నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు
అనంతపురం కల్చరల్ : బాలకృష్ణకు మతి భ్రమించి ప్రధాని మోదీపై ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని, తొలుత ఆయన భాషను మార్చుకోవాలని బీజేపీ నాయకులు హితవు పలికారు. ప్రధానిపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు శనివారం నిరసన తెలిపారు. స్థానిక టవర్‌క్లాక్ వద్ద బీజేపీ నాయకులు వేంకటేశ్వరరెడ్డి, లలిత్‌కుమార్, రత్నమయ్య తదితరులు మాట్లాడుతూ.. సినిమాల్లో హీరో వేషాలేసే బాలకృష్ణ నిజ జీవితంలో క్రిమినల్‌గా వ్యవహరించిన తీరు తెలుగువారందరికీ తెలిసిందేనన్నారు.
ఇన్ని రోజులు హోదాపై మౌనంగా ఉన్న ఆయన ఇప్పుడెందుకు నోరు పారేసుకుంటున్నారని ప్రశ్నించారు. సినిమా తీసిన నిర్మాతపైనే కాల్పులు జరిపి, శిక్ష నుంచి తప్పించుకోవడానికి మానసిక రోగిగా సర్టిఫికెట్టు తెచ్చుకున్న బాలకృష్ణకు ప్రధాని మోదీ గురించి మాట్లాడే హక్కు ఆయనకు ఎక్కడుందన్నారు?. అయితే పోలీసులు «అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను నిర్భదించడం సరికాదన్నారు.
బీజేపీ నాయకుల అరెస్టు
బీజేపీ కార్యాలయం నుంచి ఆ పార్టీ నాయకులు బాలకృష్ణకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీగా వస్తున్న బీజేపీ నాయకులకు, అప్పటికే అక్కడకు చేరుకున్న ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేసి టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. రెండు గంటల నిర్భందం అనంతరం వారిని విడిచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment