మోదీకి కురువృద్ధ నేత ఘాటు కౌంటర్ | When You Can't Eat, Toilet Not Needed: Left's Vs Takes On PM Modi | Sakshi
Sakshi News home page

మోదీకి కురువృద్ధ నేత ఘాటు కౌంటర్

Published Fri, May 13 2016 1:43 PM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

మోదీకి కురువృద్ధ నేత ఘాటు కౌంటర్ - Sakshi

మోదీకి కురువృద్ధ నేత ఘాటు కౌంటర్

తిరువనంతపురం: కేరళ సీపీఎం కురువృద్ధ నేత, మాజీ సీఎం వీఎస్ అచ్చుతానందన్ తనదైన శైలిలో ప్రధాని నరేంద్రమోదీపై ఘాటు విమర్శలు చేశారు. ఎంతసేపు స్వచ్ఛ భారత్, మరుగుదొడ్ల నిర్మాణం అని చెప్పే మోదీ.. ముందు దేశంలో చాలామందికి తినడానికి తిండి కూడా లేదనే విషయం గుర్తించాలని అన్నారు. అసలు తిండే లేనప్పుడు శౌచాలయం(మరుగుదొడ్డి) కట్టుకొని ఏం చేస్తారని ఆయన వినూత్న విమర్శ చేశారు.

ప్రస్తుతం సీపీఎం విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న ఆయన ఓ టీవీ చానెల్ తో మాట్లాడారు. ప్రధానంగా మోదీ కార్యక్రమాలపైనే ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. 'అతడు (ప్రధాని నరేంద్రమోదీ) ఎంతసేపు ప్రతి భారతీయుడికి శౌచాలయ్.. శౌచాలయ్.. శౌచాలయ్ అని పాడుతున్నారు. కానీ, తినడానికి తిండే లేనప్పుడు వాళ్లు ఆ శౌచాలయాన్ని ఎలా ఉపయోగించుకుంటారు' అని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement