పాట్నా: ఆర్జేడీ దిగ్గజం లాలు ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణీ ఆచార్య తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతుండటం తెలిసిందే. బిహార్‌లోని సరన్ నియోజకవర్గం ఆమె పోటీ చేస్తున్నారు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అక్కడి నుంచే ఆమెపై పోటీ పడుతున్నారు! తండ్రీ కూతుళ్లు ఒకరిపై ఒకరు పోటీ పడటం ఏమిటా అని అవాక్కవుతున్నారా? వాళ్లిద్దరూ సరన్ నుంచి పోటీ చేస్తున్నది నిజమే గానీ సదరు లాలు ప్రసాద్ యాదవ్ ఆమె తండ్రి కాదు. ఆ పేరుతోనే ఉన్న ఓ రైతు!
రాష్రీ్టయ జన సంభావనా పార్టీ (ఆర్జేపీ) అభ్యరి్థగా నామినేషన్ వేశారాయన. ఈ లాలు ప్రసాద్ యాదవ్‌కు గతంలో పంచాయతీ మొదలుకుని ప్రెసిడెంట్ ఎన్నికల దాకా పోటీ చేసిన అనుభవముంది. అంతే కాదు, 2017, 2022ల్లో రెండుసార్లు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ పడ్డారు. రెండుసార్లూ ఆయన నామినేషన్ తిరస్కరణకు గురవడం వేరే సంగతి! సరన్ లోక్‌సభ స్థానం నుంచి కూడా ఆయన పోటీ చేయడం ఇది తొలిసారేమీ కాదు. చాలాకాలంగా బరిలో నిలుస్తూనే వస్తున్నారు. లాలు భార్య, బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవిపై కూడా పోటీ చేశారు.
ఇప్పుడు వారి కుమార్తెపై బరిలో దిగారు. గత ఎన్నికల విషయం ఎలా ఉన్నా ఈసారి మాత్రం భారీ మెజారిటీతో గెలుస్తానని ఈ లాలు అంటుండటం విశేషం! ‘‘జీవనోపాధి కోసం వ్యవసాయం చేసుకుంటున్నా, నిత్యం సామాజిక సేవలో నిమగ్నమయ్యే ఉన్నా. కనుక ఈసారి సరన్ ప్రజలు నా వెంట ఉన్నారు’’ అంటున్నారు. రోహిణి ఓట్లను చీల్చేందుకే ఆయన బరిలో ఉన్నారని ఆరోపణలున్నాయి. పట్టించుకోనంటున్నాడు. అఫిడవిట్ ప్రకారం ఈ లాలు దగ్గర రూ.5 లక్షల నగదు, భార్య వద్ద 2 లక్షల నగదు, ఆయన పేరిటరూ.17.6 లక్షలు, భార్య పేరిట రూ.5.20 లక్షల చరాస్తులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment