Tejashwi Prasad Yadav
-
బిహార్‌లో ఇప్పుడే అసలైన ఆట మొదలైంది: తేజస్వీ యాదవ్
పట్నా: బిహార్‌లోని మహా కూటమి నుంచి బయటకు వచ్చి సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీ మద్దతుతో మరోసారి బిహార్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. మహాకూటమిలో కీలక పార్టీ అయిన ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నితీష్ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు. బీజేపీ-జేడీ(యూ) కూటమి ఏర్పాటుపై తాను మాత్రమే బీజేపీకి శుభాకాంక్షలు తెలుపగలనని అన్నారు. జేడీయూను బీజేపీ కూటమిలో కలుపుకున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, బిహార్‌లో ఇప్పుడే అసలైన ఆట మొదలైందని అన్నారు. నితీష్ కుమార్ అలసిపోయారని.. ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాలనలో ఆర్జేడీ పార్టీ అన్ని రకాలకు సహకరించిందని గుర్తుచేశారు. నితీష్‌పై ప్రస్తుతం తాను వ్యక్తిగతమైన వ్యాఖ్యలు ఏం చేయనని అన్నారు. ప్రస్తుతం నితీష్ ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియటం లేదని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో జేడీ(యూ) పూర్తిగా పట్టు కోల్పోవటం ఖాయమని అన్నారు. నితీష్ చేసిన పనికి బిహార్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని తెలిపారు. వారు(జేడీయూ) ఏం చేసినా బిహార్ ప్రజలు మాత్రం తమ వెంటే ఉంటారని తేజస్వీ తెలిపారు. చదవండి: ‘నితీష్, బీజేపీకి బిహార్ ప్రజలు బుద్ధి చెబుతారు’ -
కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో జేడీ(యూ), ఆర్జేడీ విలీనం!
జనతాదళ్ యునైటెడ్ జేడీ(యూ), రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) పార్టీలు త్వరలో విలీనం అవుతాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ(యూ)అధినేత, సీఎం నితీష్ కుమార్.. ఇండియా కూటమిలో భాగంగా సీట్ల పంపిణీపై పట్టబడుతున్నారన్న మీడియా ప్రశ్నకు కేంద్రమంత్రి ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో పలు వ్యక్తిగత సమీకరణాలు పంచుకున్నా. ఆయన కూడా చాలా విషయాలు నాకు చెప్పారు. అయితే వాటిని మీడియా ముందు ప్రజలకు వెల్లడించడం సరికాదు. కానీ, మీకు నేను ఒకటి చెప్పగలను. త్వరలో జేడీ(యూ), ఆర్జేడీ పార్టీలు విలీనం అవుతాయి. అప్పడు ఇండియా కూటమిలో సీట్ల పంపిణీకి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు’ అని అన్నారు. అయితే గురవారం పార్లమెంట్ సమావేశాలు ముగించుకొని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఇడియా కూటమి సమావేశం అనంతరం లలూ ప్రసాద్ ఇరువురు ఒకే విమానంలో ఢిల్లీ నుంచి పట్నాకు ప్రయాణం చేశారు. ప్రస్తుతం బీహార్ డిప్యూటీ సీఎం ఉన్న తన కుమారు తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసే సమయం ఆసన్నమైందని లాలూప్రసాద్.. తనతో చెప్పాడని కేంద్ర మంత్రి గిరిరాజ్ అన్నారు. కేంద్ర మంత్రి ‘విలీనం’ వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అసాధారణమైన వ్యాఖ్యలు చేస్తారు. ఆయనకి ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలవాలని ఉంటుంది. ఆయన్ను ఎవరు గుర్తించరు కావును అసాధారణ వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు’ అని మండిపడ్డారు. చదవండి: Alcohol Ban Exemption: గుజరాత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్ -
బిహార్ ఎన్నికలు.. ఆర్జేడీకి భారీ షాక్
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లలూప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లపై హత్యకేసు నమోదైంది. వీరితో పాటు ఆర్జేడీ నేతలు అనిల్ కుమార్ సాధు, కలో పాస్వాన్లతో పాటు ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్జేడీ ముఖ్య నేతలపై హత్యారోపణలు రావడం ఆ పార్టీవర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. అక్టోబర్ 4న (నిన్న) బిహార్ లోని పూర్నియా జిల్లాలోని మాలిక్ (37) ఇంట్లోకి చొరబడిన దుండగులు అతన్ని కాల్చి చంపారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మాలిక్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఉదంతం వెనుక కుట్రకోణం దాగుందని, దీన్ని రాజకీయ హత్యగా మాలిక్ భార్య ఆరోపించారు. ఇంతకుముందు ఆర్జేడీ నుంచి మాలిక్‌ను సస్పెండ్ చేసిన కారణంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. (బిహార్: ప్రతిపక్షపార్టీ నాయకుడిగా తేజస్వీ యాదవ్) పార్టీ టికెట్ కేటాయించడానికి ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ రూ.50 లక్షలు డిమాండ్ చేసినట్లు కొన్ని రోజులక్రితం మాలిక్ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తనను కులం పేరిట తేజశ్వి యాదవ్ దూషించినట్లు సైతం మాలిక్ వీడియోలో వెల్లడించారు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని అనుకున్న తురణంలోనే ఇలా హత్యకు గురికావడం పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. మాలిక్ హత్యకేసులో త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ విశాల్ శర్మ తెలిపారు. మాలిక్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయని, సంఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కాగా బిహార్ ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రతిపక్ష నాయకుడు తేజశ్వి యాదవ్ తన అసలు రంగు బయటపెట్టాడని జేడీ(యు) ఆరోపించింది. (బిహార్ ఎన్డీఏ నుంచి ఎల్జేపీ ఔట్) -
‘నా తమ్ముడికి అండగా ఉంటా’
పట్నా : తన తమ్ముడు తేజస్వీ యాదవ్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆర్జేడీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానమైనా దక్కించుకోగా.. స్థానిక పార్టీ అయిన ఆర్జేడీ అసలు ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలు చేపట్టిన తేజస్వీ రాజీనామా చేయాలంటూ ముజఫర్‌పూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే మహేశ్వర్ యాదవ్ సహా మరికొంత మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తే తమ కొంప ముంచిందని.. ఇటువంటి నిర్ణయం తీసుకుని తేజస్వీ తప్పు చేశారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన తేజ్ ప్రతాప్ యాదవ్..‘ తేజస్వీ నాయకత్వాన్ని ఇష్టపడని వారెవరైనా పార్టీ నుంచి వెళ్లిపోవచ్చు. మహాఘట్బంధన్, ఆర్జేడీ నేతలైనా సరే మీ ఇష్టం వచ్చినట్లు నడచుకోండి. కానీ నేను ఎల్లప్పుడూ తేజస్వీకి అండగా ఉంటాను. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత నా ప్రియమైన సోదరుడికి లేఖ రాశాను. గెలుపోటములు సహజమని చెప్పాను. అయితే బాధ్యతల నుంచి తప్పించుకోవడం ఏ సమస్యను పరిష్కరించదు. ఓటమిపై విచారిస్తూ కూర్చుంటే సరిపోదు. ఇంట్లోనే ఉన్న మన శత్రువులను లాగిపడేద్దాం. ఎన్డీయే ప్రభుత్వం ప్రజలను ఫూల్స్ చేసింది. ఓటర్లెలా మోసపోయారన్న విషయాలపై నేను, తేజస్వీ అందరికీ వివరిస్తాం. కృష్ణుడిలా ఎల్లప్పుడూ నా తమ్ముడి పక్కనే నిల్చుంటా’అని వ్యాఖ్యానించారు. కాగా గత కొంత కాలంగా తేజ్ ప్రతాప్, తేజస్వీల మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తేజ్ ప్రతాప్ ఇటీవలే ఆర్జేడీ విద్యార్థి విభాగం నుంచి వైదొలిగారు. అంతేకాకుండా లాలూ- రబ్రీ మోర్చా పేరిట సొంత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. భార్య ఐశ్వర్యా రాయ్‌తో విడాకుల విషయంలో కూడా కుటుంబ సభ్యులతో తేజ్ ప్రతాప్ విభేదించారు. ఇక ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిన్న కొడుకు తేజస్వీకి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. -
సీఎంగారే గురువు అంటున్న డిప్యూటీ
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనకు గురువు అని, ఆయన పరిపాలన విధానాన్ని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ తనయుడు తేజస్వి యాదవ్ అన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో తేజస్వి మాట్లాడుతూ.. తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు సభ ప్రాథమిక నిబంధనలు తెలుసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే కావడం కంటే తమ బాధ్యతలను తెలుసుకోవడం చాలా ముఖ్యమని తేజస్వి చెప్పారు. తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను తరచూ నిర్వహించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరికి విన్నవించారు. ఇటీవల బిహార్ ఎమ్మెల్యేలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వల్ల సమాజంలో ఎంపీలు, ఎమ్మెల్యేల పట్ల గౌరవం తగ్గిందని చెప్పారు. ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా చూడాలని తేజస్వి కోరారు.