
తిరువనంతపురం: కేరళలోని వామపక్ష ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. గురువారం కేరళ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయం ప్రకారం ప్రభుత్వ విధివిధానాలను వివరించాల్సిన గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రసంగ పాఠంలోని చివరి పేరాను మాత్రమే చదివి కేవలం రెండు నిమిషాల్లోనే ప్రసంగం ముగించారు.
ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ 9.02 గంటలకల్లా ప్రసంగం ముగించారు. 9.04 గంటలకు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. కొన్ని బిల్లుల పెండింగ్, యూనివర్సిటీల నిర్వహణకు సంబంధించిన అంశాలపై గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.