Saran
-
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
పాట్నా: ఆర్జేడీ దిగ్గజం లాలు ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణీ ఆచార్య తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతుండటం తెలిసిందే. బిహార్‌లోని సరన్ నియోజకవర్గం ఆమె పోటీ చేస్తున్నారు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అక్కడి నుంచే ఆమెపై పోటీ పడుతున్నారు! తండ్రీ కూతుళ్లు ఒకరిపై ఒకరు పోటీ పడటం ఏమిటా అని అవాక్కవుతున్నారా? వాళ్లిద్దరూ సరన్ నుంచి పోటీ చేస్తున్నది నిజమే గానీ సదరు లాలు ప్రసాద్ యాదవ్ ఆమె తండ్రి కాదు. ఆ పేరుతోనే ఉన్న ఓ రైతు! రాష్రీ్టయ జన సంభావనా పార్టీ (ఆర్జేపీ) అభ్యరి్థగా నామినేషన్ వేశారాయన. ఈ లాలు ప్రసాద్ యాదవ్‌కు గతంలో పంచాయతీ మొదలుకుని ప్రెసిడెంట్ ఎన్నికల దాకా పోటీ చేసిన అనుభవముంది. అంతే కాదు, 2017, 2022ల్లో రెండుసార్లు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ పడ్డారు. రెండుసార్లూ ఆయన నామినేషన్ తిరస్కరణకు గురవడం వేరే సంగతి! సరన్ లోక్‌సభ స్థానం నుంచి కూడా ఆయన పోటీ చేయడం ఇది తొలిసారేమీ కాదు. చాలాకాలంగా బరిలో నిలుస్తూనే వస్తున్నారు. లాలు భార్య, బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవిపై కూడా పోటీ చేశారు. ఇప్పుడు వారి కుమార్తెపై బరిలో దిగారు. గత ఎన్నికల విషయం ఎలా ఉన్నా ఈసారి మాత్రం భారీ మెజారిటీతో గెలుస్తానని ఈ లాలు అంటుండటం విశేషం! ‘‘జీవనోపాధి కోసం వ్యవసాయం చేసుకుంటున్నా, నిత్యం సామాజిక సేవలో నిమగ్నమయ్యే ఉన్నా. కనుక ఈసారి సరన్ ప్రజలు నా వెంట ఉన్నారు’’ అంటున్నారు. రోహిణి ఓట్లను చీల్చేందుకే ఆయన బరిలో ఉన్నారని ఆరోపణలున్నాయి. పట్టించుకోనంటున్నాడు. అఫిడవిట్ ప్రకారం ఈ లాలు దగ్గర రూ.5 లక్షల నగదు, భార్య వద్ద 2 లక్షల నగదు, ఆయన పేరిటరూ.17.6 లక్షలు, భార్య పేరిట రూ.5.20 లక్షల చరాస్తులున్నాయి. -
ఎర్రబెల్లిపై ఫిర్యాదు కేసులో విచారణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి శరణ్ చౌదరి చేసిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ–మెయిల్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ రవి గుప్తాలకు అందిన ఈ ఫిర్యాదులోని అంశాలపై పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఎర్రబెల్లి ఆదేశాలతో పోలీసు అధికారులు తనను బెదిరించి, తన పేరిట ఉన్న ఇంటిని బలవంతంగా ఆయన బంధువుల పేరిట రాయించారని శరణ్ చౌదరి ఆరో పించారు. ఓ వైపు ఎస్ఐబీ అధికారుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బయటకు వస్తుండగా, మరోవైపు ఆ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై శరణ్ చౌదరి ఫిర్యాదు చేయ డం కలకలం సృష్టిస్తోంది. ఇంటిని రాయించుకోవ డంతో పాటు బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేశారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. బూటు కాళ్లతో తన్నారు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు.. దయాకర్‌రావు ఆదేశాలతో తనను బూటు కాళ్లతో తన్ని, పలుమార్లు చెంపదెబ్బలు కొడుతూ హింసించినట్టు కూడా శరణ్ చౌదరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘2023 ఆగస్టు 21న నేను నా కార్యాలయానికి వెళుతుండగా ప్రైవేటు కారులో సివిల్ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు బలవంతంగా సీసీఎస్ ఆఫీస్‌కు తీసుకెళ్లారు. నా కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఎర్రబెల్లి దయాకర్‌రావు బంధువు విజయ్ పేరిట నా ఇంటిని రిజిస్టర్ చేయాలని అప్పటి హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వ రరావు బలవంతపెట్టారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నన్ను బూటు కాళ్లతో తన్నారు. రెండురోజులు అక్రమంగా నన్ను వారి కస్టడీలో పెట్టుకున్నారు. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులను డబ్బుల కోసం ఒత్తిడి చేశారు. అప్పుడు నా స్నేహితుడు రూ.50 లక్షలు పంపాడు. చివరకు నా ఇంటిని విజయ్ పేరిట రాసేందుకు అంగీకరించిన తర్వాత నన్ను బయటకు పంపించారు. తర్వాత న్యాయం కోసం నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే పోలీసులను నా ఇంటి మీదకు పంపారు. రిట్ పిటిషన్ విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించారు. ఏసీపీ ఉమామహేశ్వరావు ఒత్తిడి తట్టుకోలేక నేను నా రిట్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నా..’ అని శరణ్ చౌదరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్న రాజ కీయ పరిణామాలను అడ్డుపెట్టుకుని లబ్ధి పొందడానికే వడ్డేపల్లి శరణ్ చౌదరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శరణ్ చౌదరి, ప్రవాస భారతీయుడు విజయ్‌కు నడుమ జరిగిన వ్యాపార, రియల్ ఎస్టేట్ లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేద న్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడారు. -
తాగి చనిపోతే పరిహారం ఇవ్వాలా?: సీఎం నితీశ్
పాట్నా: బిహార్ సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 60కి పెరిగింది. ఈ విషయంపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. కల్తీ మద్యం తాగి చనిపోయిన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం నితీశ్ కుమార్ తేల్చిచెప్పారు. అలాంటి వారిపట్ల సానుభూతి చూపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మద్యం తాగితే చనిపోతారని, తాగాలని ప్రోత్సాహించే వారు మీకు ఎలాంటి మేలు చేయరని సీఎం సభలో అన్నారు. #WATCH | "No compensation will be given to people who died after drinking...We have been appealing- if you drink, you will die...those who talk in favour of drinking will not bring any good to you...", said CM Nitish Kumar in assembly earlier today. (Source: Bihar Assembly) pic.twitter.com/zquukNtRIA — ANI (@ANI) December 16, 2022 అయితే నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిహార్‌లో కల్తీ మద్యం కారణంగా పదుల సంఖ్యలో చనిపోతున్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం 2016 నుంచి అమలు అవుతున్నప్పటికీ.. అక్రమంగా కొందరు సారా విక్రయిస్తున్నారు. ఇది తాగి అమాయకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం తాగితే చస్తారని సీఎం వ్యాఖ్యానించారు. చదవండి: షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి.. -
స్వతంత్ర భారత్ తొలి ఓటర్ కన్నుమూత..
-
బిహార్‌లో కల్తీ మద్యం కలకలం.. 11మంది మృతి
పాట్నా: కల్తీ మద్యం తాగి 11 మంది చనిపోగా 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో చాలా మంది కంటిచూపు కూడా పోగొట్టుకున్నారు. ఈ ఘటన బిహార్‌లోని సరన్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి కారకులను గుర్తించేందుకు మకేర్, మర్హౌరా, భెల్డి పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు దాడులు జరుపుతున్నారు. కల్తీ సారాను తయారీ, విక్రయించినందుకు ఇప్పటి వరకు అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సంతోష్ కుమార్ తెలిపారు. కల్తీ సారా తాగి ఇద్దరు మరణించినట్లు మరికొంతమంది అనారోగ్యానికి గురైనట్లు గురువారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందిందని జిల్లా కలెక్టర్ రాజేష్ మీనా తెలిపారు. మకేర్ర్ పోలీసు స్టేషన్ పరిధిలో కల్తీసారా బాధితుల ఘటనలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. బాధితులంతా ఈ నెల 3న శ్రావణమాస పండుగ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం మత్తు పదార్థాలను సేవించినట్లు తేలిందని అధికారులు తెలిపారు. చదవండి: ప్రియాంక గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. వీడియో దృశ్యాలు.. పోలీసులు, ఎక్సైజ్, వైద్యాధికారుల బృంధం ఘటన స్థలానికి చేరుకొని బాధితులను సదర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని పాట్నాలోని పిఎంసిహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తొమ్మిది మంది, ప్రైవేట్ ఆసుపత్రిలో ఒకరు మరణించారు. అంతేగాక అధికారులకీ విషయం తెలియక ముందే ఒకరిని దహనం చేశారని తెలిపారు. మరో 12 మంది పన్నెండు మంది ఇంకా చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు కల్తీ మద్యం విక్రయాన్ని ముందుగా గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు స్థానిక పోలీస్టేషన్ ఎస్హెచ్ఓను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా నితీష్ కుమార్ ప్రభుత్వం 2016లో బిహార్‌లో మద్యం నిషేధించింది. అయితే 2021 నవంబర్ నుంచి జరుగుతున్న కల్తీ మద్యం ఘటనల్లో 50 మందికి పైగా చనిపోయారు. -
మార్చి 16న ‘కిర్రాక్ పార్టీ’
నిఖిల్ హీరోగా తెరెకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కిర్రాక్ పార్టీ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 16 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. నిఖిల్ స్టైలిష్ మ్యాచో లుక్స్ చిత్రంపై అంచనాలను మరింత పెంచేసాయి. కన్నడ సినిమా కిరిక్ పార్టీకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమా నిఖిల్‌కు మరో హిట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. కిర్రాక్ పార్టీ సినిమాతో శరన్ కొప్పిశెట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిఖిల్ తో ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ వంటి హిట్ చిత్రాలు తీసిన దర్శకులు సుధీర్ వర్మ, చందూ మొండేటి ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీన్జ నిఖిల్ సరసన హీరోయిన్ లు గా నటిస్తుండగా రామబ్రహ్మం సుంకర, కిషోర్ గరికిపాటి, అజయ్ సుంకర, అభిషేక్ అగ్రవాల్ నిర్మాతలుగా ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏటివి బ్యానర్ ల పై నిర్మిస్తున్న కిర్రాక్ పార్టీ మార్చ్ 16 న ప్రపంచ వ్యాప్తంగా భారీ గా విడుదల కానుంది. -
రైజర్... విన్నర్
► ఐపీఎల్లో హైదరాబాద్ తొలి విజయం కెప్టెన్ వార్నర్ సూపర్ ఇన్నింగ్స్ ► రాణించిన బౌలర్లు 7 వికెట్లతో ముంబై ఇండియన్స్ చిత్తు రెండు రోజుల క్రితం ఇదే మైదానంలో 142 పరుగులు చేసిన సన్‌రైజర్స్ ఓటమిని ఆహ్వానించింది. ఇప్పుడు సరిగ్గా అదే స్కోరును ఛేదించి లీగ్‌లో బోణీ చేసింది. ముందుగా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన హైదరాబాద్‌కు ఆ తర్వాత కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ మెరుపులు కీలక విజయాన్ని అందించాయి. రెండు పరాజయాల తర్వాత దక్కిన విజయం రైజర్స్‌లో ఆనందం నింపింది. పేరుకు పెద్ద హిట్టర్లే ఉన్నా... బ్యాటింగ్‌లో తడబడిన ముంబై ఇండియన్స్ మూల్యం చెల్లించుకుంది. రాయుడు, కృనాల్ భాగస్వామ్యం మినహా ఇతర ఆటగాళ్లు విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. భారీ స్కోరు చేయడంలో విఫలమై ఆ జట్టు మూడో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-9లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ చేసింది. సోమవారం ఇక్కడ ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అన్ని రంగాల్లో సమష్టిగా రాణించి ముంబై ఇండియన్స్‌ను 7 వికెట్లతో చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అంబటి రాయుడు (49 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. అనంతరం హైదరాబాద్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (59 బంతుల్లో 90 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. 15 బంతులు ఉండగానే సన్‌కు విజయం దక్కడం విశేషం. 63 పరుగుల భాగస్వామ్యం: ఐపీఎల్ కెరీర్ ఆరంభం గప్టిల్ (2)కు కలిసి రాలేదు. లీగ్‌లో తన తొలి మ్యాచ్ ఆడుతున్న అతను, భువీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత శరణ్ చక్కటి బంతులతో పార్థివ్ (10), బట్లర్ (11)లను అవుట్ చేశాడు. అంతకుముందు నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రోహిత్ (5) కూడా అనవసర సింగిల్‌కు ప్రయత్నించి వెనక్కి రాలేక రనౌటయ్యాడు. తక్కువ వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై ఆ సమయానికి 60 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో రాయుడు, కృనాల్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రాయుడు చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడగా, గత మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్న కృనాల్ మరోసారి చెలరేగాడు. ముందుగా నెమ్మదిగా ఆడిన వీరిద్దరు ఆ తర్వాత ధాటిని ప్రదర్శించారు. సన్ ఫీల్డింగ్ వైఫల్యాల వల్ల కూడా చకచకా పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 43 బంతుల్లో రాయుడు అర్ధసెంచరీ పూర్తయింది. ఈ జోడి ఐదో వికెట్‌కు 39 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు. ఆ తర్వాత రాయుడుతో పాటు హార్దిక్ (2) కూడా అవుటైనా కృనాల్ చివరి వరకు నిలబడ్డాడు. తొలి 10 ఓవర్లలో 58 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్, తర్వాతి 10 ఓవర్లలో 84 పరుగులు చేసింది. వార్నర్ ఒక్కడే: ఎప్పటిలాగే ధావన్ (2) వైఫల్యంతో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. సౌతీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో బంతికే అతను వెనుదిరిగాడు. అయితే రెండో ఓవర్లోనే కెప్టెన్ వార్నర్ ఫోర్, సిక్స్ బాది దూకుడును మొదలు పెట్టాడు. మరో ఎండ్‌లో హర్భజన్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన హెన్రిక్స్ (22 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) కొద్దిసేపు వార్నర్‌కు అండగా నిలిచాడు. 10 ఓవర్లలో రైజర్స్ స్కోరు 66 పరుగులకు చేరిన తర్వాత సౌతీ చక్కటి బంతితో హెన్రిక్స్‌ను అవుట్ చేయగా... ఆ తర్వాత మోర్గాన్ (11) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. హార్దిక్ పాండ్యా అద్భుత క్యాచ్ అతని ఇన్నింగ్స్‌కు ముగింపు పలికింది. మరో వైపు భారీ షాట్లతో తన జోరు కొనసాగించిన వార్నర్ 42 బంతుల్లో ఈ సీజన్లో రెండో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరింత దూకుడు ప్రదర్శించిన అతను కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. చివర్లో దీపక్ హుడా (9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు) అండతో అతను మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) ఓజా (బి) భువనేశ్వర్ 2; పార్థివ్ (బి) శరణ్ 10; రాయుడు (సి) హెన్రిక్స్ (బి) శరణ్ 54; రోహిత్ (రనౌట్) 5; బట్లర్ (సి) నమన్ ఓజా (బి) శరణ్ 11; కృనాల్ (నాటౌట్) 49; హార్దిక్ (బి) ముస్తఫిజుర్ 2; హర్భజన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-2; 2-23; 3-43; 4-60; 5-123; 6-135.; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-17-1; శరణ్ 4-0-28-3; హెన్రిక్స్ 4-0-23-0; ముస్తఫిజుర్ 4-0-32-1; బిపుల్ శర్మ 4-0-40-0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (నాటౌట్) 90; ధావన్ (బి) సౌతీ 2; హెన్రిక్స్ (సి) పార్థివ్ (బి) సౌతీ 20; మోర్గాన్ (సి) హార్దిక్ (బి) సౌతీ 11; దీపక్ హుడా (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1-4; 2-66; 3-100.; బౌలింగ్: సౌతీ 4-0-24-3; మెక్లీన్గన్ 3.3-0-33-0; జస్ప్రీత్ బుమ్రా 3-0-19-0; హర్భజన్ సింగ్ 4-0-38-0; హార్దిక్ పాండ్యా 3-0-29-0.