ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ తన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ ఏఐ (xAI)ని ప్రారంభించారు. ఏఐ కోసం గూగుల్, ఓపెన్ ఏఐతో పాటు అమెరికాలో ఇతర పేరున్న టెక్నాలజీ సంస్థలకు చెందిన నిపుణులను నియమించుకున్నారు. తద్వారా చాట్‌జీపీటీకి గట్టి పోటీ ఇస్తూ ప్రత్యామ్నాయంగా తన సంస్థను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.
గత కొంత కాలంగా మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీతో రాబోతున్న ప్రమాదాల్ని హెచ్చరిస్తున్నారు. ‘ఏఐ టెక్నాలజీ పైలట్ లేని విమానం వంటిది. అది అణుబాంబుతో సమానం. మానవ ఉనికిని నాశనం చేస్తుందని’ ఆరోపించారు. అంతేకాదు ఏఐని నియంత్రించేలా రెగ్యూలేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Announcing formation of @xAI to understand reality
— Elon Musk (@elonmusk) July 12, 2023
అయితే, ఇప్పుడు ఏఐ టెక్నాలజీలోని వాస్తవాలకు కొత్త అర్ధం చెప్పేలా ఎక్స్‌ఏఐని స్థాపించినట్లు ట్వీట్ చేశారు. మస్క్ ఏఐ సంస్థ జులై 14ను ట్విటర్ స్పేస్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
మస్క్ బృందంలో మహామహులు
చాట్ జీపీటీకి పోటీగా మస్క్ స్థాపించిన ఏఐ సంస్థ ఎక్స్‌ఏఐలో పలు దిగ్గజ కంపెనీల్లో కృత్తిమ మేధ విభాగంలో పనిచేసిన నిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో డీప్‌మైండ్ మాజీ ఇంజనీర్ ఇగోర్ బాబూస్కిన్, గూగుల్‌లో పనిచేసిన టోనీ వు, గతంలో మైక్రోసాఫ్ట్‌లో పనిచేసి ఆ తర్వాత గూగుల్‌లో చేరిన రీసెర్చ్ సైంటిస్ట్ స్జెగెడీ మస్క్ టీంలో ఉన్నారు.
చదవండి : జాబ్ మార్కెట్‌లో ‘AI’ విధ్వంసం..ఉద్యోగులకు విప్రో బంపరాఫర్!
Comments
Please login to add a commentAdd a comment