న్యూఢిల్లీ: ఎయిరిండియాలో భారీ సైబర్ అటాక్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎయిరిండియా పాసింజర్లకు సంబంధించి క్రెడిట్ కార్డు డేటా, పాస్ పోర్ట్ డేటా హ్యాకింగ్‌కు గురైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మందికి సంబంధించిన డేటా లీకైనట్లు ఎయిరిండియా వర్గాల సమాచారం. 2011 ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి 2021 వరకు డేటా హ్యాక్ అయినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. హ్యాక్ ఆయన డేటాలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సమాచారం ఉన్నట్లు సమాచారం.
చదవండి: 18 మిలియన్ల పోస్టులను తొలగించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్
Comments
Please login to add a commentAdd a comment