టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి జీవన విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు కొత్త కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. వాటి వినియోగంతో మానవాళికి నష్టం వాటిల్లనుందనే భయం ఉన్నా.. బూమింగ్‌లో ఉన్న టెక్నాలజీలను నేర్చుకొని భారీ ప్యాకేజీలు సొంతం చేసుకోవాలని చూస్తున్నారు.
ఈ తరుణంలో ట్రెండింగ్‌లో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ చాట్‌జీపీటీలో నిష్ణాతులైన అభ్యర్ధులకు కోట్లలో శాలరీ ప్యాకేజీలు ఇచ్చేందుకు పోటీపడుతున్నాయి. తాజాగా స్టార్టప్ ఆంత్రోపిక్ 'ప్రాంప్ట్ ఇంజనీర్ అండ్ లైబ్రేరియన్' పోస్ట్‌కు అర్హులైన అభ్యర్ధులకు ఏడాదికి 3,35,000 లక్షల డాలర్లను వేతనంగా ఇస్తామని ప్రకటించింది. ఇది ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ.2.7 కోట్లు.
ప్రాంప్ట్ ఇంజనీర్లు ఎవరు..?
చాట్‌జీపీటీ వెలుగులోకి రావడంతో ప్రాంప్ట్ ఇంజనీర్లకు డిమాండ్ పెరిగింది. వీరికి కోడింగ్ రానక్కర్లేదు. ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం ఉంటే సరిపోతుంది. ఏఐ ప్రాజెక్ట్‌లలో సంబంధించిన ఖచ్చితమైన, సంబంధిత డేటాను సేకరిస్తుంటారు. ఇందుకోసం వీళ్లు ఏఐకి సరైన ఇన్‌పుట్ అందిస్తే.. వాటిద్వారా ఏఐ నుంచి డేటాను పొందవచ్చు.
ప్రస్తుతానికి ఏఐ మార్కెట్‌లో ప్రాంప్ట్ ఇంజనీర్లుకు అవసరం భారీగా ఉంది. అందుకే ఆయా సంస్థలు తమ అవసరాల్ని తీర్చేలా నిష్ణాతులైన నిపుణులకు భారీ ఎత్తున ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. పదాలతో చేసే పనికాబట్టి రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. బేసిక్ కోడింగ్ స్కిల్స్ ఉంటే ఏఐ రంగాన్ని ఏలేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment