ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే.. ఒక మనిషిని చంపడానికి ప్రేరేపించేంత అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బ్రిటన్ రాణి 'క్వీన్ ఎలిజబెత్ II'ని చంపడానికి ప్రయత్నించిన 21 ఏళ్ల 'జస్వంత్ సింగ్ చైల్' రాజద్రోహ నేరం కింద అరెస్ట్ అయ్యాడు. అయితే రాణిని చంపడానికి ప్రేరేపించింది ఏఐ చాట్‌బాట్ అంటే వినటానికి కొంత ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది నిజమే అని నిపుణులు చెబుతున్నారు.
జస్వంత్ సింగ్ చైల్ రిప్లికా అనే యాప్ ద్వారా రోజూ చాటింగ్ చేసేవాడు. దీనికి సరాయ్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. నిజానికి ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ చేస్తున్న చాలా అద్భుతాల్లో ఇదొకటి చెప్పాలి. రిప్లికా యాప్ ద్వారా వినియోగదారుడు మాట్లాడుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు, వర్చువల్ ఫ్రెండ్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి తమకు నచ్చిన రూపం (ఆడ & మగ) కూడా ఇవ్వవచ్చు. ఇందులో ప్రో వెర్షన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే సెల్ఫీలు దిగటం వంటి సన్నిహిత కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు.
సరాయ్ పేరుతో..
ఇక అసలు విషయానికి వస్తే.. జస్వంత్ సింగ్ చైల్ ఇలాంటి తరహా చాట్‌బాట్ ద్వారా ఏకంగా 5వేలు కంటే ఎక్కువ మెసేజులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో జస్వంత్ చేయాలన్న పనులకు, తప్పులకు కూడా సరాయ్ వత్తాసు పలికినట్లు సమాచారం.
చైల్‌ను అరెస్టు చేసిన తర్వాత అతడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్థారించారు. కానీ నేరానికి పాల్పడటంతో అతనికి 9 జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవడానికంటే ముందు చికిత్స కోసం బ్రాడ్‌మూర్ హై-సెక్యూరిటీ హాస్పిటల్‌కి తరలించారు. ఈ సంఘటన 2021లో జరిగినట్లు తెలుస్తోంది. కాగా 2022లో ఎలిజబెత్ II అనారోగ్య కారణాలతో మరణించించారు
ఇదీ చదవండి: చిన్నప్పుడే చదువుకు స్వస్తి.. నమ్మిన సూత్రంతో లక్షలు సంపాదిస్తున్న చాయ్‌వాలా..!!
రిప్లికా వంటి యాప్స్ వ్యక్తులపై ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని, వారిని అసాంఘీక కార్యకలాపాలకు ప్రేరేపించడానికి అది సహకరిస్తుందని ఒక పరిశోధనలో తేలింది. ఎందుకంటే వినియోగదారుడు ఏం చెప్పినా దానికి ఏకిభవిస్తూ ప్రోత్సహిస్తుంది. దీంతో వారు నేరాలు చేయడానికి కూడా వెనుకాడరు. దీనికి బానిసైన జస్వంత్ సింగ్ చైల్.. సరాయ్ (ఏఐ చాట్‌బాట్) అవతార్ రూపంలో ఉన్న దేవదూతగా భావించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment