
న్యూఢిల్లీ : భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండో సారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ వింగ్ బీజేపీ వెబ్‌సైట్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్స్ వెబ్‌సైట్‌లోని పలు పేజీల స్థానంలో బీఫ్(ఎద్దు మాంసం) ఐటమ్స్ పేర్లను చేర్చారు. అంతేకాక 'Shadow_V1P3R’కు చెందిన వ్యక్తులు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు వెల్లడించారు. వెబ్ సైట్ హోం పేజ్‌లోని నావిగేషన్ బార్‌లో బీజేపీ అని ఉన్న చోట బీఫ్ పదంతో ఎడిట్ చేశారు. ఉదాహరణకు బీజేపీని బీఫ్‌గా.. బీజేపీ హిస్టరీని ‘బీఫ్ హిస్టరీ’గా మార్చారు. ప్రస్తుతం నాయకులు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంతో బిజీగా ఉండటంతో దీనిపై ఇంతవరకూ ఎవరూ స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment