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ఈ రీసెర్చ్ రిపోర్టును ఐఈఈఎఫ్ సెక్యురిటీ అండ్ ప్రైవసీ ఓ జర్నల్‌లో ప్రచురించింది. పేమెంట్ కార్డు డేటా హ్యాకర్ల బారిన పడినట్టు ఏ నెట్వర్క్, ఏ బ్యాంకు వెంటనే గుర్తిచంలేదని ఈ జర్నల్ పేర్కొంది. గెస్సింగ్ అటాక్ ద్వారా కేవలం ఆరు సెకన్లలో యూజర్ల కార్డు నెంబర్, గడువు తుది తేదీ, సీవీవీ వివరాలను స్వాధీనం చేసుకుంటారని న్యూకాసిల్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్డీ విద్యార్థులు చెప్పారు. ఆన్లైన్ కొనుగోళ్లకు వివిధ వెబ్సైట్లు వివిధ రూపాల్లో కార్డు డేటా నింపే ప్రక్రియను ఆఫర్ చేస్తాయని, దీంతో హ్యాకర్లు కార్డు వివరాలను తేలికగా హ్యాక్ చేయడానికి అవకాశముంటుందని ఆ యూనివర్సిటీకి చెందిన పీహెచ్డీ స్టూడెంట్ మహ్మద్ అలీ చెప్పారు. ప్రస్తుతం ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ వివిధ వెబ్సైట్ల నుంచి వచ్చే మల్టిపుల్ ఇన్వాలిడ్ పేమెంట్ అభ్యర్థనలనూ గుర్తించలేదని తెలిపారు. ఈ మేరకు యూజర్లు అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. -
ఏయూ వెబ్సైట్ హ్యాకింగ్
ఐదు రోజుల్లో ఇది రెండో సారి పెదవాల్తేరు : ఏయూ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైందని రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు బుధవారం మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెబ్సైట్ హోమ్ పేజీలోని లోగోలను హ్యాకర్లు మార్చేశారని, దీని వల్ల నష్టం లేదని, అయినప్పటికీ నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏయూ వెబ్సైట్ హ్యాక్ కావడం ఐదు రోజుల్లో ఇది రెండోసారి. గత నెల 30న తొలిసారి హ్యాక్ అయింది. www.andhravuniversity.edu.in వెబ్‌సైట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. పాకిస్తాన్ జిందాబాద్ అన్న నినాదాలు వెబ్సైట్లో దర్శనమిచ్చాయి. వెంటనే స్పందించిన అధికారులు మధ్యాహ్నానికి పునరుద్ధరించారు. వెబ్సైట్ హ్యాకింగ్ జరగలేదని, డొమైన్‌ను ఇతరులు డైవర్ట్ చేశారని దాని నిర్వాహకుడు ఆవాల రమేష్ ఆరోజు తెలిపారు. అయితే మళ్లీ హ్యాక్ చేయడంతో రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కోటిమంది సమాచారం గోవిందా!
ముంబై: ఇటీవల హ్యకింగ్ కు గురైన భారతీయ రైల్వే టికెటింగ్ వెబ్ సైట్ (ఐఆర్సీటీసీ)కు తాజాగా మరో చిక్కొచ్చిపడింది. హ్యకింగ్ కు గురైన సమాచారంలో ఒక కోటికి పైగా కస్టమర్ల వివరాలు ఉండటంతో పాటు ఆ వివరాలను సీడీలలో పొందుపరచి రూ.15,000లకు కావలసిన వారికి అమ్ముతున్నట్లు అధికారులకు తెలిసింది. మహారాష్ట్ర ఇంటిలిజెన్స్ బ్యూరో సైబర్ పోలీసుల వివరాల ప్రకారం హ్యకింగ్ సమయంలో దాదాపు ఒక కోటికి పైగా కస్టమర్ల ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, పాన్ కార్డు నంబర్ తదితర వివరాలను తస్కరించినట్లు తెలిపారు. వెబ్ సైట్ హ్యక్ కాలేదు: రైల్వే పీఆర్వో కాగా ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో వివరాలు హ్యక్ అయినట్లు మీడియాలో వస్తున్న వార్తలను రైల్వే పీఆర్వో సందీప్ దత్తా ఖండించారు. దీనిపై రైల్వే కమిటీ విచారణ జరుపుతోందని వివరించారు. గతంలోనూ ఐఆర్సీటీసీ వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైన విషయం తెలిసిందే. -
'కంగనా చాలా విషయాలు చెప్పింది'
ముంబయి: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తన ఈమెయిల్ హ్యాక్ చేసినట్లు ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పష్టం చేసింది. వీరిద్దరి మధ్య నడుస్తున్న కేసు విషయంలో దర్యాప్తు బృందానికి ఇచ్చిన వివరణలో ఆమె ఈ విషయం పేర్కొంది. కంగనా తరుపు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ ఆ వివరాలు తెలియజేశారు. ఆయన చెప్పిన ప్రకారం పోలీసుల ముందు వివరణ ఇచ్చేందుకు కంగనా ఆమె సోదరి రంగోలితో కలిసి వెళ్లారు. 'కంగనా, ఆమె సోదరి వివరణ పట్ల పోలీసులు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే తాను ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో హృతిక్ పేర్కొనని పలు కొత్త అంశాలు ఇప్పుడు పోలీసులకు తెలిశాయి. అసలు హృతిక్ ఓ వ్యక్తి యొక్క వ్యక్తిగత అంశాలను ఎందుకు అలా బహిరంగం చేశారనే విషయం గుర్తించకుండానే చాలా విషయాలు ముందుకెళ్లాయి' అని ఆయన చెప్పారు. శనివారం సాయంత్రం 5గంటల నుంచి 8గంటల ప్రాంతంలో పోలీసులు కంగనా వాంగ్మూలాన్ని నమోదుచేసుకున్నట్లు చెప్పారు. అంతకుముందు గత సోమవారం, ఏప్రిల్ 18న ఒకసారి పోలీసులే నేరుగా కంగనా ఇంటి వద్దకు వెళ్లి ఆమె వివరణ తీసుకున్న విషయం తెలిసిందే. -
లాలూ ఫేస్ బుక్ హ్యాక్.. యువకుడు అరెస్ట్
ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చేసిన వ్యక్తిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ అకౌంట్‌ని హ్యాక్ చేయడానికి ఉపయోగించిన 2 ఫోన్లను నిందితుని నుంచి స్వాధీనం చేసుకున్నారు. వైశాలిలోని మెహ్మదాబాద్ గ్రామానికి చెందిన దివ్యాన్షు కుమార్ అలియాస్ గోలు లాలూ ఫేస్ బుక్ అకౌంట్‌ని హ్యాక్ చేశాడని పోలీసులు తెలిపారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లపై అవగాహన ఉన్న దివ్యాన్షుకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉందని పోలీసులు పేర్కొన్నారు. మార్చి 8, 11న లాలూ ఫేస్ బుక్ అకౌంట్‌ని హ్యాక్ చేసిన దివ్యాన్షు, అనుచితమైన కమెంట్లను పోస్ట్ చేశాడు. వీటిని గమనించిన లాలూ కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ వెంటనే ఆ కామెంట్లను తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
గూగుల్ అనుకొని...
‘యాడ్గూగుల్’ను హ్యాక్ చేసిన ఐసిస్ లండన్: దిగ్గజ సెర్చింజన్ గూగుల్‌ను నేలకు దించుతామని ప్రతిన బూనిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ పొరపాటున ఆపేరుతో ఉన్న ఒక చిన్న భారతీయ కంపెనీని హ్యాక్ చేసింది. మీడియా కథనాల ప్రకారం ఐఎస్ఐఎస్ అనుబంధ హ్యాకింగ్ గ్రూప్ సైబర్ కాలిఫేట్ ఆర్మీ (సీసీఏ) భారత్‌కు చెందిన గాందాని కె అనే వ్యక్తి పేరుమీద రిజిస్టరైన యాడ్గూగుల్ఆన్లైన్.కామ్ అనే సంస్థను హ్యాక్ చేసింది. ఈ సంస్థ స్థానిక కంపెనీలకు సెర్చింజన్ సేవలు అందిస్తోంది. ‘మేము సోమవారం గూగుల్‌ని హ్యాక్ చేస్తామని ప్రకటించాం. భగవంతుని దయవల్ల అది ఈ రోజే జరగొచ్చు’ అని సీసీఏ గురువారం ప్రకటించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే యాడ్గూగుల్ఆన్లైన్.కామ్ వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడి చేశారు. హ్యాకింగ్‌కు గురైన తరువాత వెబ్సైట్లో ఇస్లామిక్‌స్టేట్‌కు సంబంధించిన పాట ఫ్రెంచ్‌లో వినిపించడంతో పాటు ఐఎస్ లోగో కనిపించింది. సీసీఏ హ్యాక్ చేసినట్లు వెబ్సైట్లో ఇండికేషన్ వచ్చింది. ఇది జరిగిన కొద్ది సేపటికే మరో హ్యాకింగ్ గ్రూప్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఐఎస్ మెస్సేజ్‌ను చెరిపేసింది. యూకే మీడియా కథనం ప్రకారం ఇప్పటి వరకు 35 బ్రిటిష్ వెబ్సైట్లను ఐఎస్ హ్యాక్ చేసింది. -
ఐఫోన్ హ్యాక్ కోసం యాపిల్‌కు ఆదేశాలు
న్యూయార్క్: కాలిఫోర్నియాలో నరమేధానికి కారణమైన ఉగ్రవాది ఫరూక్ ఐఫోన్‌ను హ్యాక్ చేయాలని కోర్టు యాపిల్ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రత కన్నా డిజిటల్ ప్రైవసీ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలతో ఉగ్రవాది ఐఫోన్‌ను హ్యక్ చేయడానికి కావలసిన సాంకేతికతను అందించి విచారణ అధికారులకు విలువైన సమాచారాన్ని సేకరించడంలో యాపిల్ సహకరించనుంది. డిసెంబర్ 2 న సయీద్ ఫరూక్, తష్ఫిన్ మాలిక్ దంపతులు సాన్ బెర్నార్డినోలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 14 మంది మృతికి కారణమై పోలీసుల కాల్పుల్లో వీరిద్దరూ హతమైన విషయం తెలిసిందే. అయితే ఫరూక్ ఐఫోన్‌ను డీకోడ్ చేసి సమాచారాన్ని సేకరించాలనుకున్న ఎఫ్‌బీఐ అధికారులకు యాపిల్ హై సెక్యూరిటీ టెక్నాలజీ అడ్డుగా నిలిచింది. దీంతో యాపిల్ సంస్థ ఎఫ్‌బీఐకి ఈ సాంకేతిక సహకారాన్ని అందించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
షాహిద్ ఫేస్ బుక్ హ్యాక్..
న్యూఢిల్లీ: తన ఫేస్ బుక్ ఖాతా తిరిగి పునరుద్ధరించబడిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తెలిపారు. పలువురు ప్రముఖుల ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలను హ్యాక్ చేస్తున్న హ్యాకర్లు ఆదివారం బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఫేస్ బుక్‌ను హ్యాక్ చేశారు. దీంతో తన ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు, ఫాలోవర్స్‌కు షాహిద్ తెలియజేశారు. అయితే, త్వరలోనే హ్యాకింగ్ నుంచి తప్పించి తన ఖాతాను పునరుద్ధరిస్తానని ప్రకటించిన ఆయన అన్నట్లుగానే సోమవారం తిరిగి తన ఖాతాను తిరిగి ప్రారంభించారు. 'ఫేస్ బుక్ ఖాతా పునరుద్ధరించబడింది.. గణపతి బప్ప మోరియా' అంటూ ట్విట్టర్లో షాహిద్ పేర్కొన్నారు. -
కేరళ ప్రభుత్వ వెబ్‌సైట్‌పై పాక్ హ్యాకర్ల దాడి
తిరువనంతపురం: 'తగలబడుతున్న త్రివర్ణ పతాకం, ఆ వెంటనే పాకిస్థాన్ అనుకూల నినాదాలు..' ఇదీ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేరళ ప్రభుత్వ వెబ్ సైట్ లోకి వెళ్లిన వారికి కనిపించిన దృశ్యాలు! పలువురి ఫిర్యాదుతో వెంటనే తేరుకున్న ప్రభుత్వాధికారులు రాత్రికిరాత్రే నిపుణులను రప్పించి వైబ్ సైట్ ను పునరుద్ధరించారు. అసలేం జరిగిందనే విషయాన్ని ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఆదివారం ఉదయం ప్రకటించారు. 'కేరళ ప్రభుత్వ వెబ్ సైట్ (www.keralagov.in) శనివారం అర్ధరాత్రి తర్వాత హ్యాకింగ్ కు గురైంది. పాకిస్థాన్ కు చెందిన హ్యాకర్లే ఈ దురాగతానికి ఒడిగట్టిఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చాం. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవెలప్ మెంట్ ఆఫ్ ఇమేజింగ్ టెక్నాలజీ వారు సైట్ ను పునరుద్ధరించారు' అని కేరళ సీఎం చాందీ తెలిపారు. దీనిని తీవ్రమైన చర్యగా భావిస్తున్నట్లు, వెంటనే విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. -
ఆరు ప్రభుత్వ సైట్లను హ్యాక్ చేసిన ఉగ్రవాదులు
బ్యాంకాక్: ఇప్పటి వరకు భౌతిక దాడులకు దిగుతున్న ఉగ్రవాదులు ఇప్పుడు సాంకేతిక పరమైన దాడులకు దిగుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ బ్యాంకాక్‌కు చెందిన ఆరు ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లను హ్యాక్ చేసింది. ట్యునీషియా నుంచి ఈ చర్యకు పాల్పడింది. ఈ సైట్లను తెరిచి చూసేవారికి రోహింగ్యా ముస్లింల చిత్రాలు దర్శనమిస్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఫల్లాగ్ గస్సిర్ని అండ్ డాక్టర్ లామౌచి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మీ సైట్లను ట్యునిషియా నుంచి తామే హ్యాక్ చేశామని అందులో పేర్కొన్నారు. 'మీరు మా ప్రజలకు గౌరవం ఇవ్వాలి. మాదంతా ఫల్లాగా బృందం. మొత్తం ముస్లింలమే. మేము శాంతియుతంగా ప్రజలను ప్రేమిస్తాం' అని కూడా అందులో పేర్కొన్నారు. గతంలో కూడా వీరే ఇజ్రాయెల్, ప్రెంచ్ సైట్లపై హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై థాయిలాండ్ సాంకేతిక శాఖ మంత్రి స్పందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ సైట్లపై హ్యాకింగ్ దాడులు జరగడం సర్వ సాధారణమైందని, సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు. -
అమెరికా, ఆస్ట్రేలియా సైట్లు హ్యాక్ చేసిన ఐఎస్
1,400 మంది ఉన్నతాధికారులను హతమారుస్తామని హెచ్చరిక మెల్బోర్న్: ఇరాక్, సిరియాలో మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ తీవ్రవాదులు కన్ను అమెరికా, ఆస్ట్రేలియాపై పడింది. ఈ దేశాల్లోని రక్షణ రంగం, ప్రభుత్వ విభాగాల్లోని 1,400 మంది ముఖ్యుల వివరాలను హ్యాక్ చేసినట్లు వెల్లడించింది. త్వరలో వీరంద రనీ హతమారుస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక తెలిపింది. ఇందులో అమెరికాకు చెందిన వారే ఎక్కువ ఉన్నారని వెల్లడించింది. ‘మేం మీ కదలికలన్నీ గమనిస్తున్నాం. మీరు వాడుతున్న సామాజిక మాధ్యమాల్లో మా సభ్యులున్నారు. మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాం. ఇందులో మీ బందువులు కూడా ఉన్నారు. త్వరలో మా ఐఎస్ మిత్రులు మిమల్ని మీ దేశంలోనే మట్టుపెడతారు’ అని ఇస్లామిక్ స్టేట్ హ్యాకింగ్ విభాగం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో విక్టోరియా ఎంపీ కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చేరవేశానని ఎంపీ తెలిపారు. తమ కుటుంబ సభ్యులకు పూర్తి రక్షణ కల్పించాలని కోరినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ విభాగం అంగీకరించింది. ఉద్యోగుల వివరాలను ఫోన్ నంబర్లు, చిరునామాలతో సహా ఐఎస్ బుధవారం ఆన్లైన్లో పెట్టినట్లు తెలిపింది. -
ఇస్రో సైట్‌పై చైనా హ్యాకర్ల దాడి
న్యూఢిల్లీ: వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు కొత్త సమస్య వచ్చిపడింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థకు చెందిన వాణిజ్య విభాగానికి చెందిన వెబ్ సైట్ హ్యాకింగ్‌కు గురైంది. దాని హోం పేజీలో స్పోర్ట్స్‌కు చెందిన పేజీ మాత్రమే కనిపిస్తుంది. చైనాకు చెందిన హ్యాకర్లు దాడి చేసినట్లు ఇస్రో అధికారులు ధృవీకరించారు. ఇస్రోకు చెందిన కమర్షిల్ ఆర్మ్ యాంట్రిక్స్ విభాగం హ్యాకింగ్‌కు గురైనట్లు వారు తెలిపారు. రెండు రోజుల కిందటే పీఎస్ఎల్వీ-సీ28 ఐదు విదేశీ(బ్రిటన్) ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ లోగానే సూట్ హ్యాకింగ్‌కు గురికావడం ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం వాణిజ్య విభాగం ఆర్మ్ యాంట్రిక్స్ హోం పేజీలో పశ్చిమ కెనడా, దక్షిణాఫ్రికాకు చెందిన స్కూల్ విద్యా విధానం, విద్యార్థులు, క్రీడలువంటి సమాచారంతో ఒక పేజీ కనిపిస్తోంది. -
బెంగాల్ వర్సిటీ వెబ్ సైట్ హ్యాక్
కోల్ కతా: పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ యూనివర్సిటీ వెబ్ సైట్ ను యునైటెడ్ ఇస్లామిక్ సైబర్ ఫోర్స్ అనే ఉగ్రవాద సంస్థ హ్యాక్ చేసింది. దీంతో దాని నుంచి బయటపడేందుకు ఇప్పుడు వర్సిటీ అధికారులు తంటాలుపడుతున్నారు. కూక్ బెహర్ లోని నార్త్ బెంగాల్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన అధికారిక వెబ్ సైట్ ఆదివారం ఉదయం హ్యాకింగ్‌కు గురైంది. దీనిపై వర్సిటీ అధికారులు మాట్లాడుతూ హోమ్ పేజీ మాత్రమే వారు హ్యాక్ చేశారని, దానిపై క్లిక్ చేస్తే యునైటెడ్ ఇస్లామిక్ సైబర్ ఫోర్స్ అని వస్తుందని, నిపుణులను తీసుకొచ్చి సమస్యను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. -
హ్యాకింగ్ చేసి.. అసభ్య చిత్రాలు.. అరెస్టు
చండీగఢ్: హర్యానాలో ఫేస్ బుక్ ఖాతాలను హ్యాక్ చేసి వాటిల్లో అసభ్య చిత్రాలు పెడుతూ అవతలి వ్యక్తులనుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం యమునా నగర్ కు చెందిన అరవింద్ సింఘాల్ (24) అనే యువకుడు దాదాపు 20 ఫేస్ బుక్ ఖాతాలను హ్యాక్ చేశాడు. ఆరు నెలలుగా వారి ఖాతాల్లోకి పోర్న్ చిత్రాలను పెడతానని బెదిరిస్తూ డబ్బు గుంజడం ప్రారంభించాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు మొత్తం 17 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫేస్ బుక్ పాస్ వర్డ్స్ కోసం ఉపయోగించేవాడని పోలీసులు తెలిపారు. తన ఫేస్ బుక్ ఖాతాలోకి అసభ్య చిత్రాలు వస్తుండటంతో నహన్ ప్రాంతానికి చెందిన సర్వేశ్ శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరవింద్ ఆగడాలకు అడ్డుకట్ట పడింది. మే 15న కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొద్ది కాలానికే అతడిని అరెస్టు చేశారు. -
ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసింది వాళ్లేనా?
న్యూఢిల్లీ: ఫేస్బుక్ అంతరాయం కలగడానికి సాంకేతిక సమస్య కారణమా లేక హ్యాకింగ్ చేయడం వల్లనా? దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మలేసియా ఎయిర్ లైన్స్ వెబ్‌సైట్‌పై ఇటీవల దాడి చేసిన హ్యాకర్లే ఫేస్‌బుక్‌కు అంతరాయం కలిగించి ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాదుల మద్దతుదారులు లిజర్డ్ స్క్వాడ్.. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ను స్తంభింపజేసినట్టు ట్విట్టర్లో పేర్కొంది. ఫేస్ బుక్ సహా , వాట్సప్ మెసెంజర్లు మంగళవారం మధ్యాహ్న ప్రాంతంలో స్తంభించిన సంగతి తెలిసిందే. సాంకేతిక సమస్యలు వల్ల ఆగిపోయినట్టు భావించారు. అయితే తామే అంతరాయం కలిగించామని మంగళవారం సాయంత్రం లిజర్డ్ స్క్వాడ్ ట్వీట్ చేసింది. మలేసియా ఎయిర్‌లైన్స్ ఈమెయిల్ తమ ఆధీనంలోనే ఉందంటూ వెంటవెంటనే ట్వీట్లు పెట్టారు. కాగా ఫేస్బుక్ యాజమాన్యం ఈ ఆరోపణలను అవాస్తమని పేర్కొంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాదారులు అసౌకర్యం చెందిన మాట వాస్తవమేనని, అయితే ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ఫేస్బుక్లో ఓ మార్పు చేయడం వల్ల సాంకేతిక సమస్య తలెత్తిందని, వెంటనే దీన్ని సరిచేశామని తెలియజేసింది. -
పూనమ్ పాండే వెబ్సైట్ హ్యాక్.. పాకిస్థానీ పాత్ర
ముంబై: హాట్ హాట్ ఫోజులు, సంచలన వ్యాఖ్యలు, ట్వీట్లతో ఎలాగోలా వార్తల్లో నిలిచే బాలీవుడ్ ముద్దుగుమ్మ, మోడల్ పూనమ్ పాండేకు ఈసారి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. పూనమ్ వెబ్సైట్ ‘www.poonampandey.in’ ను ఆదివారం పాకిస్థాన్ హ్యాకర్లు హ్యాక్ చేశారు. దీంతో అవాక్కయిన పూనమ్ ముంబై సైబర్ క్రైం సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారని తెలియగానే షాక్‌కు గురయ్యానని ఈ మోడల్ భామ చెప్పింది. ఆ సమయంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యానని చెప్పుకొచ్చింది. హ్యాక్ చేసిన వ్యక్తి పాకిస్థాన్, కాశ్మీర్ సంబంధిత విషయాల్ని పూనమ్ సైట్లో రాశాడు. ఈ విషయాల్ని పూనమ్ ట్వీట్ చేసింది. షాక్ నుంచి తేరుకునేందుకు ప్రయత్నిస్తున్నానని, త్వరలోనే వెబ్సైట్ తన నియంత్రణలోకి వస్తుందని పేర్కొంది. కొత్త లుక్, మరింత మసాల వార్తలతో ముందుకొస్తానంటూ ముక్తాయించింది.