న్యూఢిల్లీ: కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ అధికార ట్విటర్ ఖాతా గురువారం హ్యాక్ చేశారు. హ్యాకింగ్ అనంతరం ఈ ఖాతా పేరును టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్‌గా మార్చడంతో పాటు ప్రొఫైల్ పిక్ ఆయన ఫోటోని ఉంచారు. అంతేకాకుండా ‘మీరు మిలియనీర్‌గా మారడానికి ఇదొక ప్రత్యేక అవకాశం. 7,200,000 డాలర్లు గెలిచేందుకు మిస్టరీ బాక్స్‌లో ఉన్నాయి’ అని పేర్కొంటూ ఒక లింక్‌ను సైబర్ నేరగాళ్లు ఈ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. (చదవండి: యోగిజీ ఎఫెక్ట్: ప్లీజ్.. చంపొద్దు కావాలంటే జైల్లో పెట్టండి )
ఈ షాకింగ్ ఘటన జరిగిన తర్వాత పాస్‌వర్డ్‌ను మార్చడంతో పాటు ఢిల్లీ పోలీసులకు చెందిన సైబర్ క్రైమ్ బృందానికి సమాచారం అందించారు. ఈ హ్యాకింగ్ గురించి కేంద్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు. హ్యాక్ అయిన ఖాతాను కొద్ది గంటల్లోనే పునరుద్ధరించారు. అనంతరం కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. తమ అధికార ట్విట్టర్ ఖాతాకు గురువారం సైబర్ భద్రతకు సంబంధించిన సమస్యలు వచ్చాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు అందులో పోస్ట్ అయిన లేదా షేర్ చేసిన, బదులు ఇచ్చిన సమాచారానికి తమ మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. కాగా భారత ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెందిన ట్విట్టర్ ఖాతాతో పాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment