ఈవీఎంల హ్యాకింగ్‌ చాలా సులభం: ఎలన్‌ మస్క్‌ | Elon Musk favours paper ballots for elections says computer programs too easy to hack | Sakshi
Sakshi News home page

ఈవీఎంల హ్యాకింగ్‌ చాలా సులభం: ఎలన్‌ మస్క్‌

Published Mon, Oct 21 2024 4:05 AM | Last Updated on Mon, Oct 21 2024 9:39 AM

Elon Musk favours paper ballots for elections says computer programs too easy to hack

ఫిలడెల్ఫియా ఎన్నికల సభలో టెక్‌ దిగ్గజం ఎలన్‌ మస్క్‌ పునరుద్ఘాటన

ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ వాడుతుంటే అది మరింత సులభం 

ఎన్నికల్లో పేపర్‌ బ్యాలెట్లు మాత్రమే వినియోగించాలి 

టెక్నాలజీని ఇష్టపడే సాంకేతిక నిపుణుడిగా ఈ మాట చెబుతున్నా

సాక్షి, అమరావతి: ఈవీఎంలను (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లు) చాలా సులభంగా హ్యాక్‌ చేయవచ్చని టెక్‌ దిగ్గజం, టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ పునరుద్ఘాటించారు. పారదర్శకత కోసం బ్యాలెట్‌ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని మరోసారి గట్టిగా సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతో ఇష్టపడే నిపుణుడిగా తాను ఈ మాట చెబుతున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ తరపున ప్రచారం నిర్వహిస్తున్న  ఎలన్‌ మస్క్‌ రెండు రోజుల క్రితం పెన్సిల్వేనియాలోని ఫిలడెలి్ఫయాలో జరిగిన బహిరంగ సభలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

ఓ అభ్యర్థి గెలిచేలా రీ ప్రోగ్రామింగ్‌ చేయవచ్చు..
ఈవీఎంల పనితీరుపై ఎలన్‌ మస్క్‌ తొలి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈవీఎంలలో కాలం చెల్లిన మైక్రోసాఫ్ట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారని, దీంతో వీటిని హ్యాక్‌ చేయడం అత్యంత సులభమని, ఈ విషయాన్ని ఒక టెక్నాలజీ నిపుణుడిగా చెబుతున్నట్లు జూలైలో మస్క్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. 2017లో సెనేట్‌ ఇంటెలిజెన్స్‌ విచారణలో ఈ విషయం బయటపడిందని, ఓ అభ్యర్థి గెలిచే విధంగా ఓట్లను దొంగిలిస్తూ ఈవీఎంలను రీ ప్రోగ్రామింగ్‌ చేయవచ్చని స్పష్టం చేశారు. అమెరికా ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సహా మరే విధంగానూ ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ పద్ధతిని వినియోగించకూడదని మస్క్‌ గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు.

ఈవీఎంల సాఫ్ట్‌వేర్‌ ఉత్తమం కాదు.. 
‘ఈవీఎంలను చాలా సులభంగా హ్యాక్‌ చేయవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను ఇంకా చాలా తేలిగ్గా హ్యాక్‌ చేయవచ్చు. నాకు కంప్యూటర్‌ అంటే ఇష్టం. అయితే కంప్యూటర్లు ఓటింగ్‌ ట్యాబ్‌లేషన్‌ను కలిగి ఉండకూడదు. ఈవీఎంల్లో వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉత్తమమైనది కాదు. ఎన్నికల్లో పేపరు బ్యాలెట్లు మాత్రమే ఉపయోగించాలి. ప్రతి వ్యక్తి నేరుగా పోలింగ్‌ బూత్‌ వద్దకు వచ్చి లైన్‌లో నిలబడి ఓటింగ్‌ హక్కు వినియోగించుకోవాలి’ అని మస్క్‌ పేర్కొన్నారు. ఈవీఎంల ద్వారా భారత్‌లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా ఎలన్‌ మస్క్‌ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి. ఈవీఎంల ద్వారా కాకుండా పారదర్శకత కోసం బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సైతం డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement