సీఎం, డీజీపీలకు వ్యాపారి శరణ్ చౌదరి ఈ–మెయిల్
ఎర్రబెల్లి ఆదేశాలతో పోలీసులు తన ఇంటిని ఆయన బంధువుల పేరిట రాయించారని ఆరోపణ
బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి శరణ్ చౌదరి చేసిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ–మెయిల్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ రవి గుప్తాలకు అందిన ఈ ఫిర్యాదులోని అంశాలపై పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు.
ఎర్రబెల్లి ఆదేశాలతో పోలీసు అధికారులు తనను బెదిరించి, తన పేరిట ఉన్న ఇంటిని బలవంతంగా ఆయన బంధువుల పేరిట రాయించారని శరణ్ చౌదరి ఆరో పించారు. ఓ వైపు ఎస్‌ఐబీ అధికారుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బయటకు వస్తుండగా, మరోవైపు ఆ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై శరణ్ చౌదరి ఫిర్యాదు చేయ డం కలకలం సృష్టిస్తోంది. ఇంటిని రాయించుకోవ డంతో పాటు బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేశారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు.
బూటు కాళ్లతో తన్నారు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు.. దయాకర్‌రావు ఆదేశాలతో తనను బూటు కాళ్లతో తన్ని, పలుమార్లు చెంపదెబ్బలు కొడుతూ హింసించినట్టు కూడా శరణ్ చౌదరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘2023 ఆగస్టు 21న నేను నా కార్యాలయానికి వెళుతుండగా ప్రైవేటు కారులో సివిల్ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు బలవంతంగా సీసీఎస్ ఆఫీస్‌కు తీసుకెళ్లారు. నా కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఎర్రబెల్లి దయాకర్‌రావు బంధువు విజయ్ పేరిట నా ఇంటిని రిజిస్టర్ చేయాలని అప్పటి హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వ రరావు బలవంతపెట్టారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నన్ను బూటు కాళ్లతో తన్నారు. రెండురోజులు అక్రమంగా నన్ను వారి కస్టడీలో పెట్టుకున్నారు. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులను డబ్బుల కోసం ఒత్తిడి చేశారు. అప్పుడు నా స్నేహితుడు రూ.50 లక్షలు పంపాడు.
చివరకు నా ఇంటిని విజయ్ పేరిట రాసేందుకు అంగీకరించిన తర్వాత నన్ను బయటకు పంపించారు. తర్వాత న్యాయం కోసం నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే పోలీసులను నా ఇంటి మీదకు పంపారు. రిట్ పిటిషన్ విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించారు. ఏసీపీ ఉమామహేశ్వరావు ఒత్తిడి తట్టుకోలేక నేను నా రిట్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నా..’ అని శరణ్ చౌదరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
రాష్ట్రంలో జరుగుతున్న రాజ కీయ పరిణామాలను అడ్డుపెట్టుకుని లబ్ధి పొందడానికే వడ్డేపల్లి శరణ్ చౌదరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శరణ్ చౌదరి, ప్రవాస భారతీయుడు విజయ్‌కు నడుమ జరిగిన వ్యాపార, రియల్ ఎస్టేట్ లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేద న్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment