
పాన్ ఇండియా హరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సలార్, కల్కి సినిమాలతో బిజీ ఉన్నారు. తాజాగా ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాకయింది. అందులో ఆయనకు 24 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ డార్లింగ్ మాత్రం కేవలం డైరెక్టర్ రాజమౌళిని మాత్రమే ఫాలో అవుతున్నారు. కేవలం తన సినిమాలు విషయాలు. నటీనటులకు విషెస్ చెప్పడానికి మాత్రమే సోషల్ మీడియా ఖాతాను ఉపయోగిస్తుంటారు. లేదంటే వాటికి దూరంగా ఉంటారు.
(ఇదీ చదవండి: BRO Twitter Review ‘బ్రో’ మూవీ ట్విటర్ రివ్యూ)
ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ఓ వైరల్ వీడియో కనిపించింది. 'మనుషులు దురదృష్టవంతులు' అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ వీడియో చూసిన అభిమానులు 'ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాకయింది' అంటూ ట్వీట్స్ పెట్టారు. దీంతో అప్రమత్తమైన ప్రభాస్ టీమ్ సమస్యను పరిష్కరించింది. ఆయన ఖాతాను వెంటనే పునరుద్ధరించారు.
2013 అక్టోబర్ 18న తన పేరుతో ఫేస్‌బుక్ ఖాతాను ప్రభాస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. హ్యకింగిక్ కారణాలు తెలియాల్సి ఉందని ప్రభాస్ టీమ్ తెలిపింది. ఈ విషయంపై వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment