xAI
-
హిందీ నేర్పిస్తారా? ఎలాన్ మస్క్ అదిరిపోయే ఆఫర్
ఎలాన్ మస్క్‌కు చెందిన కృత్రిమ మేధస్సు సంస్థ ఎక్స్ఏఐ(xAI).. హిందీ ట్యూటర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. తమ సంస్థలో ఏఐ ట్యూటర్లుగా పనిచేయడానికి భాషా నిపుణుల కోసం గ్లోబల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఇంగ్లీష్‌తోపాటు హిందీ, ఫ్రెంచ్, చైనీస్ లేదా అరబిక్ వంటి ఇతర భాషలలో నిపుణులను నియమించుకుంటోంది.తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఏఐ మోడల్స్ భాషా అభ్యాస ప్రక్రియలకు మార్గనిర్దేశం చేయడంలో ద్విభాషా కమ్యూనికేషన్, సాంకేతిక రచన లేదా జర్నలిజంలో నైపుణ్యం అవసరం. "బలమైన పరిశోధనా నైపుణ్యాలు, వివిధ సమాచార వనరులు, డేటాబేస్లు, ఆన్లైన్ వనరులను ఇంగ్లీష్ నుంచి ఇతర భాషలలోకి మార్చగల సామర్థ్యం చాలా అవసరం" అని ఉద్యోగ వివరణ పేర్కొంది.వర్క్ ఫ్రమ్ హోమ్ఎక్స్ఏఐ ప్రకటించిన ఈ ట్యూటర్ ఉద్యోగాలు పూర్తిగా రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. అభ్యర్థులు స్థానిక టైమ్ జోన్లో సోమవారం నుండి శుక్రవారం వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయవచ్చు. అయితే ఈ ఉద్యోగ కాల పరిమితి ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. దీనికి ఎంపికైనవారికి ప్రామాణిక వైద్య ప్రయోజనాలతో పాటు అర్హతలు, అనుభవాన్ని బట్టి గంటకు 35 నుండి 65 డాలర్లు (రూ. 2,900 నుండి రూ. 5,400) వరకు చెల్లిస్తారు.ఎక్స్ఏఐ గురించి..ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ఏఐని 2023లో ఎలాన్ మస్క్ స్థాపించారు. కృత్రిమ మేధస్సు సంక్లిష్టతను తొలగిస్తూ విశ్వం నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకునే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోని వివిధ భాషలకు తమ సేవలను విస్తరిస్తోంది. -
మస్క్ ఏఐ కంపెనీ Xaiకి పెట్టుబడుల వరద..
ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐ (xAI) సిరీస్ బీ ఫండింగ్ రౌండ్లో 6 బిలియన్లను సేకరించారు. ఇందులో వెంచర్ క్యాప్టలిస్ట్ ఆండ్రీసెన్ హోరోవిట్జ్, సీక్వోయా క్యాపిటల్‌తో సహా పలువురు వ్యాపార వేత్తలు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్స్ఏఐ అధికారికంగా తెలిపింది. ఈ నిధుల్ని xAIని మార్కెట్‌కి పరిచయం చేయడానికి, అధునాతన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, భవిష్యత్ టెక్నాలజీలపై పరిశోధన, వాటి అభివృద్ధిని వేగవంతం చేసేందుకు సంస్థ ఉపయోగించనుంది. అయితే మొత్తం ఎంతమొత్తంలో ఇన్వెస్టర్ల నుంచి మస్క్ నిధుల్ని సేకరిస్తున్నారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ ఇతర మీడియా నివేదికలు నిధుల మొత్తం 18 బిలియన్ నుంచి 24 బిలియన్ల మధ్య ఉంటుందని సమాచారం. మస్క్ చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ఫౌండర్లలో ఒకరిగా ఉన్నారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే ఏఐ చాట్‌జీపీటీ వల్ల తలెత్తే ప్రమాదాలను గుర్తించారు. ఆ సంస్థ నుంచి వైదొలగారు. టెక్నాలజీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌కు సలహా ఇచ్చారు. -
చాట్‌జీపీటీతో పోటీపడేలా..‘ఎక్స్ఏఐ’లోకి భారీ పెట్టుబడులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్ఏఐని టెక్ మొఘల్ ఎలాన్ మస్క్ స్థాపించారు. తాజాగా ఆ సంస్థలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని పెంచుతున్నట్లు సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)లో ఫైలింగ్ నమోదు చేశారు. ఇప్పటికే ఆ సంస్థ నవంబర్ 29న తన వాటాను నలుగురు ఇన్వెస్టర్లకు అమ్మింది. తద్వారా సుమారు 135 మిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని స్వీకరించింది. మిగిలిన షేర్ల కొనుగోలుకు ఎక్స్ఏఐకి 'బైండింగ్ అండ్ ఇంప్లిమెంటబుల్ అగ్రిమెంట్' ఉందని పేర్కొంది. జులైలో ప్రారంభం జూలైలో ఎలాన్ మస్క్ ఎక్స్ఏఐని ప్రారంభించారు. విశ్వంలోని వాస్తవాల్ని యూజర్ల కళ్ల ముందు ఉంచేందుకే ఈ ఏఐ సంస్థను స్థాపించినట్లు మస్క్ సదరు అఫిషియల్ సైట్లో పేర్కొన్నారు. రెండు నెలల శిక్షణ అనంతరం 'ది హిచ్ హైకర్స్ గైడ్ టు ది గెలాక్సీ' స్ఫూర్తితో ఇటీవల ఎక్స్ ఏఐ గ్రోక్ అనే చాట్ బాట్‌ను ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ కంపెనీకి ఇతర సంస్థల నుంచి పోటీ ఎదుర్కొంటుంది. వాటిని ధీటుగా ఎదుర్కొనేలా నిర్విరామంగా పనిచేస్తున్నారు. పనిలో పనిగా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు. ఇతర ఏఐ సంస్థల నుంచి గట్టిపోటీ ఎలాన్ మస్క్ చాట్‌జీపీటీ సృష్టికర్తల్లో ఒకరు. 2018కి ముందు ఆ సంస్థలో కొనసాగినా.. ఆ తర్వాత కొద్దికాలానికి బయటకు వచ్చారు. ఇప్పుడు మస్క్ స్థాపించిన ఎక్స్ఏఐకి ఇతర ఏఐ ఆధారిత సంస్థలు పోటీపడుతున్నాయి. -
చాట్‌జీపీటీకి సవాల్ విసిరేలా..ఎలాన్ మస్క్ ‘AI’ స్టార్టప్ ప్రారంభం!
ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ తన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ ఏఐ (xAI)ని ప్రారంభించారు. ఏఐ కోసం గూగుల్, ఓపెన్ ఏఐతో పాటు అమెరికాలో ఇతర పేరున్న టెక్నాలజీ సంస్థలకు చెందిన నిపుణులను నియమించుకున్నారు. తద్వారా చాట్‌జీపీటీకి గట్టి పోటీ ఇస్తూ ప్రత్యామ్నాయంగా తన సంస్థను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. గత కొంత కాలంగా మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీతో రాబోతున్న ప్రమాదాల్ని హెచ్చరిస్తున్నారు. ‘ఏఐ టెక్నాలజీ పైలట్ లేని విమానం వంటిది. అది అణుబాంబుతో సమానం. మానవ ఉనికిని నాశనం చేస్తుందని’ ఆరోపించారు. అంతేకాదు ఏఐని నియంత్రించేలా రెగ్యూలేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. Announcing formation of @xAI to understand reality — Elon Musk (@elonmusk) July 12, 2023 అయితే, ఇప్పుడు ఏఐ టెక్నాలజీలోని వాస్తవాలకు కొత్త అర్ధం చెప్పేలా ఎక్స్ఏఐని స్థాపించినట్లు ట్వీట్ చేశారు. మస్క్ ఏఐ సంస్థ జులై 14ను ట్విటర్ స్పేస్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. మస్క్ బృందంలో మహామహులు చాట్ జీపీటీకి పోటీగా మస్క్ స్థాపించిన ఏఐ సంస్థ ఎక్స్ఏఐలో పలు దిగ్గజ కంపెనీల్లో కృత్తిమ మేధ విభాగంలో పనిచేసిన నిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో డీప్‌మైండ్ మాజీ ఇంజనీర్ ఇగోర్ బాబూస్కిన్, గూగుల్‌లో పనిచేసిన టోనీ వు, గతంలో మైక్రోసాఫ్ట్‌లో పనిచేసి ఆ తర్వాత గూగుల్‌లో చేరిన రీసెర్చ్ సైంటిస్ట్ స్జెగెడీ మస్క్ టీంలో ఉన్నారు. చదవండి : జాబ్ మార్కెట్లో ‘AI’ విధ్వంసం..ఉద్యోగులకు విప్రో బంపరాఫర్!