కేసీఆర్పై నిప్పులు చెరిగిన వెంకయ్య
హైదరాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఫాసిస్టు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంకయ్యనాయుడు ఖండించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేక పదం ఫాసిజం అని ఆయన అన్నారు. ఫాసిస్టు అన్న పదాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేసీఆర్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఒట్టెందుపోకడలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్లో శాంతిభద్రతల అంశం గవర్నర్ పరిధిలోకి వస్తుందని 2014 ఏపీ పునర్విభజన బిల్లులో ఉందని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అయిన ఏపీ పునర్విభజన బిల్లు గత ప్రభత్వమే ఆమోదించిందని చెప్పారు. పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదం పొందిన వెంటనే... తాము స్వాగతిస్తున్నామంటూ సంబరాలు చేసుకున్నప్పుడు తెలియలేదా అంటూ కేసీఆర్ను ప్రశ్నించారు. రాజకీయ వివాదాలు దేశానికి అంతమంచిది కాదని కేసీఆర్కు హితవు పలికారు. తమకు అన్ని రాష్ట్రాలు సమానమేనని వెల్లడించారు. రెండు రాష్ట్రాలకు కేంద్రం సమన్యాయం చేస్తుందని చెప్పారు. కేసీఆర్ చౌకబారు మాటలకు తన స్థాయి విడిచి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. తెలంగాణ బిల్లులో ఉన్న అంశాలనే అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.