తిరువనంతపురం: 'తగలబడుతున్న త్రివర్ణ పతాకం, ఆ వెంటనే పాకిస్థాన్ అనుకూల నినాదాలు..' ఇదీ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేరళ ప్రభుత్వ వెబ్ సైట్ లోకి వెళ్లిన వారికి కనిపించిన దృశ్యాలు! పలువురి ఫిర్యాదుతో వెంటనే తేరుకున్న ప్రభుత్వాధికారులు రాత్రికిరాత్రే నిపుణులను రప్పించి వైబ్ సైట్ ను పునరుద్ధరించారు. అసలేం జరిగిందనే విషయాన్ని ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఆదివారం ఉదయం ప్రకటించారు.
'కేరళ ప్రభుత్వ వెబ్ సైట్ (www.keralagov.in) శనివారం అర్ధరాత్రి తర్వాత హ్యాకింగ్ కు గురైంది. పాకిస్థాన్ కు చెందిన హ్యాకర్లే ఈ దురాగతానికి ఒడిగట్టిఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చాం. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవెలప్ మెంట్ ఆఫ్ ఇమేజింగ్ టెక్నాలజీ వారు సైట్ ను పునరుద్ధరించారు' అని కేరళ సీఎం చాందీ తెలిపారు. దీనిని తీవ్రమైన చర్యగా భావిస్తున్నట్లు, వెంటనే విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.
కేరళ ప్రభుత్వ వెబ్సైట్పై పాక్ హ్యాకర్ల దాడి
Published Sun, Sep 27 2015 12:48 PM | Last Updated on Sat, Mar 23 2019 8:37 PM
Advertisement