statistics department
-
ముందు కెరీర్..తర్వాతే పిల్లలు!
ఇల్లు.. పెళ్లి.. పిల్లలు.. ఇది నిన్నటితరం భారతీయ మహిళల మాట.. ఉన్నత చదువు.. కెరీర్.. పెళ్లి.. కెరీర్లో స్థిరత్వం.. ఆ తర్వాతే పిల్లలు.. ఇదీ నేటి భారతీయ మహిళల దృక్కోణంలో వచ్చిన మార్పు.. అవును.. పిల్లలకు జన్మనిచ్చే విషయంలో భారత మహిళల దృక్పథం మారుతోంది. ముందు ఉన్నత చదువును అభ్యసించడం, మంచి ఉద్యోగం సాధించి కెరీర్‌ను మొదలుపెట్టడం, ఆ తర్వాత దాంపత్య బంధంతో ఒక్కటి కావడం, కెరీర్లో స్థిరత్వం ఇవన్నీ సమకూరాకే సంతానం కనడానికి మొగ్గుచూపుతున్నారు. కెరీర్లో ఉన్నత స్థాయికి చేరే వరకు పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. ఈ మేరకు 2016 తర్వాత నుంచి భారత మహిళల దృక్పథంలో గణనీయ మార్పులు వచ్చాయని కేంద్ర గణాంకాలు – కార్యక్రమాల అమలు శాఖ తాజా నివేదిక వెల్లడించింది. ‘భారతదేశంలో మహిళలు, పురుషులు– 2023’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో దేశంలో జనాభా పెరుగుదల, పురుషులు–మహిళల నిష్పత్తి, సంతానం విషయంలో మహిళల దృక్పథం తదితర అంశాలపై కీలక విషయాలను పొందుపరిచింది. అందులోని ప్రధాన అంశాలు ఇవీ.. – సాక్షి, అమరావతి2036 నాటికి దేశ జనాభా 152.2 కోట్లు దేశ జనాభా 2036 నాటికి ఏకంగా 152.2 కోట్లకు చేరుతుందని నివేదిక పేర్కొంది. పురుషులతో పోలిస్తే మహిళల జనాభా నిష్పత్తి క్రమంగా మెరుగుపడుతోంది. 2011లో దేశంలో ప్రతి వేయిమంది పురుషులకు 943 మంది మహిళలు ఉండగా... 2036 నాటికి 952కు పెరుగుతారని అంచనా. 2011లో దేశ జనాభాలో మహిళలు 48.5 శాతం ఉండగా 2036 నాటికి 48.8 శాతానికి పెరగనున్నారు.మారుతున్న ‘వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు’ భారతదేశంలో ‘వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు’ (ఏజ్ స్పెసిఫిక్ ఫెర్టిలిటీ రేట్) గణనీయంగా మారుతోంది. 20 – 24 ఏళ్లు, 25 – 29 ఏళ్లు, 30– 34 ఏళ్లు, 35– 39 ఏళ్లు.. ఇలా ఐదేళ్లు ఒక్కో కేటగిరీగా వర్గీకరించారు. ఒక్కో కేటగిరీలో ప్రతి వేయి మంది మహిళలు ఏడాదిలో ఎంతమంది బిడ్డలకు జన్మనిస్తారో దాన్ని వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు అని అంటారు. మహిళల నిర్ణయానికి కారణాలివే» కెరీర్లో స్థిరపడ్డాక నిర్దేశిత లక్ష్యాలు సాధించేవరకు బిడ్డలను కనేందుకు మహిళలు ఇష్టపడటం లేదు. బిడ్డలను కంటే కెరీర్‌పై తగినంత శ్రద్ధ చూపించలేమని, అలాగే వారికి కావాల్సినంత సమయం కేటాయించలేమనే భావనతో ఉన్నారు. అందుకే 20 నుంచి 29 ఏళ్ల మధ్యలో కెరీర్లో స్థిరపడ్డాకే బిడ్డలను కనాలని భావిస్తున్న మహిళల శాతం పెరుగుతోంది. దీంతో ఆ కేటగిరీల్లో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. » ఇక కెరీర్లో స్థిరపడ్డాక బిడ్డలను కంటున్న మహిళల శాతం పెరుగుతోంది. దేశంలో 35 నుంచి 39 ఏళ్ల కేటగిరీలో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు పెరుగుతుండటమే అందుకు నిదర్శనం. 2011– 2015 మధ్య 35 నుంచి 39 ఏళ్ల కేటగిరీలో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు 32 ఉండగా... 2016– 2020లో అది 35కు పెరిగింది. » ఇక 18 ఏళ్ల లోపే బిడ్డలను కంటున్న వారిలో అక్షరాస్యులు, నిరక్షరాస్యుల మధ్య వ్యత్యాసం ఉంది. 2016–2020లో నిరక్షరాస్యుల్లో 18 ఏళ్ల లోపు వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు 39గా ఉండగా... అక్షరాస్యుల్లో ఆ రేటు 11కే పరిమితమైంది. తగ్గుతున్న ప్రసూతి మరణాలు.. ప్రసూతి మరణాలను తగ్గించడంలో భారతదేశం నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తోంది. 2030 నాటికి దేశంలో ప్రతి లక్ష ప్రసవాలకు ప్రసూతి మరణాలను 70కు తగ్గించాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ క్రమంలో 2018–20 నాటికి ప్రసూతి మరణాలను 97కు తగ్గించారు. 2030 నాటికి కంటే ముందుగానే లక్ష్యాన్ని సాధించగలమని ప్రభుత్వం పూర్తి ధీమాతో ఉంది. ఇక దేశంలో శిశు మరణా లు కూడా గణనీయంగా తగ్గాయి. ప్రతి వేయి కాన్పులకు శిశు మరణాల రేటు 2015లో 43గా ఉండగా.. 2020నాటికి 32కు తగ్గింది. -
2036 కల్లా పెరగనున్న లింగ నిష్పత్తి
న్యూఢిల్లీ: భారత్‌లో లింగ నిష్పత్తి 2036 సంవత్సరాలికల్లా కొద్దిగా మెరుగుపడనుంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు 952 మంది మహిళలు ఉంటారని గణాంక, ప్రణాళిక అమలు శాఖ సోమవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2011లో మన దేశంలో లింగ నిష్పత్తి 1000: 943గా ఉంది. లింగ సమానత్వం దిశగా సానుకూల ధోరణిని ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది. 2036 కల్లా భారత జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. అదే సమయంలో జనాభాలో మహిళల శాతం స్వల్పంగా పెరిగి 48.8 శాతానికి చేరుకుంటుందని వివరించింది. 2011లో భారత జనాభాలో మహిళ శాతం 48.5 మాత్రమే కావడం గమనార్హం. 2011తో పోలిస్తే 2036లో పదిహేనేళ్ల లోపు వయసున్న వారి సంఖ్య తగ్గుతుందని, జననాలు తగ్గుముఖం పట్టడమే దీనికి కారణమని పేర్కొంది. మరోవైపు ఇదేకాలంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపింది. -
భారత దౌత్యనీతికి సవాళ్లు
ఇరుదేశాల మిలిటరీ సంబంధాలు పునరుద్ధరించాలని చెప్పడం ద్వారా అమెరికా, చైనా తమ మధ్య అంతరం తగ్గిందన్న సంకేతాన్ని పంపాయి. అమెరికా దగ్గరవుతున్న నేపథ్యంలో రష్యా మనకు దూరమవుతున్నట్లు గతేడాది కొన్ని అపోహలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, రష్యాతో మన సంబంధాలు గాఢమైనవి. పైగా... తాజాగా భారత్, రష్యా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైన భావన కలిగింది. రష్యా, చైనా, అమెరికా మధ్య సంబంధాలు బహుముఖమైనవి మాత్రమే కాదు, సంక్లిష్టమైనవి కూడా. ఈ మూడింటి మధ్య సంబంధాల్లో వచ్చే మార్పుల ప్రభావం భారత్‌పై కచ్చితంగా ఉంటుంది. ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో భారత్ అటు రష్యాపైనా, ఇటు అమెరికాపైనా ఆధారపడి ఉంది. కానీ, అగ్రదేశాల సరసన నిలవాలన్న భారత ఆకాంక్ష నెరవేరాలంటే దేశ సైనిక సామర్థ్యం ఇతరులపై ఆధారపడేలా ఉండరాదు. భారతదేశం గొప్ప ఆత్మవిశ్వాసంతో 2024 లోకి అడుగుపెట్టింది. కొత్త ఏడాది తొలి వారంలోనే ఆదిత్య–ఎల్1 విజయవంతంగా సూర్యుడి హాలో కక్ష్యలో ప్రవేశించడం, ఉత్తర అరేబియా సముద్రంలో పైరేట్లను తరిమికొట్టేందుకు భారత నేవీ నాటకీయమైన తీరులో ఆపరేషన్లు చేపట్టడం, అన్నీ శుభసూచనలే. 2023–24లో జీడీపీ వృద్ధి రేటు ఆరోగ్యకరమైన రీతిలో దాదాపు 7.3 శాతం వరకూ ఉండవచ్చునని జాతీయ గణాంక శాఖ ప్రకటించిన విషయమూ సంతోషకరమైన సమాచారమే. అన్నింటికీ మించి భారత్ విజయాలను గుర్తిస్తూ, చైనా వార్తా పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ఒక కథనమూ ప్రచురించింది. భారత్ చాలా వేగంగా సామాజిక, ఆర్థిక వృద్ధి సాధిస్తోందని ఇందులో అభిప్రాయపడింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వ్యూహాత్మక శక్తిగా భారత్ ఎదుగుతోందని కొనియాడింది. రెండూ ముఖ్యమే! అయితే, ఈ విజయాలను ఆస్వాదించే క్రమంలో మనం గత ఏడాది ఆఖరులో జరిగిన కొన్ని అవాంఛనీయ ఘటనల గురించి మరచిపోరాదు. అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా... ప్రాంతీయంగానూ ఇతర దేశాలతో మన సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేయగల ముఖ్యమైన సంఘటనలు అవి. వ్యూహాత్మక లక్ష్యాలను కాపాడుకోవడంలో, సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ సత్తాను ప్రశ్నించే అవకాశమూ వీటికి ఉంది. భారత విదేశీ వ్యవహారాల విధానాన్ని స్థూలంగా పరిశీలిస్తే... అమెరికాకు దగ్గరవడం... అదే సమయంలో రష్యాకు నెమ్మదిగా దూరంగా జరగడం అని అనిపిస్తుంది. ఉక్రెయిన్ , రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్ మౌనం వహించడం ఈ భావనకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే సూక్ష్మస్థాయిలో అర్థం చేసుకోవాల్సిందేమిటి అంటే... భారత్ అటు రష్యాపైనా, ఇటు అమెరికాపైనా ఆధారపడిఉందీ అని. ఇరు దేశాలూ మన మిలిటరీకి అవసరమైన ఆయుధాలు, టెక్నాలజీలు అందిస్తున్నాయి. ఈ పరిమితుల దృష్ట్యానే భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని వ్యక్తం చేయలేకపోతోంది. మరీ ముఖ్యంగా పొరుగుదేశం చైనాను దృష్టిలో ఉంచుకున్నప్పుడు. అయితే 2023 చివరి నాటికి అంతర్జాతీయ వ్యవహారాల్లో పరిస్థితులు కొంచెం వేగంగా మారిపోయాయి. వాటి ప్రభావం ఈ ఏడాది మనపై కచ్చితంగా పడనుంది. నవంబరులో అమెరికా అధ్య క్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య శాన్ఫ్రాన్సిస్కోలో ‘ఏపీఈసీ’ సమావేశాల్లో కీలకమైన చర్చలు జరిగాయి. ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాల మధ్య ఏర్పడ్డ ప్రతిష్టంభన కొద్దిగా తొలగిన సూచనలు కనిపించాయి. ఇక డిసెంబరు చివరివారంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ రష్యా వెళ్లి, ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సెర్గీ లావరోవ్‌తో సమావేశమయ్యారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలం మాదిరిగానే రష్యాతో భారత్ తన సంబంధా లను దృఢతరం చేసుకునేందుకు నిబద్ధమై ఉందని జైశంకర్ రష్యా మంత్రి సెర్గీకి నొక్కి చెప్పినట్లు వార్తలొచ్చాయి. సంక్లిష్టం... బహుముఖం... రష్యా, చైనా, అమెరికా మధ్య సంబంధాలు బహుముఖమైనవి మాత్రమే కాదు... చాలా సంక్లిష్టమైనవి కూడా. ఈ మూడింటి మధ్య సంబంధాల్లో వచ్చే మార్పుల ప్రభావం భారత్‌పై కచ్చితంగాఉంటుంది. ప్రపంచ స్థాయిలో మన ప్రస్థానాన్ని, దిశను మార్చేయగల శక్తి వీటి సొంతం. ఈ సంబంధాల్లోనూ అమెరికా– చైనా మధ్య ఉన్నవి మరింత కీలకం. బైడెన్, జిన్‌పింగ్ ఇటీవలి శిఖరాగ్ర సమావేశంసందర్భంగా కొన్ని అంశాలపై స్థూలంగా ఏకాభిప్రాయానికి రాగలి గారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు ఇందుకు అడ్డు కాకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఇరుదేశాల మిలిటరీల మధ్యసంబంధాలు పునరుద్ధరించాలని చెప్పడం ద్వారా అమెరికా, చైనారెండూ తమ మధ్య అంతరం తగ్గిందన్న సంకేతాన్ని పంపాయి. రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–గాజా యుద్ధాలకు సమీప భవిష్యత్తులో ఒక అర్థవంతమైన పరిష్కారం లభించగలదన్న ఆశ సమీప భవి ష్యత్తులో కనబడని నేపథ్యంలో, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో దేశాలకు ఊరటనిచ్చే అంశమిది. స్థానిక పరిస్థితులు, ఉన్న పరిమితు లను దృష్టిలో ఉంచుకుని ఇరువురు నేతలు తమ మధ్య అంతరాలను పక్కనబెట్టి ఈ రకమైన రాజీకి వచ్చి ఉండవచ్చు. చైనా–అమెరికా మధ్య మిలిటరీ స్థాయిలో యుద్ధం లేదా చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకున్నా దాని విపరిణామాలు తీవ్రంగా ఉండేవి. కాబట్టి తాత్కాలికంగానైనా ఈ ఉపశమనం దక్కడం ముఖ్యమైన విషయం అవుతుంది. తైవాన్ విషయంలో ఇరు దేశాలు మెత్తపడిందేమీ లేకున్నా భారత్ దృష్టిలో మాత్రం చైనా–అమెరికా మధ్య వైరం కొంతైనా తగ్గడం ఎంతో కీలకమైంది. సొంతంగా ఎదిగినప్పుడే... అమెరికా ఇండో–పసఫిక్ వ్యూహంలో భారత్ ప్రధాన భాగస్వామి అన్న అంచనా ఉంది. మరి చైనా– అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడటం భారత్‌కు ఏమైనా నష్టం చేకూరుస్తుందా? అవకాశమైతే ఉంది. పైగా ద్వైపాక్షిక స్థాయిలో ఇరు దేశాల మధ్య గత ఏడాది చివరిలో కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తమ పౌరుడు ఒకరిని చంపేందుకు భారత్ కుట్ర పన్నిందని అమెరికా ఆరోపించింది. ఈ కోణంలో చూస్తే భారత్ మీద అమెరికాకు కొంత అసంతృప్తి ఉన్నట్లు స్పష్టమవుతుంది. 1970లలో హెన్రీ కిసింజర్ అమెరికా విదేశాంగ మంత్రిగా ఉండగా, అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ చైనాతో సంబంధాలను మెరుగుపరచుకునే ప్రయత్నం చేశారు. ఇది కాస్తా భారత్, యునైటెడ్ సోవియట్ రిపబ్లిక్ మధ్య బంధాలు గట్టిపడేలా చేసింది. సోవియట్ వారసురాలిగా కొనసాగిన రష్యాతో ఆ సంబంధాలు ఇప్పటికీ కొన సాగుతున్నాయి. భారత త్రివిధ దళాలకు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారుగా మారింది. అమెరికా దగ్గరవుతున్న నేపథ్యంలో రష్యా మనకు దూరమవుతున్నట్లు 2023లో కొన్ని అపోహలైతే ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజాగా కూడా భారత్, రష్యా సంబంధాల్లో సరి కొత్త అధ్యాయం ఒకటి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కాంక్షిస్తోంది. అలాగే అగ్రరాజ్యాల సరసన నిలవాలని కూడా ఆశిస్తోంది. అయితే మిలిటరీ విషయాల్లో విదేశాలపై ఆధారపడుతూంటే భారత్ ఆశలు, ఆకాంక్షలు నెరవేరడం కష్టం. అమెరికా, రష్యా, చైనా తమ స్వప్రయోజనాల కోసం ప్రయత్నించినా ద్వైపాక్షిక స్థాయిలో దగ్గరి సంబంధాలు కలిగి ఉండటం మనకు అవసరం. మన రాజకీయ, దౌత్య చతురతకు ఇది నిజంగానే ఒక సవాలు! వ్యాసకర్త సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) - కమడోర్ సి. ఉదయ భాస్కర్ -
దిగుబడులు దుమ్మురేపాయి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 2022–23 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి దిగుబడులు దుమ్మురేపాయి. గతేడాది కంటే మిన్నగా నమోదయ్యాయి. ఆహార ధాన్యాల దిగుబడులే కాదు.. అపరాలు, నూనె గింజలు, వాణిజ్య పంటల దిగుబడులు కూడా ఈసారి రికార్డు స్థాయిలోనే వచ్చాయి. 2022–23 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి తుది దిగుబడి అంచనాల నివేదికను అర్థగణాంక విభాగం (డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్) విడుదల చేసింది. దీని ప్రకారం 2022–23 వ్యవసాయ సీజన్లో 259.28 లక్షల టన్నుల దిగుబడులు రాగా.. ఇవి 2021–22తో పోలిస్తే 22.10 లక్షల టన్నులు అధికంగా నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో పత్తి, మిరప దిగుబడులు.. ఇక వాణిజ్య పంటల విషయానికొస్తే.. పత్తి 2021–22లో 13.85 లక్షల ఎకరాల్లో సాగయితే 12.74 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. అలాగే, 2022–23లో 17.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, 15.40 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. మరోవైపు.. మిరప 2021–22లో 5.62 లక్షల ఎకరాల్లో సాగవగా, నల్లతామర ప్రభావంతో 4.18 లక్షల టన్నులకు పరిమితమైంది. అదే 2022–23లో 6.47 లక్షల ఎకరాల్లో సాగవగా, నల్లతామర నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 14.63 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. రైతు ఇంట ‘ధాన్యం’ సిరులు.. ♦ 2021–22 సీజన్లో కోటి 51 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, 237.16 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ఆ తర్వాత 2022–23 సీజన్లో వివిధ కారణాల వల్ల కోటి 39 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగైనప్పటికీ దిగుబడులు మాత్రం రికార్డు స్థాయిలో 259.28 లక్షల టన్నులు నమోదయ్యాయని ఆ విభాగం వెల్లడించింది. ♦ వీటిలో ప్రధానంగా 2021–22లో 60.30 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, హెక్టార్‌కు సగటున 5,048 కిలోల చొప్పున 121.76 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులొచ్చాయి. ♦ అదే.. 2022–23లో 53.22 లక్షల ఎకరాల్లోనే వరి సాగవగా, హెక్టార్‌కు సగటున 5,932 కిలోల చొప్పున 126.30 లక్షల ధాన్యం దిగుబడులు నమోదయ్యాయి. ♦ మొత్తం మీద చూస్తే 2021– 22లో కోటి 03 లక్షల ఎకరాల్లో ఆహార పంటలు సాగవగా.. దిగుబడులు కోటి 55 లక్షల టన్నులు వచ్చాయి. 2022–23లో 92లక్షల ఎకరాలకుగాను కోటి 68 లక్షల టన్నుల దిగు బడులొచ్చాయి. అపరాలు, నూనె గింజలు కూడా.. ♦ అపరాల పంటలు 2021–22లో 30.67 లక్షల ఎకరాల్లో సాగవగా, 10.55 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ♦ 2022–23లో 25.80 లక్షల ఎకరాల్లో సాగవగా, 10.87 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. ♦ ఇక నూనెగింజల పంటలు 2021–22లో 25.05 లక్షల ఎకరాల్లో సాగవగా, 27.68 లక్షల టన్నులు.. 2022–23లో 20.30 లక్షల ఎకరాల్లో సాగవగా, 28.96 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ♦ వీటిలో ప్రధానంగా కందులు 2021–22లో 6.27 లక్షల ఎకరాల్లో సాగయితే.. 68 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. అలాగే, 2022–23లో 6 లక్షల ఎకరాల్లో సాగవగా, 78 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ♦ వేరుశనగ అయితే 2021–22లో 20.62 లక్షల ఎకరాల్లో సాగవగా, 5.15 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. 2022–23లో 14.85 లక్షల ఎకరాల్లోనే సాగవగా, 6 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. సగటు దిగుబడులు పెరిగాయి.. ఆర్థిక, గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021–22 సీజన్‌తో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ 2022–23లో రికార్డు స్థాయిలో దిగుబడులు నమోదయ్యాయి. తెగుళ్ల ప్రభావం తక్కువగా ఉండడంతో దాదాపు ప్రతీ పంటలోనూ హెక్టార్‌కు సగటు దిగుబడులు 2021–22తో పోలిస్తే పెరిగాయి.– చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
భారీగా పడిపోయిన రీటైల్ ద్రవ్యోల్బణం
వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. దేశంలో వరుసగా మే నెలలో నాలుగో సారి రీటైల్ ద్రవ్యోల్బణం భారీగా పడిపోయింది. ఏప్రిల్‌లో రీటైల్ ద్రవ్యోల్బణం 4.70 ఉండగా మే నెల సమయానికి 4.25 కి పడిపోయిందని కేంద్ర గణాంకాల కార్యాలయం (National Statistics Office (NSO) తెలిపింది. వినియోగదారుల ధరల సూచీ ప్రకారం..మే నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం 4.25 శాతంగా నమోదై 25 నెలల కనిష్ఠానికి చేరింది.ఈ ఏడాది జనవరి నుంచి 227 పాయింట్లు పడిపోవడం గమనార్హం. అయినప్పటికీ సీపీఐ ద్రవ్యోల్బణం వరుసగా 44వ నెలలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మధ్యకాలిక లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగా ఉంది. -
అది రామోజీ అబద్ధాల సాగు
సాక్షి, అమరావతి : నిత్యం ఏదో ఒక అంశాన్ని పట్టుకుని వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురదచల్లుడు వంటకాన్ని వండి వార్చడమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ ప్రత్యక్షంగా అందరికీ కళ్లెదుటే కనిపిస్తున్న నిజాన్ని అబద్ధం చేసింది. సకాలంలో మంచి వర్షాలు.. సీజన్లో కళకళలాడుతున్న రిజర్వాయర్లు.. నిర్ణీత సమయానికి ముందే నీటి విడుదల.. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు.. ప్రతి దశలోనూ అన్నదాతకు తోడుగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం.. వెరసి రాష్ట్రంలో నాలుగేళ్లుగా వ్యవసాయం పండగైంది. ఈ విషయాన్ని ఏ ఊరికి వెళ్లి ఎవరిని అడిగినా నిస్సందేహంగా నిజమేనని చెబుతారు.. ఒక్క రామోజీ, చంద్రబాబులతో కూడిన దుష్టచతుష్టయం తప్ప. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంటల మార్పిడి ఫలించడం మీకు తెలీదా రామోజీ? మెట్ట ప్రాంతాల్లో లాభదాయకం కాని వ్యవసాయ పంటలు సాగు చేసే రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లుతుండటం వాస్తవమో కాదో గ్రామీణ ప్రాంతాల్లోని మీ నెట్‌వర్క్‌నే అడిగి చూడండి. డ్రైస్పెల్స్ నమోదైనా ఆ ప్రభావం దిగుబడులపై చూపక పోవడం, నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క కరువు మండలాన్ని నమోదు చేసే పరిస్థితి రాకపోవడం నిజం. ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. హెక్టార్‌కు సగటు దిగుబడులు పెరిగాయి. వ్యవసాయ రంగంలోనే కాదు.. ఉద్యాన, పశుగణాభివృద్ధి, మత్స్య తదితర వ్యవసాయ అనుబంధ రంగాల్లో సైతం జాతీయ సగటు వృద్ధిరేటు కంటే గణనీయమైన వృద్ధి రేటు నమోదు చేసుకుంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రాసుకునే లెక్కలు కావు. కేంద్ర ఆర్థిక, గణాంకాల శాఖ రూపొందించిన గణాంకాలని మీకు తెలియదా రామోజీ? ఇంతకూ మీరు చెప్పిన అంశాల్లో నిజానిజాలు ఏమిటో చూద్దాం. ఆరోపణ: సాగు విస్తీర్ణం తగ్గింది వాస్తవం : పంటల మార్పిడి కింద మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద సాగయ్యే పంటల స్థానే ఉద్యాన పంటలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఫలితంగా నాలుగేళ్లలో 5.52 లక్షల ఎకరాల్లో కొత్తగా ఉద్యాన పంటలు సాగులోకి వచ్చాయి. మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా సాగయ్యే వరి, పొగాకు, చెరకు, మొక్కజొన్న వంటి పంటల స్థానంలో ఉద్యాన పంటలైన మామిడి, అరటితో పాటు డ్రాగన్ ఫ్రూట్, అవొకాడో, కాఫీ, అల్లం, పసుపు, అనాస, బొప్పాయి, కమల, జామ వంటి పంటలు సాగు చేస్తున్నారు. ఆరోపణ: పొడి వాతావరణాన్ని పట్టించుకోలేదు వాస్తవం : రాష్ట్రంలో 2022 ఖరీఫ్ పంట కాలంలో జూన్–జూలైలో 172 మండలాల్లో బెట్ట వాతావరణం (డ్రై స్పెల్స్) కనిపించినప్పటికీ, ఆయా మండలాల్లో పంటల సాగు ఆలస్యమైందే తప్ప సాగు ఆగలేదు. మరో 101 మండలాల్లో ఆగస్టు, సెపె్టంబర్ మధ్య డ్రైస్పెల్స్ సంభవించాయి. ఆ సమయంలో పంటలు కీలక దశకు రాకపోవడంతో దిగుబడులపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖ తన నివేదికలో తేల్చి చెప్పింది. ఆరోపణ: దిగుబడులు ఎక్కువ చేసి చూపిస్తున్నారు వాస్తవం : 2021–22లో వరి సగటున హెక్టార్‌కు ఖరీఫ్‌లో 4,800 కిలోలు, రబీలో 6,601 కిలోల దిగుబడులొస్తే, మూడో ముందస్తు అంచనా ప్రకారం 2022–23 ఖరీఫ్‌లో 5,195 కిలోలు, రబీలో 6,944 కిలోల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. 2021–22లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 154 లక్షల టన్నులు రాగా, 2022–23లో 166.63 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014–19 మధ్యలో సగటున 153.95 లక్షల టన్నులుగా నమోదైతే, 2019–23 మధ్య 165.40 లక్షల టన్నులుగా నమోదైంది. అంటే 11.45 లక్షల టన్నుల మేర పెరిగింది. ఉద్యాన పంటల విషయానికి వస్తే టీడీపీ హయాంలో 2018–19లో 17.40 లక్షల హెక్టార్లలో సాగవ్వగా, 305 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ప్రస్తుతం 18.03 లక్షల హెక్టార్లకు విస్తరించగా, 363.04 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. ఫలితంగా హెక్టార్‌కు సగటు దిగుబడులు పెరిగాయి. ఆరోపణ: సాగు తగ్గితే వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది? వాస్తవం : వృద్ధి రేటు పెరుగుదల, తగ్గుదల అనేది సాగు విస్తీర్ణం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఇది వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య, పశుగణాభివృద్ధి, అటవీ, ఉద్యాన రంగాల పురోగతి మీద ఆధారపడి ఉంటుంది. పంటల సగటు దిగుబడి, విలువ ఆధారిత ఉత్పత్తుల పెరుగుదల వంటి కారణాలతో వృద్ధి రేటు పెరుగుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 2022–23లో వృద్ధి రేటు 13.18 శాతం నమోదు కాగా, ఇది జాతీయ వృద్ధి రేటు కంటే 2 శాతం ఎక్కువ. వ్యవసాయ రంగంలో 20.72 శాతం, ఉద్యాన రంగంలో 12.58 శాతం, పశుగణాభివృద్ధి రంగంలో 7.32 శాతం, మత్స్య రంగంలో 19.41 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇవన్నీ కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖ విడుదల చేసిన లెక్కలే. రాష్ట్రంలో ఎక్కడా పంట విరామం ప్రకటించే పరిస్థితులే లేవు. కోనసీమ, పశ్చిమగోదావరి, వైఎస్సార్, బాపట్ల జిల్లాల్లో గతం కంటే మిన్నగా పంటలు సాగయ్యాయి. sak -
ఐరాస స్టాటిస్టికల్ కమిషన్‌కు భారత్ ఎన్నిక
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి అత్యున్నత గణాంకాల విభాగం యూఎన్ స్టాటిస్టికల్ కమిషన్‌కు రెండు దశాబ్దాల తర్వాత భారత్ ఎన్నికైంది. రహస్య బ్యాలెట్ ఓటింగ్‌లో జరిగిన హోరాహోరీ పోరులో నెగ్గింది. యూఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ భారత్ యూఎన్ స్టాటిస్టికల్ కమిషన్ మెంబర్‌గా, నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్‌గా, ప్రోగ్రామ్ కో ఆర్డినేటింగ్ బోర్డ్ ఆఫ్ జాయింట్ యూఎన్ ప్రోగ్రామ్ ఆన్ ఎయిడ్స్‌గా ఎన్నికైంది. -
డాక్టర్ చదువుల్లో సమానం!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో మహిళలు దూసుకెళ్తున్నారు. కొన్ని కోర్సుల్లో యువకులను మించి యువతుల సంఖ్య అధికంగా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక 2022 వెల్లడించింది. దేశంలో 1,59,69,571 మంది యువకులు, 1,50,77,414 మంది యువతులు ఉన్నత విద్య అభ్యసిస్తుండగా ఆర్ట్స్, సైన్స్, మెడికల్, సోషల్ సైన్స్ కోర్సుల్లో అమ్మాయిల సంఖ్య అధికంగా ఉంది. కామర్స్, ఐటీ, కంప్యూటర్స్, మేనేజ్మెంట్, న్యాయవాద విద్యలో అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. ♦ బీఏలో ప్రతి వంద మంది విద్యార్థులకు (పురుషులు) 109 మంది విద్యార్థినులున్నారు. ♦ బీఈడీలో ప్రతి వంద మంది విద్యార్థులకు 182 మంది విద్యార్థినులున్నారు. ♦ బీఎస్సీ (నర్సింగ్‌లో)లో అత్యధికంగా ప్రతి వంద మంది విద్యార్థులకు 308 మంది విద్యార్థినులున్నారు. ♦ ఎంబీబీఎస్‌లో పురుషులతో సమానంగా ప్రతి వంద మంది విద్యార్థులకు 100 మంది విద్యార్థినులున్నారు. ♦ ఎంఏలో ప్రతి వంద మంది విద్యార్థులకు 150 మంది విద్యార్థినులున్నారు. ♦ మ్‌కాంలో ప్రతి వంద మంది విద్యార్థులకు 198 మంది విద్యార్థినులున్నారు. ♦ ఎమ్మెస్సీలో ప్రతి వంద మంది విద్యార్థులకు 156 మంది విద్యార్థినులున్నారు. ♦ బీటెక్‌లో ప్రతి వంద మంది విద్యార్థులకు అత్యల్పంగా 40 మంది విద్యార్థినులున్నారు. ♦ ఎల్ఎల్బీలో కూడా యువతులు తక్కువగా ఉన్నారు. ప్రతి వంద మంది విద్యార్థులకు 49 మంది విద్యార్థినులున్నారు. -
రాష్ట్రంలో 2019–20లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 6.46%
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామికోత్పత్తి 6.46 శాతం పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక వార్షిక సర్వే నివేదిక వెల్లడించింది. 2018–19లో పారిశ్రామికోత్పత్తి విలువ రూ.3,76,143.34 కోట్లు కాగా 2019–20లో రూ.4,00,462.83 కోట్లుగా తెలిపింది. అంటే 2018–19తో పోలిస్తే 2019–20లో పారిశ్రామికోత్పత్తి విలువ రూ.24,319.49 కోట్లు (6.46 శాతం) పెరిగినట్లు సర్వే పేర్కొంది. కోవిడ్–19 సెకండ్‌వేవ్ నేపథ్యంలో 2019–20కి సంబంధించిన పారిశ్రామిక సర్వేని ఆలస్యంగా.. 2021 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది. ఈ సర్వే నివేదికను కేంద్ర కార్యక్రమాలు అమలు గణాంకాలశాఖ బుధవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2019–20లో రాష్ట్రంలో కొత్తగా 185 ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. 2018–19లో రాష్ట్రంలో 16,739 ఫ్యాక్టరీలుండగా 2019–20లో ఆ సంఖ్య 16,924కు పెరిగింది. 2019–20లో రాష్ట్రంలో మొత్తం 6.63 లక్షల మందికి ఉపాధి కల్పించారు. 2018–19తో పోలిస్తే 2019–20లో ఉపాధి కల్పించిన వారిసంఖ్య 30,432 పెరిగింది. 2018–19లో 6.33 లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల సంఖ్య 2018–19తో పోలిస్తే 2019–20లో 29,105 పెరిగింది. 2018–19లో 5.12 లక్షలమంది కార్మికులు పనిచేస్తుండగా 2019–20లో వారిసంఖ్య 5.41 లక్షలకు చేరింది. 2018–19లో కార్మికులకు వేతనాల రూపంలో రూ.8,954.25 కోట్లు చెల్లించగా 2019–20లో రూ.10,243.15 కోట్లు చెల్లించారు. 2019–20లో ఫ్యాక్టరీల ఆదాయం రూ.29,921 కోట్లు కాగా నికరలాభం రూ.9,584 కోట్లు. 2018–19లో ఫ్యాక్టరీల ఆదాయం రూ.23,406 కోట్లు కాగా నికరలాభం రూ.5,562 కోట్లు. 1948 ఫ్యాక్టరీల చట్టం కింద ఏర్పాటైన పదిమందికి మించి కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలను సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు. రక్షణసంస్థలు, చమురు నిల్వ, పంపిణీ డిపోలు, రెస్టారెంట్లు, హోటళ్లు, కేఫ్, కంప్యూటర్ సేవలు, రైల్వే వంటి డిపార్ట్మెంటల్ యూనిట్లు, వర్క్‌షాప్‌లు, ప్రభుత్వ మింట్లు, శానిటరీ, నీటిసరఫరా, గ్యాస్ నిల్వ మొదలైనవాటిని సర్వే పరిధి నుంచి మినహాయించారు. -
కేంద్ర ప్రభుత్వ శాఖ ట్విటర్ హ్యాక్.. మధ్యలో ఎలన్ మస్క్ ఎందుకు వచ్చాడు!
న్యూఢిల్లీ: కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ అధికార ట్విటర్ ఖాతా గురువారం హ్యాక్ చేశారు. హ్యాకింగ్ అనంతరం ఈ ఖాతా పేరును టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్‌గా మార్చడంతో పాటు ప్రొఫైల్ పిక్ ఆయన ఫోటోని ఉంచారు. అంతేకాకుండా ‘మీరు మిలియనీర్‌గా మారడానికి ఇదొక ప్రత్యేక అవకాశం. 7,200,000 డాలర్లు గెలిచేందుకు మిస్టరీ బాక్స్‌లో ఉన్నాయి’ అని పేర్కొంటూ ఒక లింక్‌ను సైబర్ నేరగాళ్లు ఈ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. (చదవండి: యోగిజీ ఎఫెక్ట్: ప్లీజ్.. చంపొద్దు కావాలంటే జైల్లో పెట్టండి ) ఈ షాకింగ్ ఘటన జరిగిన తర్వాత పాస్‌వర్డ్‌ను మార్చడంతో పాటు ఢిల్లీ పోలీసులకు చెందిన సైబర్ క్రైమ్ బృందానికి సమాచారం అందించారు. ఈ హ్యాకింగ్ గురించి కేంద్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు. హ్యాక్ అయిన ఖాతాను కొద్ది గంటల్లోనే పునరుద్ధరించారు. అనంతరం కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. తమ అధికార ట్విట్టర్ ఖాతాకు గురువారం సైబర్ భద్రతకు సంబంధించిన సమస్యలు వచ్చాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు అందులో పోస్ట్ అయిన లేదా షేర్ చేసిన, బదులు ఇచ్చిన సమాచారానికి తమ మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. కాగా భారత ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెందిన ట్విట్టర్ ఖాతాతో పాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. -
Statistics Survey: ధనిక, పేదల మధ్య భారీ అంతరం
న్యూఢిల్లీ: దేశంలో ధనిక, పేదల మధ్య భారీ అంతరం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 10 శాతం పట్టణ వాసుల్లో సగటున ఒక్కో కుటుంబం వద్ద 1.5 కోట్ల మేర ఆస్తులు ఉండగా.. దిగువనున్న పేదల వద్ద రూ.2,000 (ఒక్కో కుటుంబం) మించి లేదు. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) నిర్వహించిన ‘ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే 2019’లో ఈ వివరాలు తెలిశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి పట్టణాలతో పోలిస్తే మెరుగ్గానే ఉంది. అగ్రస్థాయి 10 శాతం కుటుంబాల వద్ద సగటున రూ.81.17 లక్షల ఆస్తులు ఉంటే.. పేద కుటుంబాల సగటు ఆస్తి రూ.41,000గా ఉంది. ఈ విధంగా చూస్తే పట్టణాల కంటే పల్లెల్లోనే పెదల పరిస్థితి కాస్త మెర్గుగా ఉందని ఈ సర్వే పేర్కొంది. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ మధ్య 77వ జాతీయ శాంపిల్ సర్వేలో భాగంగా ఎన్ఎస్వో ఈ వివరాలను సమీకరించింది. -
పాలకంకి పరవశం
సాక్షి, అమరావతి: పంట చేలో పాలకంకి నవ్వుతోంది. స్వేదాన్ని చిందించి సేద్యం చేసిన అన్నదాతకు దిగుబడుల రూపంలో మంచిరోజు రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ కృషితో పెట్టుబడి కోసం చేతినిండా సొమ్ములు అందటం.. నాణ్యమైన సాగు ఉత్పాదకాలు గడప వద్దకే చేరడం.. వాతావరణం కరుణించి కరువుతీరా వర్షాలు కురవడం.. ప్రాజెక్టులు నిండుకుండల్ని తలపిస్తున్న తరుణాన రెండో ఏడాది కూడా రైతు కష్టం ఫలించబోతోంది. ప్రస్తుత రబీలో పంటల విస్తీర్ణం పెరగ్గా.. దిగుబడుల్లోనూ అన్నదాతలు రికార్డుల్ని తిరగరాయబోతున్నారు. గణాంక శాఖ తాజాగా విడుదల చేసిన రబీ–2021 దిగుబడి అంచనాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ‘వరి’oచనున్న దిగుబడి ధాన్యం దిగుబడులు సాధారణంగా ఖరీఫ్‌లోనే ఎక్కువగా ఉంటాయి. అలాంటిది రెండేళ్లుగా రబీలోనూ దిగుబడులు పెరిగి అన్నదాత గాదెలు ధాన్యం రాశులతో నిండుతున్నాయి. ఈ ఏడాది రబీలో ముందెన్నడూ లేనివిధంగా అపరాలతో పోటీగా వరి సాగు విస్తీర్ణం పెరిగింది. రబీ–2020లో 8.30 లక్షల హెక్టార్లలో వరి సాగవగా.. హెక్టారుకు 6,868 కేజీల చొప్పున 57 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులొచ్చాయి. రబీ–2021లో సాగు విస్తీర్ణమే కాదు.. సరాసరి దిగుబడులు కూడా గణనీయంగా పెరగనున్నాయి. ఈ ఏడాది 8.81 లక్షల హెక్టార్లలో వరి సాగవగా.. హెక్టారుకు సగటున 7,025 కేజీల చొప్పున 61.89 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే హెక్టారుకు సగటున 157 కేజీల దిగుబడి పెరగనుండగా.. మొత్తంగా 4.89 లక్షల టన్నుల దిగుబడి పెరగబోతోందని గణాంక శాఖ అంచనా వేసింది. సాధారణంగా గణాంక శాఖ అంచనాతో పోలిస్తే దిగుబడి 20 శాతం అదనంగా ఉంటుందని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఇతర పంటలు సైతం.. సాధారణంగా ఏటా రబీలో అపరాల సాగు అధికంగా ఉంటుంది. గతేడాది 8.94 లక్షల హెక్టార్లలో అపరాల పంటలు వేయగా.. 9.90 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది 9.78 లక్షల హెక్టార్లలో అపరాలను సాగు చేశారు. మొత్తంగా 10.41 లక్షల టన్నుల మేర అపరాల దిగుబడులొస్తాయని గణాంక శాఖ లెక్క తేల్చింది. మరోవైపు ఇతర ఆహార ధాన్యాల పంటలు గత రబీలో 20.63 లక్షల హెక్టార్లలో సాగవగా.. 87.35 లక్షల టన్నుల మేరకు దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది 21.59 లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాలు పండిస్తుండగా.. 90.10 లక్షల టన్నుల మేర దిగుబడులొస్తాయని గణాంక శాఖ అంచనా వేసింది. ఆయిల్ సీడ్స్ దిగుబడులూ ఘనమే వేరుశనగ, పొద్దు తిరుగుడు వంటి ఆయిల్ సీడ్స్ పంటల విషయానికి వస్తే గతేడాది 1.14 లక్షల హెక్టార్లలో సాగవగా.. 2.51 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది రబీలో ఆయిల్ సీడ్స్ సాగు విస్తీర్ణం 1.50 లక్షల హెక్టార్లకు పెరిగింది. వీటి దిగుబడులు 3.18 లక్షల టన్నులు వస్తాయని అంచనా వేశారు. వీటిలో ప్రధానంగా రబీలో ఎక్కువగా సాగయ్యే వేరుశనగ గతేడాది రబీలో 93 వేల హెక్టార్లలో సాగవగా, 2.28 లక్షల టన్నుల దిగుబడి లభించింది. ఈ ఏడాది ఏకంగా 1.13 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగవగా, 2.76 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. మిరప.. రెపరెప గతేడాది 17 వేల హెక్టార్లలో మిరప పంట సాగు చేయగా.. 80 వేల టన్నుల దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది 39 వేల హెక్టార్లలో రైతులు మిరప వేయగా.. 1.84 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా. గత రబీ సీజన్లో 23.02 లక్షల హెక్టార్లలో సాగవగా, 92.43లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. కాగా ఈ ఏడాది రబీ–2021 సీజన్లో 24.13లక్షల హెక్టార్లలో పంటలు సాగవగా, 97.10లక్షల టన్నుల దిగుబడు లొస్తాయని అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం 1.11లక్షల హెక్టార్ల మేర పెరగగా, 4.67లక్షల టన్నులకు పైగా దిగుబడులు పెరగనున్నాయని గణాంక శాఖ అంచనా వేసింది. మంచి దిగుబడులు రానున్నాయ్ రబీ–2020తో పోలీస్తే రబీ–2021లో సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడులు కూడా గత రబీ కంటే గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల గణాంక శాఖ విడుదల చేసిన మూడో అంచనా దిగుబడులు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఇవి మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. రబీలో ఈ స్థాయిలో పంటలు సాగవడమే కాదు.. రికార్డు స్థాయి దిగుబడులు రానుండటం కూడా చరిత్రలో ఇదే ప్రథమం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ 55 బస్తాల వరకు దిగుబడి వచ్చేలా ఉంది పదేళ్లుగా రబీలో సాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్లం. రెండేళ్లుగా రెండో పంటకు సాగు నీరివ్వడంతో ఎలాంటి ఆందోళన లేకుండా సాగు చేసుకోగలిగాం. గత రబీలో మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి వేశా. ఎకరాకు 45 బస్తాల దిగుబడి వచ్చింది. ఈ రబీలో ఐదెకరాలు కౌలుకు తీసుకుని ఎంటీయూ–1021 సాగు చేశా. పంట ఏపుగా ఎదిగింది. ఇప్పటివరకు తెగుళ్ల బెడద కూడా పెద్దగా లేదు. 50–55 బస్తాల మధ్య దిగుబడి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. –ఏసురత్నం,నంగవరం, తూర్పు గోదావరి జిల్లా తొలిసారి రబీ సాగు చేశా మేం చరిత్రలో ఎప్పుడూ రబీ సాగు చేయలేదు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కడప–కర్నూలు కాలువ (కేసీ కెనాల్) ద్వారా ప్రభుత్వం సాగునీరివ్వడంతో తొలిసారి రబీ పంట సాగు చేశాం. నాలుగు ఎకరాల్లో నెల్లూరు సన్నాలు (జీలకర్ర మసూరి) వేశా. పంట బాగుంది. మా పక్క రైతుల పొలంలో కోతలు పూర్తయ్యాయి. ఎకరాకు 25 బస్తాలొచ్చాయి. నాకు 25 బస్తాలకు మించే వస్తుందని ఆశిస్తున్నా. మంచి దిగుబడులొచ్చే అవకాశం ఉండటంతో చాలా సంతోషంగా ఉంది. – నాగేశ్వరరెడ్డి, పాత కడప, వైఎస్సార్ జిల్లా -
తయారీ రంగానికి ‘రీస్టార్ట్’ కిక్
సాక్షి, అమరావతి : లాక్‌డౌన్‌తో దెబ్బ తిన్న రాష్ట్ర పారిశ్రామికోత్పత్తి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో రీస్టార్ట్ పేరుతో గ్రీన్ జోన్లో ఉన్న ఫ్యాక్టరీలను ప్రారంభించడానికి అనుమతించడం సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో ఐదు నెలల విరామం తర్వాత రాష్ట్ర తయారీ రంగం వృద్ధి బాట పట్టింది. ఆగస్టు నెలలో తయారీ రంగంలో 1.2 శాతం వృద్ధి నమోదైనట్లు రాష్ట్ర అర్థగణాంక శాఖ తాజాగా విడుదల చేసిన ఇండెక్స్ ఆఫ్ ఇండిస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) గణాంకాల్లో వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 353 కర్మాగారాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా తయారీ రంగంలో వృద్ధిని అంచనా వేస్తారు. గతేడాది ఆగస్టు నెలలో 120.3 పాయింట్లు ఉన్న తయారీ రంగం ఈ ఏడాది ఆగస్టు నెలలో 121.7 పాయింట్లుగా నమోదైంది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 8.6 శాతం క్షీణత నమోదు కావడం గమనార్హం. తయారీ రంగంలో లోహాలు, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక మెషినరీ, రవాణా పరికరాలు, కెమికల్స్, అప్పరెల్స్ వంటి రంగాలు మంచి పనితీరు కనపరచడంతో ఆగస్టు నెలలో వృద్ధి రేటు నమోదైంది. ముఖ్యంగా క్యాపిటల్ గూడ్స్ రంగంలో 19.7 శాతం, ఇంటర్మీడియేట్ గూడ్స్ 7.0 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ 7.1 శాతం, కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ 6.8 శాతం చొప్పున వృద్ధి నమోదైనట్లు ఐఐపీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ సగటు కంటే మెరుగైన పనితీరు.. – ఏప్రిల్–ఆగస్టులో రాష్ట్ర పారిశ్రామికోత్పత్తి దేశ సగటు కంటే మెరుగైన పనితీరు కనపర్చింది. కోవిడ్ దెబ్బతో ఆ సమయంలో దేశ వ్యాప్తంగా తయారీ రంగంలో 27.9 శాతం క్షీణత నమోదైతే అది మన రాష్ట్రంలో 15.6 శాతానికి పరిమితమైంది. – ఈ సమీక్షా కాలంలో ఆటోమొబైల్ తయారీ రంగంలో గతేడాదితో పోలిస్తే 124.2 శాతం వృద్ధి నమోదైంది. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ల తయారీలో 71.8 శాతం, ఆహార ఉత్పత్తుల తయారీలో 24.18 శాతం వృద్ధి నమోదైంది. – రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్ కింద త్వరతగతిన పరిశ్రమలు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడమే కాకుండా కష్ట సమయంలో రూ.1,168 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించడంతో సత్ఫలితాలు వచ్చాయని, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద తిరిగి వృద్ధి బాట పట్టగలమన్న నమ్మకాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా స్పందించాం.. దేశంలోనే తొలిసారిగా ‘రీస్టార్ట్’ ప్యాకేజీ కింద ఏప్రిల్ మూడో వారం నుంచే కొవిడ్ ఆంక్షలను పాటిస్తూ పరిశ్రమలను ప్రారంభించాం. దాంతో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్ర తయారీ రంగం వేగంగా కోలుకుంది. వైఎస్సార్ నవోదయం పేరుతో ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకున్నాం. గత ప్రభుత్వ రాయితీ బకాయిలను కోవిడ్ సమయంలో ఇవ్వడంతో పరిశ్రమలు త్వరగా ఉత్పత్తి ప్రారంభించగలిగాయి. దీనివల్ల ఈ ఏడాది పారిశ్రామికోత్పత్తిలో దేశ సగటు కంటే ఎక్కువ వృద్ధి రేటు నమోదు అవుతుందని అంచనా వేస్తున్నాం. – మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి నాలుగు అంశాలు కలిసొచ్చాయి సంక్షోభ సమయంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు నగదు అందజేయడంతో వారిలో కొనుగోలు శక్తి పెరిగింది. పరిశ్రమల ప్రారంభానికి పారిశ్రామిక ప్రతినిధులతో కలిసి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేసింది. ప్రత్యేక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి సమస్యలను పరిష్కరించింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిపుణులను అందిస్తోంది. ఈ నాలుగు అంశాలకు తోడు రాష్ట్ర వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు బాగుండటం కలిసి వచ్చింది. – డి.రామకృష్ణ, సీఐఐ (ఏపీ చాప్టపర్) చైర్మన్ -
ఆ జిల్లాలోనే సర్కారు డాక్టర్లు అధికం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు 5,637 మంది ఉన్నారని సర్కారు తెలిపింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర గణాంక శాఖ నివేదిక–2020 విడుదల చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాలపై విశ్లేషించింది. మొత్తం ప్రభుత్వ వైద్యుల్లో రెగ్యులర్ డాక్టర్లు 5,132 మంది ఉండగా, కాంట్రాక్టు డాక్టర్లు 505 మంది ఉన్నారు. జనరల్ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు 152 ఉన్నాయి. ప్రత్యేక వైద్యం అందించే ఆసుపత్రులు 22, ప్యానెల్ క్లినిక్‌లు 49 ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 885 ఉండగా, ఆయుష్ ఆసుపత్రులు 10 ఉన్నాయి. డిస్పెన్సరీలు 74, బస్తీ దవాఖానాలు 110, ఆరోగ్య ఉపకేంద్రాలు 4,797 ఉన్నట్లు సర్కారు తెలిపింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం పడకల సంఖ్య 23,067 ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లోనే అధిక పడకలు.. ♦రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్‌లోనే 22 జనరల్ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 11, రంగారెడ్డి జిల్లాలో 9, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో 8 చొప్పున ఉన్నాయి. ♦ప్రత్యేక వైద్యం అందించే ఆసుపత్రులు అత్యధికంగా 10 హైదరాబాద్‌లోనే ఉన్నాయి. డిస్పెన్సరీలు కూడా హైదరాబాద్‌లోనే 29 ఉన్నాయి. ♦ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అత్యధికంగా హైదరాబాద్‌లో 91 ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 56 ఉన్నాయి. ♦ఆరోగ్య ఉపకేంద్రాలు అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 267 ఉన్నాయి. ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో 257, సంగారెడ్డి జిల్లాలో 246, రంగారెడ్డి జిల్లాలో 232 ఉన్నాయి.హైదరాబాద్‌లో అత్యంత తక్కువగా 52 ఉన్నాయి. ♦బస్తీ దవాఖానాలు హైదరాబాద్‌లో అత్యధికంగా 64 ఉండగా, మేడ్చల్ జిల్లాలో 24, రంగారెడ్డి జిల్లాలో 22 ఉన్నాయి. ఏ ఇతర జిల్లాల్లో బస్తీ దవాఖానాలు లేవు. ♦డాక్టర్ల సంఖ్య అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 421 మంది ఉండగా, నిజామాబాద్ జిల్లాలో 276, హైదరాబాద్‌లో 263 మంది ఉన్నారు. ♦ఆసుపత్రుల్లో అత్యధిక పడకలు హైదరాబాద్‌లోనే 8,136 ఉన్నాయి. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 1,172 ఉన్నాయి. ♦రాష్ట్రంలో అంగన్ వాడీ కేంద్రాలు 35,700 ఉన్నాయి. అందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 2,093 ఉన్నాయి. నవజాత శిశుమరణాల రేటు 19 ♦రాష్ట్రంలో వెయ్యి జనాభాకు జనన రేటు 16.9 ఉండగా, దేశ సగటు 20. ♦ప్రతి వెయ్యి మంది జనాభాలో మరణాల రేటు దేశ సగటు 6.2 ఉండగా, తెలంగాణలో అది 6.3గా ఉంది. ♦శిశు మరణాల రేటు దేశంలో 32 ఉండగా, రాష్ట్రంలో 27గా ఉంది. ♦నవజాత శిశు మరణాల రేటు (28 రోజుల లోపున్నవారు) ప్రతి వెయ్యి మందికి దేశంలో 23 ఉండగా, రాష్ట్రంలో 19గా ఉంది. ♦ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు వెయ్యికి దేశంలో 36 ఉండగా, తెలంగాణలో 30గా ఉంది. ♦మాతా మరణాల రేటు లక్షకు దేశంలో 113 ఉండగా, రాష్ట్రంలో 63గా ఉంది. -
నాలుగేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి!
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్–2018 మార్చి) పేలవంగా ముగియనుందని స్వయంగా కేంద్ర గణాంకాల కార్యాలయం ముందస్తు అంచనాలు వెల్లడించింది. వృద్ధి రేటు కేవలం 6.5 శాతంగానే నమోదవుతుందని ఈ మేరకు శుక్రవారం వెలువడిన గణాంకాలు వెల్లడించాయి. ఈ గణాంకాలే నిజమయితే, దేశ జీడీపీ నాలుగేళ్ల కనిష్టస్థాయికి పడిపోయినట్లవుతుంది. నాలుగేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో సైతం ఇదే అతితక్కువ వృద్ధి గణాంకమూ అవుతుంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పేలవ వసూళ్లు, వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం ఇందుకు ప్రధాన కారణాల్లో కొన్నని గణాంకాలు వివరించాయి. గణాంకాల ప్రకారం తలసరి ఆదాయ వృద్ధి కూడా 9.7 శాతం (రూ.1,03,219) నుంచి 8.3 శాతానికి (రూ.1,11,782) మందగించే వీలుంది. ముఖ్యాంశాలు చూస్తే... ♦ 2014 మేలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. 2014–15లో వృద్ధి రేటు 7.5 శాతం. 2015–16లో ఈ రేటు 8 శాతమయితే, 2016–17లో 7.1 శాతంగా నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు మూడేళ్ల గరిష్టస్థాయి 5.7 శాతం పడిపోయి, రెండవ త్రైమాసికంలో కొంత కోలుకుని 6.3%గా నమోదవడం తెలిసిందే. ♦ తాజా అంచనాల ప్రకారం– ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగంలో వృద్ధి రేటు 7.9 శాతం (2016–17) నుంచి 4.6%కి పడిపోనుంది. ♦ ఇక వ్యవసాయ రంగం చూస్తే (అటవీ, మత్స్య రంగాలూ కలుపుకుని) వృద్ధి రేటు 4.9 శాతం నుంచి 2.1 శాతానికి పడిపోనుంది. ♦ పెట్టుబడులకు సంబంధించి సూచీ– గ్రాస్ ఫిక్డ్డ్స్ క్యాపిటల్ ఫార్మేషన్(జీఎఫ్‌సీఎఫ్) రూ.43.84 లక్షల కోట్లు. ఇది 2016–17లో రూ.41.18 లక్షల కోట్లు. ఈ పరిమాణం పెరుగుతుందన్న అంచనా పెట్టుబడుల వృద్ధి ప్రారంభమయ్యిందనడానికి సంకేతమని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ♦ సీఎస్ఓ అంచనాల ప్రకారం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ ఇతర సర్వీసులు – ట్రేడ్, హోటెల్స్, రవాణా, కమ్యూనికేషన్లు, బ్రాడ్‌కాస్టింగ్ విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు, ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సర్వీసుల్లో వృద్ధి 7 శాతంగా నమోదవుతుందని అంచనా. వివిధ అంచనాలు ఇలా... ♦ 2017–18 వృద్ధి అంచనాను ప్రపంచబ్యాంక్ 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. 2019–20 నాటికి 7.4%కి పెరుగుతుందని విశ్లేషించింది. ♦ ఇక 2017–18కి ఓఈసీడీ వృద్ధి అంచనా 6.7శాతం. ♦ ఫిచ్ రేటింగ్స్ 6.9% నుంచి 6.7%కి తగ్గించింది. 2018–19కి 7.4% నుంచి 7.3%కి తగ్గించింది. ♦ ఇక మూడీస్ విషయంలో 2017–18 వృద్ధి అంచనా 7.1 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది. ♦ 2017–20 మధ్య సగటు వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని స్టాండెర్డ్ అండ్ పూర్స్ విశ్లేషిస్తోంది. ♦ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 6.7 శాతానికి తగ్గించింది. ఇంతక్రితం అంచనా 7%. -
వృద్ధిరేటు పడిపోతుంది..!
2016–17లో అంచనా 7.1 శాతం • తయారీ, మైనింగ్, నిర్మాణ రంగాలు పేలవం • అంచనాలు విడుదల చేసిన గణాంకాల శాఖ • నోట్ల రద్దు కారణం కాదని వివరణ • నవంబర్‌నే ‘డేటా’కు తీసుకోలేదని వెల్లడి న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17, ఏప్రిల్–మార్చి) వృద్ధి రేటు మందగమనంలో ఉండబోతున్నట్లు స్వయంగా గణాంకాల శాఖ అంచనా వేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కేవలం 7.1 శాతంగా ఉంటుందని శుక్రవారం గణాంకాల శాఖ కార్యాలయం (సీఎస్ఓ) తన అంచనాలను వెలువరించింది. అయితే దీనికి రూ.500, రూ.1000 నోట్ల రద్దు కారణం కాదనీ, ఈ అంచనాల రూపకల్పనకు ఏప్రిల్–అక్టోబర్ మధ్యకాలంలో గణాంకాలనే పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టం చేసింది. మొత్తం జీడీపీలో దాదాపు 55 శాతం పైగా ఉన్న తయారీ రంగంతోపాటు మైనింగ్, నిర్మాణ రంగాల పేలవ పనితీరు జీడీపీ స్పీడ్‌కు బ్రేక్‌లు వేస్తున్నట్లు పేర్కొంది. గత ఏడాది దేశ జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతం. ‘‘మందగమనానికి డీమోనిటైజేషన్ ఎంతమాత్రం కారణం కాదు’’ అని గణాంకాల విడుదల సందర్భంగా చీఫ్ స్టాటిస్టీషియన్ టీసీఏ అనంత్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 2016–17 జీడీపీ అంచనాలను 7.1 శాతంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజా అంచనాలు, ఇందుకు సంబంధించి అనంత్ చెప్పిన వివరాలను పరిశీలిస్తే... ♦ ఏదో ఊహాజనితమైన అంచనాల అవసరం మాకు లేదు. వాస్తవిక గణాంకాల ఆధారిత అంచనాలు ఇవి. నవంబర్ బ్యాంక్ డిపాజిట్లు, క్రెడిట్ డేటాను మేము పరిగణనలోకి తీసుకోలేదు. డీమోనిటైజేషన్ కారణంగా నెలకొన్న తీవ్ర ఒడిదుడుకుల పరిస్థితి నెలకొనడమే దీనికి కారణం. ఇది మినహా అక్టోబర్ వరకూ అందిన వాస్తవిక డేటా ఆధారంగా తాజా గణాంకాలు విడుదలయ్యాయి. ♦ 2016–17లో జీడీపీ విలువ (2011–12 స్థిర ధరల వద్ద) రూ. 121.55 లక్షల కోట్లుగా నమోదయ్యే వీలుంది. మేలో విడుదలైన ప్రొవిజినల్ అంచనాల ప్రకారం 2015–16 ఆర్థిక సంవత్సరం జీడీపీ విలువ రూ.113.50 లక్షల కోట్లు. ♦ వాస్తవ స్థూల విలువ ఆధారిత (జీవీఏ) అంచనాల ప్రకారం వృద్ధి 2015–16లో 7.2 శాతం ఉంటే, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 శాతానికి తగ్గుతుంది. ఈ విలువలో రూ.104.27 లక్షల కోట్ల నుంచి రూ.111.53 లక్షల కోట్లకు చేరుతుంది. ♦ వ్యవసాయ రంగం వృద్ధి 4.1%గా ఉంటుంది. అటవీ, మత్స్య విభాగాల వృద్ధి రేటు 1.2%గా ఉంది. మైనింగ్, క్వారీయింగ్‌లో వృద్ధిలేకపోగా 1.8% క్షీణత నమోదుకానుంది. గతేడాది వృద్ధిరేటు 7.4%. ♦ తయారీ రంగం వృద్ధి 9.3% నుంచి 7.4%కి పడిపోతోంది. నిర్మాణ రంగంలో కూడా వృద్ధి రేటు 3.9% నుంచి 2.9%కి తగ్గుతుంది. రూ. లక్ష దాటనున్న తలసరి ఆదాయం నికర తలసరి ఆదాయం (ప్రస్తుత ధరల వద్ద) రూ.1,03,007గా ఉంటుంది. 2015–16తో పోల్చితే 10.4% (రూ.93,293) ఎక్కువ. ఊహాజనితం అనుకోము: శక్తికాంత్ దాస్ ‘సీఎస్ఓ వాస్తవిక డేటాను ఆవిష్కరించింది. దీనిని మేము ఏదో ప్రభావాలు, ఊహాగానాలతో వేసిన లెక్కలుగా భావించలేం. ఇప్పుడు వివిధ వర్గాల నుంచి అంచనాలన్నీ డీమోనిటైజేన్ ఆధారంగానే వస్తున్నాయి. ఇవన్నీ కేవలం ఊహాగానాలతో చేసినవే’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్‌దాస్ చెప్పారు. డీమోనిటైజేషన్ నేపథ్యంలో జీడీపీ 2% వరకూ పడిపోతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌సహా పలువురు అభిప్రాయపడిన నేపథ్యంలో తాజా అంచనాలు వెలువడ్డాయి. డీమోనిటైజేషన్ ప్రభావం ఉంటుంది: పరిశ్రమలు మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద డీమోనిటైజేషన్ ప్రభావం ఉంటుందని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమేనని, అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొంటాయని పారిశ్రామిక మండలి సీఐఐ పేర్కొంది. రానున్నది వృద్ధి ఆధారిత బడ్జెట్ అని విశ్వసిస్తున్నట్టు తెలిపింది. ఇది 8 శాతం దేశాభివృద్ధికి బాటకు చేరడానికి దోహదపడే అంశంగా అభిప్రాయపడింది.