breaking news
paper ballots
-
ఈవీఎంలతో గెలుస్తామంటే కుదరదు అక్కడ!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అలియాస్ EVMలు. ప్రతీ ఐదేళ్లకొకసారి ఇవి మనల్ని పలకరిస్తుంటాయి. అయితే వాటి ద్వారా పడిన ప్రతీ ఓటుకు నిజంగా భద్రత ఉంటుందా?. ఈవీఎంలను హ్యక్ చేసి మెజారిటీ ప్రజలిచ్చిన తీర్పును మార్చే అవకాశాలు ఏమాత్రం లేవా? అనే అనుమానాలు కలగడం సహజమే. మొన్నీమధ్య ఏపీ ఎన్నికల టైంలో.. అంతకు ముందు.. మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల టైంలో ఈ తరహా ప్రశ్నలెన్నో తలెత్తాయి. అందుకేనేమో.. అమెరికాలాంటి అగ్రదేశం గత రెండు దశాబ్దాల ప్రయత్నాలతో ఎన్నికల విధానాన్ని ఈవీఎంల నుంచి మళ్లీ బ్యాలెట్‌కు తెచ్చుకుంది. నవంబర్ 5వ తేదీన జరగబోయే పోలింగ్ బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరగబోతోంది. 95 శాతం రిజిస్టర్డ్ ఓటర్లు అక్కడ పేపర్‌పై టిక్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 69.9 శాతం ఓటర్లు హ్యాండ్మార్క్డ్ పేపర్ బ్యాలెట్స్ విధానంలో ఓటేయొచ్చని, అలాగే బ్యాలెట్ మార్కింగ్ డివైజ్లతో(డిజిటల్ బ్యాలెట్.. ఓటేసి అప్పటికప్పుడే ఆ ప్రింట్ బయటకు తీయొచ్చు కూడా) కూడిన పేపర్బ్యాలెట్ ఓటింగ్ వైపు మరో 25.1 శాతం మంది మొగ్గుచూపిస్తారని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన.. కేవలం ఐదు శాతం ఓటర్లు మాత్రం మన దగ్గర ఈవీఎంల తరహా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్(DRE) ద్వారా ఓటేసే ఛాన్స్ ఉంది.అక్కడ ఏరకంగా ప్రయత్నించినా ప్రజా తీర్పును మార్చడానికి వీలుండదన్నమాట. ఈవీఎంల మేనిపులేషన్తో గెలవడం అక్కడ ఎంతమాత్రం కుదరదన్నమాట. సాంకేతికతను ముందుగా పుణికిపుచ్చుకునే అమెరికాలో.. ఈ తరహా ఓటింగ్ ఇంకా జరుగుతుండడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే.. అమెరికాలో 2000 సంవత్సరం దాకా పేపర్ బ్యాలెట్స్ ఓటింగ్ జరిగేది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ వైపు అడుగులేసింది. ఓటర్లు డీఆర్ఈ లేదంటే పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే వీలు కల్పించారు. 2006 మధ్యంతర ఎన్నికల టైంలో 41.9 శాతం ఓటింగ్ డీఆర్ఈ వ్యవస్థ ద్వారానే జరిగింది. అయితే విదేశీ కుట్రలకు అవకాశం, హ్యాకింగ్ ఆరోపణల నేపథ్యంలో డీఆర్ఈపై అక్కడి ఓటర్లలోనూ నమ్మకం సన్నగిల్లింది. 2008 ఎన్నికల నుంచి డీఆర్ఈను ఓటర్లు తిరస్కరిస్తూ వచ్చారు. 2016 అమెరికా ఎన్నికల టైంలో రష్యా జోక్యం ఆరోపణలతో పూర్తిగా వాటిని పక్కన పడేశారు అక్కడి ఓటర్లు.అందుకే అనుమానాలుఈవీఎం 'అన్లాకింగ్'పై రాజకీయ దుమారం కొత్తేం కాదు. మన దేశంలో ఈసీ అందుకు అవకాశమే లేదని చెబుతున్నా.. కొన్ని ఎన్నికల ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాల టైంలో నడిచిన చర్చే ఇందుకు ఉదాహరణ. ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంల వాడకం బదులు సంప్రదాయ రీతిలో పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగించాలనే అంశాన్ని కొందరు తెరపై తెచ్చారు. ఈ క్రమంలో..ఇదీ చదవండి: ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల మీద సమారు అరవై ఏళ్ల పాటు నేను పనిచేశాను. ఈవీఎం యంత్రాల వ్యవస్థనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే. దీని వల్ల ఫలితాలు తామరుమారవుతాయి. ఈవీఎంల కంటే పాత బ్యాలెట్ పేపర్ విధానమే చాలా ఉత్తమమైంది. ఇందులో అయితే ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి.:::కాంగ్రెస్ నేత శ్యామ్పిట్రోడాభారత్లో వాడే ఈవీఎంలు అమెరికాలో వాడే తరహావి కావు. ఇక్కడి ఈవీఎంలు కంప్యూటర్ ప్లాట్‌ఫాం మీద తయారు చేయలేదు. వాటికి బయటి నుంచి ఎలాంటి నెట్‌వర్క్‌తో అనుసంధానించే అవకాశమే లేదు. రీ ప్రోగ్రామింగ్ కూడా వీలు లేదు. ఇలాంటి పరికరాలను హహ్యాక్ చేయడం కుదరదు. కావాలంటే ప్రపంచ దేశాలు భారత ఈవీఎంలను వారి ఎన్నికల్లో వాడుకోవచ్చు.:: కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్భారత్లో వాడుతున్న ఈవీఎంలకు సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి రక్షణ ఉందనేది మనకెవరికీ తెలియదు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు సంబంధించి ఈవీఎంలు ISO 27001 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది నిపుణులు తేల్చాలి. ఈవీఎంల భద్రతకు ఎలాంటి సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను వాడుతున్నారనేది ఇప్పటివరకు బహిర్గతమవలేదు. ఎవరికీ తెలియదు.::: సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ఈవీఎంలను మనం తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదంటే ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం. ఇది ఏ దేశానికైనా నష్టమే కలిగిస్తుంది.:: ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్ఇదీ చదవండి: మీకు తెలుసా? ఈ దేశాల్లో పేపర్ బ్యాలెటే ముద్దునిపుణుల నుంచి సామాన్యుల దాకా ఈవీఎంల వాడకంపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతుంటారు. కానీ, ఈ మధ్యకాలంలో పాపులర్ టెక్నాలజీ నిపుణులు కూడా వాటి పని తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తుండడం చూస్తున్నాం. దీంతో ఈవీఎంలపై అనుమానాలకు శాస్త్రీయ నివృత్తి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈవీఎంలపై ఇంతమంది ఇన్ని అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నపుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడితేనే బెటరని సామాన్యులతో పాటు పార్టీల అధినేతలు సూచిస్తున్నారు. ఈవీఎంలు వాడకంలో అయ్యే ఖర్చుతో పోలిస్తే బ్యాలెట్ విధానంలో ఖర్చు కొద్దిగా పెరిగినప్పటికీ, ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఓటర్లకు ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం కలగాలంటే బ్యాలెట్ పేపరే బెస్ట్ అనే వాదన వినిపిస్తోంది. ‘‘పేపర్ బ్యాలెట్‌తో ఓటర్ల విశ్వాసాన్ని పెంచవచ్చు. మనలాంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. రెండింటినీ నిర్ధారించడానికి ఏకైక మార్గం, పేపర్ బ్యాలెట్‌కి తిరిగి వెళ్లడం. USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే మరియు డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మనం ప్రపంచంలోని ఇతర దేశాలతో మార్పులు చేసి పేపర్ వైపు వెళ్లే సమయం ఇది. బ్యాలెట్, ఇది ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది. విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలి’’:::హర్యానా ఎన్నికలపై.. ఎగ్జిట్‌పోల్స్‌కు విరుద్ధంగా వెలువడిన ఫలితాలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ట్వీట్ -
ఈవీఎంల హ్యాకింగ్ చాలా సులభం: ఎలన్ మస్క్
సాక్షి, అమరావతి: ఈవీఎంలను (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) చాలా సులభంగా హ్యాక్ చేయవచ్చని టెక్ దిగ్గజం, టెస్లా అధినేత ఎలన్ మస్క్ పునరుద్ఘాటించారు. పారదర్శకత కోసం బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని మరోసారి గట్టిగా సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతో ఇష్టపడే నిపుణుడిగా తాను ఈ మాట చెబుతున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న ఎలన్ మస్క్ రెండు రోజుల క్రితం పెన్సిల్వేనియాలోని ఫిలడెలి్ఫయాలో జరిగిన బహిరంగ సభలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.ఓ అభ్యర్థి గెలిచేలా రీ ప్రోగ్రామింగ్ చేయవచ్చు..ఈవీఎంల పనితీరుపై ఎలన్ మస్క్ తొలి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈవీఎంలలో కాలం చెల్లిన మైక్రోసాఫ్ట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారని, దీంతో వీటిని హ్యాక్ చేయడం అత్యంత సులభమని, ఈ విషయాన్ని ఒక టెక్నాలజీ నిపుణుడిగా చెబుతున్నట్లు జూలైలో మస్క్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 2017లో సెనేట్ ఇంటెలిజెన్స్ విచారణలో ఈ విషయం బయటపడిందని, ఓ అభ్యర్థి గెలిచే విధంగా ఓట్లను దొంగిలిస్తూ ఈవీఎంలను రీ ప్రోగ్రామింగ్ చేయవచ్చని స్పష్టం చేశారు. అమెరికా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సహా మరే విధంగానూ ఎల్రక్టానిక్ ఓటింగ్ పద్ధతిని వినియోగించకూడదని మస్క్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.ఈవీఎంల సాఫ్ట్వేర్ ఉత్తమం కాదు.. ‘ఈవీఎంలను చాలా సులభంగా హ్యాక్ చేయవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను ఇంకా చాలా తేలిగ్గా హ్యాక్ చేయవచ్చు. నాకు కంప్యూటర్ అంటే ఇష్టం. అయితే కంప్యూటర్లు ఓటింగ్ ట్యాబ్‌లేషన్‌ను కలిగి ఉండకూడదు. ఈవీఎంల్లో వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ ఉత్తమమైనది కాదు. ఎన్నికల్లో పేపరు బ్యాలెట్లు మాత్రమే ఉపయోగించాలి. ప్రతి వ్యక్తి నేరుగా పోలింగ్ బూత్ వద్దకు వచ్చి లైన్లో నిలబడి ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలి’ అని మస్క్ పేర్కొన్నారు. ఈవీఎంల ద్వారా భారత్‌లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా ఎలన్ మస్క్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి. ఈవీఎంల ద్వారా కాకుండా పారదర్శకత కోసం బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సైతం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
బీజేపీకి భయమెందుకు?
లక్నో: బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహిచేందుకు బీజేపీ ఎందుకు భయపడుతోందని బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) నాయకురాలు మాయావతి ప్రశ్నించారు. ఈవీఎంలపై తమకు విశ్వాసం లేదని ఆమె స్పష్టం చేశారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... బీజేపీ నాయకులకు తమ నిజాయితీ పట్ల నమ్మకముంటే భవిష్యత్తులో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించడానికి ఎందుకు భయపడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా అభిమానుల సమక్షంలో కేక్ కోశారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు చేశారు. రెండు పార్టీలు దొందూ దొందేనని వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుల గురించి ప్రశ్నించగా.. దీనికి చాలాసార్లు సమాధానం చెప్పానని అన్నారు. ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలపై ఆమె స్పందించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇది చాలా ప్రమాదకర పరిణామమని వ్యాఖ్యానించారు. -
పేపర్ బ్యాలెట్‌పైనే పోలింగ్ జరపాలి
-
పేపర్ బ్యాలెట్‌పైనే పోలింగ్ జరపాలి
► ఈసీని కోరిన 16 పార్టీలు ► 13న సుప్రీంకోర్టులో విచారణ న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలు ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లపై నమ్మకం కోల్పోయారనీ, కాబట్టి ఎన్నికల పోలింగ్‌ను పేపర్ బ్యాలెట్‌పైనే జరపాలని 16 రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం(ఈసీ)ను కోరాయి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయానికి అన్ని ఈవీఎంలకు వీవీపీఏటీ (ఓటు ఎవరికి పడిందో తెలుపుతూ రశీదులనిచ్చే యంత్రాలు)లను అమర్చేందుకు ఈసీకి తగినన్ని నిధులు ఇవ్వడం లేదంటూ కేంద్రంపై ఆరోపణలు చేశాయి. కాంగ్రెస్, బీఎస్పీ, డీఎంకే, టీఎంసీ, వామపక్షాలు తదితర పార్టీల నాయకులు ఈసీ ఉన్నతాధికారులను సోమవారం కలిశారు. పార్లమెంటులో ప్రతిపక్షాల భేటీ ఎన్నికల సంఘం వద్దకు వెళ్లేముందు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పార్లమెంటులో ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ చాంబర్లో జరిగిన ఈ సమావేశంలో.. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఎన్నికల సంఘాన్ని కలవాల్సిందిగా ప్రతిపక్షాలు నిర్ణయించాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం తెలిసిందే. మహాభారతంలో కొడుకు దుర్యోధనుడు గెలవడానికి తండ్రి ధృతరాష్ట్రుడు సాయపడినట్లుగా...ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఈసీ తోడ్పాటునందిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. వీవీపీఏటీలు లేని ఈవీఎంలను ఎన్నికల్లో వాడడాన్ని సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్లను అన్నింటినీ కలిపి సుప్రీంకోర్టు ఏప్రిల్ 13న విచారించనుంది. వీవీపీఏటీలు కలిగిన ఈవీఎంలనే ఎన్నికల్లో వాడాలంటూ సమాజ్‌వాదీ పార్టీ నేత అతౌర్ రెహ్మాన్ వేసిన పిటిషన్‌ను సోమవారం విచారించేందుకు కోర్టు నిరాకరించింది.