mla bakakrisna
-
బాలయ్యా..భాష మార్చుకోవయ్యా
అనంతపురం కల్చరల్ : బాలకృష్ణకు మతి భ్రమించి ప్రధాని మోదీపై ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని, తొలుత ఆయన భాషను మార్చుకోవాలని బీజేపీ నాయకులు హితవు పలికారు. ప్రధానిపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు శనివారం నిరసన తెలిపారు. స్థానిక టవర్‌క్లాక్ వద్ద బీజేపీ నాయకులు వేంకటేశ్వరరెడ్డి, లలిత్‌కుమార్, రత్నమయ్య తదితరులు మాట్లాడుతూ.. సినిమాల్లో హీరో వేషాలేసే బాలకృష్ణ నిజ జీవితంలో క్రిమినల్‌గా వ్యవహరించిన తీరు తెలుగువారందరికీ తెలిసిందేనన్నారు. ఇన్ని రోజులు హోదాపై మౌనంగా ఉన్న ఆయన ఇప్పుడెందుకు నోరు పారేసుకుంటున్నారని ప్రశ్నించారు. సినిమా తీసిన నిర్మాతపైనే కాల్పులు జరిపి, శిక్ష నుంచి తప్పించుకోవడానికి మానసిక రోగిగా సర్టిఫికెట్టు తెచ్చుకున్న బాలకృష్ణకు ప్రధాని మోదీ గురించి మాట్లాడే హక్కు ఆయనకు ఎక్కడుందన్నారు?. అయితే పోలీసులు «అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను నిర్భదించడం సరికాదన్నారు. బీజేపీ నాయకుల అరెస్టు బీజేపీ కార్యాలయం నుంచి ఆ పార్టీ నాయకులు బాలకృష్ణకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీగా వస్తున్న బీజేపీ నాయకులకు, అప్పటికే అక్కడకు చేరుకున్న ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేసి టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. రెండు గంటల నిర్భందం అనంతరం వారిని విడిచిపెట్టారు. -
ఎమ్యెల్యే బాలకృష్ణ దిష్టిబొమ్మ దహనం
కదిరి అర్బన్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లిపై అనుచిత వాఖ్యలు చేసిన హిందూపురం ఎమ్యెల్యే బాలకృష్ణ దిష్టిబొమ్మను శుక్రవారం స్థానిక వేమారెడ్డికూడలిలో బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ఎమ్యెల్యేగా ఉంటూ ప్రధానమంత్రి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. సంస్కారం లేకుండా మాట్లాడటం తగదని, పెద్దలను గౌరవిస్తూ మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తలుపుల గంగాధర్, రాజశేఖర్‌బాబు, ఆంజనేయులు, నాగేంద్రప్రసాద్, వేణుగోపాల్‌రెడ్డి, రామక్రిష్ణ, ఉత్తమర్రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు. -
బాలకృష్ణకు కార్మికుల కష్టాలు పట్టవా?
సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ బత్తలపల్లి: స్థానికులను కాదని ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను తీసుకువచ్చి వెట్టిచాకిరీ చేయించుకోవడమేకాక కూలి అడిగినందుకు ఎస్ఏ రావతార్ యాజమాన్యం దాడులు చేస్తే మానవత్వంతో స్థానికులు స్పందించారేగానీ స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ పట్టించుకోలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎస్ఏ రావతార్ ఫ్యాక్టరీలో అక్రమంగా తొలగించిన 183 మంది కార్మికులను పనిలోకి తీసుకోవాలని కోరుతూ వారికి సంఘీభావంగా చేపట్టిన పాదయాత్ర బృందం సోమవారం బత్తలపల్లికి చేరుకుంది. వీరికి స్వాగతం పలుకుతూ రాంభూపాల్ బత్తలపల్లికి విచ్చేశారు. అనంతరం ఆయన బహిరంగసభలో మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గంలోని పరిగి మండలంలో ఎస్ఏ రావతార్ ఫ్యాక్టరీలో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులు సమస్యలు పరిష్కరించుకునేందుకు యూనియన్ పెట్టుకునే ప్రయత్నం చేయడంతో కార్మికులను అన్యాయంగా తొలగించారన్నారు. కలెక్టరేట్ ఎదుట ఈ నెల 21నుంచి తలపెట్టిన నిరవధిక దీక్షలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజనేయులు, రైతు సంఘం జిల్లా నాయకులు జంగాలపల్లి పెద్దన్న, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఎస్‌హెచ్ బాషా, పట్టణ కార్యదర్శి పోలా లక్ష్మినారాయణ, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జేవీ రమణ, అధ్యక్షుడు ఎల్.ఆదినారాయణ, గొట్లూరు రాముడు, హైదర్‌వలీ, ఖాదర్‌బాషా, రమణ, మండల కార్యదర్శి వడ్డె రమేష్, హమాలీ యూనియన్ నాయకులు మందల క్రిష్టా, మధ్యాహ్నభోజన ఏజెన్సీ నిర్వాహకురాలు లక్ష్మిదేవి, ఎస్ఎఫ్ఐ నాయకులు నాగార్జున, సాయికుమార్, కాశీం తదితరులు పాల్గొన్నారు.