kerala assembly sessions
-
2 నిమిషాల్లోనే ప్రసంగం ముగిసింది
తిరువనంతపురం: కేరళలోని వామపక్ష ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. గురువారం కేరళ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయం ప్రకారం ప్రభుత్వ విధివిధానాలను వివరించాల్సిన గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రసంగ పాఠంలోని చివరి పేరాను మాత్రమే చదివి కేవలం రెండు నిమిషాల్లోనే ప్రసంగం ముగించారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ 9.02 గంటలకల్లా ప్రసంగం ముగించారు. 9.04 గంటలకు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. కొన్ని బిల్లుల పెండింగ్, యూనివర్సిటీల నిర్వహణకు సంబంధించిన అంశాలపై గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ఈత కొట్టి, చేపలు పట్టిన రాహుల్.. వైరల్
కొల్లాం: కేరళలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా తెలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అతి పెద్ద సాహసమే చేశారు. కొల్లాం సముద్రంలో వారితో కలసి చేపలు పట్టే ప్రయత్నం చేశారు. మధ్యలో హఠాత్తుగా సముద్రంలోకి దూకి కాసేపు ఈత కొట్టారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రాహుల్ బుధవారం తెల్లవారుజామున వాడి బీచ్ నుంచి మత్స్యకా రులతో కలిసి సముద్రంలోకి వెళ్లారు. మీ పని అంటే గౌరవం పడవ తిరిగి ఒడ్డుకు వచ్చాక థంగస్సెరీ బీచ్ దగ్గర మత్స్యకారులనుద్దేశించి రాహుల్ ఉద్వేగభరితంగా మాట్లాడారు. కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేపలు పట్టడానికి సముద్రంలో ట్రాలర్లు ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చు కోవడాన్ని ఆయన దుయ్యబట్టారు. ఈ ఒప్పందం వల్ల జాలర్లు జీవనోపాధిని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మీరు చేసే పనిని నేను ఎంతో గౌర విస్తాను. ఆరాధిస్తాను. మేము లొట్టలేసుకుంటూ చేపలు తింటూ ఉంటాం. కానీ అవి మా ప్లేట్లోకి రావడానికి మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు ఇవాళే అర్థమైంది’’ అని రాహుల్ అన్నారు. సముద్రంలో సాహసం వల వేశాక మత్స్యకారులతో కలసి రాహుల్ కూడా సముద్రంలో దిగారు. హఠాత్తుగా సముద్రంలోకి దూకి ఈత కొట్టారు. దాదాపు 10 నిమిషాలు ఈత కొట్టినట్టుగా ఆయనతో పడవలో ప్రయాణించిన కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. ఎవరితో చెప్పకుండా హఠాత్తుగా దూకడంతో భయపడినట్లు చెప్పారు. హమ్ దో.. హమారే దో! గుజరాత్లో నూతనంగా నిర్మించిన మొతెరా స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యంగాస్త్రాలు విసిరారు. ‘హమ్ దో.. హమారే దో(మేమిద్దరం.. మాకిద్దరు)’ అనే హ్యాష్ ట్యాగ్‌తో బుధవారం ఒక వ్యంగ్య వ్యాఖ్యను ట్వీట్ చేశారు. ‘వాస్తవాలు ఎంత అందంగా బయటపడుతున్నాయో చూడండి. స్టేడియం పేరు నరేంద్ర మోదీ స్టేడియం. ఒక ఎండ్ పేరు అదానీ ఎండ్, మరో ఎండ్ పేరు రిలయన్స్ ఎండ్. పరిపాలన బాధ్యతల్లో జే షా’ అని రాహుల్ ట్వీట్ చేశారు. స్టేడియం పేరును ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంగా, స్టేడియంలోని రెండు ఎండ్లను అదానీ, రిలయన్స్ ఎండ్స్గా నిర్ణయించడాన్ని రాహుల్ ఇలా ఎద్దేవా చేశారు. కాగా, ఈ పేరు మార్పు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం స్పందించింది. కేవలం స్టేడియం పేరును మాత్రమే మార్చామని, మొత్తం స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరు సర్దార్ పటేల్ పేరుపైననే కొనసాగుతుందని వివరణ ఇచ్చింది. ప్రధాని దార్శనికతకు గౌరవం.. గుజరాత్లో నిర్మించిన స్టేడియానికి ‘నరేంద్ర మోదీ స్టేడియం’గా నామకరణం చేయడాన్ని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమర్ధించారు. ఇది క్రీడారంగంలో భారత్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ దార్శనికతను గౌరవించే వినమ్ర ప్రయత్నమని అభివర్ణించారు. స్టేడియానికి సర్దార్ పటేల్ పేరు తొలగించి, ప్రధాని మోదీ పేరు పెట్టడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించడంతో బీజేపీ నాయకులు స్పందించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కాంగ్రెస్ ఏ నాడూ గౌరవించలేదని ఆరోపించారు. అంతకుముందు, పటేల్ పేరును తొలగించి స్టేడియానికి మోదీ పేరు పెట్టడం సర్దార్ పటేల్‌నే కాదు.. భారతీయులని అవమా నించడమేనని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. -
సౌర విద్యుదుత్పత్తిపై దృష్టి
తిరువనంతపురం: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. వాతావరణ మార్పుపై పోరాటంలో భాగంగా భారత్ సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రాముఖ్యతనిస్తోందని వ్యాఖ్యానించారు. రైతులను కూడా ఈ సౌర విద్యుదుత్పత్తి రంగంలో భాగస్వామ్యులను చేయనున్నామన్నారు. రానున్న ఆరేళ్లలో దేశ సౌర విద్యుత్ సామర్థ్ధ్యం 13 రెట్లు పెరగనుందని వెల్లడించారు. 320 కేవీ పుగలుర్(తమిళనాడు)– త్రిస్సూర్(కేరళ) పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుకు రూ. 5,070 కోట్లు వ్యయం అయింది. సుపరిపాలనకు, అభివృద్ధికి కులం, వర్గం, జాతి, లింగం, మతం, భాషతో సంబంధం లేదని ప్రముఖ మలయాళ కవి కుమరనాసన్ రాసిన ‘నీ కులమేంటని అడగడం లేదు సోదరీ.. నాకు దాహంగా ఉంది. నీళ్లు మాత్రమే అడుగుతున్నాను’ అన్న కవిత పంక్తిని ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు. విజన్ డాక్యుమెంట్ రూపొందించండి స్థానిక రైతులు, కళాకారులు ప్రపంచ మార్కెట్లను చేరుకునేందుకు వీలుగా సహకారం అందించాలని విశ్వభారతి విద్యార్థులను ప్రధాని మోదీ అభ్యర్థించారు. విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో శుక్రవారం ప్రధాని ఆన్లైన్ విధానంలో పాల్గొని, ప్రసంగించారు. రానున్న 25 ఏళ్లలో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను పెంచేందుకు విద్యాసంస్థలు చేపట్టాల్సిన చర్యలపై 25 అంశాలతో విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాలని కోరారు. -
93 ఏళ్ల వయసులో చకచకా అసెంబ్లీకి
సాధారణంగా 70 ఏళ్ల వయసు వచ్చిందంటేనే కృష్ణా రామా అంటూ ఇంట్లో కూర్చుంటారు. అదే 90 ఏళ్లు దాటితే.. ఇక వాళ్లను ఇంట్లోవాళ్లు గాజుబొమ్మల కంటే జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ, కేరళలోని సీపీఎం కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్ మాత్రం 93 ఏళ్ల వయసులో కూడా చకచకా అసెంబ్లీకి వెళ్తున్నారు. అవును.. అచ్యుతానందన్‌కు 93 ఏళ్లు వచ్చాయి. పుట్టినరోజు నాడు కూడా ఆయన అసెంబ్లీకి యథావిధిగా వచ్చేశారు. తన ట్రేడ్ మార్కు తెల్ల చొక్కా, పంచె ధరించి ఆయన రాగానే పలవురు యువ ఎమ్మెల్యేలు పరుగున వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్ సభ తరఫున ఆయనకు అభినందనల చెప్పారు. ''సభలోనే అత్యంత సీనియర్ సభ్యుడైన అచ్చుతానందన్ 93వ పుట్టినరోజు సందర్భంగా ఈ సభ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది'' అని ఆయన ప్రకటించగానే.. ప్రతిపక్ష, విపక్ష సభ్యులంతా చప్పట్లతో అసెంబ్లీని హోరెత్తించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీడబ్ల్యుసీ సీనియర్ సభ్యుడు ఏకే ఆంటోనీ తదితరులు ఫోన్ చేసి అచ్యుతానందన్‌ను అభినందించారు. పాలనా సంస్కరణల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వీఎస్.. రాష్ట్రంలో ఐటీ రంగ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగులను దోచుకుంటున్నారని ఆయన అన్నారు. వెలిక్కత్ శంకరన్ అచ్యుతానందన్ 1923 అక్టోబర్ 20వ తేదీన అళప్పుళ జిల్లాలోని ఉన్నప్ర గ్రామంలో ఓ కార్మిక కుటుంబంలో పుట్టారు. 1964లో సీపీఐ నుంచి సీపీఎం విడిపోయినప్పటికే ఆయన పార్టీ సభ్యుడు. 2006-11 సంవత్సరాల మధ్య ఆయన కేరళ సీఎంగా వ్యవహరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నేత. ఈసారి మళ్లీ వామపక్షం గెలిచినప్పుడు కూడా ఆయనను సీఎం చేస్తారని అనుకున్నా, ఆయన వయసు.. శారీరక పరిమితుల దృష్ట్యా ఆయన్ను కాదని పినరయి విజయన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.