సాక్షి, హైదరాబాద్ : బీజేపీ శాసన సభాపక్ష నేత కిషన్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్ అయింది. ఈ మేరకు ఆయన సోమవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. కిషన్‌రెడ్డి డాట్ కామ్ (జీకిషన్‌రెడ్డిడాట్‌ఓఆర్‌జీ) అనే తన వెబ్‌సైట్ ఈ రోజు ఉదయం నుంచి హ్యాక్ అయిందని డీజీపీకి తెలిపారు. పాకిస్థానీయులే ఈ పనిచేసి ఉంటారని తాను అనుమానిస్తున్నట్లు తెలిపారు.
గత పదేళ్లుగా తాను ఈ వెబ్‌సైట్‌ను నిర్వహించుకుంటున్నానని, తన దగ్గర పనిచేసే ఉద్యోగులు దానిని అప్‌డేట్ చేస్తుంటారని, ఎప్పటికప్పుడు తాను నిర్వహించే కార్యక్రమాలను, సేవలను రోజువారిగా వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తుంటారని చెప్పారు. సోమవారం ఉదయం తన ఉద్యోగి ఓ వార్తను అప్‌డేట్ చేసేందుకు ప్రయత్నించగా హ్యాకింగ్ గురైనట్లు గుర్తించామని చెప్పారు. పాకిస్థాన్‌కు చెందినవారు, కరడుగట్టిన దేశ ద్రోహులే ఈ పనిచేసి ఉంటారని తాను భావిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.
కిషన్‌రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్.. 'పాక్ ఉగ్రవాదులే'
Published Mon, Feb 26 2018 7:52 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment