ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌ఏఐని టెక్ మొఘల్ ఎలాన్ మస్క్ స్థాపించారు. తాజాగా ఆ సంస్థలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని పెంచుతున్నట్లు సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ)లో ఫైలింగ్ నమోదు చేశారు.
ఇప్పటికే ఆ సంస్థ నవంబర్ 29న తన వాటాను నలుగురు ఇన్వెస్టర్లకు అమ్మింది. తద్వారా సుమారు 135 మిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని స్వీకరించింది. మిగిలిన షేర్ల కొనుగోలుకు ఎక్స్ఏఐకి 'బైండింగ్ అండ్ ఇంప్లిమెంటబుల్ అగ్రిమెంట్' ఉందని పేర్కొంది.
జులైలో ప్రారంభం
జూలైలో ఎలాన్ మస్క్ ఎక్స్‌ఏఐని ప్రారంభించారు. విశ్వంలోని వాస్తవాల్ని యూజర్ల కళ్ల ముందు ఉంచేందుకే ఈ ఏఐ సంస్థను స్థాపించినట్లు మస్క్ సదరు అఫిషియల్ సైట్‌లో పేర్కొన్నారు. రెండు నెలల శిక్షణ అనంతరం 'ది హిచ్ హైకర్స్ గైడ్ టు ది గెలాక్సీ' స్ఫూర్తితో ఇటీవల ఎక్స్ ఏఐ గ్రోక్ అనే చాట్ బాట్‌ను ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ కంపెనీకి ఇతర సంస్థల నుంచి పోటీ ఎదుర్కొంటుంది. వాటిని ధీటుగా ఎదుర్కొనేలా నిర్విరామంగా పనిచేస్తున్నారు. పనిలో పనిగా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు.
ఇతర ఏఐ సంస్థల నుంచి గట్టిపోటీ
ఎలాన్ మస్క్ చాట్‌జీపీటీ సృష్టికర్తల్లో ఒకరు. 2018కి ముందు ఆ సంస్థలో కొనసాగినా.. ఆ తర్వాత కొద్దికాలానికి బయటకు వచ్చారు. ఇప్పుడు మస్క్ స్థాపించిన ఎక్స్‌ఏఐకి ఇతర ఏఐ ఆధారిత సంస్థలు పోటీపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment