![E-scooters can be hacked to eavesdrop on riders - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/28/222431_WEB.jpg.webp?itok=GGmL2mH0)
హూస్టన్: ఎలక్ట్రానిక్–స్కూటర్లను హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికాకు చెందిన టెక్సాస్ యూనివర్సిటీ నిపుణులు తాజా పరిశోధన ద్వారా వెల్లడించారు. ఇందులో భారతీయ నిపుణులు పాల్గొన్నారు. వాహనదారుల గోప్యతకు సంబంధించిన వివరాలను ఈ–స్కూటర్ల ద్వారా హ్యాక్ చేయొచ్చని వీరు చెబుతున్నారు. ఈ–స్కూటర్లను మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేసినపుడు.. రెండింటి మధ్య సమన్వయం ఏర్పడుతుంది. దీంతో ఆ వాహనం ప్రయాణించే ప్రాంతం, ఎంత దూరం తిరిగింది వంటి వివరాలు ఫోను, వాహనాల్లో నిక్షిప్తం అవుతాయి. ఇదే హ్యాకర్లకు అవకాశం కల్పిస్తోందని వారు తెలిపారు. ఈ వివరాల ద్వారా వాహనదారులు తరచుగా తిరిగే మార్గాలను, వ్యక్తిగత వివరాలను, ప్రస్తుతం ఉండే లొకేషన్ వంటి వివరాలను హ్యాకర్లు తెలుసుకుంటారని చెప్పారు. సైబర్ సెక్యూరిటీని పటిష్టంగా ఉండేలా మోటారు వాహనాల కంపెనీలు తమ వాహనాలను తయారు చేయాలని వారు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment