మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన కోసం కేరళ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న ‘కుటుంబ శ్రీ’ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనూ అమలు
పేదరిక నిర్మూలనకు కేరళ తరహా విధానం
అధ్యయనానికి వెళ్లిన అధికారుల బృందం
సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన కోసం కేరళ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న ‘కుటుంబ శ్రీ’ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనూ అమలు చేసే దిశగా సర్కారు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని స్వయం సహాయక గ్రూపులను మరింత పటిష్టం చేసేందుకు కేరళలో అనుసరిస్తున్న విధానాలను అవలంభించడమే మేలని గ్రామీణాభివృద్ధి అధికారులు భావిస్తున్నారు.
ఇందులో భాగంగా కేరళలో అమలవుతున్న కుటుంబ శ్రీ కార్యక్రమాన్ని అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్త్రీనిధి బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ విద్యాసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది అధికారుల బృందం శుక్రవారం కేరళకు వెళ్లింది. ఈ బృందం సమర్పించే నివేదికలోని అంశాలను పరిశీలించాక రాష్ట్రంలో కుటుంబ శ్రీ కార్యక్రమ అమలుపై సర్కారు నిర్ణయం తీసుకోనుందని గ్రామీణాభివృద్ధి విభాగం ఉన్నతాధికారులు తెలిపారు.