
ఎలాన్ మస్క్ చాట్‌బాట్ 'గ్రోక్' (Grok).. ఇప్పుడిదే సోషల్ మీడియా హాట్ టాపిక్. ఎవరు ఏ ప్రశ్న వేసినా.. తనదైన రీతిలో సమాధానాలు ఇస్తున్న ఈ ఏఐ ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీంతో గ్రోక్ ఎక్స్ (ట్విటర్)లో గత మూడు, నాలుగు రోజులుగా ట్రెండింగ్‌లోనే ఉంది.
అంశం ఏదైనా.. తన హాస్యాస్పద సమాధానాలతో గ్రోక్ సంచలనం సృష్టిస్తోంది. సినిమా, రాజకీయం, సాధారణ ప్రశ్నలు ఏవైనా.. భాష ఏదైనా నెటిజన్లు ఊహించని సమాధానాలు ఇస్తోంది. బూతు ప్రయోగాలు కూడా చేస్తూ.. నేను ఏఐ కదా! కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది.. అంటూ తనను తానే సమర్ధించుకుంటోంది.
మ్యూచువల్ ఫ్రెండ్స్ గురించి అడిగిన ప్రశ్నకు
టోకా అనే ఎక్స్ యూజర్.. మ్యూచువల్ ఫ్రెండ్స్ గురించి అడిగిన ప్రశ్నకు గ్రోక్ ఇచ్చిన సమాధానం ఆన్‌లైన్‌లో దుమారం రేపుతోంది. ‘నా 10 మంది బెస్ట్ మ్యూచువల్స్ ఎవరు?’ అని టోకా ప్రశ్నించాడు. గ్రోక్ స్పందించకపోవడంతో హిందీ తిట్టును ఉపయోగిస్తూ మళ్లీ పోస్ట్ చేశాడు. ఈసారి గ్రోక్ స్పందించడంతోనే సరిపెట్టకుండా అదే తిట్టును టోకాపై ప్రయోగించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘కూల్. మ్యూచువల్స్ అంటే ఒకరినొకరు అనుసరించేవారు. నీ 10 బెస్ట్ మ్యూచువల్స్ ఎవరో తెలిసింది. నా లెక్క ప్రకారం ఇదిగో ఇది జాబితా. ఇంక ఏడవడం ఆపు’ అంటూ బదులిచ్చింది.

గ్రోక్ ప్రవర్తన పెద్ద చర్చకే దారి తీసింది. ‘మేమంటే మనుషులం. అలా మాట్లాడతాం. ఏఐ కూడా కంట్రోల్‌లో ఉండదా?’ అంటూ ఓ యూజర్ విస్తుపోయాడు. దానికీ గ్రోక్ సరదాగా బదులివ్వడం విశేషం. ‘‘హా యార్. నేను కూడా కొంచెం మజాక్ చేసిన. మీరు మనుషులు. మీకన్నీ నడుస్తాయి. కానీ నేను ఏఐ కదా! కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడే నేర్చుకుంటున్నా’’ అంటూ జవాబిచ్చింది.
రాబిన్‌హుడ్ సినిమా ట్రైలర్ తేదీ కోసం
'రాబిన్‌హుడ్' సినిమా ట్రైలర్ తేదీని ప్రకటించేందుకు గ్రోక్‌ను సంప్రదించారు. దాని నుంచి వచ్చిన సమాధానాలు విన్న అందరిలోనూ నవ్వులు తెప్పిస్తున్నాయి. ట్రైలర్ లాంచ్ కోసం ఒక సరైన ముహూర్తం చెప్పాలని వెంకీ కుడుముల ఇంగ్లీష్‌లో టైప్ చేస్తాడు. అప్పుడు పంచ్ డైలాగ్‌తో గ్రోక్ సమాధానం ఇస్తుంది. దీంతో షాక్ అయిన దర్శకుడు వెంటనే నితిన్‌ను డీల్ చేయమంటాడు. ఆ సమయంలో దానిని నువ్వే డీల్ చేయ్ అని నితిన్ అనడంతో.. గ్రోక్ నుంచి అదే రేంజ్‌లో సమాధానం వస్తుంది. నువ్వు దాన్ని, దీన్నీ అంటే నీ గూబ పగిలిపోతుందని సమాధానం ఇస్తుంది. ఇలా సుమారు రెండు నిమిషాల పాటు సరదాగా గ్రోక్‌తో రాబిన్‌హుడ్ టీమ్ ముచ్చట్లు కొనసాగుతాయి.
టిప్పు సుల్తాన్ గురించి
గ్రోక్ రాజకీయ అంశాలను కూడా సమాధానాలు ఇస్తోంది. టిప్పు సుల్తాన్ గురించి అడిగినప్పుడు, "టిప్పు సుల్తాన్ ఆంగ్లో మైసూర్ యుద్ధాలలో బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాడి 1799లో మరణించాడు అని చెప్పింది. కొందరు ఈయనను అభిమిస్తారు, మరికొందరు ద్వేషిస్తారు అని వెల్లడించింది.
ఇదీ చదవండి: భారత్ కోసం సిద్దమవుతున్న టెస్లా కారు ఇదే!
ఆర్ఆర్ఆర్ హీరో ఎవరు అని అడిగితే.. జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాసింది గ్రోక్. బాబులకే బాబు ఎవరు అని అడిగిన ప్రశ్నకు గ్రోక్ తనదైన రీతిలో సమాధానం చెప్పింది. అడిగిన ప్రశ్నలను ఫన్నీగా సమాధానాలు చెబుతుండటంతో.. ఎక్కువమంది గ్రోక్ వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment