మోడీ ఫాసిస్టని పాకిస్థానే అనలేదు
కావాలనే కేంద్రంతో కేసీఆర్ కయ్యం
తెలంగాణ ప్రభుత్వంపై పోరుకు సిద్ధం: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: ప్రధాన వుంత్రి నరేంద్రమోడీని ఫాసిస్టు అని పాకిస్థాన్ కూడా వ్యాఖ్యానించలేదని, అలాంటిది ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆయునను ఫాసిస్టుగా పేర్కొనటాన్ని తావుు తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆదివారం ఇక్కడ విలేకరులతో వూట్లాడుతూ పేర్కొన్నారు. కేసీఆర్ వ్యవహారాన్ని ప్రతిఘటించేందుకు తాము సమాయత్తమవుతున్నామని ఆయున చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం అయినందున బడ్జెట్ సమావేశాల వరకు రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టొద్దని తాము ముందుగా నిర్ణరుుంచుకున్నా కేసీఆర్ వ్యవహారశైలితో తాము పోరుబాట పట్టక తప్పట్లేదని వ్యాఖ్యానించారు. కావాలనే కేసీఆర్ కేంద్రప్రభుత్వంతో కయ్యం పెట్టుకుంటూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతి నేందుకు కారణమవుతున్నారని, ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి విఘాతంగా మారే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు కొం టామని కేసీఆర్ ప్రక టనిస్తున్నారే తప్ప ఆ రాష్ట్రంతో చర్చించేందుకు ప్రతినిధి బృందాన్ని పంపలేదని వివుర్శించారు. తమతో ఎవరూ చర్చించలేదని ఆ రాష్ర్ట సీఎం రమణ్‌సింగ్ తనతో అన్నట్టు కిషన్‌రెడ్డి చెప్పారు.
ఎన్నికల ప్రచారాన్ని హైదరాబాద్ సభతో ప్రారంభించి విజయవంతంగా నిర్వహించిన మోడీ మాదిరిగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు కూడా హైదరాబాద్‌పై ప్రత్యేక అభివూనం ఏర్పడిందని, కిషన్‌రెడ్డి చెప్పారు. జాతీయాధ్యక్షుడిగా నియుమితులైన తరువాత తొలి సమీక్ష హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తున్నారని, ఈనెల 21, 22 తేదీల్లో తెలంగాణలో ఆయన పర్యటిస్తున్నారని తెలి పారు. తొలిరోజు ఇంపీరియల్ గార్డెన్‌లో నగర నేతలతో, అనంతరం సెస్ హాలులో పార్టీ ఆఫీస్‌బేరర్ల సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. రెండో రోజు సరూర్‌నగర్ ఇండోర్‌స్టేడియంలో పార్టీ గ్రామ, పట్టణ, మండల, జిల్లా కమిటీలతో భేటీ అవుతారని చెప్పారు.