
ఇన్‌స్టాగ్రామ్ డేటా హ్యాక్?!
సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవుతున్నాయా? మన వ్యక్తిగత సమాచారం మనకు తెలియకుండానే వేరే వ్యక్తుల చేతుల్లో పడుతోందా? విలువైన ఫొటోలు, ఫోన్‌నెంబర్లు.. ఇలా అన్ని విషయాలు చోరీకి గురవుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో నేడు ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌లోని అకౌంట్లను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు దాడి చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లోన సుమారు 60 లక్షల అకౌంట్లలోని సమాచారాన్ని చోరీ చోరీ చేసినట్లు ఒక సైబర్ క్రిమినల్ చెబుతున్నాడు. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, యువతను లక్ష్యంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా అకౌంట్ల సమాచార చోరికి దిగినట్లు తెలుస్తోంది. హై ప్రొఫైల్ వ్యక్తులు, కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత సమాచారాన్ని త్వరలోనే విడుదల చేస్తామని హ్యాకర్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. వెరిఫికేషన్ కానీఅకౌంట్లు హ్యాక్‌కు గురై ఉండొచ్చని ఇన్‌స్టాగ్రామ్ ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ ప్రకటన నేపథ్యంలో చాలా అకౌంట్లు హ్యాకింగ్‌కు గురై ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.