పట్నా: బిహార్‌లోని మహా కూటమి నుంచి బయటకు వచ్చి సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీ మద్దతుతో మరోసారి బిహార్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. మహాకూటమిలో కీలక పార్టీ అయిన ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నితీష్ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు.
బీజేపీ-జేడీ(యూ) కూటమి ఏర్పాటుపై తాను మాత్రమే బీజేపీకి శుభాకాంక్షలు తెలుపగలనని అన్నారు. జేడీయూను బీజేపీ కూటమిలో కలుపుకున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌డీఏ కూటమిలో భాగంగా జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, బిహార్‌లో ఇప్పుడే అసలైన ఆట మొదలైందని అన్నారు.
నితీష్ కుమార్ అలసిపోయారని.. ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాలనలో ఆర్జేడీ పార్టీ అన్ని రకాలకు సహకరించిందని గుర్తుచేశారు. నితీష్‌పై ప్రస్తుతం తాను వ్యక్తిగతమైన వ్యాఖ్యలు ఏం చేయనని అన్నారు. ప్రస్తుతం నితీష్ ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియటం లేదని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో జేడీ(యూ) పూర్తిగా పట్టు కోల్పోవటం ఖాయమని అన్నారు. నితీష్ చేసిన పనికి బిహార్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని తెలిపారు. వారు(జేడీయూ) ఏం చేసినా బిహార్ ప్రజలు మాత్రం తమ వెంటే ఉంటారని తేజస్వీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment