టెక్నాలజీ విస్తృతమైన నేటి రోజుల్లో ఆప్యాయంగా పలకరించేవారు కరువయ్యారు. అందరూ స్మార్ట్‌ఫోన్‌లకు హత్తుకుపోయి అన్నింటినీ వాటిలోనే వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే Character.AI అనే సంస్థ చాట్‌బాట్‌కు కాల్ చేసే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. క్యారెక్టర్స్ అని పిలిచే ఈ ఏఐ చాట్‌బాట్‌లను అచ్చం మనుషలతో మాట్లాడినట్టుగానే ఉండేలా ప్రోగ్రామ్ చేయవచ్చు.
ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఫోన్ కాల్స్ చేసి నిజమైన టెలిఫోనిక్ సంభాషణల అనుభూతిని పొందవచ్చు. ఇంగ్లిష్, స్పానిష్, జపనీస్, చైనీస్ వంటి భాషలను ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుందని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ తెలిపింది. గత నెలలో ఆర్క్ సెర్చ్ కూడా ఇలాంటి ఫీచర్‌నే విడుదల చేసింది.
క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ యూజర్లందరికీ ఉచితంగా లభిస్తుందని ఏఐ సంస్థ తన బ్లాగ్ పోస్ట్ లో ప్రకటించింది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో వెబ్‌లో కూడా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు Character.AI పేర్కొంది. గత మార్చిలో కంపెనీ క్యారెక్టర్ వాయిస్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది వన్-వే కమ్యూనికేషన్. అంటే యూజర్లు ఏఐకి మెసేజ్ చేస్తే వాయిస్ రూపంలో స్పందన వస్తుంది. టెక్ట్స్ టు స్పీచ్ (టీటీఎస్) ఏఐ మోడల్ సామర్థ్యాలను ఉపయోగించి దీన్ని రూపొందించారు.
ఇప్పుడు క్యారెక్టర్ కాల్స్‌తో యూజర్లు టూ-వే వెర్బల్ కమ్యూనికేషన్ చేయొచ్చు. దీని ద్వారా యూజర్లు ఏఐ క్యారెక్టర్ తో చాటింగ్ చేసే హ్యాండ్ ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. కాల్ స్క్రీన్ ఇంటర్‌ఫేజ్ కనిపిస్తుంది. స్క్రీన్ లో మ్యూట్ బటన్, ఎండ్ కాల్ ఆప్షన్ ఉంటాయి. వేగవంతమైన ప్రతిస్పందనలను జనరేట్ చేయడానికి క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ తక్కువ లేటెన్సీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు యూజర్లు వివిధ వాయిస్‌లు, పిచ్‌లు, యాసలు ఎంచుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment