93 ఏళ్ల వయసులో చకచకా అసెంబ్లీకి | VS Achuthanandan turns 93, attends Assembly | Sakshi
Sakshi News home page

93 ఏళ్ల వయసులో చకచకా అసెంబ్లీకి

Published Thu, Oct 20 2016 3:34 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

93 ఏళ్ల వయసులో చకచకా అసెంబ్లీకి

93 ఏళ్ల వయసులో చకచకా అసెంబ్లీకి

సాధారణంగా 70 ఏళ్ల వయసు వచ్చిందంటేనే కృష్ణా రామా అంటూ ఇంట్లో కూర్చుంటారు. అదే 90 ఏళ్లు దాటితే.. ఇక వాళ్లను ఇంట్లోవాళ్లు గాజుబొమ్మల కంటే జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ, కేరళలోని సీపీఎం కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్ మాత్రం 93 ఏళ్ల వయసులో కూడా చకచకా అసెంబ్లీకి వెళ్తున్నారు. అవును.. అచ్యుతానందన్‌కు 93 ఏళ్లు వచ్చాయి. పుట్టినరోజు నాడు కూడా ఆయన అసెంబ్లీకి యథావిధిగా వచ్చేశారు. తన ట్రేడ్ మార్కు తెల్ల చొక్కా, పంచె ధరించి ఆయన రాగానే పలవురు యువ ఎమ్మెల్యేలు పరుగున వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్ సభ తరఫున ఆయనకు అభినందనల చెప్పారు. ''సభలోనే అత్యంత సీనియర్ సభ్యుడైన అచ్చుతానందన్ 93వ పుట్టినరోజు సందర్భంగా ఈ సభ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది'' అని ఆయన ప్రకటించగానే.. ప్రతిపక్ష, విపక్ష సభ్యులంతా చప్పట్లతో అసెంబ్లీని హోరెత్తించారు. 
 
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీడబ్ల్యుసీ సీనియర్ సభ్యుడు ఏకే ఆంటోనీ తదితరులు ఫోన్ చేసి అచ్యుతానందన్‌ను అభినందించారు. పాలనా సంస్కరణల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వీఎస్.. రాష్ట్రంలో ఐటీ రంగ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగులను దోచుకుంటున్నారని ఆయన అన్నారు. వెలిక్కత్ శంకరన్ అచ్యుతానందన్ 1923 అక్టోబర్ 20వ తేదీన అళప్పుళ జిల్లాలోని ఉన్నప్ర గ్రామంలో ఓ కార్మిక కుటుంబంలో పుట్టారు. 1964లో సీపీఐ నుంచి సీపీఎం విడిపోయినప్పటికే ఆయన పార్టీ సభ్యుడు. 2006-11 సంవత్సరాల మధ్య ఆయన కేరళ సీఎంగా వ్యవహరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నేత. ఈసారి మళ్లీ వామపక్షం గెలిచినప్పుడు కూడా ఆయనను సీఎం చేస్తారని అనుకున్నా, ఆయన వయసు.. శారీరక పరిమితుల దృష్ట్యా ఆయన్ను కాదని పినరయి విజయన్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement