
ప్రపంచంలోని చాలాదేశాల్లో ఓటింగ్ ప్రక్రియకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (EVM) ఉపయోగిస్తున్నారు. దీనిపైన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఇటీవల ప్యూర్టో రికో దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లలో అవకతవకలు జరిగాయని ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ అభ్యర్థి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన వందల కొద్దీ ఓటింగ్ అక్రమాలను ఎదుర్కొన్నట్లు వివరాయించారు. అదృష్టవశాత్తూ, పేపర్ ట్రయిల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించి ఓట్ల లెక్కలు సరిచేసినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వదిలేసి మళ్ళీ పేపర్ బ్యాలెట్‌లకు తిరిగి రావాలని ఆయన పేర్కొన్నారు.
రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ ట్వీట్ మీద మస్క్ స్పందిస్తూ.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను రద్దు చేయాలి. వీటిని ఎవరైనా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి హ్యాక్ చేసే ప్రమాదం ఉందని అన్నారు. ఇది ఒక దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంటుందని మస్క్ అన్నారు.

మస్క్ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మస్క్ అబ్రిప్రాయంతో చాలామంది ఏకీభవిస్తున్నారు. నిజానికి ఈవీఎంలో ఎంత సేఫ్టీ టెక్నాలజీలను ఉపయోగించి తయారు చేసినా.. అంతకు మించిన టెక్నాలజీతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఎన్నికల విషయంలో పేపర్ ఓటింగ్ ఉత్తమం అని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
We should eliminate electronic voting machines. The risk of being hacked by humans or AI, while small, is still too high. https://t.co/PHzJsoXpLh
— Elon Musk (@elonmusk) June 15, 2024