కరెంట్ షాక్ నుంచి సామాన్యుడికి విముక్తి
నిన్న.. రూ.25,666 బిల్లు.. నేడు.. రూ.2,100కి తగ్గింపు
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆటో మొబైల్ రిపేర్ వర్క్‌షాప్ నిర్వాహకుడు లింగరాజుకు ఇటీవల వచ్చిన రూ.25,666 కరెంట్ బిల్లును అధికారులు సరి చేశారు. ఈమేరకు ఈ నెల 24న ‘సాక్షి’ జిల్లా ఎడిషన్‌లో ప్రచురితమైన ‘గుండె గుబిల్లు’ కథనంపై విద్యుత్ అధికారులు స్పందించారు.
బిల్లును రూ.2,100గా సరిదిద్దారు. అధికారులకు మొర పెట్టుకున్నా తన సమస్య పరిష్కారం కాలేదని, సాక్షిలో వెలువడిన కథనంతో ఊరట లభించిందని లింగరాజు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆయన ఇంట్లో మీటర్ సక్రమంగా పనిచేయడం లేదని అధికారులు కొత్తది అమర్చారు.
అక్టోబర్, నవంబర్ నెలల బిల్లును సిబ్బంది నమోదు చేయలేదు. డిసెంబర్‌లో ఏకంగా రూ.25,666 కరెంట్ బిల్లును లింగరాజు చేతిలో పెట్టారు. దీనిపై ‘సాక్షి’ లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు తప్పును సరిదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment