సాక్షి, చెన్నై : చెన్నైలోని కేరళ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన ఓ హోటల్‌పై దాడి జరిగింది. థౌజండ్ నైట్‌లోని గ్రీమ్స్ రోడ్డులో గల హోటల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి 10.40 ప్రాంతంలో రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో హోటల్ అద్దాలు, సెక్యురిటీ చెక్‌పోస్టు ధ్వంసమయ్యాయి. కాగా, శమరిమల ఆలయంలోకి బుధవారం ఇద్దరు మహిళలు ప్రవేశించి దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై హిందుత్వవాదుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేసథ్యంలోనే కేరళ ప్రభుత్వ హోటల్‌పై దాడి జరిగి ఉండొచ్చని ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. (మహిళల ఆలయ ప్రవేశం.. కేరళలో తీవ్ర ఉద్రిక్తత)
సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని, నిందితులని పట్టుకుంటామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని కేరళ ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా 100 మంది పోలీసులను నియమించామని చెప్పారు. ఇదిలాఉండగా.. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం నేపథ్యంలో కేరళ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ సహా పలు హిందూ సంఘాలు గురువారం బంద్‌కు పిలుపునిచ్చాయి. అన్ని వయసుల స్త్రీలకు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment