Fascist
-
ఫాసిస్టులా కేసీఆర్: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి సొమ్ముతో అహంకారం, ఫాసిస్టు ధోరణితో వ్యవహరిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవినీతి సొమ్ముతో రాజకీయాలను, ప్రజాస్వామ్యాన్ని శాసించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ మీదనే ఉందన్నారు. పాలేరులో ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తామంటే సమయం ఇవ్వలేదన్నారు. పాలేరులో పార్టీని గెలిపించే బాధ్యతను యూత్ కాంగ్రెస్ తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ ఇతర ముఖ్యనేతలు సమావేశంలో పాల్గొన్నారు. కాగా ఖమ్మంలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ ఖర్చులను పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థి ఖాతాలో జమచేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో వారు గురువారం విలేకరులతో మాట్లాడారు. -
మోడీ ఫాసిస్టని పాకిస్థానే అనలేదు
కావాలనే కేంద్రంతో కేసీఆర్ కయ్యం తెలంగాణ ప్రభుత్వంపై పోరుకు సిద్ధం: కిషన్‌రెడ్డి హైదరాబాద్: ప్రధాన వుంత్రి నరేంద్రమోడీని ఫాసిస్టు అని పాకిస్థాన్ కూడా వ్యాఖ్యానించలేదని, అలాంటిది ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆయునను ఫాసిస్టుగా పేర్కొనటాన్ని తావుు తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆదివారం ఇక్కడ విలేకరులతో వూట్లాడుతూ పేర్కొన్నారు. కేసీఆర్ వ్యవహారాన్ని ప్రతిఘటించేందుకు తాము సమాయత్తమవుతున్నామని ఆయున చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం అయినందున బడ్జెట్ సమావేశాల వరకు రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టొద్దని తాము ముందుగా నిర్ణరుుంచుకున్నా కేసీఆర్ వ్యవహారశైలితో తాము పోరుబాట పట్టక తప్పట్లేదని వ్యాఖ్యానించారు. కావాలనే కేసీఆర్ కేంద్రప్రభుత్వంతో కయ్యం పెట్టుకుంటూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతి నేందుకు కారణమవుతున్నారని, ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి విఘాతంగా మారే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు కొం టామని కేసీఆర్ ప్రక టనిస్తున్నారే తప్ప ఆ రాష్ట్రంతో చర్చించేందుకు ప్రతినిధి బృందాన్ని పంపలేదని వివుర్శించారు. తమతో ఎవరూ చర్చించలేదని ఆ రాష్ర్ట సీఎం రమణ్‌సింగ్ తనతో అన్నట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారాన్ని హైదరాబాద్ సభతో ప్రారంభించి విజయవంతంగా నిర్వహించిన మోడీ మాదిరిగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు కూడా హైదరాబాద్‌పై ప్రత్యేక అభివూనం ఏర్పడిందని, కిషన్‌రెడ్డి చెప్పారు. జాతీయాధ్యక్షుడిగా నియుమితులైన తరువాత తొలి సమీక్ష హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తున్నారని, ఈనెల 21, 22 తేదీల్లో తెలంగాణలో ఆయన పర్యటిస్తున్నారని తెలి పారు. తొలిరోజు ఇంపీరియల్ గార్డెన్లో నగర నేతలతో, అనంతరం సెస్ హాలులో పార్టీ ఆఫీస్‌బేరర్ల సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. రెండో రోజు సరూర్‌నగర్ ఇండోర్‌స్టేడియంలో పార్టీ గ్రామ, పట్టణ, మండల, జిల్లా కమిటీలతో భేటీ అవుతారని చెప్పారు. -
కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన వెంకయ్య
హైదరాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఫాసిస్టు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంకయ్యనాయుడు ఖండించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేక పదం ఫాసిజం అని ఆయన అన్నారు. ఫాసిస్టు అన్న పదాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేసీఆర్‌ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఒట్టెందుపోకడలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశం గవర్నర్ పరిధిలోకి వస్తుందని 2014 ఏపీ పునర్విభజన బిల్లులో ఉందని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయిన ఏపీ పునర్విభజన బిల్లు గత ప్రభత్వమే ఆమోదించిందని చెప్పారు. పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదం పొందిన వెంటనే... తాము స్వాగతిస్తున్నామంటూ సంబరాలు చేసుకున్నప్పుడు తెలియలేదా అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాజకీయ వివాదాలు దేశానికి అంతమంచిది కాదని కేసీఆర్‌కు హితవు పలికారు. తమకు అన్ని రాష్ట్రాలు సమానమేనని వెల్లడించారు. రెండు రాష్ట్రాలకు కేంద్రం సమన్యాయం చేస్తుందని చెప్పారు. కేసీఆర్ చౌకబారు మాటలకు తన స్థాయి విడిచి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. తెలంగాణ బిల్లులో ఉన్న అంశాలనే అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. -
కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన వెంకయ్య
-
ప్రపంచంలో పెద్ద ఫాసిస్టు కేసీఆర్
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ: ప్రపంచంలో పెద్ద ఫాసిస్టు సీఎం కేసీఆర్ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రధాని మోడీని కేసీఆర్ ఫాసిస్టు అనడాన్ని ఖండిస్తూ, ఆ వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో శనివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గవర్నర్‌కు శాంతిభద్రతల అధికారాలను ఇచ్చే అంశాన్ని యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పెట్టింది. పార్లమెంటులో చట్టం ఆమోదమైంది. కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి సోనియా ఇంటికి వెళ్లి పాదాభివందనం చేసి, ఫోటోలు దిగారు. హైదరాబాద్‌కు వచ్చి గుర్రాలు, ఒంటెలు, ఏనుగుల మీద ఊరేగారు. గవర్నర్‌కు శాంతిభద్రతల అధికారాన్ని ఇచ్చిన విషయం అప్పుడు కేసీఆర్‌కు తెలియదా..? తెలిస్తే.. మరి, అప్పుడే ఎందుకు వ్యతిరేకించలేదు’ అని ప్రశ్నించారు. 21, 22 తేదీల్లో అమిత్ షా రాక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈనెల 21, 22 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. 21వ తేదీన రాష్ట్ర పదాధికారుల సమావేశం, 22వ తేదీన కార్యకర్తల భేటీ, మీడియా అధిపతులతో సమావేశమవుతారని చెప్పారు. న్యాయం ఉంది: సురేష్ వ్యాఖ్య గవర్నర్‌కు శాంతిభద్రతల అధికారాలు ఇవ్వడంలో న్యాయం ఉందని సినీనటుడు, బీజేపీ నేత సురేష్ అన్నారు. తెలంగాణలో అభద్రతాభావంతోఉన్నవారికి ఊరటనిస్తుందని చెప్పారు.