ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్‌ఏఐ (xAI) సిరీస్ బీ ఫండింగ్ రౌండ్‌లో 6 బిలియన్లను సేకరించారు. ఇందులో వెంచర్ క్యాప్టలిస్ట్ ఆండ్రీసెన్ హోరోవిట్జ్, సీక్వోయా క్యాపిటల్‌తో సహా పలువురు వ్యాపార వేత్తలు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్స్‌ఏఐ అధికారికంగా తెలిపింది.
ఈ నిధుల్ని xAIని మార్కెట్‌కి పరిచయం చేయడానికి, అధునాతన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, భవిష్యత్ టెక్నాలజీలపై పరిశోధన, వాటి అభివృద్ధిని వేగవంతం చేసేందుకు సంస్థ ఉపయోగించనుంది.
అయితే మొత్తం ఎంతమొత్తంలో ఇన్వెస్టర్ల నుంచి మస్క్ నిధుల్ని సేకరిస్తున్నారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ ఇతర మీడియా నివేదికలు నిధుల మొత్తం 18 బిలియన్ నుంచి 24 బిలియన్ల మధ్య ఉంటుందని సమాచారం.
మస్క్ చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ఫౌండర్‌లలో ఒకరిగా ఉన్నారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే ఏఐ చాట్‌జీపీటీ వల్ల తలెత్తే ప్రమాదాలను గుర్తించారు. ఆ సంస్థ నుంచి వైదొలగారు. టెక్నాలజీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల‍్ట్‌మన్‌కు సలహా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment