
'శుభయాత్ర' ప్రచారకర్తగా మోహన్ లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కేరళ ప్రభుత్వం చేపట్టనున్న 'శుభయాత్ర' కార్యక్రమం ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు.
తిరువనంతపురం: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కేరళ ప్రభుత్వం చేపట్టనున్న 'శుభయాత్ర' కార్యక్రమం ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. గుడ్ విల్ అంబాసిడర్ గా ఆయనను ప్రభుత్వం ఎంపిక చేసింది. ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది.
రవాణా, విద్య, పబ్లిక్ వర్క్స్ శాఖలతో కలిసి కేరళ పోలీసులు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరగడంతో 'శుభయాత్ర'కు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ట్రాఫిక్ నిబంధనల పాటించాల్సిన ఆవశ్యకతను ప్రజలను వివరించనున్నారు.