అమెరికాలో పలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లు హ్యాక్!
వాషింగ్టన్: అమెరికాలో పలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. హ్యాక్ చేసిన దుండగులు వాటిలో ఇస్లామిక్ స్టేట్‌కు అనుకూలంగా సందేశాలను ఉంచారు.
ఒహియో రాష్ట్రంలోని పలు వెబ్‌సైట్‌లు హ్యాకింగ్ బారిన పడినట్లు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. ఒహియో రాష్ట్ర గవర్నర్ జాన్ కిసిచ్ ఆఫీస్ వెబెసైట్‌తో పాటు.. రిహాబిలిటేషన్, హెల్త్ ట్రాన్స్‌ఫర్‌మేషన్, వర్క్‌ఫోర్స్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ డిపార్ట్‌మెంట్‌ల వెబ్‌సైట్‌లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ముస్లిం దేశాల్లో జరుగుతున్న రక్తపాతానికి ట్రంప్ జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందన్న సందేశం హ్యాక్ చేసిన వెబ్‌సైట్‌లలో కనిపించింది. హ్యాకింగ్ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టారు. హ్యాకింగ్ ఎలా జరిగిందనేదానిపై విచారణ జరుగుతుందని ఒహియో అడ్మినిస్ట్రేటీవ్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.