
లాలూ ఫేస్ బుక్ హ్యాక్.. యువకుడు అరెస్ట్
ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చేసిన వ్యక్తిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ అకౌంట్ని హ్యాక్ చేయడానికి ఉపయోగించిన 2 ఫోన్లను నిందితుని నుంచి స్వాధీనం చేసుకున్నారు. వైశాలిలోని మెహ్మదాబాద్ గ్రామానికి చెందిన దివ్యాన్షు కుమార్ అలియాస్ గోలు లాలూ ఫేస్ బుక్ అకౌంట్ని హ్యాక్ చేశాడని పోలీసులు తెలిపారు.
సోషల్ నెట్వర్కింగ్ సైట్లపై అవగాహన ఉన్న దివ్యాన్షుకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉందని పోలీసులు పేర్కొన్నారు. మార్చి 8, 11న లాలూ ఫేస్ బుక్ అకౌంట్ని హ్యాక్ చేసిన దివ్యాన్షు, అనుచితమైన కమెంట్లను పోస్ట్ చేశాడు. వీటిని గమనించిన లాలూ కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ వెంటనే ఆ కామెంట్లను తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.