
కేరళ ఆలయాల్లో ఆరెస్సెస్ కార్యక్రమాలు బంద్..?
దేవాలయ ప్రాంగణాల్లో ఆరెస్సెస్ శిక్షణా కార్యక్రమాలను నిషేధించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది
తిరువనంతపురంః దేవాలయ ప్రాంగణాల్లో ఆరెస్సెస్ శిక్షణా కార్యక్రమాలను నిషేధించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. రాష్ట్రంలో ఆరెస్సెస్ శాఖల కార్యకలాపాలను పరిమితం చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ స్పష్టమైన చర్యను చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
కేరళ పోలీసు చట్టం 73 ప్రకారం ఇటువంటి కార్యకలాపాలను నిషేధించవచ్చని సిఫార్సు చేసిన న్యాయ శాఖ .. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వ అనుమతికోసం వేచి చూస్తోంది. దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ప్రతిపాదనకు ప్రతిస్పందనగా న్యాయ శాఖ తమ ఆదేశాలను ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శికి సమర్పించింది. శిక్షణ, వ్యాయామం, ఆత్మ రక్షణకు సంబంధించిన ఎటువంటి శారీరక శిక్షణలకూ కేరళ పోలీస్ చట్టం 73 ప్రకారం దేవాలయాల్లో అనుమతి లేదని న్యాయశాఖ సెక్రెటరీ బి జి హరీంద్రనాథ్ తెలిపారు.