దేవయ్య గెలిస్తే కేంద్ర మంత్రి పదవి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
న్యూశాయంపేట: ‘కార్యకర్తలారా కష్టపడదాం... బీజేపీ, టీడీపీ బలపర్చిన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం దేవయ్య నామినేషన్ దాఖలు సందర్భంగా హన్మకొండలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. దేవయ్య గెలిస్తే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందన్నారు. 1969 ఉస్మానియాలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన డాక్టర్ దేవయ్య.. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.
కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, వరంగల్ స్మార్ట్‌సిటీ, హెరిటేజ్ సిటీ, అమృత్ తదితర పథకాలతోపాటు జాతీయ రహదారి పనులకు రూ.1,900 కోట్లు మం జూరు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు. ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ ప్రజ లకిచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. కాంగ్రెస్‌పార్టీకి డిపాజిట్ దక్కే పరి స్థితి లేదని, ప్రధానంగా బీజేపీ, టీడీపీ బలపర్చిన ఎన్‌డీఏ అభ్యర్థికి టీఆర్‌ఎస్ అభ్యర్థికి మధ్య పోటీ ఉం టుందన్నారు. సభ అనంతరం భారీర్యాలీతో బీజేపీ, టీడీపీ కార్యకర్తలు, నేతలు కలెక్టరేట్‌కు తరలివెళ్లి దేవయ్య నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.