kerala government
-
‘కలెక్టర్ బ్రో’ సహా ఇద్దరు ఐఏఎస్‌ల సస్పెన్షన్
తిరువనంతపురం: కేరళలో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై వేటుపండింది. క్రమశిక్షణ ఉల్లంఘన కారణంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం సోమవారం ఇద్దరు ఐఏఎస్ అధికారులు కె గోపాలకృష్ణన్, ఎన్ ప్రశాంత్‌లను సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మత ఆధారిత ప్రభుత్వ అధికారుల వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసినందుకు ఐఏఎస్ గోపాలకృష్ణను సస్పెండ్ చేయగా, సోషల్ మీడియాలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని విమర్శించినందుకు ఐఏఎస్ ప్రశాంత్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌కు ‘‘కలెక్టర్ బ్రో’’గా సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంది. అయితే.. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. తన మొబైల్ ఫోన్‌ను గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని ఐఏఎస్ అధికారి కె. గోపాల్‌కృష్ణన్ అన్నారు. తన అనుమతి లేకుండా మతపరమైన వాట్సాప్ గ్రూపులను సృష్టించారని ఐఏఎస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఐఏఎస్ అధికారి వాదనలను పోలీసు దర్యాప్తు అధికారి తోసిపుచ్చారు. ఆయన ఫోన్ హ్యాక్ చేయబడిందని తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ పరీక్ష కోసం పరికరాన్ని సమర్పించే ముందు గోపాలకృష్ణన్ మొబైల్ ఫోన్‌ను చాలాసార్లు రీసెట్ చేసినట్లు పోలీసులు వెల్లడించినట్లు తెలిపారు. -
ఆరోపణలు నిజమైతే ఐదేళ్లు బహిష్కరణ
నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమా కమిటీ ప్రభావం ఇతర ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది. దీంతో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం చెన్నైలోని ఆ సంఘం నిర్వాహకుల సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. ఇందులో ముఖ్యంగా విశాఖ కమిటీ సూచనల మేరకు నటీమణుల రక్షణ కోసం ఎస్ఐఏఏ–జీఎస్ఐసీసీ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. దీనికి నటి రోహిణి అధ్యక్షురాలిగానూ, నటీమణులు సుహాసిని, ఖుష్బూ సభ్యులుగానూ వ్యవహరిస్తారు. ఈ కమిటీకి ఒక న్యాయవాదిని నియమించనున్నారు. నటీమణులపై లైంగిక వేధింపులు రుజువైతే అందుకు కారణమైన వారిని సినిమాల నుంచి 5 ఏళ్లు బహిష్కరించాలని నిర్మాతల మండలికి సిఫారసు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా బాధిత నటీమణులకు చట్టపరంగా సహాయాలను అందించడం జరుగుతుందన్నారు. అలాగే బాధితుల ఫిర్యాదుల కోసం ఇప్పటికే ఫోన్ నంబర్ ఏర్పాటు చేశామనీ, తాజాగా ఈమెయిల్ ద్వారానూ ఫిర్యాదులు చేయవచ్చనీ తీర్మానం చేశారు. కాగా యూట్యూబ్ ఛానల్స్ కారణంగా బాధితులైనవారు సైబర్ ΄ోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ కమిటీ వారికి సహకరిస్తుందని, కమిటీ చర్యలను నటీనటుల సంఘం పర్యవేక్షిస్తుందని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ఉ΄ాద్యక్షుడు పూచి మురుగన్, కోశాధికారి కార్తీ ΄ాల్గొన్నారు. -
బయటపడ్డ బహిరంగ రహస్యం
ప్రపంచమంతా మలయాళ సినిమాలను పొగుడుతూ, తాజా జాతీయ అవార్డుల్లోనూ దేశమంతటిలోకీ ఉత్తమ సినిమాగా మలయాళ చిత్రమే నిలిచిన పరిస్థితుల్లో... ఆ పరిశ్రమలో పైకి కనిపిస్తున్న మంచితో పాటు కనిపించని దుర్లక్షణాలూ అనేకం ఉన్నాయని బహిర్గతమైంది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై కేరళ ప్రభుత్వం 2017 జూలైలో వేసిన హేమ కమిటీ నివేదిక బయటకు రావడంతో తేనెతుట్టె కదిలింది. నాలుగేళ్ళ పైచిలుకుగా కేరళ ప్రభుత్వం గుట్టుగానే అట్టి పెట్టిన ఈ నివేదిక న్యాయస్థానంలో, రాష్ట్ర సమాచార కమిషన్‌లో అనేక పోరాటాల అనంతరం సోమవారం బాహ్యప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. సున్నిత సమాచారం, వ్యక్తుల వివరాల పేజీలను మినహాయించి బయటకొచ్చిన మిగతా నివేదిక అంశాలపై దేశవ్యాప్త చర్చ రేగుతోంది. ఏడెనిమిదేళ్ళ క్రితమే అంతర్జాతీయంగా ‘మీ టూ’ ఉద్యమం, ఆపైన భారత సినీరంగంలోనూ ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదాలు, ఆడవాళ్ళు పని కావాలంటే లైంగిక లబ్ధి కలిగించేలా ‘కమిట్మెంట్’ ఇచ్చి, ‘కాంప్రమైజ్’ కావాల్సి వస్తోందనే ఆరోపణలు చూశాం. అయినా సరే... మలయాళ నటులు, పరిశ్రమ నిపుణుల్ని పలువురిని ఇంటర్వ్యూ చేసి హేమ కమిటీ వెల్లడించిన అంశాలు నివ్వెర పరుస్తున్నాయి. సెట్లో స్త్రీలపై లైంగిక వేధింపులు, తాగివచ్చి వారు బస చేసిన గది తలుపులు కొట్టడాలు, 10–15 మంది శక్తిమంతమైన లాబీ గుప్పెట్లో మలయాళ చిత్రసీమ లాంటి సంగతులను కమిటీ కుండబద్దలు కొట్టింది. కోల్‌కతాలో విధినిర్వహణలో డాక్టర్‌పై హత్యాచార ఘటనతో అట్టుడుకుతున్న దేశంలో సినీరంగ స్త్రీల పరిస్థితీ ఏమంత భిన్నంగా లేదని తేలిపోయింది.అత్యంత సంచలన అంశాలేమీ బయటపెట్టకుండా కమిటీ పెద్దమనిషి తరహాలో నివేదికను ఇచ్చిందనే అధిక్షేపణలూ లేకపోలేదు. ఆ మాటెలా ఉన్నా పరిశ్రమలోని అవాంఛనీయ ధోరణుల్ని బయటపెట్టి, ప్రజాక్షేత్రంలో వాటిపై చర్చ లేవనెత్తడంలో విజయం సాధించింది. స్టెనోగ్రాఫర్ కానీ, కనీస ఇతర సౌకర్యాలు కానీ లేకున్నా సరే, అనేక అవరోధాలను అధిగమించి మరీ ఈ కమిటీ 233 పేజీల నివేదిక సిద్ధం చేసింది. నివేదికలో బలాబలాలు ఏమైనప్పటికీ, సినీసీమలోని చీకటి కోణంపై దర్యాప్తు జరిపి ఇలాంటి నివేదిక ఒకటి వెలువడడం దేశంలో ఇదే తొలిసారి. నిజానికి, అనివార్య పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఈ సంఘాన్ని వేయాల్సి వచ్చింది. ఓ ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి, హీరో దిలీప్ కదులుతున్న కారులో జరిపిన లైంగిక అత్యాచారంతో 2017 ఫిబ్రవరిలో మలయాళ చిత్రసీమ అట్టుడికింది. రాష్ట్రమంతా నిరసనలు, ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ బృందం డిమాండ్ల మేరకు కేరళ సర్కార్ రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి కె. హేమ సారథ్యంలో త్రిసభ్య సంఘం వేయక తప్పలేదు. తెలుగు టి శారద కూడా అందులో మెంబరే! ఆ కమిటీ 2019 డిసెంబర్ 31కే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఉద్యమకారులు పదే పదే అభ్యర్థించినా, సినిమావాళ్ళ ప్రైవసీకి భంగమంటూ సర్కార్ ఇన్నేళ్ళుగా ఆ నివేదికను తొక్కిపెట్టింది. అదేమంటే, అది న్యాయవిచారణ సంఘం కాదు గనక నివేదిక బయటపెట్టాల్సిన బాధ్యత లేదు పొమ్మంది. నివేదిక విడుదలను ఆపాలన్న ఓ నటి అభ్యర్థనను సైతం హైకోర్ట్ తాజాగా తోసిపుచ్చడంతో... చివరకు నివేదిక బహిర్గతమైంది. తళుకుబెళుకుల సినీరంగానికి అంచున... సహజంగానే అనేక బలహీనతల నీలి నీడలు పరుచుకొని ఉంటాయని ప్రపంచానికి తెలుసు. అది ఒక్క మలయాళ సినీసీమకే పరిమితం కాదు. అందం, ఆనందం, ఆర్థిక ప్రయోజనం, పదుగురిలో పాపులారిటీ, పలుకుబడి పోగుబడినందున అన్ని భాషల సినీ రంగాల్లోనూ ఉన్నదే! కాకపోతే, తొందరపడి ఎవరూ బాహాటంగా ప్రస్తావించని చేదు నిజమది. లైంగిక వేధింపులు సహా ఆవేదన కలిగించే అనుభవాలు అనేకమున్నా, ఆడవాళ్ళు ఆ మాట బయటకు చెప్పరు. చెబితే పరిశ్రమలో అప్రకటిత నిషేధం సహా ఇంకా అనేక ఇతర వేధింపులు తప్పని దుఃస్థితి. ఆది నుంచి ఈ రుగ్మతలు ఉన్నవే. ‘సినీరంగంలో స్త్రీలు నిత్యం ఎదుర్కొంటున్న భూతం లైంగిక వేధింపులు’ అని కమిటీ తెగేసి చెప్పడంతో మేడిపండు పగిలింది. మన యావత్ భారతీయ సినీ రంగానికి ఇది ఒక మేలుకొలుపు. అన్ని భాషల్లోనూ కలల వ్యాపారంలో కొనసాగుతున్న పితృస్వామ్య భావజాలం, లైంగిక దుర్విచక్షణ, వేతన వ్యత్యాసాలు సహా అనేక అవలక్షణాలపై మనకు చెంపపెట్టు. చిత్రం ఏమిటంటే, ప్రైవేట్ పరిశ్రమల్లో పని పరిస్థితులకు సైతం ప్రభుత్వ షరతులు, చట్టాలు వర్తిస్తాయి. ఎప్పుడో సినీరంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించినట్టు కేంద్ర సర్కార్ ప్రకటించినా దాని వల్ల ఒనగూడిన ప్రయోజనాలేవో అర్థం కాదు. కళ, వ్యాపారపు కల కలగలిసిన సృజనశీల పరిశ్రమకు చట్టాలు చేయడం అంత సులభం కాకపోవచ్చు. కానీ, మగవారితో సమానంగా ఆడవారికి వేతనం మాట దేవుడెరుగు... మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకొనే మరుగు స్థలాల లాంటి కనీస వసతులైనా కల్పించలేమా? సమ్మతితో పని లేకుండా ఆడవారితో ఎలాగైనా ప్రవర్తించవచ్చని భావిస్తున్న పని ప్రదేశంలో తగినంత బాధ్యత, భద్రత పెంపొందించేలా చేయలేమా? సమాజంగా మనం, సర్కారుగా పాలకులు సినీ పరిశ్రమపై ఆలోచించాల్సిన ఇలాంటి అంశాలు అనేకం. ఎప్పటి నుంచో ప్రత్యేక సినిమా విధానం తెస్తామని ఊరిస్తున్న కేరళ సర్కార్ సినీసీమలో వేతన ఒప్పందాలు, భద్రత అమలుకు సంబంధించి హేమ కమిటీ సిఫార్సులపై ఇకనైనా దృష్టి పెట్టాలి. పనిచేయడానికి ఒకమ్మాయి ఇంటి గడప దాటి వచ్చిందంటే సర్వం సమర్పించడానికి సిద్ధమైనట్టేనని చూసే పురుషాహంకార దృష్టి ఇకనైనా మారాలి. అన్ని పనిప్రదేశాల లానే సినీ రంగంలోనూ స్త్రీలకు సురక్షితమైన, భద్రమైన వాతావరణం కల్పించడం అంతర్జాతీయ స్థాయికి ఎదిగామని భుజాలు ఎగరేస్తున్న మన సినీ పరిశ్రమ కనీస బాధ్యత. -
ఈ పాఠాలు అవసరం
‘అ’ అంటే ‘అమ్మ’.. ‘ఆ’ అంటే ‘ఆవు’ పాఠాలు కాదు కావలసినవి. అమ్మకు సాయం చేసే ఇంటి సభ్యుల పాఠాలే కావాలని కేరళ ప్రభుత్వం పాఠ్యాంశాలను ప్రవేశపెట్టింది. అమ్మ వంట చేస్తుంటే నాన్న ఆఫీసుకు వెళ్లే చిత్రాలతో ఉండే గత పాఠాలకు బదులు అమ్మకు వంటలో సాయం చేసే నాన్నలను ప్రవేశ పెట్టింది. ఆడపిల్లలను ఒక విధంగా, మగ పిల్లలను ఒక విధంగా కాకుండా అందరూ అన్ని పనుల్లో సమానమే అని చెప్పే పాఠాలు ఇప్పుడు అవసరం.అంకుర స్థాయిలో విద్యాబోధన వేసే ప్రభావాలు చాలా గట్టివి. గతంలో ఇవి తెలియకుండా లింగ వివక్షను ప్రతిపాదించేవి. లేదా పరిమితులను నిర్థారించేవి. లేదా ఎవరి పనులు ఏమిటో, ఎవరి స్థాయి ఏమిటో స్టీరియోటైప్ చేస్తూ ముద్ర వేసేవి. టెక్ట్స్‌బుక్స్‌లో ఎప్పుడూ అమ్మ ఎప్పుడూ వంట చేస్తూ. అక్కకు జడ వేస్తూ. ముగ్గు వేస్తూ, ΄÷లం గట్ల మీద నాన్నకు క్యారేజీ తీసుకువెళుతూ, రోలు దంచుతూ, వెన్న చిలుకుతూ కనిపించేది.నాన్న పడక్కుర్చీలో పేపర్ చదువుతూ ఉంటాడు. లేదా ఆఫీసుకు వెళుతూ లేదా ఆఫీస్‌లో పని చేస్తూ కనిపిస్తాడు. అంటే అబ్బాయిలు ఉద్యోగాలకి, అమ్మాయిలు ఇంటి పనికి పరిమితం కావాలని తెలియకనే మనసుల్లోకి ఎక్కేది. ఇప్పటికీ ఇలాంటి పాఠాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. కాని కేరళ రాష్ట్రం ఈ పద్ధతిని వదిలి ‘జెండర్ న్యూట్రల్’ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టింది.ముందే నేర్పించండి‘టీచ్ దెమ్ అర్లీ’ అని కేరళ ప్రభుత్వం కొత్త ధోరణిని ఎంచుకుంది. చిన్న వయసులోనే స్త్రీ, పురుష అస్తిత్వాల మధ్య వివక్షను చెరిపేసే పాఠాలు చె΄్పాలని నిర్దేశించింది. మూడవ తరగతి మలయాళం, ఇంగ్లిష్ టెక్ట్స్బుక్కుల్లో ఇంటి పనుల పాఠం ఉంది. మూడవ తరగతి టెక్ట్స్బుక్లో కొబ్బరి తురుము తీస్తున్న నాన్న వంటగదిలో కనిపిస్తే ఇంగ్లిష్ టెక్స్›్టబుక్‌లో పాపకు ఇష్టమైన చిరుతిండిని సిద్ధం చేస్తున్న తండ్రి కనిపిస్తాడు.ఈ పాఠాలను ప్రస్తుతం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్వాగతిస్తున్నారు. ‘అయితే పాఠాల కంటే ముందు లింగ వివక్ష విషయంలో ఉపాధ్యాయులకు కూడా దృష్టి కోణంలో మార్పు తేవాలనే అవగాహనతో వేసవి సెలవుల్లో శిక్షణా తరగతులు నిర్వహించాం’ అని తెలిపాడు కేరళ ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్ జయప్రకాష్. ఇది మాత్రమే కాదు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అన్ని రకాల జెండర్ల, వారి జీవన హక్కుల గురించి అవగాహన కలిగించే పాఠాలను కాలక్రమంలో స్కూల్ టెక్ట్స్‌బుక్కులు చేరుస్తామని కేరళ విద్యాశాఖ తెలిపింది.ఐదవ తరగతి లోపు 200 రోజులుఈ విద్యా సంవత్సరం కేరళ విద్యాశాఖ తీసుకున్న మరో కీలక నిర్ణయం 1 నుంచి 5 వ తరగతి లోపు పిల్లలకు 200 పని దినాలు చాలని నిబంధన విధించడం. ప్రాథమిక విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 5వ తరగతి లోపు పిల్లలకు 200 పని దినాల్లో 800 గంటల చదువు చాలు. అంతకు మించి చదివించడం వల్ల ఏం ప్రయోజనం ఉండటం లేదని ఉపాధ్యాయ సంఘం చేసిన సూచన మేరకు అక్కడి విద్యాశాఖ కొత్త నియమాన్ని అమలులోకి తెచ్చింది.దీని వల్ల అన్ని స్కూళ్లు ఐదవ తరగతి లోపు పిల్లలకు వారానికి ఐదు రోజులే పని చేస్తాయి. ఉపాధ్యాయ సంఘం మరో సూచన కూడా చేసింది. బడి గంటలు పెంచి హైస్కూల్ తరగతులకు కూడా 200 రోజుల పని దినాలు చేయాలని. హైస్కూల్ సిలబస్‌లు పూర్తి కావాలంటే సంవత్సరంలో 1000 గంటలు పాఠాలు సాగాలని అందుకు వారానికి ఐదు రోజులు ఎక్కువ పీరియడ్లు చెప్పి శని, ఆదివారాలు సెలవు ఇవ్వొచ్చని సంఘం సూచించింది. దీనికి విద్యాశాఖ అనుమతించలేదు గాని పరిశీలనకు తీసుకుంది. -
2 నిమిషాల్లోనే ప్రసంగం ముగిసింది
తిరువనంతపురం: కేరళలోని వామపక్ష ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. గురువారం కేరళ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయం ప్రకారం ప్రభుత్వ విధివిధానాలను వివరించాల్సిన గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రసంగ పాఠంలోని చివరి పేరాను మాత్రమే చదివి కేవలం రెండు నిమిషాల్లోనే ప్రసంగం ముగించారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ 9.02 గంటలకల్లా ప్రసంగం ముగించారు. 9.04 గంటలకు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. కొన్ని బిల్లుల పెండింగ్, యూనివర్సిటీల నిర్వహణకు సంబంధించిన అంశాలపై గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
కేరళ ప్రభుత్వంపై అయ్యప్ప భక్తుల ఆగ్రహం
-
దేవుని కొలువులోనూ అదే నిర్లక్ష్యమా ?
-
రెండేళ్లుగా ఏం చేస్తున్నారు?.. గవర్నర్‌పై సుప్రీంకోర్టు అసహనం
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను రెండేళ్లుగా గవర్నర్ తనవద్దనే నిలిపి ఉంచడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.రాష్ట్రపతి సమ్మతి కోసం గవర్నర్లు ఎప్పుడు బిల్లులను పంపించాలనే అంశంపై మార్గదర్శకాలను రూపొందించే విషమాన్ని పరిశీలించనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులను ఆమోదించడంలో విపరీతమైన జాప్యం జరుగుతుందంటూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. రెండు సంవత్సరాలుగా బిల్లును ఎందుకు తొక్కిపెట్టారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. బిల్లులను గత రెండేళ్లుగా గవర్నర్ ఎందుకు తొక్కి పెట్టారని ప్రశ్నించింది. అంతకుముందు గవర్నర్ కార్యాలయం తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి.. మొతం 8 బిల్లుల్లో ఏడింటిని గవర్నర్ రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్‌లో ఉంచారని, మరో బిల్లుకు గవర్నర్ మహమ్మద్ ఖాన్ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నోట్ చేసుకున్న సీజేఐ.. గత రెండేళ్లుగా బిల్లులను గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి అటార్నీ జనరల్ బదులిస్తూ.. అనే సందేహాలను లేవనెత్తే ఆ వివరాల్లోకి వెళ్లదలచుకోలేదని తెలిపారు. అయితే ప్రజలకు, రాజ్యాంగానికి జవాబుదారీ అయిన తమకు ఆ వివరాలు అవసరమనని జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్న ధర్మాసనం స్పష్టం చేసింది. కేరళ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ జోక్యం చేసుకుంటూ.. రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లులను ఎప్పుడూ పంపించాలనే విషయంలోనూ మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కోరారు. చదవండి: ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే.. రాష్ట్రంలో పాలనను నిలిపివేసేలా గవర్నర్లు బిల్లులను తొక్కిపెట్టడాన్ని అనుమతించకూడదని తెలిపారు. అసెంబ్లీతో కలిసి పని చేయకుండా గవర్నర్ ప్రత్యర్థిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గడువులోగా ఆమోదం తెలిపేందుకు లేదా తిరస్కరించేందుకు రాష్ట్ర గవర్నర్లకు మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ చేసిన అభ్యర్థనను సవరించేందుకు కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. విచారణను ఇక్కడితో ముగిద్దామనున్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. విచారణను పెండింగ్‌లో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇదో సజీవ సమస్యగా పేర్కొంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గవర్నర్‌కు పలు కీలక సూచనలు చేసింది. బిల్లుపై సందేహాలు ఉంటే ముఖ్యమంత్రి పినరయి విజయన్, సంబంధిత మంత్రితో గవర్నర్ చర్చిస్తారని భావిస్తున్నట్లు తెలిపింది. రాజకీయ వివేకంతో నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అలా జరగని పక్షంలో రాజ్యాంగం అప్పగించిన విధులను నిర్వర్తించడానికి చట్టబద్దమైన విధానాల ఖరారుకు తాము సిద్దంగా ఉంటామని పేర్కొంది. -
నిందితుడి సమాచారం లీక్.. కేరళ సీనియర్ ఐపీఎస్ అధికారి సస్పెండ్
కేరళ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ విజయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది .కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో నిందితుడి అరెస్ట్, తరలింపు సమాచారం లీక్ చేసిన ఆరోపణలపై విజయన్‌పై కేరళ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కాగా విజయన్ గతంలో కేరళ ఏటీఎస్ యూనిట్ హెడ్‌గా పనిచేశారు. నిందితుడి తరలింపుకు సంబంధించిన సమాచారం లీక్ కావడం తీవ్రమైన భద్రతా వైఫల్యమని పేర్కొంటూ లా అండ్ ఆర్డర్ అడిషినల్ డీజీపీ అజిత్ కుమార్ అందించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఈ రిపోర్టులో నిందితుడు షారుక్ సైఫీని మహారాష్ట్రలోని రత్నగిరి నుంచి కేరళలోని కోజీకోడ్‌కు తరలిస్తున్న సమాచారాన్ని బహిర్గతం చేసినట్లు తేలింది. అదే విధంగా ఈ కేసును దర్యాప్తుచేసిన బృందంలో లేని ఐజీ విజయన్, గ్రేడ్ ఎస్సై మనోజ్ కుమార్ కే.. నిందితులను రోడ్డు మార్గంలో కోజికోడ్‌కు తీసుకెళ్తున్న అధికారులను సంప్రదించినట్లు పేర్కొంది. చదవండి: అమెరికాలో న్యాయ పోరాటం.. భారత్‌కు విజయం.. ‘రాణాను అప్పగించండి’ పోలీసు ఏటీఎస్ విభాగం మరింత జాగ్రత్తగా పనిచేయాలని సూచిస్తూ..ఏడీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దీనిపై సమగ్ర విచారణ అవసరమని సస్పెన్షన్ ఆర్డర్లో పేర్కొంది.ఏడీజీపీ నివేదిక ఆధారంగా దాని అధికారులపై సమగ్ర విచారణ అవసరమని పేర్కొంది.ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు విజయన్ను సర్వీసు నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై ఏడీజీపీ (పోలీస్ హెచ్‌క్యూ) కె పద్మకుమార్ విచారణ జరుపుతారని ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు కోజికోడ్ జిల్లాలోని ఎలత్తూర్ సమీపంలోని కోరాపుళ వంతెన వద్దకు చేరుకోగానే ఓ వ్యక్తి తన తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ చల్లి నిప్పంటించిన విషయం తెలిసిందే. చూస్తుండగానే ఆ మంటలు ఇతర ప్రయాణికులకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. తొమ్మిది మందికి కాలిన గాయాలయ్యాయి. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో రైలు నుంచి కిందకు దూకడంతో ప్రాణాలు కోల్పోయారు. మరణించినవారిలో ఏడాది చిన్నారి సహా మహిళ వ్యక్తి ఉన్నారు. ఏప్రిల్ 2న ఈ ఘటన జరిగింది. దీనిపై విచారణ జరిపేందుకు కేరళ పోలీసులు సిట్ బృందం ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని, ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగిందని సిట్ విచారణలో గుర్తించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత నిందితుడు సైఫ్‌ను రత్నగిరిలో ఏప్రిల్ 5న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రహస్యంగా కేరళకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. మీడియా, ప్రజల దృష్టి పడకుండా రోడ్డు మార్గాన ప్రైవేటు ఎస్‌యూవీలో తరలించారు. అయితే కన్నూరు జిల్లా గుండా వెళ్లుండగా ఉన్నట్టుండి నిందితుడిని తీసుకెళ్తున్న కారు టైర్ పేలడంతో వాహనం రోడ్డు పక్కన నిలిచిపోయింది. ఆ సమయంలో ముగ్గురు అధికారులు మాత్రమే ఉన్నారు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు చేస్తుండగా నిందితుడిని చూసేందుకు స్థానికులు అక్కడ గుమిగూడారు. చదవండి:రూ.10 లక్షలు ఇస్తేనే భార్యతో హనీమూన్.. అశ్లీల వీడియోలు తీసి.. -
గవర్నర్ వైఖరిపై అధికార పార్టీ విస్తృతస్థాయి నిరసన
తిరువనంతపురం: కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వాన్ని బహిరంగంగా తీవ్రంగా తప్పుబట్టే ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌పై క్షేత్రస్థాయి విస్తృత నిరసన కార్యక్రమాలకు ఎల్డీఎఫ్ శ్రేణులు తెరతీశాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గవర్నర్ ఖాన్‌కు వ్యతిరేకంగా కరపత్రాలు పంచిపెట్టాయి. భారత రాజ్యాంగంపై కనీస అవగాహనలేని గవర్నర్ పూర్తిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరఫున పనిచేస్తున్నారని ఆ కరపత్రాల్లో ప్రచురించారు. ఉన్నత విద్య పరిరక్షణకు ఖాన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ సొసైటీ పేరిట ఈ కరపత్రాలు ముద్రితమయ్యాయి. ఈనెల 15వ తేదీన రాజ్‌భవన్ ఎదుట ఏకంగా లక్షమందితో భారీ నిరసన కార్యక్రమానికి ఏర్పాటుచేస్తున్నట్లు ఎల్డీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో సీపీఐ(ఎం) పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమిస్తున్నారని, గుత్తాధిపత్యం రాజ్యమేలుతోందని గవర్నర్ ఖాన్ సోమవారం విమర్శించిన విషయం తెల్సిందే. ఇదీ చదవండి: గవర్నర్‌కు ఇలా చేసే అధికారం ఉందా?.. ఏ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? -
గోల్డ్ కేసులో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది
తిరువనంతపురం/న్యూఢిల్లీ : కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్, ఎల్డీఎఫ్ ప్రభుత్వం మధ్య మరోసారి దుమారం చెలరేగింది. గవర్నర్ ఖాన్ ఈసారి గోల్డ్ స్మగ్లింగ్ వివాదాన్ని లేవనెత్తారు. ముఖ్యమంత్రి విజయన్ రాష్ట్రంలో ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంలో తాను జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గవర్నర్ ఖాన్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, యూనివర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆరోపించిన మర్నాడు గురువారం గవర్నర్ ఖాన్ న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. యూనివర్సిటీల్లో ఆరెస్సెస్ అజెండాపై సీఎం ఒక్క ఉదాహరణ అయినా చూపగలరాని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో ఆరెస్సెస్‌కి చెందిన వారిని నియమించడానికే ప్రస్తుతమున్న వైస్ ఛాన్సలర్లపై చర్యలు తీసుకుంటున్నానని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దానిని రుజువు చేస్తే గవర్నర్ పదవికి తాను రాజీనామా చేస్తానని, అలా రుజువు చెయ్యలేకపోతే సీఎం రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ‘‘కేరళ ప్రజలు ప్రస్తుతం గోల్డ్ స్మగ్లంగ్ గురించి, అందులో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం గురించి చర్చించుకుంటున్నారు. ఈ కేసులో శివశంకర్ పాత్ర ఏంటి ? ఎందుకు ఆయనని తొలగించారు ? ఈ కేసులో సీఎంఒ ప్రమేయం ఉందని తేలితే నేను ఇందులో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది’’ అని గవర్నర్ హెచ్చరికలు జారీ చేశారు. -
రోజుకు 25 వేల మందికి అయ్యప్ప దర్శనం
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ప్రతి రోజూ గరిష్టంగా 25 వేల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకోవచ్చని కేరళ ప్రభుత్వం తెలిపింది. కరోనా ఉధృతి కారణంగా గత ఏడాది రోజుకు కేవలం వెయ్యి మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. ఈ ఏడాది కరోనా ఉధృతిలో తగ్గుదల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. శబరిమల దర్శనాలకు సంబంధించి దక్షిణాది ఐదు రాష్ట్రాల అధికారులతో కేరళ ప్రభుత్వ అధికారులు మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా ఉధృతి చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులకు అనుమతిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది. అయితే, భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రం నుంచి శబరిమల యాత్రకు వచ్చే భక్తులకు తెలిసేలా విస్త్రత ప్రచారం కల్పించాలని కేరళ ప్రభుత్వం కోరింది. శబరిమల యాత్రికులకు కేరళ ప్రభుత్వం సూచనలు: ► శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ పోర్టల్‌లో తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ► రెండు డోసుల కరోనా టీకా పూర్తయినట్లు ధృవీకరణ పత్రం వెంట తీసుకురావాలి. లేదా దర్శనానికి 72 గంటల ముందుగా పరీక్ష చేయించుకుని, కోవిడ్ నెగిటివ్ ధృవీకరణ పత్రాన్ని వెంట తెచ్చుకోవాలి. ► శబరిమల ఆలయ పరిసరాలలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులనూ అనుమతించరు. ► పంబా నదిలో స్నానాలపై ఆంక్షలు ఈ ఏడాది కూడా కొనసాగుతాయి. నదీ స్నానాలకు బదులు కేవలం నది వెంబడి షవర్ స్నానాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. -
కరోనా కాలంలో ఆంక్షలు సడలిస్తారా?: సుప్రీంకోర్టు సీరియస్
న్యూఢిల్లీ: బక్రీద్ పండుగ పేరుతో కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా ఆంక్షలను మూడు రోజులపాటు సడలించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకవైపు కరోనా విజృంభణ కొనసాగుతూ అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, మరోవైపు అదే ప్రాంతంలో సడలింపులు ఇవ్వడం ఎంతమాత్రం తగదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని తేల్చి చెప్పింది. ఆంక్షల సడలింపు వ్యవహారం ఒకవేళ కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదలకు దారితీస్తే తాము కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. బక్రీద్ సందర్భంగా కేరళలో కరోనా ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న దాఖలైన పిటిషన్‌సై జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ బి.ఆర్.గవాయిల ధర్మాసనం తొలుత సోమవారం విచారణ చేపట్టింది. అఫిడవిట్ దాఖలు చేయాలని కేరళ సర్కారును ఆదేశించింది. దీంతో కేరళ సర్కారు మంగళవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులోని అంశాల పట్ల న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. వ్యాపారుల వద్ద సరుకులు మిగిలిపోతాయన్న కారణంతో కరోనా ఆంక్షలను సడలించడం ఏమిటని నిలదీసింది. ఉత్తరప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతుండగానే కన్వర్ యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా సుప్రీంకోర్టు గత వారం సుమోటోగా విచారణ జరిపిన సంగతి తెలిసిందే. -
అలా చేస్తే... మహమ్మారికే పండుగ!
అప్రమత్తతతో వివేకంగా వ్యవహరించాల్సిన సమయంలో విస్మయపరిచేలా ప్రవర్తిస్తే ఏమనాలి? అవును. కొన్నిసార్లు... కొన్ని ప్రభుత్వాల నిర్ణయాలు చూస్తే అవాక్కవుతాం. పవిత్రమైన బక్రీద్ పండుగ సందర్భంగా కేరళ సర్కార్ మూడు రోజుల పాటు లాక్డౌన్ సడలించి, వివిధ దుకాణాల్లో వ్యాపారాలకూ, ప్రార్థనలకూ ఇచ్చిన అనుమతులు చూసి, సాక్షాత్తూ సుప్రీంకోర్టే ఇప్పుడు నోరు నొక్కుకుంది. వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గి, ఇలాంటి పని చేయడం దారుణమని వ్యాఖ్యానించింది. కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ ముందు ప్రాణాలతో జీవించి ఉంటే, తరువాతే వ్యాపారం, జీవనోపాధి. అందుకే, రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రసాదించిన ‘జీవించే హక్కు’కు తలొగ్గా లంటూ సుప్రీంకోర్టు మంగళవారం కేరళ సర్కార్‌కి గట్టిగానే చెప్పాల్సి వచ్చింది. ఉత్తరాదిలో కావడ్ (కావడి) యాత్ర వివాదం, అనేక ప్రభుత్వాలు దీన్ని రద్దు చేసినప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 25 నుంచి యాత్రను కొనసాగించాలనుకోవడం, సుప్రీం తనకు తానుగా జోక్యం చేసుకొని అడ్డుకట్ట వేయడం... ఇవన్నీ కొద్దిరోజులుగా చూస్తూనే ఉన్నాం. ఇంతలోనే దక్షిణాదిన కేరళ ఇలా బక్రీద్ పండుగ పేరుతో కరోనా జాగ్రత్తలకు నీళ్ళొదలడం ఎలా చూసినా అభ్యంతరకరమే! ముస్లింలకు ఎంతో ముఖ్యమైన బక్రీద్ పండుగను జరుపుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కాకపోతే, కరోనా జాగ్రత్తలన్నీ అందరూ పాటించేలా ప్రభుత్వాలు కల్పించాలంటారు. కానీ, ఏదో ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పరిస్థితులను వాడుకోవాలని చూస్తేనే ఇబ్బంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 27 శాతం మంది ముస్లిములున్న కేరళలోని పాలక ‘వామపక్ష ప్రజాస్వామ్య కూటమి’ (ఎల్డీఎఫ్) ప్రభుత్వం చేసింది అదే అన్నది తాజా విమర్శ. దేశంలోని పది అగ్రశ్రేణి కరోనా బాధిత రాష్ట్రాల్లో కేరళ రెండో స్థానంలో ఉంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైందీ అక్కడే. అదే వ్యక్తి ఇటీవలే రెండోసారీ కరోనా బారినపడ్డారు. అవన్నీ తెలిసి కూడా కరోనా అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పండుగ కొనుగోళ్ళ కోసమంటూ దుస్తులు, చెప్పులు, ఆభరణాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాల దుకాణాలకు 3 రోజుల పాటు కేరళ సర్కార్ ఎలా అనుమతించిందన్నది ప్రశ్న. కేరళ, మహారాష్ట్రల్లో ఇప్పటికే థర్డ్‌వేవ్ వచ్చేసిందా అని కూడా అనుమానిస్తున్నారు. అందుకే, మహారాష్ట్ర ఏమో షరతులు పెట్టి, ప్రతీకాత్మకంగా ఈ ‘త్యాగాల పండుగ’ను ఇళ్ళల్లోనే జరుపు కోవాలని చెబుతోంది. కానీ, కేరళ అందుకు పూర్తి భిన్నమైన మార్గం ఎంచుకోవడం విచిత్రం. అయిదేళ్ళకోసారి యూడీఎఫ్, ఎల్డీఎఫ్ల మధ్య అధికారం మారిపోవడం ఆనవాయితీ అయిన కేరళలో ఆ మధ్య శబరిమల వివాదం లాంటివి చూశాం. బీజేపీ పుంజుకోవడమూ గమనించాం. వాటన్నిటినీ తట్టుకొని, ఈ ఏప్రిల్‌లో కేరళలో వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్నారు సీఎం పినరయి విజయన్. ఆయన తన లౌకికవాద ప్రమాణాల ప్రదర్శనకు బక్రీద్ పండుగ వేళను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. కానీ, కరోనా మహమ్మారికి ఆచారం, పండుగ ఏముంటుంది! గత ఏడాది నాటి తబ్లిగీల సమావేశమైనా, ఈ ఏడాది మొదట్లో లక్షలాది మంది ఒక్కచోట చేరిన కుంభ మేళా అయినా, నిన్నగాక మొన్న యూపీ సర్కార్ అనుమతించాలని చూసిన వేలాది శివభక్తుల ‘కావడ్ యాత్ర’ అయినా, ఇప్పుడు మసీదుల్లో గణనీయ సంఖ్యలో చేరి జరుపుకొనే బక్రీద్ అయినా... కరోనా కోరల వ్యాప్తికి ఒకటే! హిందూ, ముస్లిం తేడా లేకుండా గుమిగూడిన జనం ఆసరాగా విస్తరించడమే దాని లక్షణం. ఆ ప్రాథమిక అంశాన్ని పాలకులు విస్మరించి, నిబంధనలకు తూట్లు పొడిస్తే, ఎవరికి నష్టం? ఆ తరువాత ఎవరి ప్రాణానికి ఎవరు పూచీ? కరోనా జాగ్రత్తలు పాటించేలా చూస్తామని పాలకులు చెబుతున్నారు. కానీ, ఒడిశా రథయాత్ర మొదలు తెలంగాణలో బోనాల దాకా జనం మాస్కులు, భౌతికదూరం లేకుండా ఎలా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలుసు. నిరక్షరాస్యత, ధార్మిక పిడివాదం ఎక్కువగా కనిపించే పలు ఉత్తరాది రాష్ట్రాల బాటలోనే అక్షరాస్యత, అభ్యుదయం తొణికిసలాడే కేరళ ప్రయాణించడం నిజంగా విచిత్రం, విషాదం. ఎవరి భక్తి విశ్వాసాలు వారివి. సాటి మనుషులకు సమస్యలు తేనంత వరకు ఎవరి ధర్మం మీదనైనా వేరెవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. కానీ, ఆ ధార్మికతను రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకు అనువుగా వాడుకోవాలని చూస్తేనే అసలు చిక్కు. బక్రీద్ వేళ... కేరళ సర్కార్ వ్యవహరించిన తీరు అంతే బాధ్యతారాహిత్యంగా ఉందనేది విమర్శకుల మాట. దైవభూమిగా పేరున్న కేరళలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ 15 శాతం దాకా కరోనా పాజిటివిటీ రేటు ఉంది. అలాగే జికా వైరస్ కేసులు మళ్ళీ తలెత్తాయి. మూడున్నర కోట్ల జనాభా ఉన్న ఆ రాష్ట్రంలో ఇప్పటికి పూర్తిగా టీకా పడింది 45 లక్షల మందికే. అలాగే, 1.2 కోట్లమందికే, అంటే రాష్ట్ర జనాభాలో మూడోవంతు మందికి మాత్రమే తొలి డోసు టీకా పడింది. ఉన్నట్టుండి ఇప్పుడు షరతుల గేట్లు ఎత్తేయడం సరి కాదనడానికి ఈ గణాంకాలే సాక్ష్యం. అందుకే, థర్డ్‌వేవ్ ప్రమాదాన్ని హెచ్చరిస్తున్న ‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్’ ఫిర్యాదుతో కేరళ సర్కారును కోర్టు నిలదీయాల్సి వచ్చింది. కరోనా పూర్తిగా దూరం కాకముందే జాగ్రత్తలు గాలికొదిలేయడం, ఆర్థికవ్యవస్థను దృష్టిలో పెట్టుకొని అనేక రాష్ట్రాలు ఇస్తున్న నిబంధనల సడలింపు ఇప్పుడు కేరళ సహా అన్నిచోట్లా భయపెడుతున్నాయి. ఇవి మరిన్ని విపరిణామాలకు దారితీస్తే, అప్పుడు ఏ కోర్టులొచ్చి ఎవరిని నిలదీసినా ప్రయోజనం ఉండదు. జరిగిన తప్పులకు ప్రజలు, పాలకులు తమను తామే నిలదీసుకోవాల్సి వస్తుంది. -
కేరళ పిటిషన్‌ను తొసిపుచ్చిన సుప్రీంకోర్టు
తిరువనంతపురం: మలయాళ నటుడు దిలీప్ కుమార్‌తో పాటు మరి కొంతమంది లైంగిక వేధింపులు, అపహరణ కేసుల విచారణను బదిలీ చేయాలని కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. జస్టీస్ ఏఎం నేతృత్వంలోని ఖాన్విల్కర్ ధర్మాసనం ట్రయల్ జడ్జిపై పక్షపాత ఆరోపణలు చేయడం అనవసరమని కేరళ హైకోర్టుతో అంగీకరించారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది జి ప్రకాష్ ‘బాధితురాలిపై ప్రాసిక్యూషన్, పక్షపాత సంఘటనల కారణంగా ఈ కేసు విచారణ దెబ్బతిందని, న్యాయమైన విచారణ పొందడం బాధితురాలి హక్కు’ అని ఆయన ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘విచారణ నేపథ్యంలో బాధితురాలిని పరీక్షించే సమయంలో ఈ కేసులో 5వ నిందితుడు తన ఫోన్లో కోర్టు హాల్ చిత్రాలను తీశాడు. అదే విధంగా బాధితురాలైన సదరు మహిళ కోర్టుకు వస్తున్న కారు ఫొటోలు కూడా తీశాడు. అయితే ప్రాసిక్యూషన్ వారు ఈ అంశాలను ట్రయల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ట్రయల్ కోర్టు ఈ విషయంలో మౌనం వహించింది. దీనిని భారత ఆధారాల చట్ట ఉల్లంఘనగా నిర్వహించబడుతోందని’ రాష్ట్ర ప్రభుత్వం తన పటిషన్లో సుప్రీంకు నొక్కి చెప్పింది. అంతేగాక ఈ కేసు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు 40 మంది డిఫెన్స్ న్యాయదులు హాజరయ్యారని ప్రభుత్వం తెలిపింది. కోర్టు హాల్లో పెద్ద సంఖ్యలో న్యాయవాదులను అనుమతించిన కారణంగా బాధితురాలిని ప్రశ్నించడంలో నైతిక స్వభాన్ని ప్రశ్నించినప్పటికి లైంగిక వేధింపుల వివరాలపై ప్రశ్నించకుండా విచారణను అడ్డుకోవడంలో ట్రయల్ కోర్టు న్యాయమూర్తి విఫలమ్యారని ప్రభుత్వం పేర్కొంది. చెప్పాలంటే ఒక దశలో ట్రయల్ జడ్జి స్పష్టమైన కారణం లేకుండానే ఆందోళన చేందారని, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా అనవసర వ్యాఖ్యలు చేసినట్లు రాష్ట్ర ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎర్నాకుళంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణను వెంటనే నిలిపివేయాలని రాష్ట్రం సుప్రీంకోర్టును కోరింది. అయితే ఈ కేసులో బాధితురాలైన మహిళ కారులో కొచ్చి వెళ్తుండగా ఆమెను బంధించి నటుడు దిలీప్‌తో పాటు కొంతమంది వ్యక్తులు ఆమెపై లైంగిక వేధింపులకు తెగబడినట్లు కేరళ పోలీసులు తెలిపారు. అంతేగాక ఈ ఘటన సమయంలో నిందితులు ఘటనకు సంబంధించి తమ ఫోన్లో వీడియోలు, ఫొటోలు కూడా తీశారని, ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా నటుడు దీలిప్‌ను బాధితురాలు ఆరోపించడంతో అరెస్టు చేసినట్లు కేరళ పోలీసులు పేర్కొన్నారు. -
కేరళ ఆయుర్వేదం గెలిచింది!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జనవరి నాటికి కరోనా వైరస్ కేరళలో అడుగుపెట్టింది. కొద్ది రోజుల్లోనే రోగుల సంఖ్య పదుల సంఖ్యకు.. ఆపై వందల్లోకి చేరింది. మహమ్మారికి కళ్లెం వేసేందుకు రంగంలోకి దిగిన కేరళ ప్రభుత్వం.. ఆయుర్వేదాన్ని ఆయుధంగా చేసుకుంది. వ్యాధిని గుర్తించేందుకు ఏం చేయొచ్చో తెలపాలని ఆయుర్వేద వైద్యులను కోరింది. దాంతోపాటు రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఏం చేయాలన్నది రాష్ట్రం మొత్తానికి తెలియజేసింది. ఏప్రిల్ 11 నాటికి కరోనాకు సంబంధించి ఆయుర్వేద కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది. రోగులతో పాటు సాధారణ ప్రజలు కూడా రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలని, ఇందుకు తాము సూచించిన పద్ధతులను పాటించాలని కోరింది కూడా. ఆయుర్వేదం ఏం చెబుతోంది? రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుని, తద్వారా కరోనాను దూరంగా ఉంచేందుకు కేరళ ప్రభుత్వం ఆయుర్వేదం ఆధారంగా పలు సూచనలు చేసింది. చిరుతిళ్లను వీలైనంత వరకు తగ్గించడం, డ్రైఫ్రూట్స్‌తో పాటు ఉడికించిన పచ్చి అరటిపండు (కేరళలోని నేండ్రం రకం)ను వాడాల్సిందిగా కోరింది. ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలని.. రోజులో కనీసం ఒక్కసారైనా ముడి బియ్యంతో చేసిన గంజి తాగాలని, వీలైనంత వరకు మాంసాధారిత ఆహారాన్ని తీసుకోకపోవడం మేలని తెలిపింది. కూరలు, సూప్‌లు, అల్పాహారాల్లో పెసలు, పెసరపప్పు విరివిగా వాడాలని కోరింది. రోజుకు కనీసం 20 నిమిషాల పాటు యోగా చేయాలని తెలిపింది. మినుముల వాడకం తగ్గిస్తే మేలని, వేడినీటిలో శొంఠిని వేసి మరిగించిన నీటిని తాగుతుండటం, శొంఠి కాఫీకి కొంచెం పసుపు కలుపుకొని తాగడం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయని, ఆవు పాల కంటే మేకపాలు మేలని తెలిపింది. కరోనా నియంత్రణకు ఆయుర్వేద మందులు ఉపయోగించేందుకు సిద్ధమైన కేరళ ప్రభుత్వం.. చికిత్స విషయానికి వచ్చేసరికి మాత్రం ఆధునిక వైద్యం పైనే ఆధారపడింది. నిర్ధారణ పరీక్షలు, వైద్యం అల్లోపతి ద్వారా చేపట్టారు. ఆయుర్వేద విధానం జీవనశైలి మార్పులు, రోగి శక్తి పుంజుకునేందుకు ఉపయోగపడుతోంది. కేరళను ఆయుర్వేదం రక్షిస్తుంది కరోనా కష్టకాలంలో ఆయుర్వేదాన్ని ఉపయోగించేందుకు ప్రభుత్వం ‘కేరళను ఆయుర్వేదం రక్షిస్తుంది’ అనే నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చింది. స్వాస్థ్యం, సుఖాయుష్యం, పునర్జనని పేర్లతో సిద్ధం చేసిన పద్ధతులను ప్రజలకు ప రిచయం చేసింది. 60 ఏళ్లలోపు వారికి తొలి పద్ధతి ఉపయోగపడితే వృద్ధుల రక్షణకు సుఖాయుష్యం సిద్ధమైంది. పునర్జనని కరో నా రోగులు త్వరగా కోలుకునేందుకు సాయపడుతుంది. రాష్ట్రంలోని ఆయుర్వేద వైద్యశాల వివరాలను ‘నిరామయ’పేరున్న పో ర్టల్కు ఎక్కించింది. కేంద్ర ప్రభుత్వపు ఆయుష్ మిషన్‌లో భాగంగా రా ష్ట్రమంతా ఆయుర్ రక్ష పేరుతో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ ఆరోగ్య కేంద్రాలు కరోనా పర్యవేక్షణ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ సామాజిక మాధ్యమ పేజీల్లో కరోనా నివారణకు తీ సుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన వ్యాయామాల వివరాలను ప్రజలకు అందించింది. ఏపీలోని గ్రామ వలంటీర్ల వ్యవస్థ మాదిరిగా ఆయుర్వేద వైద్యులు, వైద్య విద్యార్థుల సాయంతో రాష్ట్రమంతటా అనుమానిత క రోనా బాధితులను గుర్తించేందుకు కృషిచేసింది. -
ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్: తెరుచుకోనున్న కల్లు దుకాణాలు
తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం పలు షరతులతో కూడిన లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో అనేక రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. కానీ తొలి కేసు నమోదైన కేరళ రాష్ట్రంలో ఇప్పటి వరకు మద్యం అమ్మకాలకు అక్కడి ప్రభుత్వం అనుమతినివ్వలేదు. అయితే తాజాగా అక్కడి ప్రభుత్వం కూడా కొన్ని లాక్డౌన్ సడలింపులకు ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా కల్లు విక్రయాలకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కల్లు దుకాణాలు తెరవడానికి అనమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కల్లు దుకాణాల సంఖ్యపై ఎలాంటి పరిమితులు విధించలేదు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న అన్ని కల్లు దుకాణాలు తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే దుకాణాల వద్ద భౌతిక దూరం, మాస్స్‌లు ధరించడం తప్పనిసరి అని తేల్చిచెప్పింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గీత కార్మికులు, మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పట్లో వైన్స్ షాప్స్‌కు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. చదవండి: ఆంధ్రప్రదేశ్: యాక్టివ్ కేసులు తగ్గుముఖం జూన్‌లో రైళ్ల కూత.. బస్సులపై అస్పష్టత -
కేరళ సర్కారుకు తలంటిన కేంద్రం
-
హలో.. కంట్రోల్ రూమ్
నాలుగ్గోడలు లేని ‘లాక్డౌన్’.. వలస కూలీలది! సొంత ఊళ్లకు మైళ్ల దూరంలో.. భాష రాక ఉక్కిరిబిక్కిరౌతున్న బతుకు శ్వాస వాళ్లది. ఆకలౌతోందని.. అనారోగ్యంగా ఉందని.. ఉండటానికి ఇంత చోటు కావాలని.. ఎవర్ని అడగాలి? ఏ భాషలో అడగాలి?! ‘కంట్రోల్ రూమ్’కి సుప్రియ రాక ముందు వరకు.. ఎర్నాకుళంలోని వలసలకూ భాష సమస్య ఉండేది. ఆమెకు ఏడు భాషలు రావడంతో.. వాళ్ల చెవుల్లో తేనె పోసినట్లుగా ఉంటోంది. కేరళలో పద్నాలుగు జిల్లాలు ఉన్నాయి. దేశంలో లాక్డౌన్ మొదలయ్యాక ఆ పద్నాలుగు జిల్లాల కలెక్టర్ కార్యాలయాలలో పద్నాలుగు ‘కోవిడ్ కంట్రోల్ రూమ్’లను ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కూడా గత రెండు వారాలుగా కేరళలో ఉన్న వలస కార్మికుల కోసం నిర్విరామంగా పని చేస్తున్నాయి. ఫోన్ చేసి ఎవరైనా ‘ఆకలౌతోంది’ అంటే ఫలానా చోట భోజనం దొరుకుతుంది వెళ్లండి’ అని చెబుతున్నాయి. ‘ఉండటానికి చోటెక్కడైనా ఉందా?’ అని అడిగితే.. ఫలానా ప్రాంతంలో షెల్టర్లు ఉన్నాయి వెళ్లండి’ అని అడ్రెస్ ఇస్తున్నాయి. ‘‘మా ఊరికి ఎప్పట్నుంచి బస్సులు తిరుగుతాయి?’ అని కొందరు అడుగుతుంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కొందరు ఫోన్ చేసి, ‘కేరళలో మా వాళ్లు ఎలా ఉన్నారో కనుక్కుని చెబుతారా?’ అని పలకని ఫోన్ నెంబర్లను ఇస్తుంటారు. కష్టంలో ఉన్న వాళ్లు ఎలాంటి ప్రశ్నలైనా వేస్తారు. కష్టం తీర్చడానికి ఉన్నవాళ్లు ఓర్పుగా సమాధానాలు ఇవ్వాలి. సుప్రియకు ఓర్పుతో పాటు, ఏడు భాషలలో ప్రశ్నలను అర్థం చేసుకుని ఏడు భాషలలో అవసరమైన సమాచారాన్ని ఇవ్వగల నేర్పు ఉంది. అలాగని ఆమేమీ బహుభాషా ప్రవీణురాలు, కోవిదురాలు కాదు. జీవనోపాధి కోసం స్వరాష్ట్రమైన ఒడిశా నుంచి కేరళకు వచ్చాక పరభాషలను నేర్చుకోవాలన్న ఉత్సాహంతో.. కేవలం ఉత్సాహంతో.. మలయాళం, హిందీ, బెంగాలీ, అస్సామీ, బంగ్లా భాషలను నెట్లో నేర్చుకున్నారు. ఒడియా ఎలాగూ మాతృభాష. ఇంటర్ వరకు చదువుకుంది కాబట్టి ఇంగ్లీష్ కూడా వచ్చు. అన్ని భాషల్లోనూ రాయలేరు కానీ.. చక్కగా మాట్లాడగలరు. అర్థం చేసుకోగలరు. అన్నీ భాషల్లోనూ ఆమెకు ఫ్రెండ్స్ ఉన్నారు. అదొకటి కూడా సుప్రియకు ఉపయోగపడింది. ఎర్నాకుళం కలెక్టరేట్లోని కోవిడ్ కంట్రోల్ రూమ్‌లో ‘మైగ్రెంట్ లింక్ వర్కర్’గా సుప్రియకు రోజుకు 200 వరకు కాల్స్ వస్తుంటాయి. వాళ్ల భాషలో విని, వాళ్ల భాషలో సమాధానం చెప్పగానే వాళ్లు వ్యక్తం చేసే సంతోషానికి అవధులే ఉండటం లేదు. ‘‘కొందరైతే.. నాతో మాట్లాడుతుంటే వాళ్ల ఊళ్లో ఉన్నట్లుగా అనిపిస్తోంది’’ అని పూడుకు పోయిన గొంతుతో కృతజ్ఞతగా అంటుంటారు. వాళ్లు అలా అన్నప్పుడు.. తాత్కాలికంగానే అయినా తగిన ఉద్యోగంలోకే వచ్చానని అనిపిస్తుంటుంది నాకు’’ అంటారు సుప్రియ. వలస కూలీలను కేరళ ప్రభుత్వం ‘వలస అతిథులు’ అంటుం ది. సుప్రియ కూడా అతిథులను ఆహ్వానించినట్లే వాళ్ల ఫోన్ కాల్స్‌ని రిసీవ్ చేసుకుంటున్నారు. సుప్రియతోపాటు ఆ సెంటర్లో మరో 11 మంది ‘మైగ్రెంట్ లింక్ వర్కర్’లు పని చేస్తున్నారు. సుప్రియ ‘రోష్ని’లో వాలంటీర్ కూడా. వలస కార్మికుల పిల్లలకు విద్యను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ పథకమది. ఇంకా.. మలయిదోంతురుత్లోని ప్రభుత్వ పాఠశాలలో హిందీ టీచర్‌గా కూడా పని చేస్తున్నారు సుప్రియ. ‘సర్వశిక్ష అభయాన్ ప్రాజెక్ట్’ కింద ఆమెకు ఆ ఉద్యోగం వచ్చింది. ఆమె ఉండటం ఎర్నాకుళంలోనే.. పుక్కట్టుపాడి లో. సుప్రియ పూర్తి పేరు సుప్రియా దేవ్నాథ్. ఐదేళ్ల క్రితం భర్తతోపాటు కేరళ వచ్చేశారు. ఆయన పేరు ప్రశాంతకుమార్ సామల్. పెరంబవూర్లోని ప్లయ్ ఉడ్ కంపెనీలో ఉద్యోగం. కూతురు శుభస్మిత.. తల్లి టీచర్‌గా ఉన్న బడిలోనే ప్రి–నర్సరీలో ఉంది. సుప్రియ తన చదువును ఇంటర్‌తోనే ఆపేయాలని అనుకోవడం లేదు. పెరంబువూర్ కాలేజ్‌లో బి.ఎ. హిందీలో చేరబోతున్నారు. అందుకు అవసరమైన సర్టిఫికెట్లు కొన్ని ఒడిశాలోనే ఉండిపోయాయి. ఈ వేసవి సెలవుల్లో వాటిని తెచ్చుకోవాలని అనుకుంటుండగానే.. ఇదిగో, ఈ లాక్డౌన్! ‘‘ఇంట్లోనే ఉండిపోవడం కష్టమే. అసలు ఇల్లే లేకపోవడం ఇంకా పెద్ద కష్టం అంటారు’’ సుప్రియా.. ‘వలస అతిథుల్ని’ గుర్తుకు తెచ్చుకుని. l -
ఇళయారాజాకు మరో అరుదైన పురస్కారం
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాకు మరో అరుదైన గౌరవ దక్కింది. కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘హరివరాసనం’ పురస్కారాన్ని ఆయనకు ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీన శబరిమలైలో ఇళయరాజాకు పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించి.. ఎన్నో అద్భుతమైన పాటలు అందించి మ్యూజిక్ మేస్ట్రోగా పేరొందిన ఇళయరాజా.. ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, సత్కారాలు పొందారు. భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే, శబరిమల కొండపై నెలకొన్న అయ్యప్పను మేలుకొలిపే ‘హరివరాసనం’ పాటను ఎంతో భక్తితన్వయత్వంపై ఇళయరాజా పాడటం.. విశేషమైన ప్రాచుర్యం పొందింది. అయ్యప్ప భక్తులు నిత్యం వినే పాటగా ఇది ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఇళయరాజకు హరివరాసనం పురస్కారం దక్కడం, శబరిమలలో దానిని అందుకోబోవడం అరుదైన విశేషమని చెప్పాలి. -
‘ఆ తీర్పును పక్కనపెట్టాలి’
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ గతంలో సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు బుధవారం విచారణకు చేపట్టింది. సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలో జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్, ఇందు మల్హోత్రాతో కూడిన సుప్రీం ధర్మాసనం ఎదుట వివిధ పక్షాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టాలని నాయర్ సర్వీస్ సొసైటీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కే పరాశరన్ విజ్ఞప్తి చేశారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా రుతుక్రమం కలిగిన స్త్రీలను ఆలయంలోకి అనుమతించడం లేదని, ఇది అంటరానితనం కిందకు రాదని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు రివ్యూ పిటిషన్లను తాము వ్యతిరేకిస్తున్నామని కేరళ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా కోర్టుకు నివేదించారు. రివ్యూ పిటిషన్ల రూపంలో కేసును తిరిగి చేపట్టలేరని పేర్కొన్నారు. మతానికి సంబంధించిన కార్యకలాపాల్లో సమాన హక్కును నిరాకరించే పద్ధతి ఏదైనా రాజ్యాంగంలోని ఆర్టికల్ 25కు విరుద్ధమని, సుప్రీం ఉత్తర్వులను గౌరవించాలని, సమీక్షించాలని కోరరాదని తాము నిర్ణయం తీసుకున్నామని ట్రావన్‌కోర్ దేవస్ధానం బోర్డు న్యాయవాది రాకేష్ ద్వివేది సుప్రీం బెంచ్‌కు నివేదించారు. ఇది విస్తృత ప్రజాబాహుళ్యానికి సంబంధించిన అలంశం కాదని, ఓ వర్గం అంతర్గత వ్యవహారమని, వారి విశ్వాసానికి సంబంధించినదని సీనియర్ న్యాయవాది శేఖర్ నపాడే కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మతపరమైన పద్ధతులను ఎవరూ నిర్ధేశించలేరని, ఆ వర్గానికి చెందిన సభ్యులే దాన్ని నిర్ణయిస్తారని, సుప్రీం తీర్పు అనంతరం కేరళలో నెలకొన్న సామాజిక అశాంతిని మనమంతా టీవీల్లో చూశామని చెప్పారు. అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. -
శబరిమల ఆలయంలోకి 51మంది మహిళలు ప్రవేశం
-
అత్యంత హీనంగా కేరళ సర్కారు తీరు
కొల్లం(కేరళ), బలంగిర్(ఒడిశా): శబరిమల అంశంపై కేరళ ప్రభుత్వం అత్యంత హీనంగా వ్యవహరించి, చరిత్రలో నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రేషన్ సరుకులను పక్కదారి పట్టకుండా ఆపి, రూ.90వేల కోట్ల కుంభకోణాన్ని బట్టబయలు చేసినందుకు తనను తొలగించేందుకు కుట్ర జరిగిందని ప్రధాని ఆరోపించారు. మంగళ వారం ఆయన కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొల్లం (కేరళ), బలంగిర్ (ఒడిశా)లలో జరిగిన కార్యక్రమాల్లో ప్రసంగించారు. అవినీతి, మతతత్వం, కులతత్వం అంశాల్లో కేరళలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి(ఎల్డీఎఫ్) ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఒకే నాణేనికి రెండు పార్శా్వల వంటివని పేర్కొన్నారు. ‘శబరిమల అంశంపై కేరళలోని వామపక్ష ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత హీనమైందిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇలా మరే ప్రభుత్వం కానీ, పార్టీ కానీ చేయలేదు. కమ్యూనిస్టులకు చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలపై ఏమాత్రం గౌరవభావం ఉండదని మనకు తెలుసు. కానీ, ఇంత హేయంగా వ్యవహరిస్తుందని ఎవరూ ఊహించలేరు’ అని తీవ్రంగా దుయ్యబట్టారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై పార్లమెంట్ లోపల ఒకలా, పత్తనంతిట్ట (అయ్యప్ప కొలువైన జిల్లా)లో మరోలా మాట్లాడుతున్న కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. కేరళ ప్రజలకు, వారి సంప్రదాయాలకు రక్షణగా నిలిచే ఏకైక పార్టీ బీజేపీయేనని చెప్పారు. ‘యూడీఎఫ్, ఎల్డీఎఫ్ లకు ఒక్కటే చెబుతున్నా. మా కార్యకర్తను తక్కువగా చూడొద్దు. త్రిపురలో జరిగిందే ఇక్కడా జరుగుతుంది’ అని అన్నారు. నన్ను తొలగించేందుకు కుట్ర నకిలీ పత్రాల ద్వారా రూ.90వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు జరుగుతున్న కుట్రను అడ్డుకున్నందుకు తనను పదవి నుంచి తొలగించేందుకు చూశారని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘గత ప్రభుత్వాల హయాంలో దళారులు.. లేకపోయినా ఉన్నట్లు పత్రాలు సృష్టించి రేషన్ కార్డులు, వంట గ్యాస్ కనెక్షన్లు, పింఛన్లు పొందారు. మా ప్రభుత్వం అలాంటి ఆరు కోట్ల పేర్లను గుర్తించి రూ.90వేల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టే పెద్ద కుంభకోణాన్ని అడ్డుకుంది. తమ ఆటలు సాగకపోయేసరికి ఈ అక్రమార్కులంతా ఏకమై ఈ‘చౌకీదార్’ను తొలగించేందుకు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు’ అని మోదీ అన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ కొల్లాంలోని జాతీయ రహదారి–66పై నిర్మించిన 13 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును, బలంగీర్‌లో రూ.1,550 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. -
శబరిమల ఎఫెక్ట్..! చెన్నైలోని కేరళ హోటల్‌పై దాడి
సాక్షి, చెన్నై : చెన్నైలోని కేరళ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు చెందిన ఓ హోటల్‌పై దాడి జరిగింది. థౌజండ్ నైట్లోని గ్రీమ్స్ రోడ్డులో గల హోటల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి 10.40 ప్రాంతంలో రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో హోటల్ అద్దాలు, సెక్యురిటీ చెక్‌పోస్టు ధ్వంసమయ్యాయి. కాగా, శమరిమల ఆలయంలోకి బుధవారం ఇద్దరు మహిళలు ప్రవేశించి దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై హిందుత్వవాదుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేసథ్యంలోనే కేరళ ప్రభుత్వ హోటల్‌పై దాడి జరిగి ఉండొచ్చని ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. (మహిళల ఆలయ ప్రవేశం.. కేరళలో తీవ్ర ఉద్రిక్తత) సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని, నిందితులని పట్టుకుంటామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని కేరళ ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా 100 మంది పోలీసులను నియమించామని చెప్పారు. ఇదిలాఉండగా.. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం నేపథ్యంలో కేరళ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ సహా పలు హిందూ సంఘాలు గురువారం బంద్‌కు పిలుపునిచ్చాయి. అన్ని వయసుల స్త్రీలకు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి విదితమే. -
తెరుచుకున్న శబరిమల దేవాలయం
శబరిమల: భారీ భద్రత నడుమ మకర సంక్రాంతి(మకరవిలక్కు) వేడుకల కోసం శబరిమల అయ్యప్ప దేవాలయం ఆదివారం తెరుచుకుంది. ప్రధాన పూజారి వీఎన్ వాసుదేవన్ నంబూద్రి ఆలయ తలుపులు తెరిచి పూజలు చేశా రు. తొలి రోజే భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. మకర సంక్రాంతి జనవరి 15న జరుగుతుంది. ఆలయాన్ని తిరిగి జనవరి 21న మూసివేస్తారు. 41 రోజుల పాటు జరిగిన మండల పూజ అనంతరం 27న ఆలయాన్ని మూసివేశారు. అన్ని వయసుల మహిళల్ని ఆలయంలోనికి అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేరళ ప్రభుత్వం భద్రతను పటిష్టం చేసింది. -
ప్రభుత్వంతో చర్చల ప్రశ్నే లేదు
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలన్న సుప్రీం కోర్టు తీర్పుపై కేరళ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసేంత వరకూ ప్రభుత్వంతో చర్చల ప్రశ్నే లేదని ఆలయ పూజారులు తేల్చిచెప్పారు. ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తామని, స్వామి సన్నిధానంలో మహిళా పోలీసులను నియమిస్తామన్న కేరళ ప్రభుత్వం నిర్ణయంపైనా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప ఆలయంతో సంబంధాలున్న పూర్వపు రాజులు పండాళం రాయల్స్ కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అమలుపై సోమవారం మాట్లాడేందుకు పండాళం రాయల్స్ కుటుంబ సభ్యులు, ఆలయ పూజారులను కేరళ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయనంతవరకూ చర్చల ప్రసక్తే లేదని ఆలయ ప్రధాన పూజారుల్లో ఒకరైన కందరారు మోహనారు తెలిపారు. -
ఆ మట్టికి పోరాడే శక్తి!
అంతా సజావుగా సాగకపోవచ్చు. కొన్ని లోపాలు కూడా తలెత్తి ఉండొచ్చు. ప్రజలంతా వరదల్లో చిక్కుకుంటే నిరాశా నిస్పృహలు చుట్టముట్టడం సహజమే. అయినా కేరళ తట్టుకుంది. ధైర్యంగా నిలబడింది. అనేక ఒడిదుడుకులను ఎదురొడ్డి నిలిచింది. నిరాశా నిస్పృహల్లో కూరుకుపోకుండా అనితరసాధ్యమైన సాహసాలు చేసి ప్రజలను రక్షించుకుంది. గత కొన్ని రోజులుగా వరదల్లో చిక్కుకున్న కేరళ అదే పోరాటపటిమను ప్రదర్శించింది. కేరళ పాలకులకూ, నాయకత్వానికీ నిజానికి ఇదొక పెద్ద సవాల్! ప్రధానంగా యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని కేంద్రీకరించి, సైనికదళాల సాయంతో తమ ముందున్న సవాళ్ళను అధిగమించడంలోనూ, సహాయక చర్యలు చేపట్టడంలోనూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కృతకృత్యులయ్యారు. సాహసోపేతమైన సహాయక చర్యలు రాష్ట్రంలో మొత్తం 22000 మంది ప్రజలను రక్షించింది. వరదల్లో చిక్కుకున్న 7.24 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా పెద్ద సంఖ్యలో వృద్ధులనూ, చిన్నారులనూ రక్షించింది. వారి దీక్ష అనన్య సామాన్యం... మొన్న నిఫా వైరస్ ఎదుర్కొన్నట్టుగానే నేడు వరద ప్రళయాన్నీ తప్పించుకోవడంలో కేరళ ప్రజల పాత్ర అనన్యసామాన్యమైనది. వైద్యులు, ఉపాధ్యాయులూ, విద్యార్థులూ, ఐటి ఉద్యోగులూ ఇలా ప్రజలంతా ఎవరికి తోచిన సాయం వారందించారు. వరద బాధితులకు ఆపన్నహస్తం అందించడంలో అహోరాత్రులు శ్రమించారు. ఎక్కడో వరదల్లో చిక్కుకుపోయిన గర్భిణులనూ, చిన్నారులనూ భుజాలకెత్తుకుని తీసుకెళ్ళారు. వృద్ధులను నెత్తిన మోసుకొచ్చారు. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి కావాల్సిన ఆహారపదార్థాలను అందించడానికి ఎందరో దాతలు ముందుకొచ్చారు. నీటిలో నానుతూ రోజుల తరబడి ఉండిపోయిన స్త్రీలకు అవసరమైన లోదుస్తులూ, సానిటరీ ప్యాడ్స్‌ని సైతం ప్రత్యేకించి వారికి చేర్చేందుకు ఒళ్ళు దాచుకోకుండా పనిచేసిన స్వచ్ఛంద కార్యకర్తలెందరో కేరళ ప్రజల్లో దాగున్న పోరాటపటిమను చాటిచెప్పారు. సమైక్య శ్రమసౌందర్యాన్ని ప్రపంచ ప్రజలకు రుచిచూపించిన కేరళ మత్స్యకారుల పాత్రను చరిత్ర మరువజాలదు. ఊరూ పేరూలేని చేపలుపట్టే సాధారణ ప్రజలు సైతం తమతమ బోట్లతో సొంత ఖర్చుతో వరదప్రాంతాలకు చేరుకొని తమ శరీరాలను మెట్లుగా మలిచిన సందర్భం అపురూపమైనది. అయినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది... ఇప్పటికే స్వచ్ఛందంగా ఎంతో మంది ముందుకొచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇందులో మత్స్యకారుల పాత్ర ప్రత్యేకించి చెప్పుకోదగినది. సైన్యం నిర్విరామంగా పనిచేస్తూనే ఉంది. అయినప్పటికీ ఇంకా చాలా పని మిగిలేవుంది. అంటువ్యాధులు పొంచి ఉన్నాయి. వైద్య సహాయం తక్షణావసరం. తాగునీటిని అందించడం, నిలవచేసుకోవడం. విద్యుత్‌ను పునరుద్ధరించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా సర్వస్వం కోల్పోయిన కేరళ ప్రజలు తమ జీవితాలను మళ్ళీ మొదటినుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి. ఇళ్ళూ, పంటలూ, పొలాలూ, పాఠశాలలూ, అన్నీ కోల్పోయిన ప్రజలు ఇప్పుడు సహాయకశిబిరాల నుంచి తిరిగి తమతమ ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ ఏమీలేని స్థితి నుంచి జీవితాలను ప్రారంభించాలి. కేరళ మట్టిలోనే పోరాడే శక్తి ఉంది. అక్కడి ప్రభుత్వం ప్రజలు సమైక్యంగా వరద బీభత్సాన్ని ఎదుర్కొంటున్న తీరు 1924లో కేరళని అతలాకుతలం చేసి ఇలాంటి వరదలనే గుర్తుకు తెస్తోంది. అప్పుడు సైతం... 1924లో కేరళని ముంచెత్తిన వరదలు దక్షిణ భారతదేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రాన్ని నష్టపరిచాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిగా పశువులు చనిపోయాయి. పూర్వీకుల కథల్లో ఆ విషాదం ఇంకా మిగిలేవుంది. అప్పుడు కూడా కేరళని ఆదుకునేందుకు అంతా కదిలివచ్చారు. 1924 ఆగస్టులో వచ్చిన ఈ వరదల్లో వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 4000 మందిని అమబాలప్పుజా, 3000 మందిని అల్లెప్పీ, 5000 మందిని కొట్టయాం, 3000 మందిని చంగనాస్సెరీ, 8000 మందిని పెరూర్ తదిరత ప్రాంతాలకు పంపారు. ఆ యేడాది ప్రజలకు టాక్సులు వ్యవసాయ పన్నులు రద్దుచేసారు. వ్యవసాయ రుణాల కోసం 4 లక్షలు ప్రత్యేకించి కేటాయించారు. ఇళ్ళు కోల్పోయిన బాధితులకు తాత్కాలిక ఇళ్ళనిర్మాణం కోసం ఆర్థిక సాయం, వెదురును ఉచితంగా సరఫరా చేయడంలాంటి ఎన్నో కార్యక్రమాలు స్వర్గథామంలాంటి కేరళను మళ్ళీ మెల్లమెల్లగా పుంజుకునేలా చేసాయి. అటు కేంద్రం... ఇటు రాష్ట్రప్రభుత్వం... విపత్తులు సంభవించినప్పుడు, ప్రళయం ప్రజల ప్రాణాలను కబళిస్తున్నప్పుడు అన్నింటినీ పక్కకు పెట్టాల్సిందేనని కేరళ విషయంలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు రుజువుచేసాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వైద్యం కోసం అమెరికా వెళ్ళాల్సి ఉన్నా తన ప్రయాణాన్ని వాయిదా వేసుకొని ప్రజలకూ, కేంద్ర ప్రభుత్వానికీ నిత్యం అందుబాటులో ఉన్నారు. రాజకీయాలను పక్కనబెట్టి కేరళ ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్రమోడీకి కేరళ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు అందుతోన్న సైనిక సహకారాన్నీ, అదనంగా కావాల్సిన తోడ్పాటుని గురించీ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ, కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్రంలో జరుగుతోన్న సహాయక చర్యలపట్ల హర్షం వ్యక్తం చేసారు. తక్షణ అవసరాలకనుగుణంగా కేంద్రం స్పందిస్తోంది. -
మనోహరా.. లాటరీ నీదేరా..!
ఒక్కసారైనా లాటరీ గెలవాలని ఎంతో మంది కలలు కంటుంటారు. ఎక్కడైనా లాటరీ వేస్తున్నారనగానే అక్కడికి వెళ్లి వెంటనే ఓ కూపన్ తీసేసుకుంటారు. కొందరికి ఇదో సరదా.. కొందరికి ఇదో పిచ్చి.. మరికొందరికి ఇదో వ్యసనం.. ఏదైతేనేమి ఒక్కసారి లాటరీ తగిలితే దశ దిశ మారినట్లే. మరి అలాంటిది మూడు సార్లు లాటరీ తగిలితే.. దాన్నేమనాలి.. ఎక్కడో సుడి ఉందనుకోవాలి.. ఆయనే కేరళకు చెందిన ఆర్పీ మనోహరన్.. ఈయన కేరళ విద్యుత్ శాఖలో పనిచేసి రిటైరయ్యారు. ఇప్పటివరకు వరుసగా మూడేళ్లుగా మూడు లాటరీలు గెలుచుకున్నాడు. తొలిసారిగా కేరళ ప్రభుత్వం నిర్వహించిన లాటరీని 2016 ఆగస్టులో గెలుచుకున్నాడు. అప్పుడు మనోహరన్ రూ.70 లక్షలు గెలుచుకున్నాడు. ఆ తర్వాత 2017 నవంబర్‌లో నిర్మల్ లాటరీని గెలుచుకున్నాడు. అప్పుడు కూడా రూ.65 లక్షల నగదును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మరోసారి లాటరీలో గెలిచి ముచ్చటగా మూడోసారి రూ.70 లక్షలు గెలుచుకున్నాడు. ఇంతకుముందు కూడా చాలా చిన్న చిన్న మొత్తాల్లో లాటరీ గెలుచుకునేవాడినని, కానీ మూడేళ్లుగా ఇంత పెద్ద మొత్తంలో లాటరీ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందంటున్నాడు. అసలు ఇదంతా నిజమో కలనో కూడా అర్థం కావట్లేదని చెబుతున్నాడు. -
కేరళీయులు ఐక్యంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: ఉపాధిలో భాగంగా కేరళీయులు ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉన్నా అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ఆ ప్రాంత ప్రజలతో మమేకం కావాలని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అన్నారు. ముందుగా కేరళీయులు స్వరాష్ట్రం వదలి బయట ఉన్నప్పుడు అందరూ ఒక కుటుంబంలా ఐక్యంగా ఉండాలని సూచించారు. కేరళ ప్రభుత్వం ప్రవాస కేరళీయులకు అండగా ఉంటుందని తెలిపారు. శనివారం రవీంద్రభారతిలో ఆల్ ఇండియా మలయాళీ అసోసియేషన్ (ఏఐఎంఏ) రాష్ట్ర యూనిట్, ప్రవాసీ వెల్ఫేర్ బోర్డ్, కేరళ ప్రభుత్వం సంయుక్త ఆధ్వ ర్యంలో కేరళ ప్రవాసీ పెన్షన్ స్కీమ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా విజయన్ మాట్లాడుతూ కేరళ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేవలం అక్కడ ఆదాయ వనరులే కాకుండా ప్రవాసీ కేరళీయుల సహకారం ఉందన్నారు. స్వరాష్ట్రం పట్ల ప్రవాసీ కేరళీయుల మమకారం మరువలేనిదని ఆయన కొనియాడారు. కేరళ ప్రవాసీ పెన్షన్ స్కీమ్ ప్రారంభం ప్రవాసీ కేరళీయుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే నూతనంగా కేరళ ప్రవాసీ పెన్షన్ స్కీమ్ ప్రారంభించామని తెలిపారు. 60 ఏళ్లు నిండిన ప్రవాసీ కేరళీయులకు రూ.2 వేలు పెన్షన్ స్కీమ్ ఏర్పాటు చేశామన్నారు. అందుకు సంబంధించిన మొదటి పెన్షన్ కార్డును లబ్ధిదారులకి అందజేశారు. వైద్య సౌకర్యం కోసం అంబులెన్స్‌ను అందజేశారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి మాట్లాడుతూ ప్రవాసీ కేరళీయుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రవాసీ కేరళ కళాకారులు నిర్వహించిన కలారిఫైట్(యుద్ధ విన్యా సాలు), పాటలు, జానపద గీతాలు అలరించాయి. కార్యక్రమంలో కేరళమంత్రి ఏకే బాలన్, ఏఐఎంఏ జాతీయ అధ్యక్షుడు గోపాలన్ పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వానికి తలంటిన సుప్రీంకోర్టు
కేరళ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కోర్టు ధిక్కార నోటీసు కూడా జారీచేసింది. తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదంటూ గట్టిగా ప్రశ్నించింది. సోమవారంలోగా దీనికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పినరయి విజయన్ అధికారంలోకి వచ్చిన తర్వాత డీజీపీ టీపీ సేన్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించి అప్రాధాన్య పోస్టులో నియమించగా, దానిపై ఆయన కోర్టుకెక్కారు. సుప్రీంకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సేన్‌కుమార్‌ను మళ్లీ డీజీపీగా నియమించాలని చెప్పింది. కానీ, ప్రభుత్వం మాత్రం ఇంకా సేన్‌కుమార్‌ను డీజీపీ చేయకుండా ఇంకా మీనమేషాలు లెక్కపెడుతూనే ఉంది. దాంతో కొన్నాళ్లు వేచి చూసిన ఆయన.. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో తాము చెప్పినా కూడా ఎందుకు ఆయనను డీజీపీ పదవిలో నియమించలేదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జిషా హత్యకేసు, పుట్టింగల్ ఆలయంలో బాణసంచా పేలుడు దుర్ఘటన కేసులను సరిగా విచారించలేదంటూ 2016 మే నెలలో కొత్తగా వచ్చిన పినరయి విజయన్ ప్రభుత్వం సేన్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తీసేసి, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది. కానీ ఆయన ఆ పదవిలో చేరకుండా కోర్టుకెక్కారు. పుట్టింగల్ ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 110 మంది మరణించారని, ఆ కేసులో తప్పు చేసిన పోలీసు అధికారులను సేన్‌కుమార్ కాపాడారని సుప్రీంకోర్టులో కేరళ సర్కారు వాదించింది. కానీ కోర్టు మాత్రం సేన్‌కుమార్‌కు అనుకూలంగానే తీర్పు వెల్లడించింది. -
సీపీఎంవి హత్యా రాజకీయాలు: లక్ష్మణ్
కేరళలో సీపీఎం హత్యా రాజకీయాలు చేస్తోందని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ మండిపడ్డారు. కేరళలో వరుసగా జరుగుతున్న ఘటనలను నిరసిస్తూ ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. కేరళ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని, బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో అహింసామార్గంలో నడవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్ అన్నారు. సీపీఎం ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, నేరచరిత్ర ఉన్న సీఎం ఈరోజు కేరళలో ప్రభుత్వం నడుపుతున్నారని మండిపడ్డారు. సీపీఎం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించిన దళితులను కిరాతకంగా హతమార్చారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపై బాంబు దాడులకు దిగుతున్నారని ఆయన అన్నారు. కమ్యూనిస్టులది పూర్తిగా నేర చరిత్ర అని, ఇంతకుముందు పశ్చిమ బెంగాల్లో ఇలాగే నేరాలకు పాల్పడితే అక్కడి ప్రజలు ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్లీ వాళ్లు యూనివర్సిటీలలో అల్లర్లు సృష్టిస్తున్నారని, వాళ్ల చేష్టలను దేశం మొత్తం గమనిస్తోందని అన్నారు. కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పార్టీ లోపాయికానీ ఒప్పందం చేసుకుని, జాతీయవాదులపై దాడికి ఉసిగొల్పుతోందని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీతో పాటు జాగృత భారత్, ఎంఎంఆర్ఐ, ఆర్ఎస్ఎస్ తదితర సంస్థలు కూడా పాల్గొన్నాయి. మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో తెలంగాణ– కేరళ సాంస్కృతిక ఉత్సవం
25 నుంచి మూడు రోజులపాటు భారీ సమ్మేళనం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ– కేరళ ప్రభుత్వాలు సంయుక్తంగా నగరంలో పైత్రుకోత్సవం పేరుతో సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ నెల 25 నుంచి 3 రోజులపాటు నాంపల్లి తెలుగు లలితకళాతోరణంలో ఈ కార్యక్రమాలుంటాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ తెలుగు రీజియన్ మలయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ, కేరళ సాంస్కృతిక, పురావస్తు, రాజ్యాభిలేఖన శాఖలు దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. రెండు రాష్ట్రాల నృత్య విన్యాసాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, విద్యార్థు లకు చిత్రలేఖనం, క్విజ్ పోటీలు, సంప్రదాయ వంటకాల ఘుమఘుమలు, పురస్కారాలు పొం దిన మలయాళీ చలనచిత్ర ప్రదర్శనలు... ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు ఉంటాయి. గెలుపొందిన వారికి ఉచితంగా కేరళ పర్యటన అవకాశాలు కూడా వరిస్తాయి. ఈ వివరాలను బుధవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పర్యాటకశాఖ మంత్రి చందూలాల్, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంలు వివరించారు. ఈ ఉత్సవాల్లో ప్రదర్శన కోసం కేరళ నుంచి భారీ సంఖ్యలో కళాకారుల బృందం నగరానికి వస్తోందని తెలిపారు. కేరళ ప్రభుత్వంతో కలసి ఇలాంటి భారీ సాంస్కృతికోత్సవాలను నిర్వహించటం ఇదే తొలిసారన్నారు. ఉత్సవాల అనంతరం తెలంగాణ కళాకారుల బృం దం కేరళకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తుందన్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్ కళాకారుల బృందం రాష్ట్రంలో పర్యటించి ఇచ్చిన ప్రదర్శనలకు మంచి స్పందన వచ్చిందని, మరిన్ని రాష్ట్రాల బృందాలు తెలంగాణకు రావటానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. త్వరలో కశ్మీర్‌కు తెలంగాణ బృందాలు త్వరలో తెలంగాణ బృందాలు కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తాయన్నారు. కేరళకు విదేశీ పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నందున వారిలో కనీసం 20 శాతం మందిని తెలంగాణకు మళ్లించగలిగితే విదేశీ పర్యాటకుల సంఖ్య సులభంగా 10 లక్షలకు చేరుకుం టుందని వెంకటేశం చెప్పారు. ఈ దిశగా విజయం సాధించేందుకు ఈ ఉత్సవాలు దోహదం చేస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక సంచాలకులు హరికృష్ణ, కాన్ఫెడరేషన్ ఆఫ్ తెలుగు మలయాళీ అసోసియేషన్స్ అధ్యక్షులు బెంజిమన్‌లు కూడా పాల్గొన్నారు. -
కేరళ ఆలయాల్లో ఆరెస్సెస్ కార్యక్రమాలు బంద్..?
తిరువనంతపురంః దేవాలయ ప్రాంగణాల్లో ఆరెస్సెస్ శిక్షణా కార్యక్రమాలను నిషేధించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. రాష్ట్రంలో ఆరెస్సెస్ శాఖల కార్యకలాపాలను పరిమితం చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ స్పష్టమైన చర్యను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కేరళ పోలీసు చట్టం 73 ప్రకారం ఇటువంటి కార్యకలాపాలను నిషేధించవచ్చని సిఫార్సు చేసిన న్యాయ శాఖ .. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వ అనుమతికోసం వేచి చూస్తోంది. దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ప్రతిపాదనకు ప్రతిస్పందనగా న్యాయ శాఖ తమ ఆదేశాలను ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శికి సమర్పించింది. శిక్షణ, వ్యాయామం, ఆత్మ రక్షణకు సంబంధించిన ఎటువంటి శారీరక శిక్షణలకూ కేరళ పోలీస్ చట్టం 73 ప్రకారం దేవాలయాల్లో అనుమతి లేదని న్యాయశాఖ సెక్రెటరీ బి జి హరీంద్రనాథ్ తెలిపారు. -
రాష్ట్రంలోనూ ‘కుటుంబ శ్రీ’
పేదరిక నిర్మూలనకు కేరళ తరహా విధానం అధ్యయనానికి వెళ్లిన అధికారుల బృందం సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన కోసం కేరళ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న ‘కుటుంబ శ్రీ’ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనూ అమలు చేసే దిశగా సర్కారు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని స్వయం సహాయక గ్రూపులను మరింత పటిష్టం చేసేందుకు కేరళలో అనుసరిస్తున్న విధానాలను అవలంభించడమే మేలని గ్రామీణాభివృద్ధి అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా కేరళలో అమలవుతున్న కుటుంబ శ్రీ కార్యక్రమాన్ని అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్త్రీనిధి బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ విద్యాసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది అధికారుల బృందం శుక్రవారం కేరళకు వెళ్లింది. ఈ బృందం సమర్పించే నివేదికలోని అంశాలను పరిశీలించాక రాష్ట్రంలో కుటుంబ శ్రీ కార్యక్రమ అమలుపై సర్కారు నిర్ణయం తీసుకోనుందని గ్రామీణాభివృద్ధి విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. -
ఆ ఆచారాన్ని మేం కాపాడాలి
‘శబరిమల’లో మహిళల నిషేధంపై కేరళ సర్కారు న్యూఢిల్లీ: శబరిమల గుడిలోకి ఋతుస్రావ వయసులోని మహిళల ప్రవేశంపై నిషేధం మత విషయమని.. భక్తులకున్న మతాచారహక్కును కాపాడాల్సిన బాధ్యత తమకు ఉందని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ గుడి పాలనాధికారం.. ట్రావెన్కోర్-కొచ్చిన్ హిందూ మత సంస్థల చట్టం కింద ట్రావెన్కోర్ దేవాస్వమ్ బోర్డుకు ఉంది కాబట్టి, మత విషయాల్లో పూజారుల అభిప్రాయమే అంతిమమంది. గుడిలోకి మహిళల ప్రవేశానికి మద్దతునిస్తూ గత ఎల్డీఎఫ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్‌ను ఉపసంహరించుకుంటూ.. ప్రస్తుత యూడీఎఫ్ ప్రభుత్వం తాజా అఫిడవిట్‌ను సమర్పించింది.10-50 ఏళ్ల వయసున్న మహిళల ప్రవేశంపై అనాది కాలం నుంచి నియంత్రణలు ఉన్నాయని.. ఇది రాజ్యాంగంలోని 25, 26 అధికారణల కింద భక్తులు తమ మత విశ్వాసాలు, ఆచారాలను ఆచరించే హక్కు కిందకు వస్తుందని పేర్కొంది. కాబట్టి.. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వేసిన పిటిషన్‌ను కొట్టేయాలంది. -
‘శబరిమల’లో జోక్యం చేసుకోం
తిరువనంతపురం: శబరిమలలోని అయ్యప్ప దేవాలయ సంప్రదాయాలు, నిబంధనల విషయంలో రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ బుధవారం తెలిపారు. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలను అనుమతించకూడదన్న నిబంధనను సుప్రీం కోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై కేరళ ప్రభుత్వం తన వైఖరిని ఖరారు చేసింది. ఆలయ సంప్రదాయాలు, నిబంధనలలో తాము జోక్యం చేసుకోరాదని నిర్ణయం తీసుకుంది. ఇదే అంశాన్ని సుప్రీం కోర్టుకు తెలియజేస్తామని కూడా వెల్లడించింది. -
కేరళ మద్యం విధానం చట్టబద్ధమే
సుప్రీం కోర్టు సమర్థన న్యూఢిల్లీ: ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే బార్ లెసైన్సులు మంజూరు చేస్తూ కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం విధానం రాజ్యాంగబద్ధమేనని సుప్రీం కోర్టు సమర్థించింది. దేశ మద్యం వినియోగంలో 14 శాతం వాటా చిన్న రాష్ట్రమైన కేరళదేనని, బహిరంగ మద్యపానంపై నిషేధం విధించాలన్న రాష్ట్ర నిర్ణయం చట్టబద్ధం, సహేతుకమేనని జస్టిస్ విక్రమ్‌జిత్, జస్టిస్ శివకీర్తిల బెంచ్ మంగళవారం తీర్పు వెలువరించింది. మద్యం అమ్మకాల్లో ఫైవ్ స్టార్ హోటళ్ల వాటా కేవలం 0.08 శాతమే మాత్రమేనని కోర్టు గుర్తు చేసింది. వందశాతం అక్షరాస్యత ఉన్న కేరళలో మద్యం వినియోగం భారీగా ఉందని పేర్కొంది. మద్యాన్ని స్వేచ్ఛగా అమ్మడం వల్ల సామాజిక దుష్పరిణామాలు కలుగుతాయని, ఈ విధానాన్ని సవాలు చేసిన ఆ రాష్ట్ర బార్ యజమానుల అప్పీళ్లను స్వీకరించలేమని పేర్కొంది. ఈ విధానం వల్ల ఏడు వందల బార్లు మూతపడతాయని, వేలాది మంది ఉపాధి కోల్పోతారని బార్ల యజమానులు వాదించారు. కోర్టు స్పందిస్తూ.. వారి పునరావాసం కోసం మద్యంపై సెస్సును వాడాలని, హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. మద్యం విధానాన్ని బార్ యజమానులు కేరళ హైకోర్టులో సవాల్ చేయగా ప్రభుత్వ అనుకూల తీర్పు వచ్చింది. వారు సుప్రీం గడప తొక్కారు. కొత్త విధానం ప్రకారం.. ఫైవ్‌స్టార్ కాని హోటళ్లు, బార్లలో మద్యాన్ని అమ్మకూడదు. 2023 నాటికి రాష్ట్రంలో మద్యాన్ని సంపూర్ణంగా నిషేధించేందుకు దీన్ని తీసుకొచ్చారు. కోర్టును తీర్పుపై కేరళ సీఎం హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ విధానం ఆలోచనాత్మకమైన, సాహోపేతమైన నిర్ణయం. వ్యాపారులకు వ్యతిరేకం కాదు, సామాజిక దురాచారానికి వ్యతిరేకం’ అని తిరువనంతపురంలో విలేకర్లతో అన్నారు. -
తప్పు ఒప్పుకోకుంటే.. న్యాయచర్య
మోదీ ప్రభుత్వానికి కేరళ సర్కారు హెచ్చరిక తిరువనంతపురం/న్యూఢిల్లీ: గోమాంసం వడ్డించారన్న ఆరోపణలపై ఢిల్లీ కేరళ భవన్‌పై పోలీసులు దాడి వివాదం బుధవారం మరింత ముదిరింది. తప్పుడు ఫిర్యాదు చేశారన్న అభియోగాల(107/151సీఆర్పీసీ)పై హిందూసేన చీఫ్ విష్ణుగుప్తాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచారు. ఈ మొత్తం వ్యవహారం వల్ల కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఏర్పడిన ప్రతిష్టంభన బుధవారమూ కొనసాగింది. కేరళ కేబినెట్ అత్యవసరంగా సమావేశమై చర్చించింది. ఢిల్లీ పోలీసులు తాము చట్టం ప్రకారమే వ్యవహరించామని, క్యాంటీన్ తనిఖీ తమ విధుల్లో భాగమని చేస్తున్న వాదనను కేంద్రం సమర్థిస్తే న్యాయపర చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకోకుండా ప్రవేశించటం చట్టాల ఉల్లంఘనేనని సీఎం ఊమెన్ చాందీ అన్నారు. గోమాంసంపై ఢిల్లీలో నిషేధమున్న విషయం తమకు తెలుసని.. దాన్ని వడ్డించనేలేదని, గేదె మాంసాన్నే వడ్డించారని తెలిపారు. కేరళ భవన్లో బుధవారం తిరిగి గేదె మాంసాన్ని వండి వడ్డించారు. 45 నిమిషాల్లో ఈ వంటకం హాట్‌కేక్‌లా అమ్ముడుపోయింది. రూ.50 చొప్పున 70 ప్లేట్లు అమ్మారు. పీఎంఓకు నివేదిక! ఈ వివాదంపై కేంద్ర హోం శాఖ ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదిక ఇవ్వనుంది. దీని కోసం ఢిల్లీ పోలీసుల నుంచి నివేదిక తీసుకుంది. సోమవారం కేరళభవన్‌లో గోమాంసం వడ్డిస్తున్నట్లు ఫోన్ రావడంతో అక్కడికెళ్లామని పోలీసులు చెప్పారు. గోమాంసం వడ్డించడం లేదని తెలియడంతో, అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తమను సంప్రదించాలని క్యాంటీన్ సిబ్బందికి తెలిపి.. భవన్‌గేట్, దాని పరిసర ప్రాంతాల్లో భద్రత ఏర్పాటు చేశామని హోం శాఖకు తెలిపారు. -
కేరళ భవన్లో గోమాంస వివాదం
కేరళ భవన్లో ఢిల్లీ పోలీసుల హల్చల్ క్యాంటీన్లో వడ్డించింది గేదె మాంసమన్న కేరళ ప్రభుత్వం న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని కేరళ భవన్ క్యాంటీన్లో గోమాంసం వడ్డిస్తున్నారంటూ చెలరేగిన వివాదం రాజకీయ రంగు పులుముకుంది. క్యాంటీన్లో హిందూ సేన కార్యకర్తలు, ఢిల్లీ పోలీసులు హంగామా చేయటంతో వివాదం రేగింది. ఈ ఘటన కేరళ భవన్లో సోమవారం సాయంత్రం హిందూసేన కార్యకర్తలు ప్రవేశించి ఆందోళన చేయటంతో మొదలైంది. కేరళ భవన్ క్యాంటీన్ మెనూలో బీఫ్ కూడా ఉంది. మిగతా ఆహార పదార్థాల పేర్లన్నీ ఇంగ్లీష్‌లో ఉండి బీఫ్ పేరును మలయాళంలో పేర్కొన్నారు. విషయాన్ని తెలుసుకున్న హిం దూసేన కార్యకర్తలు కేరళ భవన్‌లోకి ప్రవేశించి బీఫ్ వండకూడదంటూ ఆందోళన చేశారు. కేరళభవన్ సిబ్బంది పోలీస్ కంట్రోల్‌రూమ్‌కి సమాచారమిచ్చారు. దీంతో 20మంది పోలీసు లు కేరళభవన్‌కు చేరుకున్నారు. అప్పటికే హిందూసేన కార్యకర్తలు పారిపోయారు. అయితే పోలీసులు క్యాంటీన్లోకి వెళ్లి గోమాం సం వండారా లేదా అని పరిశీలించటం, సిబ్బందిని ప్రశ్నించటంతో దుమారం రేగింది. అది గేదె మాంసం: తాము క్యాంటిన్లో వడ్డిస్తున్నది గోమాంసం కాదని, గేదె మాంసమని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీజీ థామ్సన్ స్పష్టం చేశారు. రెసిడెంట్ కమిషనర్ అనుమతి లేకుండా కేరళ భవన్‌లోకి చొరబడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలి: ఊమెన్‌చాందీ గోమాంసం వడ్డిస్తున్నారన్న ఆరోపణలపై కేరళభవన్‌పై దాడి చేయటం దారుణమని ఢిల్లీ పోలీసులపై, దుండగులపై కఠిన చర్యలు తీసు కోవాలని కేరళ సీఎం ఊమెన్ చాందీ ప్రధానికి లేఖ రాశారు. కాగా, ఢిల్లీ పోలీసులు కేరళభవన్‌పై దాడి చేయనే లేదని, ఆందోళన జరుగుతోందంటూ అక్కడి సిబ్బంది నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు వెళ్లారని, ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ అన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిపై చర్య తీసుకుంటామన్నారు. -
కేరళ ప్రభుత్వ వెబ్‌సైట్‌పై పాక్ హ్యాకర్ల దాడి
తిరువనంతపురం: 'తగలబడుతున్న త్రివర్ణ పతాకం, ఆ వెంటనే పాకిస్థాన్ అనుకూల నినాదాలు..' ఇదీ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేరళ ప్రభుత్వ వెబ్ సైట్ లోకి వెళ్లిన వారికి కనిపించిన దృశ్యాలు! పలువురి ఫిర్యాదుతో వెంటనే తేరుకున్న ప్రభుత్వాధికారులు రాత్రికిరాత్రే నిపుణులను రప్పించి వైబ్ సైట్ ను పునరుద్ధరించారు. అసలేం జరిగిందనే విషయాన్ని ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఆదివారం ఉదయం ప్రకటించారు. 'కేరళ ప్రభుత్వ వెబ్ సైట్ (www.keralagov.in) శనివారం అర్ధరాత్రి తర్వాత హ్యాకింగ్ కు గురైంది. పాకిస్థాన్ కు చెందిన హ్యాకర్లే ఈ దురాగతానికి ఒడిగట్టిఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చాం. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవెలప్ మెంట్ ఆఫ్ ఇమేజింగ్ టెక్నాలజీ వారు సైట్ ను పునరుద్ధరించారు' అని కేరళ సీఎం చాందీ తెలిపారు. దీనిని తీవ్రమైన చర్యగా భావిస్తున్నట్లు, వెంటనే విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. -
'శుభయాత్ర' ప్రచారకర్తగా మోహన్ లాల్
తిరువనంతపురం: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కేరళ ప్రభుత్వం చేపట్టనున్న 'శుభయాత్ర' కార్యక్రమం ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. గుడ్ విల్ అంబాసిడర్ గా ఆయనను ప్రభుత్వం ఎంపిక చేసింది. ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. రవాణా, విద్య, పబ్లిక్ వర్క్స్ శాఖలతో కలిసి కేరళ పోలీసులు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరగడంతో 'శుభయాత్ర'కు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ట్రాఫిక్ నిబంధనల పాటించాల్సిన ఆవశ్యకతను ప్రజలను వివరించనున్నారు. -
సింగర్ బాలుకు కేరళ సత్కారం
శబరిమలై: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కీర్తికి మరో కలికితురాయి తోడైంది. కేరళ ప్రభుత్వం, శబరిమలై దేవస్థానం ఉమ్మడిగా అందించే ప్రతిష్ఠాత్మక 'హరివరాసనం' అవార్డును ఈ ఏడాదికిగానూ ఆయన అందుకున్నారు. శనివారం అయ్యప్ప సన్నిధానం శబరిమలై ఆలయంలో కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎస్ శివకుమార్ నుంచి బాలు ఈ అవార్డును స్వీకరించారు. అవార్డుతోపాటు లక్ష రూపాయల నగదు బహుమానం, మెమొంటోను అందజేశారు. తన గానం ద్వారా ఆథ్యాత్మిక ఉన్నతికి పాటుపడినందుకుగానూ ఆయనను హరివరాసనం అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. 'ఐదు దశాబ్ధాల నా సంగీత ప్రస్థానంలో ఎన్నో అవార్డులను అందుకున్నాను. అయితే హరివరాసం మాత్రం వాటన్నింటిలోకి ప్రధానమైనదిగా భావిస్తున్నాను. అయ్యప్ప స్వామి ఆలయం మత సామరస్యానికి గొప్ప ఉదాహరణ. స్వామివారిని కీర్తిస్తూ హిందీ సహా అనేక భాషల్లో పాటలు పాడిన నేను మొదటిసారి శబరిమలకు రావడం ఆనందంగా ఉంది' అని అన్నారు. -
తారల విముఖత
ప్రభుత్వ ప్రకటనల్లో నటించేందుకు రీమా కల్లింగల్ నిరాకరించారు. కోలీవుడ్, మాలీవుడ్ నటులు ప్రభుత్వ ప్రకటనల్లో తరచుగా నటించారు. కేరళలో ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో ఫిలిం డిస్ట్రిబ్యూషన్, ఆడియో, వీడియో కాపీరైట్స్, శాటిలైట్ హక్కులు వంటి వాటిపై ఐదు శాతం వ్యాట్ పన్ను విధింపును ప్రకటించారు. ఇదివరకే 14 శాతం వాట్ పన్ను వుంది. దీంతో వాట్ పన్నును 19కి పెంచడాన్ని చిత్రరంగం తీవ్రంగా వ్యతిరేకించింది. కేరళ ప్రభుత్వ ప్రకటనల్లో మమ్ముట్టి, మోహన్‌లాల్, రీమాకల్లింగల్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన వ్యాట్ పన్నును కేరళ చిత్రరంగం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ వ్యతిరేకత తెలియజేసే విధంగా కేరళ ప్రభుత్వ ప్రకటనల్లో నటించ రాదన్న నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి త్వరలో ఒక అధికార పూర్వక ప్రకటన విడుదల చేయనున్నారు. -
కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం పాఠశాలలకు సంబంధించి ఓ కీలకమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. మరుగుదొడ్లులేని ప్రైవేట్ స్కూళ్లకు ఇకపై ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వబోమని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మరుగుదొడ్లులేని ప్రభుత్వ పాఠశాలల్లో వందరోజుల్లోగా వాటిని నిర్మించాలని ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్ల సదుపాయం ఉండాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. చాందీ అధ్యక్షతన నిన్న జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు తప్పనిసరిగా వుండాలని కేబినెట్ నిర్ణయించింది. 196 ప్రభుత్వ పాఠశాలలలో, 1011 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలలో టాయిలెట్ల సదుపాయం లేనట్లు గుర్తించారు. ** -
కూలీల సంపాదన 30 వేలు!
కేరళ ప్రభుత్వ పథకంతో లబ్ధి పొందుతున్న వ్యవసాయ కూలీలు తిరువనంతపురం: వ్యవసాయ కూలీలు నెలంతా కష్టపడినా మహాఅయితే రూ. 10 వేలు సంపాదిస్తారు. రోజుకు రూ. 200 నుంచి రూ. 300 లభిస్తుంది. అందులోనూ మహిళా కూలీలకు ఇంకా తక్కువే లభిస్తుంది. కానీ నెలకు రూ. 30 వేల వరకు సంపాదించే వ్యవసాయ కూలీలను చూడాలనుకుంటున్నారా? నెలనెలా ఉద్యోగుల్లా.. ఠంచనుగా బ్యాంకు అకౌంట్ల ద్వారా వేతనాలనందుకుంటున్న కూలీలను చూడాలనుకుంటే.. విదేశాలకు వెళ్లనక్కరలేదు. మనదేశంలో.. అదీ మన పక్కనే ఉన్న కేరళలోనే ఆ అద్భుతం జరుగుతోంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం కారణంగా అది సాధ్యమైంది. ఆ పథకం కింద ప్రతీ గ్రామ పంచాయితీలో ‘కర్షక కర్మ సేన’(వ్యవసాయ కూలీల సైన్యం)ను ఏర్పాటు చేస్తారు. స్థానిక వ్యవసాయ కూలీలు అందులో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి భూమి దున్నడం, నాట్లు వెయ్యడం, కొబ్బరికాయలు తెంచడం నుంచి ఆధునిక వ్యవసాయ పద్ధతుల వరకు అన్ని వ్యవసాయ సంబంధ పనుల్లో శిక్షణ ఇస్తారు. ఆ గ్రామంలో కూలీలు అవసరమైన వారు ఈ సేనను సంప్రదించి సేవలు పొందవచ్చు. వారికివ్వాల్సిన కూలీలో బేరాలుండవు. పనిని బట్టి ముందే నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించాల్సిందే. సాధారణంగా ఏ రోజు కూలీ మొత్తం ఆ రోజే చెల్లించే విధానం కూడా అక్కడ లేదు. చేసిన పనిని గంటలవారీగా లెక్కించి, సంపాదించిన మొత్తాన్ని నెలవారీగా ఆ కూలీల బ్యాంకు అకౌంట్లలో జమచేస్తారు. మహిళలకు కూడా పురుషులకు సమానంగా చెల్లిస్తారు. ఈ పథకం ద్వారా చాలామంది వ్యవసాయ కార్మికులు నెలకు రూ. 30 వేల వరకు సంపాదిస్తున్నారు. అయిదంకెల సంపాదన అక్కడ చాలా సాధారణం.గ్రామ పంచాయతీవారు కానీ, స్థానిక కృషి భవన్ అధికారులు కానీ కూలీల సేవలు పొందిన యజమానుల నుంచి డబ్బును వసూలు చేస్తారని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 60 గ్రామాల్లో ఈ పథకాన్ని ప్రారంభించామని వ్యవసాయ శాఖ డెరైక్టర్ అజిత్ కుమార్ తెలిపారు. తొలిదశలో కనీసం 200 గ్రామాల్లో దీన్ని ప్రారంభించాలనుకుంటున్నామన్నారు. సంవత్సరం మొత్తం వారికి పని లభించేలా కూడా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.