జవాన్లు నోరు మూయించారు!
ధామన్‌గావ్(మహారాష్ట్ర): సరిహద్దులో పదేపదే కాల్పుల ఉల్లంఘనలతో దుందుడుకుగా వ్యవహరించిన పాకిస్తాన్ ను మన సైన్యం నోరు మూయించిందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వ్యాఖ్యానించారు. ఇది పాకిస్థాన్‌కు తగిన గుణపాఠంగా ఆయన పేర్కొన్నారు. వారు మళ్లీ ఇలాంటి దుస్సాహనానికి పాల్పడరు. మన జవాన్లు వారి నోరు మూయించారు' అని మోదీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని ధామన్‌గావ్ ర్యాలీలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యం తీవ్ర ప్రతిఘటనతో సరిహద్దులో పాకిస్థాన్ కాస్త వెనక్కు తగ్గిన నేపథ్యంలో మోదీ ఇలా స్పందించారు.
గత తొమ్మిది రోజుల నుంచి పాకిస్తాన్ జవాన్లు కాల్పులకు తెగబడటంతో ఆ దేశ సరిహద్దుకు దగ్గరగా ఉన్న వారంతా ఇళ్లు వదిలి పోయిన సంగతి మోడీ గుర్తు చేశారు. 'మీ అందరికీ ప్రభుత్వం తరుపున హామీ ఇస్తున్నారు. మరలా తిరిగి నివాసాలు ఏర్పరుచుకోవటానికి ప్రభుత్వ తగిన పరిహారం అందుతుని తెలిపారు.శుక్రవారం ఎన్నికల ర్యాలీలో ఉన్న మోదీ మరోమారు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. అసలు పాకిస్తాన్ బోర్డర్ లో ఏమి జరుగుతుందన్న దానిపై కాంగ్రెస్ పార్టీ చాలా బిజీగా ఉందని మోదీ ఎద్దేవా చేశారు.