ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరూ?..శశి థరూర్‌ సమాధానమిదే | Shashi Tharoor Was Asked Who Is PM Modi Alternative This Is His Reply | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరూ?..శశి థరూర్‌ సమాధానమిదే

Published Wed, Apr 3 2024 9:08 PM | Last Updated on Wed, Apr 3 2024 9:28 PM

Shashi Tharoor Was Asked Who Is PM Modi Alternative This Is His Reply - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలన్ని ప్రచారంపై దృష్టి సారించాయి. ముచ్చటగా మూడోసారి ఆధిక్యం సాధించి కేంద్రంలో చక్రం తిప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి  వచ్చేందుకు తీవ్ర కృషి చేస్తోంది. ఎవరికి వారే గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  

ఈ క్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వ్యక్తి ఎవరో చెప్పాలంటూ జర్నలిస్టులు ఆయన్ను అడిగిన ప్రశ్నకు థరూర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

‘పార్లమెంటరీ వ్యవస్థలో ఈ ప్రశ్న అసంబద్ధమైనది. అధ్యక్ష వ్యవస్థల్లో మాదిరి మనం ఒక వ్యక్తిని ఎన్నుకోవడం లేదు. మన దేశ వైవిధ్యం, బహుళత్వం, సమ్మిళిత వృద్ధిని సంరక్షించడం కోసం రూపొందించిన విధివిధానాలను పాటించే పార్టీ లేదా సంకీర్ణ కూటమిని ఎన్నుకుంటాం.

ఇక్కడ ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం మోదీకి ప్రత్యామ్నాయం అనుభవజ్ఞులైన, సమర్థులైన నాయకుల సమూహం. వారు తమ అహాన్ని పక్కన పెట్టి ప్రజల సమస్యలపై వాటిపై పోరాడతారు. అందులో నుంచి ప్రధానిగా ఎవరిని ఎన్నుకోవాలన్నది తర్వాతి విషయం. మన ప్రజాస్వామ్యాన్ని,  వైవిధ్యాన్ని పరిరక్షించడమే ప్రథమ ప్రాధాన్యం’ అని శశిథరూర్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

కాగా కేరళలోని తిరువనంతపురం నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న శశిథరూర్‌.. తాజా ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే బరిలోకి దిగారు. ఈ క్రమంలో బుధవారం మరోసారి కాంగ్రెస్‌ నుంచి ఎంపీ అభ్యర్ధిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఇప్పటి వరకు తిరువనంతపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఇరకరడ బీఊసీ పేం,ఇచి కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పోటీ చేస్తున్నారు. సీపీఐ నుంచి  పన్నియన్‌ రవీంద్రన్‌ పోటీ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement