Andhra Pradesh Reorganisation Act
-
పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టిపెట్టాలి
-
AP Government: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది, పది సంస్థల విభజనలో ఆలస్యంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సంస్థల విభజన ఆలస్యంతో ఏపీ నష్టపోతుందని పిటిషన్లో పేర్కొంది. షెడ్యూల్ తొమ్మిది, పదిలో ఉన్న సంస్థల విలువ దాదాపు రూ.1,42,601 కోట్లు. ఈ సంస్థలు దాదాపు 91శాతం తెలంగాణలోనే ఉన్నాయి. విభజన అంశంపై తెలంగాణ స్పందించకపోవడం ఏపీ ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. తక్షణమే సంస్థల విభజనకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. చదవండి: (నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్) -
ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం, ఎంపీల ఒత్తిడి ఫలించింది: సజ్జల
సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అద్భుతంగా పాలిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం శ్రీకాళహస్తీశ్వరస్వామిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డికి.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కాలని దేవుడ్ని ప్రార్థించా. ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం, ఎంపీల ఒత్తిడి ఫలించింది. కేంద్ర హోంశాఖ అజెండాలో ఏపీ విభజన సమస్యల అంశం చేర్చడం సంతోషం. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినవి ఉన్నాయి. మళ్లీ న్యాయ సమీక్షకు పోకుండా సమస్యను పరిష్కరించాలి' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: (ఆ సమస్యల పరిష్కారం కోసం ఏడేళ్లుగా పోరాడుతున్నాం: మల్లాది విష్ణు) -
ఆ సమస్యల పరిష్కారం కోసం ఏడేళ్లుగా పోరాడుతున్నాం: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం ఏడేళ్లుగా పోరాడుతున్నామని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా రాష్ట్ర సమస్యలపైనే చర్చించారు. పార్లమెంట్‌లోనూ మా ఎంపీలు విభజన హామీలపై అనేకమార్లు ప్రశ్నించారు. కేంద్ర ఇప్పటివరకూ పెద్దన్న పాత్ర పోషించలేదు. ఈనెల 17న కేంద్ర హోంశాఖ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలు నెరవేర్చాలి. పోలవరానికి పూర్తి నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తి చేయాలి' అని మల్లాది విష్ణు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చదవండి: (AP: కొత్త జిల్లాలపై సూచనల పరిశీలనకు కమిటీ) -
మూడు అంశాలే ప్రామాణికం!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 అమల్లోకి వచ్చిన తేదీ నాటికి ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ప్రాతిపదికన గోదావరి జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నీటి లభ్యత 75 శాతం కంటే అధికంగా ఉన్న మిగులు జలాలపై పూర్తి అధికారాన్ని దిగువ రాష్ట్రానికే బచావత్ ట్రిబ్యునల్ కట్టబెట్టడాన్ని ప్రస్తావించనుంది. విభజన నేపథ్యంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కే మిగులు జలాలపై పూర్తి హక్కులు కల్పించడాన్ని కూడా గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటుకు ప్రాతిపదికగా తీసుకోవాలని కోరాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య గోదావరి, కృష్ణా నదీ జలాల వినియోగంలో తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు ఈనెల 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశాన్ని నిర్వహించిన విషయం విదితమే. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం(ఐఆర్డబ్ల్యూడీఏ)–1956 ప్రకారం ప్రతిపాదనలు పంపితే గోదావరి జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని షెకావత్ పేర్కొన్నారు. ఇందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖరరావు అంగీకరించారు. సీఎంల ఒప్పందాలే ప్రాతిపదికగా.. దేశవ్యాప్తంగా నదీ జలాల వివాదాలను పరిష్కరించి పరీవాహక ప్రాంతాలకు నీటిని కేటాయించేందుకు 1969 ఏప్రిల్ 10న ఆర్ఎస్ బచావత్ నేతృత్వంలో డీఎం బండారీ, డీఎం సేన్ సభ్యులుగా ట్రిబ్యునల్ ఏర్పాటైంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసుకున్న ఒప్పందాలు ప్రాతిపదికగా బచావత్ ట్రిబ్యునల్ గోదావరి జలాలను పంపిణీ చేసింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 1,430 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ 1980లో ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పర్ గోదావరి(జీ–1) నుంచి శబరి(జీ–12) వరకు నదీ పరీవాహక ప్రాంతాన్ని 12 ఉప పరీవాహక ప్రాంతాలుగా ట్రిబ్యునల్ విభజించింది. ప్రతి ఉప పరీవాహక ప్రాంతంలో రాష్ట్రాలకు కేటాయించగా మిగులుగా ఉన్న నికర జలాలను వినియోగించుకునే వెసులుబాటును దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టింది. 75 శాతం కంటే అధికంగా నీటి లభ్యత ఉన్న మిగులు జలాలపై పూర్తి హక్కును ఆంధ్రప్రదేశ్‌కే కలి్పంచింది. 25 ఏళ్ల పాటు ఈ తీర్పు అమల్లో ఉంటుందని, ఆ తర్వాత సమీక్షించుకోవచ్చని సూచించింది. రెండో జీడబ్ల్యూడీటీ తెరపైకి.. అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీలో తీసుకున్న నిర్ణయంతో జీడబ్ల్యూడీటీ–2 తెరపైకి వచ్చింది. జీడబ్ల్యూడీటీ–2 ఏర్పాటుకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలపై కేంద్రానికి మూడు ప్రతిపాదనలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ప్రతిపాదనలు ఇవీ.. ► ఉమ్మడి రాష్ట్రం విడిపోయే నాటికి అంటే 2014 జూన్ 2 నాటికి గోదావరి జలాల్లో 660 టీఎంసీలను వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, 472 టీఎంసీలు వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేశాయి. మరో 116 టీఎంసీలను వాడుకునే సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్, 178 టీఎంసీలు ఉపయోగించుకునేలా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అంటే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు 776, తెలంగాణకు 650 వెరసి 1,426 టీఎంసీలను కేటాయించాలి. ► బచావత్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు జీ–1 నుంచి జీ–12 వరకు పరీవాహక రాష్ట్రాలకు కేటాయించగా మిగులుగా ఉన్న నికర జలాలను దిగువ రాష్ట్రమైన ఏపీకే కేటాయించాలి. ► 75 శాతం కంటే నీటి లభ్యత అధికంగా ఉండే మిగులు జలాలపై పూర్తి అధికారాన్ని బచావత్ ట్రిబ్యునల్ దిగువ రాష్ట్రమైన ఏపీకే ఇచ్చింది. ఆ మేరకు నీటి కేటాయింపులు చేస్తే, జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన మేరకు నదుల అనుసంధానం ప్రాజెక్టు పనులు చేపడతాం. -
అసెంబ్లీ సీట్ల పెంపు: కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశం అంతటా అసెంబ్లీ సీట్ల పెంపు జరిగినప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనూ సీట్ల పెంపు జరుగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ చట్టం ప్రకారం.. ప్రత్యేకంగా రెండు రాష్ట్రాల్లోనే అసెంబ్లీ సీట్లను పెంచడానికి అవకాశం లేదని తెలిపారు. గత పాలకులు ఏపీ విభజన చట్టంలో ఇష్టం ఉన్నట్లు అనేక అంశాలు పెట్టారని.. అసెంబ్లీ సీట్ల పెంపు అంశం రాత్రికి రాత్రి తీసుకువచ్చిందని అభిప్రాయపడ్డారు. దేశంలో సీట్ల పెంపు పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆలోచన చేయలేదని, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై న్యాయ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ స్థానాలపై పెంపుపై మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అన్నారు. కశ్మీర్లో అసెంబ్లీ సీట్ల పెంపు..! గురువారం ఢిల్లీలో జమ్మూకశ్మీర్ బ్లాక్ లెవల్ ప్రజాప్రతినిధులతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ వేగవంతంగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని స్థానిక నేతలకు పిలుపు నిచ్చారు. ‘మార్చి, ఏప్రిల్ లో జమ్మూకశ్మీర్ లో పర్యటిస్తా. కశ్మీర్లో అభివృద్ధిని వేగవంతం చేస్తాం. కశ్మీర్ లో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ అంశపై మరింత లోతుగా ఆలోచిస్తున్నాం. దానికి పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది. మే నెలలో జమ్మూ కశ్మీర్ ఔట్ రీచ్ కార్యక్రమం పెడుతున్నాం. కేంద్ర మంత్రులంతా బ్లాక్ లెవల్‌కు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ పన్నాగాలు పారలేదు. స్థానిక ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి సహకరించారు. బాధ్యులపై కఠిన చర్యలు... ఢిల్లీలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆస్తుల విధ్వంసం, మరణాలకు కారకులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం. హింసకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని అన్నారు. -
ప్రారంభమైన కేంద్ర హోంశాఖ సమావేశం
-
ముగిసిన కేంద్ర హోంశాఖ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంపై కేంద్ర హోంశాఖ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో బుధవారం సాయంత్రం ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్కే జోషి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా సమస్యలపై అధికారులు రెండున్నర గంటలపాటు సుధీర్ఘంగా చర్చించారు. షెడ్యూల్ 9,10లలోని సంస్థల విభజనపై ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే సింగరేణి కాలరీస్, ఆర్టీసీ, సివిల్ సప్లై కార్పొరేషన్ బకాయిలు, పలు కార్పొరేషన్ల విభజన అంశాలపై అధికారులు చర్చించారు. అయితే ఈ సమావేశంలో ఏపీ భవన్ విభజనపై చర్చ జరగలేదు. ప్రస్తుతం ఏపీ భవన్‌ను రెండు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయని అధికారులు హోంశాఖకు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలు లెవనెత్తిన అంశాలపై కేంద్ర హోంశాఖ వివరణ కోరింది. అయితే ఈ సమావేశం ఫలప్రదంగా సాగిందని ఇరు రాష్ట్రాల సీఎస్‌లు తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత నార్త్ బ్లాక్ వద్ద ఇరు రాష్ట్రాల సీఎస్‌లు నార్త్ బ్లాక్ వద్ద కరచాలనం చేసుకున్నారు. -
ఏపీ ఆస్తులేవీ తెలంగాణకు ఇవ్వడం లేదు: బుగ్గన
సాక్షి, అమరావతి: ఏపీ ఆస్తులేవీ తెలంగాణకు ఇవ్వడం లేదని, తెలంగాణ భవనాలను మాత్రమే తెలంగాణకు ఇచ్చేశామని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకే ఏపీ సీఎం, ముఖ్యమైన కేబినెట్ మంత్రులు, అధికారులు వెళ్లి.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సంబంధించిన సమస్యలపై చర్చించారని తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్‌లోని భవనాలు 2024 వరకు మనకు చెందుతాయని, ఆ తర్వాత అవి తెలంగాణకే చెందుతాయని స్పష్టం చేశారు. పదేళ్ల కాలపరిమితి ఉన్నా..గతంలో చంద్రబాబు హుటాహుటిన ఎందుకు అమరావతికి పరిగెత్తుకొని వచ్చారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి.. ఓటుకు కోట్లు కేసులో వీడియోలకు అడ్డంగా దొరికిపోవడంతోనే ఆయన అమరావతికి పారిపోయి వచ్చిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆయనతోపాటు హుటాహుటిన ప్రభుత్వ ఉద్యోగులు రావడంతో.. భార్యలు అక్కడ, భర్తలు ఇక్కడ.. పిల్లలు అక్కడ తల్లిదండ్రులు ఇక్కడ అన్నట్టుగా ఉద్యోగుల పరిస్థితి తయారైందని, వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అప్పుడు హుటాహుటిన పారిపోయి వచ్చి.. ఇప్పుడు భవనాలు వదిలేసి వచ్చామని అంటున్నారని టీడీపీ తీరును తప్పుబట్టారు. ఈ భవనాలు కావాలంటే నాలుగేళ్లపాటు మున్సిపల్ బిల్లులు, కరెంటు, వాటర్ బిల్లులు కట్టాల్సి ఉంటుందని, గత ఐదేళ్లూ వాడని భవనాలను.. తిరిగి అక్కడికి వెళ్లి ఇంకో ఐదేళ్లు వాడే పరిస్థితి లేదని, ఎలాగైనా 2024లో ఆ భవనాలు తెలంగాణకు తిరిగి ఇవ్వాల్సినవే కనుక ఇచ్చివేశామని తెలిపారు. నీళ్లు, నిధుల పంపకాల వంటి పెద్ద పెద్ద విషయాల్లో సామరస్యంగా పంపకాలు చేసుకోవాలన్న సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మొన్న ముఖ్యమంత్రుల సమావేశంలో తొమ్మిదో, పదో షెడ్యూల్లోని అంశాలు, నీళ్లు, నిధులు పంపకాలపై చర్చించామని తెలిపారు. రాజకీయాల కోసం టీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధమని చంద్రబాబు బాహాటంగా చెప్పినప్పుడు లేని అభ్యంతరం.. ఇప్పుడు మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి, కృష్ణ, గోదావరి నీళ్లు తెచ్చుకోవడానికి విశాల దృక్పథంతో ఆలోచిస్తే తప్పేంటని ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాల సఖ్యతతో ఉండి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు కోసం చర్యలు తీసుకుంటే.. దానిని అభినందిచాల్సిందిపోయి.. ప్రతిపక్ష విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. -
సామరస్యమే సరైన పరిష్కారం
ఏ సమస్యల పరిష్కారానికైనా కాలగతి ఎంత ముఖ్యమో అనువైన వాతావరణం కూడా అంతే ముఖ్యమని హిపోక్రిటస్ పేర్కొన్నాడు. విభజనానంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గతంలో చాలా చిక్కుముళ్లు ఏర్పడటం వాస్తవమే కానీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తుతం ఉన్న సుహృద్భావ వాతావరణం మిగిలి ఉన్న సమస్యల పరిష్కారానికి అత్యంత అనుకూలతను ఏర్పరుస్తోంది. ఉద్యోగుల విభజన వంటి కొన్ని అంశాలు గతంలోనే దాదాపుగా పరిష్కృతమయ్యాయి. మిగిలి ఉన్న రెండు ప్రధాన అంశాలు షెడ్యూల్ 9 షెడ్యూల్ 10కి చెందిన సంస్థల విభజన. కోర్టుల వరకు వెళ్లిన షెడ్యూల్ 10కి చెందిన సంస్థల విభజన అంశాన్ని ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా పరిష్కరించుకోవచ్చు. ఇక 9వ షెడ్యూల్‌కి చెందిన వాణిజ్యపరమైన సంస్థల విషయంలో కూడా సామరస్యంగా పరిష్కరించుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు. సాధారణంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు అంత సులభంగా పరిష్కారం కావు. పంతాలు, పట్టింపులు ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి మామూలుగా అంత ప్రధానం కాని అంశాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. రాష్ట్రాల విభజనలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా విభజన రెండు ప్రాంతాల సమ్మతితో జరగనప్పుడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన రెండు ప్రాంతాల సమ్మతితో జరగలేదు. విభజన జరిగే నాటికి కే చంద్రశేఖరరావు అప్పుడే ఉద్యమ నేతగా ఉద్యమాన్ని నడిపి అధికార బాధ్యతలు చేపట్టారు. ఉద్యమ స్ఫూర్తితో అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ఉద్యమానికి కారణభూతమైన అంశాలు వారి ఆలోచనలను ప్రభావితం చేయటం సహజమే. విభజన చట్టం లోపభూయిష్టంగా, అస్పష్టంగా ఉండటం కూడా విభజన అంశాల పరిష్కారంలో సమస్యలకు కారణమైంది. కాలక్రమేణా ఆవేశాలకు బదులు ఆలోచనలు ప్రధాన భూమిక పోషించే కొద్దీ సమస్యల పరిష్కారానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. సమస్యల పరిష్కారానికి కాలగతి ఎంత ముఖ్యమో అనువైన వాతావరణం కూడా అంతే ముఖ్యమని హిపోక్రిటస్ మహనీయుడు పేర్కొన్నాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య మిగిలి ఉన్న సమస్యల పరిష్కారానికి నేడు ఇలాంటి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది . కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న సుహృద్భావ వాతావరణమే ఈ సమస్యల పరిష్కారానికి సరైన అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగుల విభజన పూర్తయినట్లే! నేడు మిగిలి ఉన్న విభజన సమస్యల పరిష్కారాన్ని గురించి ఆలోచించే ముందు గత ఐదేళ్లలో ఈ అంశాల పరిష్కారంలో పురోగతిని సమీక్షించుకుందాం. ప్రప్రథమంగా పరిష్కారమైన అంశం అఖిల భారత సర్వీస్ అధికారుల విభజన. దీనికోసం కేంద్ర ప్రభుత్వమే ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. చాలా త్వరగా మొదటి ఆరునెలల్లోనే అఖిల భారత సర్వీసు అధికారుల విభజన పూర్తయి రెండు రాష్ట్రాలకు వాళ్ళ కేటాయింపు అయిపోయింది. సరైన విధానాన్ని కమిటీ అనుసరించలేదని భావన కొందరు అధికారులకు ఉన్నా, వారు వారి రాష్ట్ర కేడర్లలో ఇమిడిపోయి పనిచేయడం ప్రారంభించారు. ఇక రెండో ప్రధాన అంశం ఉద్యోగుల విభజన. దీనికోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి కమలనాథన్ గారి నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఒకవైపు ప్రత్యేక తెలంగాణకు, మరొక వైపు సమైక్యాంధ్రాకు జరిగిన ఉద్యమాలలో ఉద్యోగస్తులు ప్రధాన పాత్ర పోషించిన నేపథ్యంలో విభజన అంశంలో నిర్ణయాలు కొన్ని వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉన్నందున ఉద్యోగస్తుల కేటాయింపు చాలా జటిలమైన సమస్యగా తయారైంది. కానీ కమలనాథన్ ఆధ్వర్యంలో కమిటీ చాలా ఓర్పుతో ఈ జటిలమైన సమస్యను పరిష్కరించింది. ఈరోజు కోర్టు సమస్యల దృష్ట్యా ఆగిపోయిన ఒకటి రెండు కేడర్లు తప్పితే మిగిలిన అన్ని కేడర్ల అధికారులను, ఇతర సిబ్బందిని రెండు రాష్ట్రాల మధ్య కేటాయించారు. ఇది ఒక క్లిష్ట సమస్యను విజయవంతంగా పరిష్కరించినట్లేనని చెప్పాలి. ఇక పరిష్కారం కాకుండా మిగిలి ఉన్న రెండు ప్రధాన అంశాలు షెడ్యూల్ 9 షెడ్యూల్ 10కి చెందిన సంస్థలు. షెడ్యూల్ 10 సంస్థలన్నీ ప్రధానంగా శిక్షణ నైపుణ్య తర్ఫీదు కోసం ఏర్పాటు చేసిన సంస్థలు. రాష్ట్ర విభజన చట్టంలో ఈ సంస్థలను పొందుపరిచేటప్పుడు చాలా పొరపాట్లు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల సంఘంలాంటి రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి చట్టబద్ధమైన మహిళా సంస్థల దాకా అన్నింటిని ఈ షెడ్యూల్లో పొందుపరచారు. రెండు రాష్ట్రాల మధ్య ఒక సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడడానికి ఈ సంస్థలకు సంబంధించిన విభజన ప్రధాన పాత్ర చోటుచేసుకుంది. దీనికి కారణం విభజన చట్టం చాలా లోపభూయిష్టంగా ఉండటమే. ఆస్తుల పంపకంలో ఇచ్చిపుచ్చుకోవచ్చు విభజన చట్టంలోని సెక్షన్ 75ను అనుసరించి ఇవి తమకే వర్తిస్తాయి కాబట్టి తెలంగాణ ఆరవ భాగంలోని ప్రకరణలకు అనుగుణంగా ఈ సంస్థలు తమవేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాదించింది. చివరకు ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లి ఈ సంస్థలు రెండు రాష్ట్రాల మధ్య విభజించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, దానిలో కేంద్ర ప్రభుత్వానికి అధికారాన్ని కల్పిస్తూ వెసులుబాటు కల్పించారు. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థల మూలనిధిని రెండు రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికపై కేటాయిస్తూ ఆస్తులు ఈ సంస్థలు ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయి అని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా లేవంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో కేసు వేసింది. ఈ అంశాన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవచ్చు. ఈ సంస్థలను కొత్త రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌కు నిధుల అవసరం ఎంతైనా ఉంది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం గానీ, తెలంగాణ గానీ సమకూరిస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకొని ఆ నిధులతో ఈ సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. దీనికి అనుగుణంగా ఎక్కడి సంస్థలు ఆ రాష్ట్రంలోనే ఉండిపోతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా వీటిని ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన నిధులు ఏపీకి వస్తాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఇదే ఉత్తమమైన మార్గం. ఇక రెండవ ప్రధాన అంశం షెడ్యూల్ 9 సంస్థల విభజన. ఇవి అన్నీ వాణిజ్యపరమైన సంస్థలు. ఈ సంస్థల విభజనకు విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ షీలా భిడే నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాదాపు 90 సంస్థల్లో 40 సంస్థలకు ఆ కమిటీ తన సిఫార్సులను అందజేసింది. మంచి వ్యక్తిత్వం, నిబద్ధత కలిగిన అధికారిణి షీలా భిడే. ఆ కమిటీ సిఫార్సులను రెండు రాష్ట్రాలు ఆమోదించి ఈ అంశాన్ని కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఈ వాణిజ్యపరమైన సంస్థల ప్రధాన కార్యాలయాలు విభజన చట్టంలోని అంశాలకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికపై రెండు రాష్ట్రాల మధ్య విభజితమవుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాకు వచ్చే ఆస్తులను తెలంగాణ రాష్ట్రం మార్కెట్ ధరకు తీసుకుంటే ఉత్తమం. ఆ వచ్చిన నిధులతో ఈ సంస్థల కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది అంగీకారయోగ్యం కాకపోతే పరస్పర అవగాహనతో కొన్ని భవనాలను తెలంగాణ, కొన్ని భవనాలను ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన భవనాలను మార్కెట్ ధరకు అమ్ముకుని ఆ వచ్చిన నిధులతో ఈ సంస్థలను స్వరాష్ట్రంలోనే ఏర్పాటు చేసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లభిస్తుంది. పరస్పర అవగాహన తప్పనిసరి ఇక చట్టంలోని లోపం మూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు సంబంధించి వాయిదా వేసిన పన్నులు, వారి ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నందున ఇక్కడే చెల్లిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రానికి చట్టంలోని ఈ లోపాన్ని సవరించవలసిందిగా అభ్యర్థించింది. చట్టసవరణకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది కనుక తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛందంగా ఈ నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయటం మంచి సంకేతాలను పంపిస్తుంది. ఇది వివాదాలకు తావు లేని అంశం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ బాకీలను తెలంగాణ చెల్లిం చాలని, లేదు.. ఆంధ్రప్రదేశే మాకు చెల్లించాలని ఒక వివాదం నడుస్తూ ఉన్నది. సామరస్యపూర్వక వాతావరణంలో ఈ అంశాన్ని పరిష్కరించుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు. నాకు తెలిసి నేను ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు ఈ అంశంపై జరిగిన చర్చలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాయిదా పద్ధతుల్లో చెల్లించటానికి సమయం అడిగింది కానీ ఈ బాకీలు సరికావని ఏనాడు పేర్కొనలేదు. చాలా జటిలమైన సమస్య వెంటనే పరిష్కారం అవడానికి అవకాశం లేని సమస్య నదీ జలాల పంపిణీ. ఇది కేవలం తెలంగాణ–ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. నదీ పరీవాహక ప్రాంతానికి చెందిన అన్ని రాష్ట్రాలకు చెందిన అంశం. రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఎన్ని వివాదాలు ఉన్నాయో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య కూడా అన్ని వివాదాలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం కేవలం నిపుణులతో కూడిన కమిటీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించవలసి ఉంటుంది. ఈ సమస్యలకు పరిష్కారం లభించటానికి కొంత సమయం పట్టవచ్చు. రెండు రాష్ట్రాలలో ఈ విభజన అంశాల పరిష్కారానికి ఏర్పడిన కమిటీలోని అధికారులకు సర్వీసులో సమర్థులైన, నిష్పాక్షికతకు పేరొందిన ఆఫీసర్లుగా మన్నన ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశాల పరిష్కారాన్ని వీరికి వదిలేసి వారి సూచనలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తే త్వరితగతిలో అందరికీ ఆమోదయోగ్యంగా పరస్పర అవగాహనతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
ఏ రాష్ట్ర కేసులు ఆ రాష్ట్ర హైకోర్టుకే బదిలీ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ఏర్పడే నాటికి దాఖలైన అప్పీళ్లు, కోర్టు ధిక్కార పిటిషన్లు, పునః సమీక్షా పిటిషన్లపై విచార ణ జరిపే పరిధి ఉమ్మడి హైకోర్టుకు ఉందం టూ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 40(3) చెబుతున్న నేపథ్యంలో, ఇలాంటి వ్యాజ్యాలపై ఏ రాష్ట్ర హైకోర్టు విచారించాలన్న అం శంపై తెలంగాణ హైకోర్టు ఫుల్ బెంచ్ మం గళవారం స్పష్టతనిచ్చింది. ఉమ్మడి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్లు, రిట్ అప్పీళ్లు, కోర్టు ధిక్కార వ్యాజ్యాలు, పునః సమీక్షా పిటిషన్లను రాష్ట్రానికి చెందిన వాటిని ఆ రాష్ట్రానికి బదలాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే ఇరు రాష్ట్రాలతో ముడిపడి ఉన్న వ్యాజ్యాల విషయం లో మాత్రం, ఆ వ్యాజ్యాల్లోని ప్రధాన అంశం ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుందో నిర్ణయించి, దాన్ని ఆ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేసే విషయంలో సీజే పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఒక్కో కేసు ఆధారంగా సీజే జారీ చేసే పాలనాపరమైన ఉత్తర్వుల ఆధారంగా ఆ కేసుల బదలాయింపు జరపాల్సి ఉంటుందని పేర్కొంది. సర్వీసు వివాదాల విషయంలోనూ దీన్నే అనుసరించాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఫుల్‌బెంచ్ తీర్పు వెలువరించింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 40(3) వల్ల ఏపీ హైకోర్టు న్యాయవాదులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, కాబట్టి ఈ వ్యవహారంపై తగిన ఆదేశాలు జారీ చేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం తెలంగాణ హైకోర్టు సీజేకి లేఖ రాసింది. ఈ లేఖను పరిశీలించిన సీజే దాన్ని పిల్ పరిగణించారు. ఈ వ్యాజ్యంలో కీలక అంశాలు ముడిపడి ఉన్నందున దీనిపై ఫుల్‌బెంచ్‌ను ఏర్పాటు చేయడమే మేలని నిర్ణయించి ఆ మేర ఫుల్ బెంచ్‌ను ఏర్పాటు చేశారు. -
విభజన హామీలపై మళ్లీ ‘తెల్ల’మొహం
చంద్రబాబునాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త డ్రామాకు తెరతీసింది. ప్రత్యేక ప్యాకేజీనుంచి మొదలుపెట్టి పోలవరం కట్టేస్తామంటూ ప్రగల్భాలు పలకడం వరకు అడుగడుగునా తన అసమర్థతను నిరూపించుకుంటూ, కేంద్రానికి దాసోహమంటూ సాగిలబడినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను అణుమాత్రం కూడా నెరవేర్చలేకపోయిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు శ్వేతపత్రం పేరిట రివర్స్ గేమ్ ఆడటం మొదలుపెట్టేసింది. కేంద్రం నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా విభజన హామీలపై ఒత్తిడి తేకుండా కేవలం ధర్మపోరాట దీక్షల పేరుతో రాజకీయం చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంతో పోరాటం చేయడం లేదు. దురదృష్టమేమిటంటే ఈ శ్వేతపత్రాల బాగోతాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకం నమ్ముతున్నట్లు లేదు. కేంద్రంలో బీజేపీతో పొత్తు కలిపి నాలుగున్నరేళ్లు అధికారం అనుభవించి, సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగడమే కాకుండా రాష్ట్రంలో కూడా బీజేపీని ప్రభుత్వంలో చేర్చుకుని పబ్బం గడిపిన చంద్రబాబునాయుడు గత ఏడునెలలుగా చేస్తున్న డ్రామా పరాకాష్టకు చేరుకుంది. అది శ్వేతపత్రాల డ్రామా. మొదటి శ్వేత పత్రంలో.. విభజన చట్టంలోని హామీల అమలు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చట్టంపై శ్వేతపత్రం పేరుతో విడుదల చేసిన అంశాలను పరిశీలిస్తే.. టీడీపీ ప్రభుత్వ అసమర్థతవల్లే ఆ పనులేమీ జరగలేదని అర్థమవుతుంది. ప్రత్యేక హోదా అవసరమే లేదని వాదించిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు కేంద్రంపై ఆరోపణలు చేస్తోంది. అలాగే పోలవరం నిర్మించే బాధ్యత కేంద్ర పరిధిలో ఉండగా తామే కడతామని పట్టుబట్టి మరీ తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడేమో పోలవరానికి కేంద్రం నిధులే ఇవ్వలేదని వీధులకెక్కుతోంది. ఈ నేపథ్యంలో శ్వేతపత్రంలోని అసలు వాస్తవాలను పరిశీలిద్దాం. విభజన హామీలు అమలు కాకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుణ్యమేనని అధికార యంత్రాంగం బాహాటంగానే వ్యాఖ్యానిస్తోంది. ఎందుకంటే కేంద్రంలో భాగస్వామిగా నాలుగేళ్లకు పైగా ఉన్నప్పటికీ విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయకుండా వంగి వంగి దండాలు పెట్టడమే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం విభజన హామీల అమలు కోసం అడిగిన పాపాన పోలేదు. అంతే కాకుండా దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల్లో అత్యుత్తమ ప్రధాన మంత్రి ఒక్క మోదీ మాత్రమేనని స్వయంగా చంద్రబాబు కీర్తించిన విషయంకూడా తెలిసిందే. కేంద్రం నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా విభజన హామీలపై ఒత్తిడి తేకుండా కేవలం ధర్మపోరాట దీక్షల పేరుతో రాజకీయం చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంతో పోరాటం చేయడం లేదు. ప్రత్యేకహోదాను అడ్డుకున్నదెవరు? ప్రధానంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబునాయుడే కారణమని రాష్ట్ర ప్రజానీకంతో పాటు దేశం అంతటికీ తెలుసు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పకముందే చంద్రబాబు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా.. ప్రత్యేక హోదా కన్నా మేలైన ప్యాకేజీని కేంద్రం ఇస్తానందంటూ చంద్రబాబు బాహాటంగా ప్రకటనలు చేశారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఏమీ రావంటూ కేంద్రానికి అవకాశం ముందుగానే బాబు ఇచ్చేశారని సీనియర్ ఐఏఎస్ అధికారులు పేర్కొం టున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక హోదా ఉద్యమం తారస్థాయికి చేరుతున్న సమయంలో.. ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రంతో బేరసారాలు నడిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట ప్రభుత్వానికి అప్పగించేందుకు కేంద్రం అంగీకరించడంతో ప్రత్యేక సహాయానికి సీఎం చంద్రబాబు అంగీకరించారు. దాంతో సెప్టెంబరు 7, 2016న అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక సహాయాన్ని ప్రకటించారు. విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టుల ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అదే రోజున అర్ధరాత్రి విలేకరుల సమావేశాన్ని పెట్టి చంద్రబాబు స్వాగతించారు. ఆ మరుసటి రోజే శాసనసభలో కేంద్రానికి అభినందనలు తెలుపుతూ తీర్మానం చేశారు.. ఆ తరువాత విదేశీ ఆర్థిక సాయంతో ప్రాజెక్టుల ద్వారా వద్దని హడ్కో, నాబార్డు ద్వారా ఆర్థిక సాయం అందించాలంటూ ముఖ్యమంత్రి స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు. అంతెందుకు పది నెలల క్రితం అంటే.. ఈ ఏడాది íఫిబ్రవరి 27వ తేదీన ఉండవల్లిలో ప్రజావేదికలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ హోదా వల్ల ఏమి వస్తుందని, పోలవరానికి 40 వేల కోట్లు రావని, 16 వేల కోట్లు రెవెన్యూ లోటు రాదని, పరిశ్రమలకు రాయితీలు వస్తాయంటూ మభ్యపెడుతున్నారంటూ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కంటే మేలైన ప్యాకేజీ కేంద్రం ఇస్తానందని, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని బాబు ప్రత్యేక హోదాపై తన వ్యతిరేకతను మరోసారి దేశానికి చాటి చెప్పారు. అంతే కాకుండా ప్రతిపక్ష నేత నేతృత్వంలో ప్రత్యేక హోదా పోరును తారస్థాయి తీసుకువెళ్తున్న సమయంలో పోరాటంలో పాల్గొనే వారిని జైళ్లకు పంపిస్తామనడమే కాకుండా పీడీ కేసులు పెడతామంటూ బాబు హెచ్చరికలు చేశారు. నాలుగేళ్ల పాటు ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు వైఖరి రాష్ట్రానికి నష్టం తెస్తుందనే భావనతో ప్రతిపక్ష నేత హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడమే కాకుండా వైఎస్ఆర్సీపీ ఎంపీల చేత రాజీనామా చేయించడంతో రాష్ట్ర ప్రజానీకం అంతా వైఎస్ఆర్సీపీకి బాసటగా నిలుస్తోందని, ప్రత్యేక హోదాపై ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉన్నట్లు గ్రహించిన చంద్రబాబు ఇక దిక్కు లేక ఒక పక్క కేంద్రంలోని పెద్దలతో లోపాయికారిగా కుమ్మకై బయటకు మాత్రం ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చనందుకు కేంద్రంలోని బీజెపీతో తెగతెంపులంటూ ప్రకటించారనే విషయం తేటతెల్లమైంది. ప్రత్యేక హోదా ఇవ్వద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని ప్రతిపక్ష నేత అసెంబ్లీలోనూ, బయట పలుసార్లు చెప్పినప్పటికీ బాబు పట్టించుకోలేదు. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వై.వి.రెడ్డి, సభ్యుడు గోవిందరావుల లిఖిత పూర్వక ప్రతులను ప్రతిపక్ష నేత చూపించినా బాబు పట్టించుకోలేదు. ప్రతిపక్షనేత గతంలో ఏమి చెప్పారో ఇప్పుడు అదే విషయాన్ని ప్రత్యేక హోదా విషయంలో బాబు చెప్పడమే విడ్డూరం. ప్రత్యేకహోదా వల్ల అన్నీ వస్తాయని ఏ జీవోలో ఉందో చూపెట్టాలంటూ హేళన చేస్తూ చంద్రబాబు గతంలో మాట్లాడిన విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం ఎన్నటికీ మరవలేరు. పోలవరం.. ఆమడదూరం! విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టును వంద శాతం ఖర్చుతో తామే పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ను ఏర్పాటు చేసి.. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు సిద్ధమైంది. కానీ.. పీపీఏతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోకుండా, నిర్మాణ బాధ్యతలను అప్పగించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తూ వచ్చింది. దాంతో సెప్టెంబరు 7, 2016న పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. నాబార్డు ద్వారా నిధులు విడుదల చేస్తామని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకూ రూ.10,069.66 కోట్లను ఖర్చు చేస్తే.. కేంద్రం రూ.6,727.26 కోట్లను విడుదల చేసింది. రూ.3,342.40 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ.. 2010–11 ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే రూ.7,158.53 కోట్లను విడుదల చేస్తామని సెప్టెంబరు 7, 2016న కేంద్రం ప్రకటించింది. అందులో ఇప్పటివరకూ విడుదల చేసిన నిధులు పోనూ మరో రూ.431.27 కోట్లను కేంద్రం విడుదల చేయాలి. ఇందులో రూ.399 కోట్లను విడుదల చేస్తూ సెప్టెంబరు 5న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సమాచారం పంపింది. ఇప్పటివరకూ విడుదల చేసిన నిధుల వినియోగానికి సంబంధించిన ధ్రువపత్రాలను పంపాలని కోరింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ యూసీలను పంపలేదు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను నెల రోజుల్లోగా పంపాలని మార్చి 12, 2015న పీపీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ.. ఆగస్టు 16, 2017 వరకూ అంటే 28 నెలలు జాప్యం చేసి రూ.57,940.86 కోట్లతో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది..వాటిలో భారీ ఎత్తున తప్పులు ఉన్నట్లు సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) తేల్చింది. అంచనా వ్యయం భారీగా పెరగడానికి సహేతుకమైన కారణాలు చెబితే.. ఆమోదించి, నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కానీ.. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం సహేతుకమైన సమాధానాలు చెప్పడం లేదని కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు. సీఎం బాబు కమీషన్ల కోసం కక్కుర్తి పడకుండా పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి అప్పగించి ఉంటే.. ఈ పాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉండేది. జిల్లాల నిధుల్లో గోల్మాల్ వెనుకబడిన ఉత్తరాంద్ర, రాయలసీమలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇస్తామని కేంద్రం విభజన చట్టంలో పేర్కొంది. ఆ విభజన చట్టం ప్రకారం ఐదేళ్ల కాలంలో 24,350 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే ఆ ప్రతిపాదనలు అసమగ్రంగా ఉండటంతో తిప్పి పంపడమే కాకుండా అన్ని నిధులు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి ఒత్తిడి తేకుండా కేంద్రం కోరినట్లు ఏడాదికి జిల్లాకు 100 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాల్సిందిగా కేంద్రానికి లేఖ రాశారు. ఎక్కడ 24,350 కోట్లు ఎక్కడ ఐదేళ్లలో 3,500 కోట్లు. ముఖ్యమంత్రే స్వయంగా జిల్లాకు ఏడాదికి 100 కోట్ల రూపాయల చొప్పున ఇస్తే సరిపోతుందని లేఖ రాయడంతో కేంద్రం జిల్లాకు 50 కోట్ల రూపాయల చొప్పున ఇస్తామని పేర్కొంది. వెనకబడిన జిల్లాలకు కేంద్రం విడుదల చేసిన నిధులను నిబంధనల మేరకు ఆ జిల్లాల్లో వ్యయం చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించడంతో తొలుతే కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయి తనిఖీలకు వస్తామని హెచ్చరించింది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం పంపిన వినియోగ పత్రాలను కేంద్రం తప్పుపట్టింది. దీంతో వెనుకబడిన జిల్లాలకు 1,050 కోట్ల రూపాయలను విడుదల చేసిన తరువాత మిగతా నిధులను విడుదల చేయలేదు. దీనిపై ఇప్పటికీ కూడా చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు. పీఆర్పీ బకాయిల ఎగవేతపై కేంద్ర నజర్ రెవెన్యూ లోటు రూ. 16,000 కోట్లలో ఏకంగా రూ. 3,920 కోట్లు కేంద్రం నుంచి రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వయంకృతాపరాధమే. 2014 నుంచి 2015 మార్చి వరకు పీఆర్సీ బకాయిలను ఉద్యోగులకు చెల్లించకుండా బకాయిలు పెట్టింది. బకాయిలు పెట్టడంతో వ్యయం చేయకుండా ఆ మొత్తాన్ని రెవెన్యూ లోటుగా ఎలాగ పరిగణిస్తామని కేంద్రం నిలదీయడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పీఆర్సీ బకాయిలను రాష్ట్ర విభజన జరిగిన తొలి ఏడాదిలోనే ఉద్యోగులకు చెల్లించేసి ఉంటే రెవన్యూ లోటు కింద 3,920 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చేవి. మరో పక్క దుగరాజపట్నం పోర్టు ఫీజబిలిటీ కాదని, మరో ప్రత్యామ్నాయ పోర్టును ప్రతిపాదించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో పెద్ద పోర్టుగా కేంద్రం అంగీకరించిన దుగరాజపట్నం పోర్టును ప్రతిపాదించకుండా ఏకంగా రామాయపట్నం పోర్టును మేజర్ పోర్టు నుంచి మైనర్ పోర్టుగా మార్చేసి రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని జీవో జారీ చేసేసింది. ఇక విశాఖకు రైల్వే జోన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలకు ఏకాభిప్రాయం లేదు. అధికార టీడీపీకి చెందిన ఎంపీల్లోనే రైల్వే జోన్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. కేంద్రం రైల్వే జోన్‌పై ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. మరో పక్క వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ఇనుప ఖనిజం ఎక్కడ నుంచి సరఫరా చేస్తారని కేంద్రం అడుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నోరు ఎత్తడం లేదు. రాజధాని నిర్మాణానికి సమగ్ర నివేదిక ఏది? ఇక రాజధాని నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఇటీవల వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించలేదు. తొలుత రాజధానికి నాలుగు లక్షల కోట్ల రూపాయల నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు అవసరమని, కనీసం 1.35 లక్షల కోట్ల రూపాయలు అవసరమని పేర్కొన్న చంద్రబాబు ప్రతీ ఏడాది బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. అయితే ఇటీవల రాజధాని నిర్మాణానికి 1,09,623 కోట్ల రూపాయలు అవసరం అవుతాయంటూ 39,937 కోట్ల రూపాయల సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు. పైగా కేంద్ర ప్రభుత్వం తొలుత ఇచ్చిన 1,500 కోట్ల రూపాయలను తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి వినియోగించేసింది. కేంద్రం దీనిపై విస్మయం వ్యక్తం చేసింది. పక్కా భవనాల నిర్మాణానికి కేంద్రం నిధులిస్తే తాత్కాలిక సచివాలయానికి ఎలాగ వినియోగిస్తారంటూ నిలదీసింది. ఈ నిర్వాకంతో రాజధాని నిర్మాణానికి మొత్తం 2,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. ఆ తరువాత కేంద్రానికి డీపీఆర్ పంపినప్పటికీ ఆ డీపీఆర్‌ను ఆమోదింపచేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎటువంటి ఒత్తిడి చేయకుండా కేవలం ధర్మపోరాట దీక్షల పేరుతో కేంద్రం అన్యాయం చేసిం దంటూ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇటీవల వరకు ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారి ధర్మపోరాట దీక్షలపై ఇతర అధికారుల దగ్గర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడైనా ప్రభుత్వం దీక్షలు చేస్తుందా అంటూ ఆ అధికారి ప్రశ్నించడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రంపై ఒత్తిడి చేసి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయకుండా ధర్మపోరాట దీక్షలు చేయడం వల్ల రాష్ట్రం నష్టపోతుందన్నారు. రాష్ట్రం నష్టపోయినా పరవాలేదు.. మనకు రాజకీయం ముఖ్యం అనే రీతిలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని కూడా ఆ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. జాతీయ విద్యాసంస్థలపై కల్లబొల్లి కబుర్లు విభజన చట్టం కింద రాష్ట్రంలో ఏర్పాటుచేయాల్సిన జాతీయ విద్యాసంస్థలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్వేతపత్రంలో కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయితేనే వాటిలో వివిధ విభాగాలు, ల్యాబ్‌లు, ఇతర పరిశోధనశాలల ఏర్పాటు చేయడానికి వీలుంటుంది. ఒక్కో విద్యాసంస్థకు అనేక భవనాలు నిర్మించాల్సి ఉంటుందని, నిర్మాణాలు ఒక్కరోజులోనో, నెలలోనో పూర్తయ్యేది కాదని చెబుతున్నారు. ఏదైనా నిర్మాణానికి సంబంధించి అవసరమైన మేరకు నిధులు వెచ్చించి ఆ పనులు పూర్తయ్యాక తదుపరి పనులకు నిధులు వినియోగిస్తుంటారు. అంతే తప్ప ఒకేసారి భవనానికి అయ్యే మొత్తాన్ని ఎవరూ విడుదల చేయరు, ఖర్చుచేయరు. విడతల వారీగానే ఆనిర్మాణాల బడ్జెట్ నిధులు విడుదల అవుతుంటాయి. అలాగే నియామకాల విషయంలోనూ ప్రవేశపెట్టే కోర్సుల వారీగా నియామకాలు చేపడుతుంటారు. కానీ చంద్రబాబునాయుడు ఈ వాస్తవాలను కప్పిపుచ్చి జాతీయ విద్యాసంస్థల అంశాన్ని రాజకీయంగా వినియోగించుకోవడానికి శ్వేతపత్రంలో నిధులు ఇవ్వలేదని, నియామకాలు చేయలేదని పొందుపరిచారని పేర్కొంటున్నారు. విభజన చట్టం ప్రకారం 11 జాతీయ విద్యాసంస్థల్లో 5 (ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీడీఎం)లు ప్రారంభమయ్యాయి. ఐఐపీఈ, ఎన్‌ఐడీఎంలు కూడా తాత్కాలిక భవనాల్లో పనిచేస్తున్నాయి. సెంట్రల్ వర్సిటీ, ఏఐఐఎంఎస్‌లు కూడా తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నాయి. ట్రైబల్ వర్సిటీ ప్రారంభం కావలసి ఉంది. విచిత్రమేమంటే రాష్ట్రంలో ఏర్పాటు అయ్యే ఈ సంస్థలకు భూములను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాలి. అలా సమకూర్చిన భూమికి కూడా చంద్రబాబునాయుడు విలువ గట్టి తాను 131.33 కోట్లు ఇచ్చానని చెబుతుండటం విశేషం. ఈ సంస్థలకు ఇప్పటివరకు కేంద్రం 845.42 కోట్లు ఇచ్చింది. అయితే వీటికి 12746 కోట్లు కావాలని కేంద్రం ఇచ్చింది చాలా తక్కువని బాబు వాదిస్తున్నారు. దశలవారీగా పూర్తయ్యే ఈ సంస్థలకు విడతల వారీగా నిధులు విడుదల అవుతుంటాయని, దాన్నీ చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటుండటం విచిత్రంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగున్నరేళ్లుగా కేంద్రంలో తన మంత్రులను కొనసాగించిన బాబు విద్యాసంస్థలకు నిధుల గురించి ఏనాడూ అడిగిన పాపాన పోలేదు. కేంద్ర బడ్జెట్లో ప్రతి ఏటా అరకొర నిధులు కేటాయిస్తున్నట్లు స్పష్టంగా తెలిసినా దానిపై ఏనాడూ నోరెత్తిన పాపాన పోలేదు. - సీహెచ్ మాణిక్యాలరావు, సాక్షి ప్రతినిధి -
అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం స్పష్టత
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయాలను కీలకమలుపు తిప్పనున్న నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యం కాదని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబునాయుడు తమ రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలను పెంచాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి అర్జీలు పెట్టగా కేంద్రం ఈ ప్రకటన చేసింది. విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలను పెంచాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో పేర్కొన్నప్పటికీ అది సాధ్యం కాదని పేర్కొంది. కాగా, తెలంగాణలోని 119 స్థానాలను 153కు, ఏపీలోని 175 స్థానాలను 225కు పెంచాలని విభజన చట్టంలో పొందుపరిచారు. -
ఏపీలో విలీన మండలాలపై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఒక్క కలంపోటుతో ఏపీలో విలీనం చేశారంటూ హైకోర్టులో వేసిన పిల్‌పై ఇరు పక్షాల వాద ప్రతివాదనలు ముగిశాయి. నియోజకవర్గాల పునర్విభజన చేయకుండా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం చెల్లదని పేర్కొంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఈ పిల్ వేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్.ఎస్.వి.భట్ల ధర్మాసనం బుధవారం ఈ పిల్‌ను మరోసారి విచారించింది. ఇరుపక్షాల వాద ప్రతివాదనల అనంతరం తీర్పును తర్వాత ప్రకటిస్తామని తెలి పింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్పిస్తూ... ఒక నియోజకవర్గంలోని ఓటర్లను మరో నియోజకవర్గానికి బదిలీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్నారు. బయటనుంచి వచ్చిన ఒత్తిళ్లకు ఈసీ తలొగ్గిందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన చట్ట ప్రకారం చేయాలన్నా రు. దీనిపై ఈసీ తరఫు న్యాయవాది ప్రతివాదన చేస్తూ.. ఏపీ పునర్విభజన చట్టం కింద ఏడు మండలాల్ని ఏపీలోని నియోజకవర్గాల్లో కలిపామన్నారు. ఇలా చేయడం వల్ల రెండు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల సంఖ్య యథాతథంగానే ఉన్నాయన్నారు. -
‘ముందస్తు’కు ముంపు మండలాల చిక్కు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ముంపు మండలాల ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్ర పునర్విభజన తర్వాత 2014లో పోలవరం ప్రాజెక్టు కోసం 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు పార్లమెంట్ ఆమోదం తెలిపినప్పటికీ విలీన గెజిట్ మాత్రం ఇంకా వెలువడలేదు. దీంతో ఈ మండలాలు ఉన్న మూడు నియోజక వర్గాల ఓటర్ల జాబితాలో మార్పులు చేసే అంశంపై ఎన్నికల సంఘం ఎటూ తేల్చలేకపోతోంది. ఓటరు జాబితాలో సవరణ చేస్తేనే... రాష్ట్ర పునర్విభజన తర్వాత భద్రాచలం, బూర్గంపాడు, కూనవరం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, రామచంద్రాపురం మండలాలను ఏపీలో విలీనం చేశారు. ఈ ఏడు మండలాలు ప్రస్తుతం భద్రాచలం, అశ్వారావు పేట, పినపాక నియోజక వర్గాల్లో ఉన్నాయి. దీంతో ఓటర్లు ఆంధ్రాలో, ఎమ్మెల్యేలు తెలంగాణలోనూ ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఈ మూడు నియోజక వర్గాల ఓటర్ల జాబితాలో సవరణ చేస్తేనే ఎన్నికలకు మార్గం సుగమం కానుంది. -
విభజన సమస్యలు పరిష్కరించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృత అంశాలు ఉన్నాయని, తెలంగాణలో కొన్ని అంశాలు పరిష్కారం కావాల్సి ఉందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి తెలంగాణ ప్రభుత్వం వివరించింది. రాజ్యసభ సభ్యుడు పి.చిదంబరం నేతృత్వంలోని కేంద్ర హోం శాఖ స్టాండింగ్ కమిటీ శుక్రవారం సమావేశమై రాష్ట్ర విభజన అపరిష్కృత సమస్యలను తెలుసుకుంది. అపరిష్కృత అంశాలపై రాష్ట్ర సీఎస్ ఎస్కే జోషి ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తం 15 అంశాలను తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం కాలపరిమితితో సమస్యలు పరిష్కరించాలని, ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలని, 10వ షెడ్యూలు సంస్థల ఆస్తులు అందుబాటులోకి వచ్చేలా చేయాలని సీఎస్ కోరారు. హైదరాబాద్‌లో ఖాళీ చేసిన ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం వాడుకునేలా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా అంశాలపై తగిన సిఫారసులు చేయాలని స్థాయీ సంఘానికి విన్నవించారు. నదీ జలాల పంపిణీపై.. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం పరిధిలోని సెక్షన్ 3 కింద తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కృష్ణా నదీ జలాలను అన్ని రాష్ట్రాల మధ్య తిరిగి పంపిణీ చేపట్టాలని కోరాం. కానీ ఇప్పటివరకు కేంద్రం ట్రిబ్యునల్‌కు రెఫర్ చేయలేదు. కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్–2 అవార్డు ఇంకా ఇవ్వలేదు. నదీ జలాలపై తెలంగాణ హక్కులను ఏపీ విస్మరిస్తోంది. వ్యవస్థీకృత విధానం లేకుండా పోయింది. ఇప్పటివరకు కృష్ణా నదీ జలాల పంపిణీపై అపెక్స్ కౌన్సిల్ ఒకేసారి సమావేశమైంది. పట్టిసీమ విషయంలో బచావత్ అవార్డు అమలు కాలేదు. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలి. పోలవరం బ్యాక్ వాటర్ ద్వారా భద్రాచలం సమీప ప్రాంతం ముంపునకు గురయ్యే అంశంపై అధ్యయనానికి ఆదేశాలు ఇవ్వాలి మౌలిక వసతులపై... తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం, ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. 4,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సంస్థను ఎన్టీపీసీ స్థాపించాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో సమీకృత స్టీలు ప్లాంటు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఇంకా అధ్యయన దశలోనే ఉంది. తెలంగాణలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో రహదారి వ్యవస్థను కేంద్ర జాతీయ రహదారుల సంస్థ మెరుగుపరచాల్సి ఉంది. ముఖ్యమైన అంశాలు ఇవీ.. - శాసనసభ స్థానాలు: ఈ చట్టం ప్రకారం తెలంగాణలో శాసనసభ స్థానాల సంఖ్య 119 నుంచి 153కు పెరగాల్సి ఉంది. దీని తాజా పరిస్థితి తెలియకుండా పోయింది. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడం పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలపై ప్రభావం చూపింది. ఈ మూడు ఎస్టీ నియోజకవర్గాలు. తెలంగాణలో ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల సంఖ్యపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఇంకా తేల్చలేదు. - హైకోర్టు విభజన: హైకోర్టు విభజన జరగకపోవడం తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఉమ్మడి హైకోర్టులో మొత్తం 61 మంది న్యాయమూర్తులకు గాను 29 మంది న్యాయమూర్తులు పనిచేస్తుండగా ఇందులో ఆరుగురే తెలంగాణకు చెందినవారు. హైకోర్టు బార్ రెండుగా విడిపోయి హైకోర్టు ఆవరణలోనే పలుమార్లు ఆందోళనలు చోటు చేసుకున్నాయి. - రెవెన్యూ పంపిణీ: కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన నిధులు రూ.1,630 కోట్లు ఏపీ సంచిత ఖాతాలో ఉన్నాయి. ఇవి తెలంగాణకు రావాల్సి ఉంది. 13వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా రూ.1,132 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. - బయటి ఆస్తుల పంపిణీ: ఉమ్మడి ఏపీ బయట ఉన్న ఏకైక ఆస్తి ఢిల్లీలోని ఏపీ భవన్ ఒక్కటే. దీని పంపకానికి ఏపీ ఇచ్చిన రెండు ప్రతిపాదనలు తెలంగాణ పరిశీలనలో ఉన్నాయి. - ఆస్తులు, అప్పుల పంపిణీ: ఆపరేషనల్ యూనిట్స్‌ను భౌగోళికత ఆధారంగా పంపిణీ చేయాలి. కేంద్ర హోం శాఖ ఇచ్చిన స్పష్టత ప్రకారం ప్రధాన కార్యాలయాలు ఏ ప్రాంతంలో ఉంటే ఆయా రాష్ట్రాలకే చెందుతాయి. అయితే ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ ఫుడ్స్, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సంస్థల విషయంలో ప్రధాన కార్యాలయం అనే పదానికి నిర్వచనం అవసరమవుతోంది. - షెడ్యూలు 9 సంస్థలు: ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కో కోసం సంస్థల విభజన ఇంకా పూర్తికాలేదు. మొత్తం 91 సంస్థలకు గాను 78 సంస్థల విభజనపై స్పష్టత వచ్చింది. - ఏపీహెచ్ఎంఈఎల్: ఈ సంస్థలో సింగరేణి సంస్థకు 81.54 శాతం ఈక్విటీ ఉంది. సింగరేణిలో తెలంగాణకు 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. అయితే షీలాభిడే కమిటీ మాత్రం ఏపీహెచ్ఎంఈఎల్ సంస్థ ఏపీలో ఉన్నందున ఆ సంస్థ ఏపీకి చెందుతుందని సిఫారసు చేయడం చట్ట విరుద్ధం. -
‘గతిలేకనే బీజేపీతో బాబు తెగతెంపులు’
సాక్షి, న్యూఢిల్లీ: అంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై టీడీపీ ఆడుతున్నపూటకో డ్రామాలు, మోసపూరిత దీక్షల గురించి ఎండగడుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. లేఖలో కేవీపీ పేర్కొన్న ముఖ్యాంశాలు.. పోరాటయోధుడిగా చిత్రీకరించుకోవడానికే.. ‘గత నాలుగు సంవత్సరాలుగా అధికార మత్తులో, మోడీ మాయలో ఉన్న మీరు, ఎన్నికలు ముంగిట్లో కొచ్చేసరికి రాష్ట్ర ప్రయోజనాలు గుర్తుకొచ్చి హోదా ఉద్యమంలోకి హఠాత్తుగా ఊడిపడి పొద్దెరుగకుండా ఉపన్యాసాలు ఇస్తున్నారు. గతిలేకనే బీజేపీతో తెగతెంపులు చేసుకొన్న మీరు.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని గురించి కేంద్రతో పోరాటం చేస్తున్న పోరాటయోధుడిగా మిమ్మల్ని మీరు చిత్రీకరించుకోవడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ పాత్రను తక్కువ చేసి చూపడానికి నానా తంటాలు పడుతున్నారు. అయితే మీరు, మీ పార్టీ గత నాలుగు నెలలుగా చేస్తున్న పోరాటాన్ని "స్వతంత్ర ఉద్యమ పోరాటం" స్థాయిలో ప్రజలలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో మీ సోత్కర్ష, సెల్ఫ్ డబ్బా శృతిమించి అసహజంగా కనిపించి జనానికి రోత పుట్టిస్తున్నాయి. బరువు తగ్గడానికే దీక్షలు మీ పార్టీ వారు చేస్తున్న దీక్షలు, ధర్నాలు "బరువు తగ్గడానికి" చేస్తున్న ప్రయోగాలేనని, ఇక మీ నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాటా దీక్షలు.. ఎన్నికల వేళ ప్రజలను మరోసారి మాయ చేయడానికి చేస్తున్న మీ ప్రచార ఆర్భాటాలేనని "సోషల్ మీడియా" కోడై కూస్తున్న విషయం మీకు తెలియనిది కాదు. అసత్య ప్రచారాలు చేస్తూ, చివరకు ఆ అసత్యాలని నిజాలుగా జనాన్ని నమ్మించాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు జనం విషయంలో ఎలా పనిచేస్తున్నాయో తెలియదు గాని.. మీ విషయంలో,మీ భజనబృందాల విషయంలో చక్కగా పనిచేస్తున్నాయి. దీక్షల కోసం కోట్ల ఖర్చు ఇక మీ అసత్య ప్రచారాలకు పరాకాష్ట నిన్న "ఒంగోలు ధర్మ పోరాట దీక్ష" సభలో మీ ప్రసంగం. నాలుగేళ్లు, మీ మార్గదర్శకత్వంలో, మీ దిశానిర్దేశానికి అనుగుణంగా, మీకు మాట రాకుండా.. ప్రజా ప్రయోజనాలు, విభజన హామీలు గాలికి వదిలి.. తమ సొంత పనులు చక్కబెట్టుకొంటూ.. పార్లమెంట్ సభ్యులకు సన్మానంతో మొదలైన మీ సభ.. ఆద్యంతం అసత్యాలతో, అర్ధసత్యాలతో పాటు.. ఆత్మ స్తుతి.. పరనిందలకు చక్కటి ఉదాహరణగా నిలిచింది. ఈ సభ వల్ల ప్రజలకు ఏ మాత్రం లాభం లేకపోగా.. దీక్షకు మీరు అట్టహాసంగా చేయించిన ఏర్పాట్ల వల్ల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ఖజానాపై పడింది. అయితే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలను మరోసారి బురిడీ కొట్టించి ఎలా అయినా అధికారం సంపాదించాలని మీరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించి.. వాస్తవాలను, ముఖ్యంగా విభజన హామీల సాధన విషయంలో మీ ఉదాసీనతను, నిర్లక్ష్యాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవడంతో పాటు.. గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ విభజన హామీల విషయంలో చేసిన ప్రయత్నాలు మీకు తెలిసినా.. మరిచిపోయినట్లు నటిస్తున్న మీకు మరోసారి గుర్తు చేద్దామనే ఈ ప్రయత్నం. విభజన చట్టం అమలు గురించి పోరాటం చేస్తున్నది కాంగ్రెస్సే.. నిజానికి మార్చి2, 2014న కేంద్ర కేబినెట్ పోలవరం ముంపు మండలాలను ఆంధ్రలో కలపడం మరియు ఆంధ్రకు ఐదు సంవత్సరాల ప్రత్యేక హోదా.. ఈ రెండు అంశాలను ఆర్డినెన్సు రూపంలో ఇవ్వాలని నిర్ణయించినా.. న్యాయశాఖ అభ్యంతరాల నేపథ్యంలో ఇవ్వకపోవడం వల్ల.. అదే ఆర్డినెన్సును ఎన్డీయే ప్రభుత్వం మే28 న జారీ చేసినా.. దాంట్లో ప్రత్యేక హోదా అంశం లేకపోవడం గుర్తించి.. అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జూన్2, 2014నే ప్రధానికి లేఖ రాశారు. ఎన్నికలలో గెలిచి, ప్రమాణస్వీకారం, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎంత అట్టహాసంగా చేయాలి అని మీరు గణించుకొంటున్న రోజులవి. మీకు గుర్తుండే ఉంటుంది. ఇక ఆరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ.. మొన్న లోక్‌సభలో అవిశ్వాసం, రాజ్యసభలో స్వల్ప విరామంలో చర్చ వరకు.. రాష్ట్రస్థాయిలో, కేంద్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వవలసినదేనని పోరాటం చేస్తూనే ఉన్నది. ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలను తేదీలవారీగా మీకు పంపుతున్నాను. ఒకసారి పరిశీలించండి. మీ భ్రమలు తొలిగే అవకాశం ఉన్నది. ఇక ఆ సభలో మీ ప్రవచనాలలో భాగంగా.. అనేక పార్టీల మద్దతు మీరు "కష్టపడి" కూడగట్టినట్లు పెద్ద చిట్టా చదివారు. కానీ మీరు చెప్పిన పార్టీలన్నీ.. రాజ్యసభలో నేను ప్రత్యేక హోదా కోరుతూ ప్రవేశ పెట్టిన "ప్రైవేట్ మెంబెర్ బిల్"కు అనుకూలంగా ఓటు వేయడానికి ఏప్రిల్ 2016 లోనే, అంటే రెండు సంవత్సరాలు క్రితమే కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాల వల్ల సిద్ధం అయ్యారన్న విషయం మీరు ఉద్దేశ్యపూర్వకంగానే మర్చిపోయారు. అంటే.. రెండు సంవత్సారాల క్రితమే.. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని గుర్తించి.. జాతీయ స్థాయిలో 14 పార్టీలు ఆంధ్రకు సహకరించడానికి ముందుకొస్తే, మీరు మాత్రం మోడీ మోజులో అప్పట్లో.. "ప్రత్యేకహోదా సంజీవని కాదు.. ప్రత్యేకహోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏమి బాగుపడ్డాయి".. అంటూ చిలకపలుకులు పలికారు. ఇక ఆ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా.. చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా, ఒక ప్రైవేట్ మెంబెర్ బిల్ కు అనుకూలంగా తప్పనిసరిగా ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు విప్ జారీచేసి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని చూస్తే.. మీరు మాత్రం మీ ఎంపీలకు సభ జరగకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్నారు ఇక జైట్లీ గారు.. ప్రైవేట్ మెంబెర్ బిల్లు మనీ బిల్లు అని ప్రకటించగానే.. మీ సభ్యులు మీ ఆదేశాలకు అనుగుణంగా బల్లలు చరిచి ఆనందం వ్యక్తం చేశారు. ఇక జూన్4, 2017న రాహుల్ గాంధీ నేతృత్వంలో 14 రాజకీయ పార్టీల జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా విషయంలో సంఘీభావం వ్యక్తం చేయడానికి గుంటూరు వస్తే.. నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేస్తూ, కాన్వాయ్ లపై కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసరమని, ఆ సభను భగ్నం చేయమని, రాహుల్ గాంధీతో సహా ఇతర నాయకుల ఫ్లెక్సీలను చించమని, పార్టీనాయకులకు, ప్రభుత్వ అధికారులకు సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఆదేశాలు ఇచ్చారు మీరు. "ప్రత్యేకహోదా కంటే మెరుగైన ప్యాకేజిని సాధించానని" శాసన సభ సాక్షిగా చెప్పిన మీరు.. "ప్రత్యేక హోదా అంటే జైలుకే" అంటూ బెదిరించిన మీరు.. ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ, ప్రత్యేకహోదా సాధన పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పాత్రేమీ లేనట్లు చిత్రీకరిస్తూ.. కృత్రిమ కన్నీరు కారుస్తూ.. ముక్కు చీదడం ప్రజలకు వెగటు పుట్టిస్తున్నది. అవిశ్వాసానికి కాంగ్రెస్ మద్దతు.. ఇక మొన్న కేంద్రంపై అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చింది. కేవలం అందరికంటే ముందు నోటీసు ఇచ్చారన్న ఒకే ఒక్క కారణంతో మీ పార్టీ నోటీసు ను ముందుగా చేపడుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇక అవిశ్వాస తీర్మానం పై చర్చ చేపట్టడానికి కూడా మీకున్న సంఖ్యాబలం సరిపోదని తెలిసినా.. ఆ అవిశ్వాస తీర్మానానికి మీరే కారణం అయినట్లు చెప్పుకోవడం.. ఇక కాంగ్రెస్ పార్టీ మనసు మార్చుకొని అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిందని చెప్పడం.. మీ అవకాశవాదానికి పరాకాష్ట. ఊసరవెల్లి కంటే ఘోరంగా.. నిజానికి కాంగ్రెస్ పార్టీ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరగకూడదనే చిత్తశుద్ధితోనే మొదటినుంచి వ్యవహరిస్తున్నది. తన మనసు ఎప్పుడు మార్చుకోలేదు.. మాట ఎప్పుడు మార్చలేదు.. కానీ ప్రత్యేక హోదా విషయంలో ఊసరవెల్లి కంటే ఘోరంగా, వేగంగా రంగులు మార్చింది.. మాటలు మార్చింది మీరే.. ఈ విషయం మీకు గుర్తు లేకపోతే.. "ప్రత్యేక హోదా విషయంలో మొదటినుంచి మన స్టాండ్ ఎలా ఉన్నది.. మన ఏ విధంగా ముందుకు పోయాం.. ఒక్కసారి చెప్పండి".. అని మీ సీపీఆర్ఓనో, మీ మీడియా సలహాదారునో ఒక్కసారి అడగండి.. వీడియో సాక్ష్యాలతో సహా మీ ముందు ఉంచుతారు. లేదంటే.. "గత నాలుగేళ్లు గా అధికారం తలకెక్కి.. ప్రజలను మర్చిపోయాను.. ఇప్పుడు ఎన్నికల వస్తుండడంతో మళ్ళీ మీరు గుర్తు వచ్చారు" అని తప్పును నిజాయతీగా ప్రజలముందు ఒప్పుకోండి. అంతే కానీ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నించకండి. ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపండి.. నిజంగా.. విభజన హామీల సాధన పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయ్యుంటే.. దీక్షల పేరుతో, వేదికలెక్కి.. మైకులు పట్టుకొని ఇచ్చే ఉపన్యాసాలు ఆపి, "అవసరమైతే.. న్యాయపరమైన చర్యలు తీసుకొంటామని".. ఉత్తర కుమార ప్రగల్భాలు అపి.. అవసరం వచ్చింది అని గ్రహించి.. ప్రభుత్వ పరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. ముందు, విభజనచట్ట అమలుపై వివిధ కోర్టులలో ఉన్న కేసులలో ప్రభుత్వం తరుపున వాస్తవాలు వివరిస్తూ కౌంటర్లు వేయించి.. ఈ కేసులను ప్రజా ప్రయోజనార్ధం దృష్ట్యా త్వరితగతిన పరిష్కరించమని కోర్ట్ లను కోరండి. మీ నిజాయితీని నిరూపించుకోండి. దీక్షల పేరిట ప్రజాధన దుర్వినియోగాన్ని ఆపండి. హోదాపై మీ నిజాయితినీ నిరూపించుకోండి. ప్రత్యేక హోదాతో సహా ఇతర విభజన హామీల సాధన విషయంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను, పోరాటాన్ని వక్రీకరిస్తూ కాంగ్రెస్ పాత్రను తక్కువచేసి చూపేలా గోబెల్స్ ప్రచారాలు మానుకోండి’ అంటూ లేఖలో కేవీపీ పేర్కొన్నారు. -
ఆ ఆస్తులు పంచాలని చట్టంలో లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూలులో పొందుపరిచిన సంస్థల ఆస్తులు పంచాలని ఆ చట్టంలో ఎక్కడా లేదని, కేవలం ఆయా సంస్థల సేవలను కొద్దిరోజులపాటు రెండు రాష్ట్రాలకు పొడిగించడం కోసమే సెక్షన్ 75ను పొందుపరిచారని కేంద్ర హోం శాఖ తెలిపింది. పదో షెడ్యూలులోని సంస్థల యాజమాన్య హక్కులు పంచేందుకు ఎలాంటి నిబంధనను చట్టంలో పొందుపరచలేదని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై కేంద్ర హోం శాఖ శుక్రవారం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. చట్టంలో పొందుపరిచిన నిబంధనల అమలుకు కేంద్ర హోం శాఖ ఇరు రాష్ట్రాలతో పలుమార్లు సమావేశమైందని, ఇటీవల మూడుసార్లు సమావేశమైందని వివరిస్తూ ఆయా సమావేశాల్లో చర్చించిన అంశాల పురోగతిని అఫిడవిట్‌కు జోడించింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల అమలుపై పలు మంత్రిత్వ శాఖలు సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశాయని, కేసులో ఇంప్లీడ్ కాని మంత్రిత్వ శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని తామే అఫిడవిట్లో పొందుపరుస్తున్నట్టు హోం శాఖ తెలిపింది. అఫిడవిట్‌లోని ముఖ్యాంశాలు ఇవీ.. షెడ్యూలు పదిలోని సంస్థల ఆస్తులు పంచాలన్న నిబంధన ఎక్కడా ఈ చట్టంలో లేదు. ఆయా సంస్థల ద్వారా సేవలను పక్క రాష్ట్రానికి కొనసాగించడానికి మాత్రమే సెక్షన్ 75ను నిర్దేశించారు. సంబంధిత సెక్షన్ అమలుకు నిబంధనల ఖరారు కోరుతూ రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోరాం. ఇంకా ఖరారు చేయలేదని ఏపీ సమాధానం ఇచ్చింది. తెలంగాణ సమాచారం ఇవ్వలేదు. షెడ్యూలు 9లోని సంస్థల ఆస్తులు, హక్కులు, అప్పులు పంచేందుకు 2014 మే 30న షీలా భిడే కమిటీని ఏర్పాటు చేశారు. 2018 మే 11న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు ఆయా సంస్థల ఉద్యోగుల విభజన, ఆస్తులు, అప్పుల విభజన ముగింపు దశలో ఉంది. షీలా భిడే కమిటీ గడువును 2018 ఆగస్టు 31 వరకు పొడిగించారు. అఖిల భారత సర్వీసు ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయించారు. ఇందులో కొందరు ఐఏఎస్ అధికారులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. రాష్ట్ర కేడర్ ఉద్యోగుల విభజనకు కమలనాథన్ కమిటీ సిఫారసుల మేరకు 2015 నవంబర్ నుంచి 2017 డిసెంబర్ మధ్య విడతల వారీగా 56,400 మంది ఉద్యోగులను విభజించారు. మరో 753 మంది ఉద్యోగుల విభజన పెండింగ్‌లో ఉంది. షెడ్యూలు 13లోని అంశాలపై.. షెడ్యూలు 13లోని అంశాలపై 22–01–2018, 12–03–18, 29–05–2018 తేదీల్లో హోం శాఖ ఆయా రాష్ట్రాల అధికారులతో సమీక్షించిందని చెబుతూ ఆయా సమావేశాల్లో వచ్చిన పురోగతిని అఫిడవిట్లో వివరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం స్థల నిర్ణయం, మౌలిక వసతుల ఏర్పాటు తర్వాతే హైకోర్టు ఏర్పాటుకు తమ నుంచి ప్రక్రియ మొదలవుతుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలో ని విద్యాసంస్థల ఏర్పాటులో పురోగతి వివిధ దశల్లో ఉంది. కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరి జన విశ్వవిద్యాలయం మినహా మిగిలినవన్నీ తాత్కాలిక భవనాల్లో ప్రారంభమయ్యాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభిస్తాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్టీలు ప్లాంట్ల విషయంలో పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి కేవలం ఫీజిబులిటీ నివేదికను మాత్రమే సమర్పించాల్సి ఉంది. గడువు లోపే నివేదిక వచ్చింది. అయితే వాణిజ్యపరమైన యోగ్యత లేదని నివేదిక తేల్చింది. అయినప్పటికీ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి కొత్తగా మరో ఫీజిబులిటీ నివేదిక ఇవ్వాలని మెకాన్‌ను కోరాం. అవసరమైన సమాచారం ఏపీ నుంచి వచ్చింది. తెలంగాణ నుంచి రావాల్సి ఉంది. రెండు రాష్ట్రాల నుంచి సమాచారం వచ్చాక మెకాన్ నివేదిక సమర్పిస్తుంది. విజయవాడ మెట్రో రైలుకు ప్రతిపాదన వచ్చింది. అయితే కేంద్రం కొత్త మెట్రో రైలు విధానం తెచ్చినందున ఏపీ ప్రతిపాదనలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రతిపాదనలు కూడా తిరస్కరించాం. నూతన విధానం ప్రకారం ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ)కి ఆంధ్రప్రదేశ్ 200 ఎకరాలు ఇచ్చినప్పటికీ అది వివాదంలో చిక్కుకుంది. వివాదాలు పరిష్కరించి స్థలాన్ని అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించాం. సమీపంలో ఉన్న పోర్టుల ద్వారా ఎదురవుతున్న పోటీతత్వం కారణంగా దుగరాజపట్నం పోర్టుకు వాణిజ్య యోగ్యత లేదని నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చింది. ప్రత్యామ్నాయ ప్రాంతాలు సూచించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరగా జవాబు రాలేదు. అయినప్పటికీ నౌకాయాన శాఖ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఏపీలో ఒక మేజర్ పోర్టు స్థాపనకు గల అవకాశాలపై అధ్యయనం చేస్తోంది. కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం, గెయిల్, హెచ్‌పీసీఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇంజినీర్ ఇండియా లిమిటెడ్ ఈ విషయమై ఫీజిబులిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు స్థాపనకు వయబులిటీ గ్యాప్ ఫండ్ అవసరమని, దానిని సమకూర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాం. ఏపీ నూతన రాజధాని నుంచి హైదరాబాద్‌కు, ఇతర తెలంగాణ నగరాలకు ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ స్థాపనకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటాం. విశాఖ– చెన్నై పారిశ్రామిక కారిడార్ విషయంలో పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫీజిబులిటీ అధ్యయనం చేసి తన తుది నివేదికను సమర్పించింది. ఏపీలో కొత్త రైల్వే జోన్ స్థాపనకు విభజన చట్టం అమలులోకి వచ్చిన రోజు నుంచి ఆరు నెలల్లోగా ఫీజిబులిటీ నివేదిక ఇవ్వాలని మాత్రమే ఉంది. రైల్వే జోన్ స్థాపనకు యోగ్యత లేదని ఇదివరకే కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇదివరకే 16 రైల్వే జోన్లు ఉన్నందున కొత్త రైల్వే జోన్ నిర్వహణకు వాణిజ్య యోగ్యత ఉండదని మార్చి 12, 2018 నాడు జరిగిన సమావేశంలో రైల్వే శాఖ అభిప్రాయపడింది. అయినప్పటికీ తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదు. దేశంలో ఇప్పటికే 5 కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటి సామర్థ్యం కూడా పూర్తిగా వినియోగంలో లేదు. కొత్త ఫ్యాక్టరీకి వాణిజ్య యోగ్యత ఉండదని రైల్వే శాఖ అభిప్రాయపడింది. -
విశాఖలో రైల్వేజోన్.. సాధ్యం కాని పని!
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ పునర్విభజన చట్టం అమలుపై కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ పునర్విభజన చట్టంపై ఈ ఏడాది మూడు సార్లు భేటీ అయ్యామని, షెడ్యూల్ 10 ప్రకారం కేంద్ర సంస్థలు ఏ ప్రాంతంలో ఉన్నాయో.. అక్కడే కొనసాగుతాయని, అంతే తప్ప ఆస్తుల పంపకం చేయమని కేంద్రం తెలిపింది. షెడ్యూల్ 10 కింద రెండు తెలుగు రాష్ట్రాల్లో 142 సంస్థలున్నాయని చెప్పింది. అయితే 13వ షెడ్యూల్ కింద ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థను ఏపీలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుపై కూడా నివేదిక అందిందని, ఇప్పటికే దేశంలో 16 రైల్వే జోన్లు ఉన్నాయని, మరొక జోన్ ఏర్పాటు దాదాపుగా సాధ్యమయ్యే పనికాదని, నిర్వహణపరంగా కూడా లాభదాయకం కాదని కేంద్ర చెప్పింది. అయితే దీనిపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు, స్టేక్ హోల్డర్లతో చర్చించిన తర్వాత తీసుకుంటామని తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టంలోని 53వ సెక్షన్ ప్రకారం.. రెండు రాష్ట్రాల్లో వాణిజ్య, పారిశ్రామిక ఆస్తులు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఏ ప్రాంతంలో ఉంటే, ఆ రాష్ట్రానికే చెందుతాయని తెలిపింది. ఉద్యోగుల పంపిణీ విషయంలో కేంద్రానిదే తుది నిర్ణయని కూడా తేల్చి చెప్పింది. ‘ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ అధికారుల పంపిణీ ఇప్పుడే పూర్తయింది. దీనిపై 12 మంది ఐఏఎస్ అధికారులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ కోసం కమల్‌నాథ్ కమిటీ ఏర్పాటైంది. పోలీసు శాఖలోని 753 మంది ఉద్యోగుల విషయంలోనే ఇంకా తుది నిర్ణయం రాలేదు. చట్టంలోని అన్ని అంశాలు పూర్తయ్యాయి లేదా తుది దశలో ఉన్నాయి. పొంగులేటి అఫిడవిట్‌ను తిరస్కరించండి’ అని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. -
విభజన చట్టం అమలుపై కమిటీ భేటీ
-
విభజన చట్టం అమలుపై చిదంబరం అధ్యక్షతన కమిటీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునరవ్యవస్థీకరణ చట్టం-2014లోని అంశాల అమలు స్థితిగతులపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలోని పార్లమెంటరీ హోంశాఖ స్టాండింగ్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల విభజన, ఆర్టీసీ ఆస్తుల పంపకం, రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదాల గురించి కమిటీ చర్చించనుంది. ఈ సందర్బంగా విభజన చట్టం అమలు నివేదికను ఏపీ ప్రభుత్వం కమిటీకి అందించింది. విభజన అనంతరం కేంద్రం ఇచ్చిన నిధులకు సంబధించిన మరో నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో ఏర్పడిన రెవెన్యూ లోటుకు కేంద్రం 3,979 కోట్ల నిధులు ఇచ్చినట్లు వీటికి సంబంధించిన వినియోగ పత్రాలు(యూసీలు) ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం కమిటీతో పేర్కొంది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు పెట్టిన 6,727 కోట్లకు యూసీలు అవసరం లేదని కమిటీకి సూచించింది. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన 1,632 కోట్లకు యూసీలు ఇచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. విజయవాడ- గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్దికి కేంద్రం మంజూరు చేసిన వెయ్యి కోట్లకు గాను 229 కోట్లకు యూసీలు ఇచ్చినట్టు తెలిపింది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ది కోసం కేంద్రం ఇచ్చిన 1,050 కోట్లకు గాను 946 కోట్లకు యూసీలు ఇచ్చినట్టు ఏపీ ప్రభుత్వం కమిటీకి తెలిపింది. -
బీజేపీతో చర్చించే హోదా హామీ : మన్మోహన్
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న యూపీఏ హామీని ప్రస్తుత ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశించానని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. బీజేపీ నేతలతో సంప్రదించిన అనంతరం ఏపీకి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఏపీ విభజన హామీలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ భారత ప్రధానిగా 2014లో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులో తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చర్చ జరుగుతున్నదని అన్నారు. ప్రధాని హోదాలో ఏపీకి ప్రత్యేక హోదాను నిండు సభలో తాను హామీ ఇచ్చానని చెప్పారు. అప్పటి విపక్ష నేత అరుణ్ జైట్లీ సహా పలువురు సీనియర్ బీజేపీ నేతలతో చర్చించిన అనంతరం తాను ప్రత్యేక హోదా హామీ ఇచ్చానని అన్నారు. సభలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. -
ప్రత్యేక హోదా సంజీవని కాదన్నది చంద్రబాబే
-
హోదా సంజీవని కాదన్నది చంద్రబాబే : రాజ్‌నాథ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా సంజీవని కాదన్నది చంద్రబాబేనని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు, సుజనా చౌదరి స్వాగతించారని, అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చే నిధులతో సమానంగా ఏపీకి నిధులు మంజూరు చేస్తున్నామని, దీనికి ముఖ్యమంత్రి కూడా అంగీకారం తెలిపారన్నారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. ఏపీ విభజన హామీలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు హోంమంత్రి బదులిచ్చారు. ఏపీకి విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. బిల్లులో పేర్కొన్న హామీల్లో 90 శాతం హామీలను ఇప్పటికే నెరవేర్చామన్నారు. రైల్వే జోన్‌పై ప్రతికూలంగా నివేదిక వచ్చినా జోన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును తామే కడతామని ఏపీ సర్కార్ కోరితే అంగీకరించామని, పోలవరానికి ఇప్పటివరకూ రూ 6754 కోట్లు మంజూరు చేశామన్నారు. రికార్డు సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. తొలి కేబినెట్ భేటీలోనే 7 ముంపు మండలాలను ఏపీలో కలిపామన్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి హోదా ఇస్తారా లేదా స్పష్టం చేయాలని కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, గులాం నబీ ఆజాద్ నిలదీశారు. 14వ ఆర్థిక సంఘం పేరుతో హోదా నిరాకరించడం సరైందికాదని విమర్శించారు.మరోవైపు టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపై రాజ్‌నాథ్ సెటైర్లు వేశారు. చర్చలో తాము చెబుతున్న అంశాలపై సుజనా చౌదరి మారుమాట్లాడలేక తలదించుకున్నారని ఎద్దేవా చేశారు. -
వెల్‌లో విజయసాయిరెడ్డి నిరసన
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ విభజన హామీలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన సమయం ఇవ్వలేదని పార్టీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. తమకు అతితక్కువ సమయం కేటాయించడం పట్ల చైర్మన్ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రానికి సంబంధించి కీలక అంశంపై తమకు అతితక్కువ సమయం కేటాయించడంపై మండిపడ్డారు. అంతకుముందు ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమనే అంశంతో పాటు పూర్వాపరాలను వివరించే క్రమంలోనే కేటాయించిన సమయం అయిపోయిందని, ప్రసంగం ముగించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విజయసాయి రెడ్డిపై ఒత్తిడి చేశారు. కీలక అంశంపై తనకు మరింత సమయం ఇవ్వాలని, కనీసం 15 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతించాలని విజయసాయి రెడ్డి కోరారు. టీడీపీకి 27 నిమిషాలు సమయం ఇచ్చారని తనకు మరింత సమయం ఇవ్వాలని కోరినా వెంకయ్యనాయుడు నిరాకరించారు. -
చంద్రబాబు ప్యాకేజీను స్వాగతించారు
-
రాజ్యసభలో చర్చ.. టీడీపీపై జీవీఎల్ తీవ్ర విమర్శలు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక ప్యాకేజ్‌ను చంద్రబాబు స్వాగతించారని రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పష్టం చేశారు. ప్యాకేజ్‌ను స్వాగతిస్తూ మహానాడులో, శాసనసభలో చంద్రబాబు తీర్మానాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కింద వచ్చేవన్నీ ప్యాకేజ్ రూపాంలో వస్తాయని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారన్నారు. ఏపీ విభజన చట్టంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో జీవీఎల్ టీడీపీ వైఖరిని దుయ్యబట్టారు. బీజేపీ వల్లే ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి విదేశీ నిధులు వస్తున్నాయన్నారు. ఏపీపై ప్రధాని ప్రత్యేక దృష్టి పెట్టి సాయం చేస్తున్నారన్నారు. ప్యాకేజ్‌కు మద్దతుగా మద్దతుగా టీడీపీ చేసిన తీర్మానాలను ఆయన సభలో చదివి వినిపించారు. జీవీఎల్ ప్రసంగానికి టీడీపీ ఎంపీలు పలుమార్లు అడ్డుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ రాద్ధాంతం చేస్తోందని జీవీఎల్ మండిపడ్డారు. రూ లక్షా 27వేల కోట్లు ఏపీకి అదనంగా వస్తున్నప్పుడు అన్యాయం జరిగిందని టీడీపీ ఎలా అంటుందని నిలదీశారు. హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ కాదు మల్టీపుల్ టర్న్‌లు తీసుకున్నారన్నారు. మరోవైపు చర్చ సందర్భంగా సీఎం రమేష్‌ను ఎం వెంకయ్య నాయుడు మందలించారు. ఏపీకి నీవు ఒక్కడివే ప్రతినిధి అనుకోవద్దని చురకలంటించారు. కాంట్రాక్టర్ల కొమ్ముకాస్తున్న చంద్రబాబు కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని జీవీఎల్ విమర్శించారు. మోదీ నిధులతో చంద్రన్న బీమా పథకం అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే చంద్రబాబు సర్కార్ కాంట్రాక్టర్ల కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఇక హోదా ఉన్న రాష్ట్రాలకూ, లేని రాష్ట్రాలకూ తేడా లేదని చెప్పుకొచ్చారు. కృష్ణపట్నం కొత్త పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రెవిన్యూ లోటు కింద రాష్ట్రానికి కేంద్రం రూ 22,300 కోట్లు కేటాయించిందని చెప్పారు. ప్రత్యేక హోదాకు, పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదన్నారు. -
బయ్యారం ఉక్కు భిక్ష కాదు.. హక్కు
రాష్ట్రాల పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ నిర్మాణం అంశాన్ని స్పష్టంగా పొందుప ర్చారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఆంధ్రాని ఒప్పిం చడానికి వారికి పోలవరం ప్రాజెక్ట్ హామీనిచ్చిన కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ కింద నాటి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ముంపుకు గురౌతున్నం దున ఖమ్మం జిల్లాకు ఊరడింపుగా ఉక్కు పరిశ్ర మను ఇస్తామని చట్టంలో చేర్చింది. విభజన చట్టం లోని 13వ క్లాజులో ఖమ్మం జిల్లాలో 30 వేల కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని స్పష్టంగా ప్రకటిం చారు. దీనికి సంబంధించిన ప్రక్రియను 6 నెలల్లో ప్రారంభిస్తామని కూడా అందులో పేర్కొన్నారు. అప్పటినుంచి టాస్క్‌ఫోర్స్, విజిలెన్స్ కమిటీలను వేస్తూ, సర్వేలు చేస్తూ కాలయాపన చేస్తూ వచ్చారు. త్వరలో బయ్యారానికి తీపి కబురు చెపుతామని కేంద్ర ఉక్కుగనుల శాఖ మంత్రి మీడియా ముందు ప్రకటించటం, బయ్యారం ఉక్కు పరిశ్రమకు అవసర మైన వనరులన్నీ సమకూర్చుతామని, ముడి ఖనిజం రవాణా కోసం జగదల్పూర్ నుంచి రైల్వే లైన్ నిర్మా ణానికి పరిశీలన కోసం 2 కోట్లు కేటాయించామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించడం ఇలా ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వాలు 4 ఏళ్ల నాటకానికి తెర వేస్తూ తాజాగా పరిశ్రమ పెట్టే అవకాశమే లేదని స్పష్టీక రిం చారు. ఇది విభజన హామీని తుంగలో తొక్కి తెలం గాణ ప్రజలను మోసం చేయడమే. యూపీఏ ప్రభుత్వం బయ్యారం ఉక్కు పరిశ్రమ విభజన చట్టంలో పొందుపర్చిన తరువాత జరిగిన ఎన్నికలలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమల నిర్మాణంపై మొదటినుండి సాకులు చెపుతూ కాలం గడుపుతూ వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వనరులు సమకూర్చడం లేదని, బయ్యారం ఇనుప ఖనిజంలో నాణ్యత లేదని ఉన్న ఖనిజం కూడా పరిశ్రమ నిర్విఘ్నంగా నడవడానికి సరిపోదని తదితర సాకులు చెబుతూ వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట వాస్తవమేనను కున్నా రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా నుంచి నాణ్యత కలిగిన ఇనుప ఖనిజాన్ని దిగుమని చేసుకుంటామని, అందుకు రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఉంది. అయినా, పరిశ్రమ పెట్టడానికి అభ్యంతరమేమిటి? 2014 ఫిబ్రవరి 18న పార్లమెంట్ ఆమోదించిన విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరచబడిన ఉక్కు పరిశ్రమ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నదే నిజం. అప్పుడప్పుడు మాట వరసకు బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి వల్లెవేయడం తప్ప ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేసీఆర్, ఆయన ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసింది లేదు. పైగా సెయిల్ ముందుకు రానందున బయ్యారం స్టీల్స్‌ను జిందాల్‌కు ఇస్తామని, సిద్ధంగా ఉండమని ఆ కంపెనీ అధికారులకు మీడియా ముందే చెప్పారు. విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు పరి శ్రమను ఏర్పాటు చేయకుండా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంటే తెలంగాణకు చట్ట బద్ధంగా రావల్సిన ఉక్కు పరిశ్రమపై మాట్లాడకుండా ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్ని స్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నది.బయ్యారం ఉక్కు పరిశ్రమ ఈ ప్రాంతవాసుల చిరకాల వాంఛ, దీని కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. ఇక్కడి ఉక్కును పాలకులు ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలను ప్రజా ఉద్య మాల ద్వారా అడ్డుకున్న చరిత్ర ఉంది. 1 లక్షా 46 వేల ఎకరాల పరిధిలోని ఇనుప ఖనిజాన్ని రక్షణ స్టీల్స్ అనే ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేసిన సందర్భంలోనే ప్రైవేటు కంపెనీలకు ఇవ్వవద్దని ప్రభుత్వ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఈ ఉద్యమంలో ముందు భాగాన ఉన్నది. తెలంగాణ ఉద్యమ శక్తులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాయి. బయ్యారం ఉక్కు పరిశ్రమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాయిష్టాల సమస్య కాదు. అది అనేక ఉద్యమాలు, త్యాగాలతో తెలంగాణ రాష్ట్రానికి లభించిన చట్టబద్ధ హక్కు, దానిని కాదనే అధికారం ఎవరికీ లేదు. ఈ హక్కు సాకారం అయ్యేవరకు ఐక్యంగా ఉద్యమించాలి. గౌని ఐలయ్య, కన్వీనర్, బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కమిటి, జడ్పీటీసీ ‘ 94907 00955 -
కేసీఆర్ కనీసం నోరు మెదపడం లేదు..
సాక్షి, హైదరాబాద్ : విభజన చట్టంలోని హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ తాను సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశానని, ఈ రిట్ పిటిషన్‌పై కేంద్ర ఉక్కు, ఆర్థిక, జల మంత్రిత్వశాఖలు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ పిటిషన్ స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. విభజన చట్టంలోని కొన్ని హామీలను కేంద్రం ఇప్పటివరకు కనీసం ముట్టుకోలేదని ఆయన అన్నారు. రూ. 1350 కోట్లు ప్రత్యేక సహాయం కింద రాష్ట్రానికి రావాల్సి ఉందని తెలిపారు. ఉద్యమ సీఎం అని చెప్పుకొనే కేసీఆర్.. కనీసం ఈ విషయం మీద నోరు కూడా మెదపడం లేదని ఆయన తప్పుబట్టారు. తన పిటిషన్‌పై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నా.. సీఎం కేసీఆర్ కనీసం స్పందించడం లేదని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం సిగ్గుచేటు అని పొంగులేటి మండిపడ్డారు. దీనికంటే ముఖ్యమైన విషయం ప్రభుత్వానికి ఏముందని ప్రశ్నించారు. నాలుగు కోట్ల ప్రజలకు ఈ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి, బీజేపీ అధినేత అమిత్ షాకు కోపం వస్తుందనే సీఎం కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. విభజన హామీల విషయం, సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవ్వాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌కు ఉందని అన్నారు. మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అమరవీరుల త్యాగాలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. -
‘ఆ దారుణాలన్నీ అద్వానీకి తెలుసు’
సాక్షి, రాజమహేంద్రవరం : ఏపీ విభజన చట్టం చెల్లుబాటు కాదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో పోరాటం చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు. రాష్ట్ర విభజనను బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కూడా సమర్థించలేదని గుర్తుచేశారు. సభ (పార్లమెంట్)లో ఎన్ని దారుణాలు జరిగాయో అద్వానీకి తెలుసునని, ఇప్పుడు ఇందుకు సంబంధించి నోటీసులిస్తే అద్వానీ అన్ని విషయాలు చెబుతారని అన్నారు. రాజమహేంద్రవరంలో ఉండవల్లి గురువారం మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని సభలో లేవనెత్తిన అంశంపై చర్చ జరగాలన్నారు. ప్రధాని చెప్పిన మాటలపై నేతలు వివరణ కోరాలని పేర్కొన్నారు. ‘సభ తలుపులు మూసి విభజన చట్టాన్ని ఆమోదింపచేశారు. సభ్యులు ఎవరూ లేరని తెలిసి విభజన బిల్లును ఎలా ఆమోదించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ విడిపోయింది. కనుక లోక్‌సభలో టీడీపీ ఎంపీలు మాట్లాడటానికి వాళ్లకు ఏం అభ్యంతరం ఉంది. సభలో జరిగిన దారుణాలు ఆద్వానీకి తెలుసు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో రాష్ట్రనేతలు నిలదీయాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిలదీయకుంటే .. ప్రజా ప్రతినిధులుగా ఉండటానికి నేతలు అనర్హులు. ఏపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ నిర్ణయించాలి. కానీ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రాకుండా చేస్తున్నారు. పార్లమెంట్లో ఏ నిమిషం ఏం జరిగిందో రికార్డు ఉంటుంది. మీడియాకు పార్లమెంట్ రికార్డులన్నీ నేనే ఇస్తాను. విభజన బిల్లుపై సభలో జరిగిన వాటిపై అందరికీ మెయిల్స్ పంపాను. సభలో కేంద్రం పెద్దలను నిలదీయాలని చెప్పా. కానీ ఎవరూ అలా చేయడం లేదు. ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం నేడు ఏపీ సీఎం చంద్రబాబు (టీడీపీ ఎంపీలు)కు ఉంది. మీకు బాధ్యత ఉందని భావిస్తే దయచేసి ఇప్పుడైనా పార్లమెంట్లో ప్రశ్నించాలని’ ఉండవల్లి చెప్పారు. -
కేంద్రం చేసిందేమీ లేదు : ఏపీ అఫిడవిట్
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని ఏ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన హామీల అమలుపై కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని రాష్ట్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి, ఆ విషయాన్ని పక్కన బెట్టిందని అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం కేంద్రం తీరును తప్పుబట్టింది. అంతేకాదు హోదా ఉన్న రాష్ట్రాలతో సమానంగా పన్ను రాయితీలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టింది. వెనుకబడిన జిల్లాలకు 24,350 కోట్ల రూపాయల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని కోరామని, 1050 కోట్ల రూపాయలను మాత్రమే కేంద్రం ఇచ్చిందని వెల్లడించింది. పోలవరం ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం 7,918.40 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని, కేంద్రం 5,349.70 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా విలువ 57,948.86 కోట్లను అనుమతించలేదని, విభజన హామీల్లో ఏ ఒక్క దాన్ని కేంద్రం అమలు చేయలేదని ఆరోపించింది. షెడ్యూల్-9లో ఉన్న 142 విద్యాసంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదని, కడప స్టీల్ ప్లాంట్, గిరిజన వర్సిటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏపీ పేర్కొంది. నాలుగేళ్లలో జాతీయ విద్యాసంస్థల నిర్మాణానికి 10 శాతం కన్నా తక్కువ నిధులు కేటాయించారని, దుగ్గరాజపట్నం పోర్టు, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాట్లపై దృష్టి సారించలేదని వాపోయింది. రైల్వేజోన్ ఇంకా పరిశీలనలోనే ఉందని కేంద్రం చెబుతోందని, అమరావతి నిర్మాణానికి 11,602 కోట్ల రూపాయలతో డీపీఆర్ పంపామని, 1500 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం విడుదల చేసిందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. -
ఉద్యమ పార్టీ ఎందుకు స్పందించదు?
సాక్షి, హైదరాబాద్ : ఏపీ పునర్విభజన చట్టాన్ని రెండు రాష్ట్రాల్లో అమలు చేయాలని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం ఈ చట్టాన్ని సరిగ్గా అమలు చేయనందు వల్లే కోర్టుకు వెళ్లామన్నారు. ప్రతిపక్షం బాధ్యతగా తాము చేయాల్సిందింతా చేస్తున్నామని.. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసమే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశామన్నారు. ఇందుకు ప్రతిగా కేంద్రం వివిధ శాఖల ద్వారా కౌంటర్ దాఖలు చేయిస్తోందన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసం తన సొంత ఖర్చుతో కేసుకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహిస్తున్నానన్న ఆయన.. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్ ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పొలిటికల్, పర్సనల్ అజెండాతోనే అధికార పార్టీ వ్యవహరిస్తున్నట్లు కనబడుతోందని విమర్శించారు. శ్వేతపత్రం విడుదల చేయాలి.. ఏపీ పునర్విభజన చట్టం కింద తెలంగాణకు ఎంత మేలు జరిగిందనే విషయాలపై శ్వేతప్రతం విడుదల చేయాలని సుధాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం సాధన కోసం ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి లక్ష పోస్టు కార్డులు రాసే కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. బయ్యారం గనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతోంటే తెలంగాణ, ఆంధ్ర పరిస్థితులు వేరంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. -
‘చివరకు బెల్లం ముక్క కూడా ఇవ్వలేదు’
సాక్షి, విజయవాడ: నాలుగేళ్లు భారతీయ జనతా పార్టీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇపుడు నీతులు చెబుతున్నారని సీపీఎం జాతీయ నాయకులు బీవీ రాఘవులు విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగేళ్ల బురదను ఎవరు కడుగుతారని ప్రశ్నించారు. ఇన్నాళ్లు బీజేపీ కాళ్లు పట్టుకుని, ఇపుడు కాళ్లు లాగుతానంటున్నారన్నారు. తనకు అధికారమిస్తే 15 ఏళ్లు రాష్ట్రానికి హోదా తెస్తానన్న బాబు ఇప్పుడేం మాట్లాడుతున్నారు?.. ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలన్న వెంకయ్య నాయుడు ఎక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఎన్నో హామిలిచ్చి.. చివరకు బెల్లం ముక్క కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు సీపీఎం వ్యతిరేకమని ఎప్పుడో ప్రకటించామన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తున్నారు.. మరీ ఈ నాలుగేళ్ళ నుంచి ఏం చేస్తున్నారన్నారు. ఇప్పుడు దీక్ష చేస్తే నాలుగేళ్ళగా చేసిన పాపం పోతుందా అని నిలదీశారు. రమేష్ చేసే దీక్షలో చిత్తశుద్ది లేదన్నారు. ఏ సమస్యపైనైనా దీక్షలు, నిరసనలు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం తమని అరెస్టు చేస్తుందని, కానీ చంద్రబాబు దీక్ష చేస్తే ఆయన్ను పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు దీక్ష చేస్తే ప్రజాస్వామ్యం, తాము చేస్తే అరాచకమా అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి ఇష్టమొచ్చినట్లు తినేశారని, ఇప్పుడు అమరావతిని తింటున్నారని ఆరోపించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదని, గిట్టుబాటు ధర కోసం పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ వ్యవస్థను అమెరికా చేతిలో పెడుతోందని పేర్కొన్నారు. -
రాష్ట్రపతికి కొణతాల లేఖ
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం- 2014 ప్రకారం ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు అందించే నిధులను వెనక్కి తీసుకుని కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం- 2014లోని సెక్షన్ 46(2), 46(3) ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికై 2017- 18 సంవత్సరానికి గానూ 350 కోట్ల రూపాయలు విడుదల చేశారని... కానీ పలు రాజకీయ కారణాల వల్ల ఆ నిధులను వెనక్కి తీసుకోవడం దారుణమని కొణతాల లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వచ్చే మూడేళ్లలో 1050 కోట్ల నిధులు ప్రత్యేక ప్యాకేజీ కింద విడుదల చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. గత రెండేళ్లుగా ఏపీ వినియోగించుకున్న 946.47 కోట్ల రూపాయలకు సంబంధించిన సర్టిఫికెట్లు ప్రభుత్వం సమర్పించిందని లేఖలో పేర్కొన్నారు. అదే తరహాలో ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన 350 కోట్ల రూపాయలు ఏపీకి విడుదల చేస్తున్నట్లు జైట్లీ ప్రకటించారని.. కానీ ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం తెలపలేదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి ఏదో భిక్ష వేస్తున్నట్లు కేంద్రం ప్రవర్తిస్తోందని.. కానీ ఆ నిధులు పొందడం చట్టబద్ధమైన హక్కు అని.. ఈ విషయంలో మీరు చొరవ తీసుకోవాలని రాష్ట్రపతికి విఙ్ఞప్తి చేశారు. కేబీకే(కోరాపూట్- బోలంగిర్- కలహంది) ప్లాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ మాదిరి అభివృద్ధికై ప్రత్యేక ప్యాకేజీ అందిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామని కొణతాల తెలిపారు. ఏపీకి నిధులు విడుదల చేయడం ప్రధాని నరేంద్ర మోదీకి నచ్చడం లేదోమోనని.. అందుకే ఇలా చేసి ఉంటారని పేర్కొన్నారు. నిధులు వెనక్కి తీసుకోవడంపై ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని, అందుకు సంబంధించిన ప్రతిని ఈ లేఖతో జత చేస్తున్నామని కొణతాల పేర్కొన్నారు. -
విభజన చట్టంపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చి నాలుగేళ్లయినా అమలు కాలేదా? అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలుపై వైఖరి చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హామీలు అమలు కావట్లేదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల భద్రాచలం ఆలయం ముంపునకు గురవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. విభజన చట్టం అమలుకాకపోవడం వల్ల తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. నాలుగేళ్లయినా చట్టంలోని హామీల అమలు పూర్తి కాలేదా అని జస్టిస్ సిక్రీ వ్యాఖ్యానించారు. కేంద్రం తన వైఖరి తెలిపేందుకు 4 వారాల సమయం కావాలని అదనపు సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ ధర్మాసనాన్ని కోరారు. ఏపీ తరఫున అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ విన్నవించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. -
కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం సీరియస్
-
‘తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలి’
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలనే ఏపీ విభజన చట్టంలోని హామీలపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నాలుగు సంవత్సరాలు గడిచినా ఏపీ విభజన చట్టంలోని హామీలను ఎందుకు అమలు చేయలేక పోయారో సమాధానం చెప్పాలని కేంద్రాన్ని న్యాయస్థానం సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొంగులేటి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేసిందన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పిటీషన్లో ఇంప్లీడ్ కావాలన్నారు. తనకు ఎవరిపైనా కోపం లేదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రీడిజైన్ జరగాలని తెలిపారు. పోలవరం రీడిజైన్ జరగాలనే అంశాన్ని కేసీఆర్ గాలికొదిలేశారని, ఇపుడు ఆయన దృష్టంతా రాజకీయాల చుట్టే తిరుగుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టించుకోకుండా, కాంగ్రెస్‌పై విమర్శలకే కేసీఆర్ సమయం కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఎలా పోరాడుతున్నాయో చూసి నేర్చుకోవాలని సూచించారు. -
కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన విశ్వవిద్యాలయం, పోలవరం ముంపుపై అధ్యయనం చేయడం వంటి విభజన హామీలను వెంటనే అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని గతంలో సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో న్యాయస్ధానం జారీ చేసిన నోటీసులకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున న్యాయవాదులు హాజరైనా కేంద్రం స్పందించలేదు. దీంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై నాలుగు వారాల్లో వివరణ ఇస్తామని అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ ధర్మాసనాన్ని కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
‘హోదా’తోపాటు... విభజన హామీల అమలుకు..
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రకాశం జిల్లా, కారంచేడుకు చెందిన రైతు పొలూరి శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, లోక్‌సభ సెక్రటరీ జనరల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రధాన ఎన్నికల కమిషనర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. -
రైల్వేజోన్‌పై ఎందుకీ అలసత్వం?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్న అలసత్వంపై హైకోర్టు మంగళవారం రైల్వేశాఖను నిలదీసింది. అపాయింటెడ్ డే నుంచి ఆరు నెలల్లోపు రైల్వేజోన్ ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం చెబుతుంటే, ఇప్పటి వరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది. రైల్వేజోన్ ఏర్పాటు విషయంలో తీసుకున్న చర్యలేమిటో వివరించాలని రైల్వేశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
సీఎస్‌లతో మార్చి 5న కేంద్ర హోంశాఖ భేటీ
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ మార్చి 5న సమావేశం కానుంది. విభజన చట్టం అమలు తీరు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, 13వ షెడ్యూల్లోని అంశాలపై ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఈ సమావేశానికి తెలంగాణ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషీ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ దినేష్ కుమార్ హాజరు కానున్నారు. కాగా ఫిబ్రవరి 23న సమావేశం జరగాల్సి ఉండగా, ఆ భేటీ వాయిదా పడిన విషయం తెలిసిందే. -
ఇరురాష్ట్రాల సీఎస్ల సమావేశం వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : విజభన చట్టం అమలుపై ఈ నెల 23న జరగాల్సిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశం వాయిదా పడింది. కేంద్ర హోంశాఖ ఈ మేరకు ఉభయ రాష్ట్రాలకు సమాచారం అందించింది. అయితే తదుపరి సమావేశం ఎప్పుడనే దానిపై స్పష్టత లేదు. తొలుత ఈ నెల 21న సమావేశం కావాలని భావించినా, ఎస్సీ కమిషన్ పర్యటనతో మరో తేదీన నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖను కోరింది. దీంతో సీఎస్ల సమావేశం వాయిదా పడింది. విభజన హామీల అమలుపై పెద్ద ఎత్తున ఆందోళన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్న విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ ఆంధ్రుల గొంతు కోసింది..
-
‘చెప్పుకోవట్లేదంటే మేము చేయనట్లు కాదు’
సాక్షి,న్యూఢిల్లీ : విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..బీజేపీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం కమిటీ ఏర్పాటు చేశామని పోలవరం నిర్మాణానికి రూ.4వేల కోట్లు విడుదల చేసినట్లు జీవీఎల్ నరసింహరావు తెలిపారు. కడప స్టీల్‌ప్లాంట్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, దుగరాజపట్నం పోర్టుపై అభ్యంతరాలను పరిశీలిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రుల గొంతు కోసిందని, రాష్ట్రానికి కాంగ్రెస్ సరైన న్యాయం చేయలేదని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి కేంద్రం సాయం చేసిందన్నారు. రాజకీయ లబ్దికోసం దుష్ప్రచారాలు చేయడం సరికాదని అన్నారు. ‘చెప్పుకోవట్లేదంటే మేము చేయనట్లు కాదు’ బీజేపీ ఏపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు ఈ సందర్భంగా ఏపీకి కేంద్రం ఇప్పటివరకూ ఇచ్చిన నిధులు, మంజూరు చేసిన ప్రాజెక్టులు, సంస్థల వివరాలతో కూడిన 27 పేజీల నోట్‌ను మీడియాకు విడుదల చేశారు. విభజన హామీల అమలుకు మోదీ సర్కార్ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. హోదావల్ల వచ్చే అన్ని ప్రయోజనాలను ప్రత్యేక ప్యాకేజీలో ఇస్తామన్నారు. పోలవరం ముంపు మండలాలను ఏపీ పరిధిలోకి తెచ్చామని అన్నారు. ఏపీకి సాయం చేయడం లేదనే వార్తలు వాస్తవం కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ సరైన న్యాయం చేయలేదని, ఇప్పుడు రాహుల్ గాంధీ మాయమాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీ విభజన చట్టం హామీలు అమలు చేస్తామని ఆయన తెలిపారు. పదేళ్లలో చేయాల్సిన సాయాన్ని మూడున్నరేళ్లలోనే చేశామని అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చట్టంలో ఎందుకు పెట్టలేదని హరిబాబు ప్రశ్నించారు. 4వేల కోట్ల నిధులు రెవెన్యూ లోటు కింద కేంద్రం ఇచ్చిందని మిగిలిన బకాయిల ఎంతనేదానిపై అంగీకారానికి చర్చలు జరుగుతున్నాయన్నారు.ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అమలు చేస్తున్నామని, అయిదు సంస్థలు నెలకొల్పే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రైల్వే జోన్ విషయంలో త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని, ఇక దుగరాజపట్నం బదులు వేరే ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సూచించాలని ఆయన అన్నారు. పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదేనని, నాబార్డు ద్వారా నిధుల ఇస్తామని హరిబాబు తెలిపారు. విద్యుత్ కొరతతో అల్లాడుతున్న ఏపీకి 24 గంటల కరెంటు ఇచ్చామని,లక్షకోట్ల రూపాయల విలువైన రోడ్లు, రాజధానికి 3500 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. భవన నిర్మాణాలు మొదలుపెడితే నిరంతరం నిధులు ఇస్తామని, మూడున్నరేళ్లలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపికి ఇచ్చామని హరిబాబు వివరించారు. విభజన చట్టంలో ని 85శాతం హామీలు మూడున్నరేళ్లలో అమలు చేశామని,ఇందులో తప్పుంటే జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.విజయవాడ, విశాఖ మెట్రో పరిశీలనలో ఉందని, పెట్రో కాంప్లెక్స్ పై సాధ్యసాధ్యలపై అధ్యయనం జరుగుతోందని హరిబాబు పేర్కొన్నారు. టీడీపీ తమ మిత్రపక్షమని, ఏమైనా అనుమానాలు ఉంటే చర్చలు ద్వారా పరిష్కరించుకుంటామన్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే రూ,2,500 కోట్లు ఇచ్చాం పోలవరం నిర్మాణానికి రూ.4,662.28 కోట్లు విడుదల చేశాం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది విభజన చట్టం ప్రకారం కేవలం 5 సంస్థలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి కడప స్టీల్ ప్లాంట్ విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం దుగరాజపట్నం పోర్టుకు రక్షణ శాఖ నుంచి, ఇస్రో నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం సూచిస్తే, అక్కడ వెంటనే పోర్టు నిర్మాణం చేపడతాం రైల్వే జోన్ అంశం కూడా త్వరలో ప్రకటన ఉంటుంది. ఏర్పాటు జరుగుతుంది చట్టంలో పదేళ్ళ కాలపరిమితిలోగా ఇవన్నీ చేయాలని ఉంది. కానీ నరేంద్ర మోదీ సర్కారు మాత్రం మూడేళ్లలోనే చాలా ఇచ్చింది 85 శాతం హామీలు మూడున్నరేళ్లలో అమలు చేశాం వెంకయ్య నాయుడు చొరవతో చట్టంలో ఉన్నవే కాదు, లేనివి కూడా మంజూరు అయ్యాయి రూ. లక్ష కోట్ల విలువ చేసే జాతీయ రహదారులు మంజూరు చేసాము షిప్పింగ్ మరియు వాటర్ వేస్‌లో కూడా చట్టంలో లేని ప్రాజెక్ట్ మంజూరు చేసాం పెట్రోలియం కాంప్లెక్స్ పని కూడా జరుగుతుంది తిరుపతి ఐఐటీకి రూ.90.93 కోట్లు కేంద్రం ఇచ్చింది -
‘జైట్లీ ప్రకటన కొత్త సీసాలో పాత సారాలా ఉంది’
-
‘కొత్త సీసాలో పాత సారాలా ఉంది’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సమస్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో గురువారం చేసిన ప్రకటన కొత్త సీసాలో పాత సారాలా ఉందని వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా నిలబెట్టాలనే చిత్తశుద్ధి నిజంగా ఉంటే కేంద్రంలోని మంత్రులతో, ఎంపీలతో రాజీనామా చేయించాలని అన్నారు. రాష్ట్ర మంత్రులను, ఎంపీలను ముందు కూర్చొబెట్టుకుని ఏపీకి ఒరగబెట్టేలా ఏదో తీవ్రంగా చర్చిస్తున్నట్లు చంద్రబాబు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా విభజన చట్టంలోని హామీలను అమలు చేయించలేకపోయారని దుయ్యబట్టారు. ఇంకా చూస్తాం, చేస్తాం అంటూ బీజేపీ ప్రభుత్వం కూయడం దారుణమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాష్ట్రం గురించి కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్రం ముందు సాగిలపడ్డారని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పచ్చి అవకాశవాదిగా మారడం కన్నా దారుణం మరోటి లేదని అన్నారు. -
ఎరువుల సబ్సిడీని రైతులకు ఎందుకివ్వడం లేదు ?
-
ఏపీ ఎంపీల ఆందోళనకు మా మద్దతు: ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ: విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆమె గురువారం లోక్‌సభలో మాట్లాడారు. ఏపీ అన్యాయంపై ఆ రాష్ట్ర ఎంపీలు చేస్తున్న ఆందోళనకు కవిత మద్దతు పలికారు. పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఎంపీల ఆందోళనలకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. అయితే, ప్రభుత్వంలో ఉండి నిరసనలు తెలుపడం సరైన పద్ధతి కాదని ఆమె పరోక్షంగా టీడీపీ ఎంపీలను ఉద్దేశించి పేర్కొన్నారు. కేంద్రం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. జీఎస్టీ, నోట్లరద్దుకు తాము మద్దతునిచ్చామని, తెలంగాణకు కేంద్రం మద్దతునివ్వాలని అభ్యర్థించారు. కేంద్రం ఎరువుల సబ్సిడీని నేరుగా రైతులకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ఫర్టిలైజర్ కంపెనీల విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పులనే బీజేపీ ఎందుకు చేస్తోందని అన్నారు. -
కేబినెట్ నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకిస్తారు
-
పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : విభజన హామీల అమలుపై ఏపీ ఎంపీల నిరసనలతో గురువారం రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడారంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. కేంద్ర మంత్రులకు సమిష్టి బాధ్యత ఉంటుందని, కేబినెట్లో బడ్జెట్‌కు ఆమోదం తెలిపి సభలో విభేదించడం రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి కేబినెట్ నిర్ణయంతో విభేదించవచ్చని, మంత్రి పదవిలో కొనసాగుతూ కేబినెట్ నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకిస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు స్పందిస్తూ కేంద్రమంత్రులు సలహాలు ఇవ్వచ్చని, సుజనా మాటలు కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకం కాదని చెప్పారు. దీనిపై సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతకుముందు విభజన హామీలపై పెద్దల సభలో వాడివేడి చర్చ జరిగింది. విభజన హామీలను అమలుచేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. విభజన చట్టాన్ని గౌరవించాలని, బిల్లులో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కోరారు. సభ్యుల ఆందోళనల నడుమ రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది. ఛైర్మన్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం రాజ్యసభ సభ వాయిదా అనంతరం ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై ఛైర్మన్ తీరు రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఛైర్మనే నిబంధనలు అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఛైర్మన్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఒక మంత్రి మరొక మంత్రికి సలహా ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యను ఛైర్మన్ ఎలా సమర్థిస్తారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. -
ప్రధాని ప్రసంగానికి ముందే...
-
ప్రధాని ప్రసంగానికి ముందే...
సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీల అమలును కోరుతూ వైఎస్ఆర్సీపీ ఎంపీల ఆందోళనల నడుమ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. వెల్‌లో వైఎస్ఆర్సీపీ ఎంపీల నిరసనల మధ్య ప్రధాని ప్రసంగం కొనసాగించారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఎంపీలు నినదించారు.ప్రధాని ప్రసంగానికి ప్రతిపక్షాలు పదేపదే అడ్డుతగలగా..టీడీపీ సభ్యులు మాత్రం మోదీ ప్రసంగానికి అరగంట ముందే ఆందోళన విరమించారు.ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. మోదీ మాట్లాడేందుకు సిద్ధమైన వెంటనే టీడీపీ ఎంపీలు తమ సీట్లలో కూర్చున్నారు. గతంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు అనంతరం ఎలాంటి సమస్యలు రాలేదని, వాజ్‌పేయి హయాంలో అప్పటి ప్రభుత్వం రాజనీతిజ్ఞతతో వ్యవహరించిందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. -
పార్లమెంటు చట్టాన్ని గౌరవించండి: కొణతాల
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రం రెండుగా చీలిపోయాక ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తామన్న రైల్వే జోన్, ప్రత్యేక హోదా హామీలను బీజేపీ నెరవేర్చాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్, మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ శుక్రవారం రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్‌ను కోరారు. ఆయన రైల్వే మంత్రికి రాసిన సుదీర్ఘ లేఖలో ప్రస్తుత బడ్జెట్లోనైనా విశాఖరైల్వే జోన్‌ను ప్రకటించాలని విన్నవించారు. పార్లమెంటులో చట్టం చేసిన తర్వాత కూడా విశాఖ రైల్వే జోన్ అంశం కాగితాలకే పరిమితం కావడం బాధాకరమన్నారు. ఈ విషయమై మాజీ రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి రెండు సార్లు అర్జీ పెట్టుకున్నా.. ఫలితం లేకుంగా పోయిందని తెలిపారు. ‘ఏపీ రీ-ఆర్గనైజేషన్ బిల్లు, 2014 లోని షెడ్యూల్ 3 అవశేష ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులను కల్సిస్తామని తెలిపింది. దాంట్లో భాగంగానే ఆరు నెలల్లోగా కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దక్షిణమధ్య రైల్వే జోన్ తెలంగాణకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు రైల్వే జోన్ ఏర్పాటు అనివార్యం అయినందున వెంటనే స్పందించండి’ అని లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు. హామీల అమలుకు దిక్కు లేదు.. రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలికాంశాలు విశాఖపట్నం కలిగివుందని కొణతాల అన్నారు. 1052 కి.మీ. రైల్వే లైన్ వున్న ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన రైల్వేజోన్ ఏర్పాటు కొన్ని రాజకీయ కారణాలతోనే జాప్యం అవుతోందని ఆయన విమర్శించారు. ఆదాయార్జనలో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న వాల్తేర్ డివిజన్ ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం మరో విశేషమని అన్నారు. ఆర్థికాభివృద్ధి దిశగా సాగుతున్న దేశంలో న్యాయమైన తమ వంతు వాటాకోసం ఉత్తరాంధ్ర ప్రజానీకం కోరుకుంటోందని.. విశాఖ పట్నం హెడ్ క్వార్టర్స్‌గా రైల్వే జోన్ ఏర్పాటుతో వారి కలలను నిజం చేయాలని విఙ్ఞప్తి చేశారు. ఏపీ రీ-ఆర్గనైజేషన్ బిల్లులో రాష్ట్రం విడిపోయాక ఆరు నెలల కాలంలోనే రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ఆ దిశగా అడుగులేయక పోవడం శోచనీయమన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేజీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రైల్వే జోన్‌ను చేర్చారని గుర్తు చేశారు. పార్లమెంటు హామీలు కూడా అమలుకు నోచుకోకుంటే ప్రజాస్వామ్యంపై మాకు నమ్మకం పోతుందని నిరసన వెళ్లగక్కారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో చివరి ఈ బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇంకా ఆలస్యం చేసి ప్రజల్లో ఉన్న అసహనాన్ని పెంచొద్దని హెచ్చరించారు. -
విశాఖ పెట్రో వర్సిటీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ) బిల్లు– 2017ను లోక్‌సభ శుక్రవారం ఆమోదించింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు ఇప్పటికే విశాఖలోని తాత్కాలిక క్యాంపస్‌లో ప్రారంభమైన ఐఐపీఈకి జాతీయ ప్రాధాన్య, స్వతంత్ర సంస్థగా గుర్తింపునిస్తూ వర్సిటీని ఇన్కార్పొరేట్ చేసేందుకు గానూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్ శుక్రవారం సభలో బిల్లు ప్రవేశపెట్టారు. రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీ కోసం ఏపీ ప్రభుత్వం 200 ఎకరాల స్థలమిచ్చిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. -
హైకోర్టు ఏర్పాటుకు మరో చట్టం కావాలి..!
-
హైకోర్టు ఏర్పాటుకు మరో చట్టం కావాలి..!
- పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టత లేదు - న్యాయాధికారుల నియామకం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై స్పష్టత లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయాధికారుల క్యాడర్ విభజనకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భం గా బుధవారం జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఉండాలన్న ఉద్దేశాన్ని మాత్రమే పార్లమెంటు ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొంది. అయితే కానిస్టిట్యూట్(ఏర్పాటు) చేయాల్సింది ఎవరు? ఎప్పుడు ఏర్పాటు చేయాలి? ఎలా ఏర్పాటు చేయాలి? అన్న అంశాలను ఈ చట్టం ప్రస్తావించలేదు. పార్లమెం టు ఆ చట్టంలో ఈ అంశాలను పొందుపరిచి ఉండాల్సింది. కొత్త హైకోర్టు ఏర్పాటుకు కొత్త చట్టం అవసరం అన్నది మా అభిప్రాయం. దీనిపై మీరేమంటారు?’’ అని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఈ కేసులో పిటిషనర్ల తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్, హైకోర్టు రిజిస్ట్రీ తరఫు న్యాయవాది వేణుగోపాల్‌ను ప్రశ్నించారు. రాష్ట్రపతి నోటిఫై మేరకే ఏపీ హైకోర్టు ఏర్పాటు..! ఇందుకు జైసింగ్ సమాధానం ఇస్తూ.. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 30 దీనిని నిర్వచించిందన్నారు. ఏపీకి ఆర్టికల్ 214, పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 31 కింద కొత్త హైకోర్టు ఏర్పడేవరకు హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి హైకోర్టుగా ఉంటుందని తెలిపారు. ‘‘సెక్షన్ 31(1) ప్రకారం సెక్షన్ 30 నియమాలకు లోబడి ఏపీకి ఒక ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో హైకోర్టును తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా పిలవాలి. సెక్షన్31(2) ప్రకారం ఏపీ హైకోర్టు ప్రధాన స్థానం.. రాష్ట్రపతి ఎక్కడ నోటిఫై చేస్తారో అక్కడ ఉంటుంది’’ అని పేర్కొన్నారు.దీనిపై జస్టిస్ చలమేశ్వర్ స్పందిస్తూ.. పలు ప్రశ్నలు సంధించారు. ఇందిరా జైసింగ్ సమాధానమిస్తూ.. ‘‘భవిష్యత్తులో అక్కడ హైకోర్టు ఉంటుందని సెక్షన్ 30 చెప్పింది. హైకోర్టు ఏర్పాటు ఎక్కడ అన్న విషయం మాత్రమే నిర్ధారించాల్సి ఉంది. సెక్షన్ 5 రాజధాని గురించి చెప్పింది. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ పదేళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. హైకోర్టు గురించి ఈ సెక్షన్లో ప్రస్తావన లేదు..’’ అని పేర్కొన్నారు. దీనికి జస్టిస్ చలమేశ్వర్ స్పందిస్తూ ‘‘కానిస్టిట్యూట్ అనే పదానికి అర్థం ఏంటి? మనకు ఇక్కడ తెలియని విషయం ఏంటంటే భౌతికంగా హైకోర్టు విభజన ఎప్పుడు జరగాలన్నదే. కొత్త హైకోర్టు ఏర్పాటుకు ఈ చట్టం సరిపోతుందా? లేక కొత్త చట్టం కావాలా అన్నదే ఇక్కడ ప్రశ్న. రాజధాని అన్నది కేవలం ఒక భావన మాత్రమే. అదొక చట్టపరమైన పరిధి కాదు..’ అని పేర్కొన్నారు. న్యాయాధికారుల విభజనపై నియమం ఏదైనా ఉందా? న్యాయాధికారుల నియామకాల వివాదానికి సంబంధించి జస్టిస్ చలమేశ్వర్ పలు ప్రశ్నలు వేశారు. దీనికి ఇందిరా జైసింగ్ స్పందిస్తూ.. సెక్షన్ 77, 78లలో ఉద్యోగుల సేవలు, విభజనకు సంబంధించిన ప్రాతిపదిక చెప్పారే తప్ప సబార్డినేట్ జ్యుడిషియల్ అధికారుల ప్రస్తావనేదీ లేదన్నారు. వీటి మార్గదర్శకాలు కేంద్రం రూపొందించాలా? లేక హైకోర్టు రూపొందించాలా? అన్న దానిపైనే వివాదం ఉందన్నారు. హైకోర్టు రిజిస్ట్రీ తరపున వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ..ధర్మాసనం ఇచ్చే మార్గదర్శకాలను అనుసరిస్తామన్నారు. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ తన వాదనలు వినిపించారు. -
ప్రత్యేక సాయాన్ని తిరస్కరించారు: వైవీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బుధవారం లోక్‌సభలో ప్రత్యేక ప్రస్తావనల కింద ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘‘ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు మూడేళ్లుగా విజ్ఞప్తిచేస్తూ వస్తున్నారు. నీతి ఆయోగ్ దీనిపై అధ్యయనం చేస్తుందని గతంలో కేంద్రం చెప్పింది.గతేడాది ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయాన్ని ప్రకటించారు. దీనిని గతవారం కేంద్ర మంత్రిమండలి కూడా ఆమోదించింది. కానీ అందులో ఉన్న అంశాలన్నీ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కల్పించిన ప్రయోజనాలే తప్ప ప్రత్యేకంగా పెద్దగా ప్రయోజనం ఉన్న అంశాలేవీ లేవు. అందువల్ల ప్రజలు ప్రత్యేక సాయాన్ని తిరస్కరించారు. ప్రత్యేక హోదా కోసమే డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల నీతిఆయోగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టండి. ఆ సిఫారసులతో సంబంధం లేకుండా ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయండి..’’ అని విన్నవించారు. -
‘ఫోరెన్సిక్’కు విభజన కష్టాలు
గవర్నర్ వద్ద ప్రస్తావనకు రాని సైన్స్ ల్యాబ్ అంశం తెలంగాణ, ఏపీ మంత్రుల ఎజెండాలోనే లేని వైనం సాక్షి, హైదరాబాద్: వివిధ కేసుల్లో పోలీసు, ఎక్సైజ్‌శాఖలకు శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించి నివేదికలందించే కీలకమైన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) విభజన కష్టాలు ఎదుర్కొంటోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో పొందుపరిచిన సంస్థలు, విభాగాల విభజన జాబితాలో ఎఫ్ఎస్ఎల్ కూడా ఉన్నా తెలుగు రాష్ట్రాలు ఈ సంస్థను పట్టించుకోలేదు. పదో షెడ్యూల్లోని సంస్థలు, విభాగాల విభజనపై మూడు రోజుల క్రితం గవర్నర్ నరసింహన్ వద్ద జరిగిన చర్చలో ఇరు రాష్ట్రాల మంత్రులు ఎఫ్ఎస్ఎల్ విభజన అంశాన్ని వారి ఎజెండాలోనే చేర్చకపోవడంతో ఆ విభాగం అధికారుల్లో ఆందోళన నెలకొంది. సిబ్బంది కొరత కారణంగా ఇప్పటికే రెండు లక్షలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు వివిధ శాస్త్రీయ పరీక్షలకు వాడే యంత్ర పరికరాల విభజనపైనా ఇరు రాష్ట్రాల డీజీపీలు ఇంకా ఓ అంగీకారానికి రాలేదని తెలిసింది. ఇంతటి ప్రాధాన్యతగల సంస్థను రెండు రాష్ట్రాల ప్రభుత్వా లు పట్టించుకోకపోవడంతో అయోమయం నెలకొంది. ఖాళీగా 89 పోస్టులు... ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ పదవీ విరమణ చేసి ఏడాది కావస్తుండగా ఇన్చార్జి డైరెక్టర్‌తోనే కాలం నెట్టుకొస్తున్నా రు. మొత్తం 202 మంజూరు పోస్టుల్లో 113 మంది పనిచేస్తుండగా, మిగతా 89 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్లోని కీలకమైన విభాగాలను పర్యవేక్షించాల్సిన నాలుగు జాయింట్ డైరెక్టర్ పోస్టుల్లో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
విశాఖ రైల్వేజోన్ కోసం కమిటీ ఏర్పాటు
► రాజధానిని కవర్ చేస్తూ 106.30 కిలోమీటర్ల కొత్త లైన్లకు ప్రతిపాదనలు ► దానికి మొత్తం రూ. 2679.59 కోట్ల వ్యయ అంచనా ► పనులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేం ► వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం న్యూఢిల్లీ విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించేందుకు సీనియర్ రైల్వే అధికారులతో ఒక కమిటీని నియమించినట్లు రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంగా ఆయనీ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులేంటని, అసలు అలాంటి ప్రతిపాదన ఏమైనా ఉందా అని విజయసాయిరెడ్డి రైల్వే మంత్రిని ప్రశ్నించారు. దాంతో.. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 13 (మౌలిక సదుపాయాలు)లో 8వ ఐటెం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఒక కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు గల అవకాశాలను రైల్వే మంత్రిత్వశాఖ పరిశీలించాల్సి ఉందన్నారు. ఇందుకోసం సీనియర్ రైల్వే అధికారులతో ఒక కమిటీని ఇప్పటికే ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఈ కమిటీ ఇందులో భాగంగా ఉన్న పలువురు స్టేక్హోల్డర్లు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి నివేదిక ఇస్తుందని, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ఆ లేఖలో వివరించారు. అలాగే.. నంబూరు జంక్షన్ నుంచి అమరావతి మీదుగా విజయవాడ-కాజీపేట మార్గాన్ని ఎర్రుపాలెం వద్ద కలిపేలా దక్షిణ మధ్య రైల్వే ఏమైనా ప్రతిపాదన సిద్ధం చేసిందా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అమరావతి నుంచి పెదకూరపాడు, సత్తెనపల్లి మీదుగా గుంటూరు జిల్లా నరసరావుపేట వెళ్లేందుకు కొత్త రైల్వే లైను కోసం సర్వే ఏమైనా మొదలైందా అని అడిగారు. ఒకవేళ మొదలైతే నంబూరు- ఎర్రుపాలెం మధ్య ఏవేం స్టేషన్లు వస్తాయి, అమరావతి నుంచి నరసరావుపేటకు ఎలా కనెక్ట్ అవుతుందో చెప్పమన్నారు. ఈ రెండు కొత్త లైన్లకు అంచనా వ్యయం ఎంతని ప్రశ్నించారు. కొత్త రైల్వేలైన్ల పనులు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు ముగుస్తాయని కూడా ఆయన అడిగారు. వాటికి రైల్వే మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నంబూరు జంక్షన్ నుంచి అమరావతి మీదుగా విజయవాడ-కాజీపేట మార్గాన్ని ఎర్రుపాలెం వద్ద కలిపేలా కొత్త లైనుకు ప్రతిపాదన వచ్చిందన్నారు. నంబూరు- అమరావతి-ఎర్రుపాలెం విద్యుదీకరణతో కలిపి డబుల్ లైన్ (56.8 కిమీ), పెదకూరపాడు-అమరావతి విద్యుదీకరణ లేకుండా సింగిల్ లైన్ (24.5 కిమీ), సత్తెనపల్లి-నరసరావు పేట విద్యుదీకరణ లేకుండా సింగిల్ లైన్ (25 కిమీ)లకు సంబంధించి మొత్తం 106.30 కిలోమీటర్ల మార్గానికి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఇప్పటికే ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ మార్గంలో ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, పెద్దాపురం, పరిటాల, కొప్పురావూరు, రేవెల, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, కొత్తపల్లి, వెడ్డమాను, తాడికొండ, నిడుముక్కొల, చాగంటివారిపాలెం స్టేషన్లు ఉంటాయని వివరించారు. ఈ రెండు లైన్లకు కలిపి మొత్తం రూ. 2679.59 కోట్ల రూపాయల వ్యయాన్ని అంచనా వేస్తున్నామన్నారు. ఈ పనులు చేపట్టడం, పూర్తి చేయడంలో పలు అంశాలున్నాయని.. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తమకు భూమి అప్పగించడం లాంటివి రైల్వే మంత్రిత్వశాఖ చేతుల్లో ఉండవని తెలిపారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఫలానా తేదీ అని ఏమీ నిర్ణయించలేదన్నారు. -
చంద్రబాబుకు చురక అంటించిన కేవీపీ
-
చంద్రబాబుకు చురక అంటించిన కేవీపీ
న్యూఢిల్లీ: విభజన హామీలు ఎందుకు నెరవేర్చరని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. ముఖ్యమైన 10 హామీలను ఇప్పటివరకు నెరవేర్చేదని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. హోదాపై ప్రైవేటు బిల్లు చర్చకు రాకుండా చేశారని, వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు అనుమతించాలని కోరారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించిన ఘనత తమదేనని గుండెపై చేయి వేసుకుని చెప్పగలనని కేవీపీ అన్నారు. ఎక్కువకాలం పాలించిన ప్రతిఒక్కరూ ఉత్తమ పరిపాలకులు కాలేరని, ఔరంగజేబులా చంద్రబాబు ఎక్కువ కాలం పరిపాలించలేరని చురక అంటించారు. వాస్తవాలు మాట్లాడితే తన అనుయాయులతో ఎదురుదాడి చేయిస్తున్నారని, ఈ పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. ఏపీ పోలీసు అధికారుల ప్రకటనలు చూస్తుంటే వారికి రాజ్యాధికారాన్ని అప్పగించారన్న భయం కలుగుతోందన్నారు. విభజన చట్టం హామీల కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. -
రికార్డులన్నింటినీ భద్రపరచండి
మైనారిటీ కమిషన్ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మైనారిటీ కమిషన్ రికార్డులన్నింటినీ భద్రపరచాలని కమిషన్ కార్యదర్శిని బుధవారం ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో ఉన్న మైనారిటీ కమిషన్ గురించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని, ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లిం చడం లేదని కమిషన్ చైర్మన్ హైకోర్టును ఆశ్రరుుంచారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ఏసీజే నేతృత్వం లోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. కమిషన్ చైర్మన్, సభ్యుల మూడేళ్ల పదవీ కాలం ఈ ఏడాది మే తో ముగిసిందని తెలిపారు. అందువల్ల కమిషన్ బాధ్యతలను చూసుకునేందుకు కార్యదర్శిని ఏర్పాటు చేశామన్నారు. రికార్డులను కార్యదర్శికి అప్పగించడం సబబుగా ఉంటుందని, ఈ మేరకు పిటిషనర్‌ను ఆదేశించాలని కోరారు. అంగీకరించిన ధర్మాసనం రికా ర్డులన్నింటినీ భద్రపరచాలని కార్యదర్శిని ఆదేశించింది. కమిషన్ కొనసాగింపు విషయంలో మరో వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. -
అసెంబ్లీ స్థానాల పెంపు కుదరదు
-
అసెంబ్లీ స్థానాల పెంపు కుదరదు
- సీట్లు పెంచాలంటే ఆర్టికల్ 170ని సవరించాల్సిందే - 2026 జనాభా లెక్కల తరువాతే అవకాశం - రాజ్యసభలో స్పష్టం చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సాక్షి, న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించకుండా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం కుదరదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. బుధవారం రాజ్యసభలో సభ్యుడు టి.జి.వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహిర్ ఈమేరకు సమాధానమిచ్చారు. ’ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? వస్తే సంబంధిత వివరాలు వెల్లడించండి. ఈ విషయంలో కేంద్రం స్పందన ఏంటి?’ అంటూ ఎంపీ టి.జి.వెంకటేశ్ రాతపూర్వకంగా ప్రశ్నించారు. దీనికి హోం శాఖ సహాయ మంత్రి సమాధానమిస్తూ ’ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి విజ్ఞాపన వచ్చింది. ఈ అంశాన్ని న్యాయ శాఖ దృష్టికి తీసుకెళ్లాం. న్యాయ శాఖ అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 తరువాత చేసే తొలి జన గణన ప్రచురించేంతవరకు అసెంబ్లీ సీట్ల సంఖ్య సర్దుబాటు చేయడం కుదరదని అటార్నీ జనరల్ తన అభిప్రాయం తెలిపారు. అందువల్ల ఆర్టికల్ 170ని సవరించకుండా ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం కుదరదు..’ అని స్పష్టం చేశారు. -
ఏం మాయ చేశార్రా బాబూ!
ఇవి ప్రత్యేక హోదాకు సమానమా..? సాక్షి, హైదరాబాద్: ఇదో పచ్చి దగా..! పక్కా మోసం..! ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలకే మసిపూసి మారేడు కాయ చేసి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. రాష్ట్రాన్ని విభజించడం ద్వారా ఏపీకి జరిగిన అపార నష్టాన్ని పూడ్చడానికి పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో అనేక హామీలు ఇచ్చారు. ఆర్థికలోటు పూడ్చటం, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, జాతీయస్థాయి విద్యాసంస్థల ఏర్పాటు, పారిశ్రామిక కారిడార్‌కు సాయం... అందులో కొన్ని. విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి ‘హక్కు’గా సంక్రమించిన ఈ హామీలను కేంద్రం తప్పనిసరిగా అమలు చేయాల్సిఉంది. వీటి అమలుకే కేంద్రం రూ.రెండు లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కొన్నిటికి కేంద్రం ఇప్పటికే సాయం చేస్తుంది. అయితే విభజన బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ రాష్ట్ర ప్రజలు, ప్రధాన ప్రతిపక్షం ఉద్యమించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా కావాలంటూనే, అంతకు మించిన సాయం చేస్తే వద్దంటామా అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఐదుకోట్ల ఆంధ్రుల ఆశలను అడియాశలు చేస్తూ... విభజన చట్టం ద్వారా సంక్రమించిన హక్కులనే వల్లె వేస్తూ అవేవో తాము కొత్తగా ఇచ్చినట్లు ప్రకటించి, దాన్ని ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా చిత్రీకరించింది. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ఎలాంటి సాయం ప్రకటించకపోయినా... ఇచ్చిన హామీలను సైతం ఎన్నేళ్లలో పూర్తి చేస్తారనే స్పష్టత లేకపోయినా... ఆ ప్రకటనను సీఎం స్వాగతించడం గమనార్హం. విభజన చట్టంలోని హామీలను, వాటి అమలు విధానాన్ని, తాజాగా కేంద్రం చేసిన ప్రకటనలోని ఆంతర్యాన్ని గమనిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రజలను ఎలా వంచిస్తున్నాయో అర్థమవుతుంది. రెవెన్యూ లోటు... విభజన చట్టంలో ఏముంది? విభజన వల్ల భారీగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. జూన్ 2వ తేదీ నుంచి మార్చి 31, 2015 వరకు రూ.16.078.67 కోట్లు రెవెన్యూ లోటు ఏర్పడినట్లు అకౌంటెంట్ జనరల్ నివేదిక కేంద్రానికి సమర్పించారు. మూడేళ్లలో కేంద్రం ఏమిచ్చింది? విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.2303, 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1176.50 కోట్లు... మొత్తంగా మూడేళ్లలో రూ.3,979.50 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భర్తీ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు రాజీపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన ఆధారంగా స్పష్టం అవుతోంది. రూ.16.078.67 కోట్లు రెవెన్యూ లోటు ఏర్పడినట్లు అకౌంటెంట్ జనరల్ తేల్చగా కేంద్రం మూడేళ్లలో కేవలం రూ.3,979.50 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఆ మొత్తాన్ని కూడా రాష్ట్రప్రభుత్వం ఆడంబరాలకు వినియోగించి, తప్పుడు లెక్కలు చెప్పింది. తాజాగా ఏం చెప్పారు? ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2014-15లో రెవెన్యూ లోటును ప్రామాణికమైన ఖర్చును పరిగణనలోకి తీసుకుని కేంద్రం చెల్లిస్తుంది. ఆ మేరకు ఇప్పటికే రూ.3,979 కోట్లు చెల్లించాం. మిగిలినది వాయిదాల కింద చెల్లిస్తాం. లోటు భర్తీలోనూ కోతేనా? 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే ఇప్పటికి కేవలం రూ.3,979.50 కోట్లు మాత్రమే విడుదల చేసిన కేంద్రం మిగతా ఎంత మొత్తాన్ని ఇస్తారో తాజా ప్రకటనలో స్పష్టం చేయలేదు. రాజధాని భవనాల వివరాలు... విభజన చట్టంలోని సెక్షన్-94 ప్రకారం నూతన రాజధానిలో కనీస అత్యవసర మౌలిక సదుపాయాల నిర్మాణాలైన రాజభవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసన మండలి నిర్మాణాలకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తుంది. అందుకోసం అవసరమైతే అటవీ భూములను డీనోటిఫై చేస్తామని పేర్కొంది. మూడేళ్లలో ఏ మేరకు నిధులొచ్చాయి? రాజధానిలో నిర్మాణాలకు గత ఏడాది వరకు కేంద్రం రూ.1050 కోటు,్ల ఈ ఏడాది రూ.450 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తానికి వినియోగ పత్రాలు సమర్పిస్తేనే 450 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని షరతు విధించింది. తాజాగా ఏం చెప్పారు? ఏపీ నూతన రాజధాని కోసం ఇప్పటికే రూ.2,500 కోట్లు చెల్లించాం, మిగిలిన రూ.1000 కోట్లను కూడా చెల్లిస్తామని అరుణ్ జైట్లీ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం... రాజధాని నిర్మాణం కోసం రూ. 15,175 కోట్లు వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ అంచనా. కేంద్రం ఇప్పటివరకూ రూ.1,050 కోట్లు విడుదల చేయగా రాష్ర్ట ప్రభుత్వం వాటిని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరిట దుబారాగా ఖర్చు చేసింది. విజయవాడ, గుంటూరు మున్సిపాలిటీల్లో ప్రత్యేక ప్రాజెక్టుల కోసం ఇచ్చిన రూ. 1000 కోట్లు నిధులను కూడా రాజధాని ఖాతాలో రాసేసినా ప్రశ్నించే ధైర్యం చేయడంలేదు. కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పకపోవడం... శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, తాత్కాలిక భవనాల నిర్మాణం పేరిట దుబారా ఖర్చులు చేస్తుండటంతో కేంద్రం నిధుల విడుదలలో కోత వేసింది. ఎన్నేళ్లకు పూర్తయ్యేను? రాజధాని నిర్మాణానికి రూ.15,175 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా కేంద్రం కేవలం రూ.3,500 కోట్లు మాత్రమే సహాయం అందిస్తామని ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే రాజధాని భవనాల నిర్మాణంలో మరింత జాప్యం తప్పదని తెలుస్తోంది. ఏడు జిల్లాలకు ప్రత్యేక నిధి విభజన చట్టంలోని సెక్షన్-46(3) ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది. సెక్షన్ 94 (2) ప్రకారం కేబీకె, బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇస్తామని పేర్కొంది. మూడేళ్లలో ఎన్ని నిధులొచ్చాయి? జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున కేంద్రం 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 350 కోట్ల చొప్పున విడుదల చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలోనూ రూ. 350 కోట్లు సాయం ప్రకటించింది. అయితే గతంలో ఇచ్చిన రూ.700 కోట్లకు వినియోగ పత్రాలను సమర్పించాకనే ఈ నిధులను ఇస్తామని షరతు విధించింది. అరుణ్ జైట్లీ ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాలకు ఇప్పటికే రూ.1,050 కోట్లు విడుదల చేశాం. రానున్న సంవత్సరాల్లో మరో రూ.1,050 కోట్లు సహాయం అందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, వాటి అభివృద్ధికి రూ.7,000 కోట్లు అవసరమని ఆర్థిక శాఖ అంచనా వేసింది. అయితే ఆ మేరకు నిధులు సాధించలేక రాష్ర్ట ప్రభుత్వం చతికిలబడిపోయింది. తాజాగా కేవలం రూ.2,100 కోట్లు మాత్రమే సహాయం అందిస్తామని కేంద్రం స్పష్టంచేసినా రాష్ర్ట ప్రభుత్వం కిమ్మనడంలేదు. పారిశ్రామిక రాయితీలు విభజన చట్టం సెక్షన్ 94(1) ప్రకారం పారిశ్రామిక ప్రగతికి కేంద్రం ప్రత్యేకంగా ఆర్థిక చర్యలతో పాటు పన్నుల రాయితీలు ఇస్తుంది. ఆ మేరకు ఇప్పటివరకు అదనంగా 15 శాతం యాక్సిలేరేటెడ్ డిప్రియేషన్, 15 శాతం అదనపు కేపిటల్ అలవెన్స్‌ను ఐదేళ్ల పాటు ఇచ్చింది. తాజాగా అరుణ్ జైట్లీ ఇవే మాటలను వల్లె వేశారే తప్ప కొత్తగా ప్రకటించిందేమీ లేదు. విభజన చట్టంలోని హామీల మేరకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు... (రూ.కోట్లలో) 2014-15 ఆర్థిక లోటు పూడ్చటం 16,078.67 రాజధాని నిర్మాణం కోసం 15,175 పోలవరం ప్రాజెక్టు కోసం 20,010 వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధికి 7,000 జాతీయస్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు 9,580 పరిశోధన, శిక్షణ సంస్థల ఏర్పాటుకు 8,000 ఇండస్ట్రియల్ కారిడార్ ఆర్థిక లోటును పూడ్చడానికి 46,600 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 32,809 మొత్తం 1,53,674 ఇవికాక ఆయా పథకాలకు కేంద్రం నుంచి రావాల్సినవి 45,000 మొత్తంగా కలిపి 1,96,674 విద్యా, శిక్షణ, పరిశోధనా సంస్థలు... విభజన చట్టం 13వ షెడ్యూల్ సెక్షన్ 93లో రాష్ట్రంలో పలు జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పుతామన్న హామీ ఉంది. ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, ఐఐఐటీ, వ్యవసాయ యూనివర్సిటీ, ఎయిమ్స్, గిరిజన విశ్వవిద్యాలయం ఎన్ఐడీఎంల ఏర్పాటుకు రూ.9,580 కోట్ల వ్యయం అవుతుందని అంచనావేశారు. అలాగే షెడ్యూలు 9, 10 లో పేర్కొన్న శిక్షణ, పరిశోధన సంస్థలకు మరో రూ.8,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. వీటిలో కొన్నిటిని మంజూరు చేయగా... తాత్కాలిక భవనాల్లో నిర్వహిస్తున్నారు. వాటికి పూర్తి స్థాయిలో నిధులు ఎప్పుడిస్తారో, మిగతా సంస్థలను ఎప్పుడు మంజూరు చేస్తారో జైట్లీ ప్రకటనలో ఎలాంటి స్పష్టత లేదు. విభజన చట్టంలో పేర్కొన సంస్థల పేర్లు చెప్పారే తప్ప కొత్తగా ఒక్క సంస్థనూ ప్రకటించకపోవడం గమనార్హం. మౌలిక సదుపాయాల కల్పన... విభజన చట్టం 13 షెడ్యూల్ సెక్షన్ 93 ప్రకారం రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు పలు ప్రాజెక్టులను ప్రకటించారు. వాటి ఏర్పాటుకు రూ.46,600 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణం సాధ్యాసాధ్యాలపై ఆరు నెలల్లో నివేదిక ఇస్తామని పేర్కొనగా.. మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆ పని పూర్తి కాలేదు. దుగరాజపట్నం ఓడరేపు తొలిదశ 2018నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నప్పటికీ ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. తాజాగా అరుణ్ జైట్లీ ప్రకటనలోనూ ఈ అంశాలపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. విశాఖ, విజయవాడల్లో మెట్రో రైలు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను ఇంకా పరిశీలిస్తున్నామని ప్రకటించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు రూ.రెండు లక్షల కోట్లు అవసరమని అంచనా వేయగా... తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ప్రత్యేక హోదాకు సమానమైన సహాయం’ ఆ మేరకు లేకపోవడం గమనార్హం. -
పునర్విభజన చట్టం అమలుపై చర్చకు నోటీసు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదాపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి గురువారం ఉదయం రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. పునర్విభజన చట్టం అమలు తీరుపై ఇవాళ మధ్యాహ్నం రెండుగంటలకు రాజ్యసభలో కూలంకషంగా చర్చ జరగనుంది. కాగా గత రెండురోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై వివాదం ముదరడంతో సమస్య పరిష్కారం కోసం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నిన్న రాజ్యసభలో వివిధ పక్షాల నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి మంగళవారం రాజ్యసభలో జరిగిన వాగ్వివాదాల్లో జోక్యం చేసుకొంటూ విభజన చట్టం అమలుపై చర్చ జరగాలని, దీనిపై కేంద్ర ఆలోచన తెలియాల్సి ఉందని కేంద్రమంత్రి సుజనా చౌదరి పేర్కొన్న విషయం తెలిసిందే. విభజన చట్టం అమలుపై ఇవాళ చర్చ జరిగిన తర్వాత ఓటింగ్‌కు అవకాశం ఉండేలా నోటీసులు ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. -
పునర్విభజన చట్టం అమలుపై నేడు చర్చ
-
పునర్విభజన చట్టం అమలుకు నేడు చర్చ
- రాజ్యసభ చైర్మన్ చొరవతో ఫ్లోర్ లీడర్ల సమావేశంలో నిర్ణయం - చర్చ తర్వాత సమాధానమివ్వనున్న ఆర్థిక మంత్రి జైట్లీ - ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగానే తేల్చేసిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ పునర్విభజన చట్టం అమలు తీరుపై గురువారం రాజ్యసభలో కూలంకషంగా చర్చ జరగనుంది. గత రెండురోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై వివాదం ముదరడంతో సమస్య పరిష్కారం కోసం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ బుధవారం రాజ్యసభలో వివిధ పక్షాల నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ విభజన చట్టం అమలుపై స్వల్ప వ్యవధి చర్చ జరగాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఏపీ విభజన చట్టం అమలు, ఏపీకి ఏ విధంగా సాయం అందిస్తున్నామనే విషయంపై చర్చకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రతిపాదించింది. వాస్తవానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం రాజ్యసభలోనే ఈ మేరకు ప్రతిపాదించారు. అయితే కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా తేల్చి చెప్పారు. ఈ బిల్లుపై చర్చకు అభ్యంతరం లేదని, అయితే ఓటింగ్‌కు రాజ్యాంగపరంగా అవరోధాలున్నాయని జైట్లీ పేర్కొన్న విషయం విదితమే. బుధవారం సమావేశంలో కేంద్రం ఈ విషయాన్నే పునరుద్ఘాటించింది. విభజన చట్టం అమలుపై చర్చ జరిగిన తర్వాత ఆర్థిక మంత్రి జైట్లీ జవాబిస్తారని, అందువల్ల ప్రైవేట్ మెంబర్ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఈ సూచనపై కాంగ్రెస్ నాయకత్వం స్పష్టంగా స్పందించలేదని తెలుస్తోంది. జైట్లీ ఇచ్చే జవాబును బట్టి తాము ఒక నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు సమాచారం. అయితే ప్రైవేట్ మెంబర్ బిల్లుతో సంబంధం లేకుండా గురువారం రాజ్యసభలో మధ్యాహ్నం రెండు గంటలకు విభజన చట్టం అమలుపై చర్చ జరగనుంది. ఈ మేరకు స్వల్ప వ్యవధి చర్చ కోసం కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీడీపీ నేతలు గురువారం ఉదయం నోటీసులు ఇస్తారు. వాస్తవానికి మంగళవారం రాజ్యసభలో జరిగిన వాగ్వివాదాల్లో జోక్యం చేసుకొంటూ విభజన చట్టం అమలుపై చర్చ జరగాలని, దీనిపై కేంద్ర ఆలోచన తెలియాల్సి ఉందని కేంద్రమంత్రి సుజనా చౌదరి పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, విభజన చట్టం అమలుపై గురువారం చర్చ జరిగిన తర్వాత ఓటింగ్‌కు అవకాశం ఉండేలా నోటీసులు ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. -
విభజనపై వీడనిపీటముడి
- వివాదాస్పదంగా డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ విభజన - తొమ్మిదో షెడ్యూల్ సంస్థలపై రెండు రాష్ట్రాల పేచీ - రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారిగా తిరుపతయ్య నియామకం - ఢిల్లీలో రాష్ట్ర విభజన వివాదాల పరిష్కార కమిటీ భేటీ సాక్షి, హైదరాబాద్ : ఏపీ పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ సంస్థల విభజనకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారిని నియమించింది. నోడల్ అధికారిగా డాక్టర్ కె.తిరుపతయ్యను నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతయ్య ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్డీ అడిషనల్ డీజీ (శిక్షణ)గా పనిచేస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విభజన వివాదాల పరిష్కార కమిటీ బుధవారం ఢిల్లీలో భేటీ అయింది. ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీల విభజన శాఖల అధికారులు హాజరయ్యారు. కొద్దిరోజులుగా డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. ఈ సంస్థ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ ఉత్పత్తులను తెలంగాణలో అమ్ముకునే హక్కులను ఏపీ ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ(సాంబశివ డెయిరీ)కి అప్పగించటంతో ఈ వివాదం మొదలైంది. గతేడాది మేలో రెండు రాష్ట్రాల మేనేజింగ్ బోర్డులు సమావేశమై రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 101, 103 ప్రకారం సంస్థ తాత్కాలిక విభజనను పూర్తి చేసుకున్నాయి. విభజన తర్వా త జాయింట్ అకౌంట్ మూసేసి విడివిడిగా బ్యాంకు ఖాతాలు తెరిచాయి. కానీ.. సంస్థ ఆర్థిక లావాదేవీలను జాయింట్ అకౌంట్ ద్వారానే నిర్వహించాలని ఏపీ వాదిస్తోంది. హైదరాబాద్ లాలాగూడలోని విజయ భవన్ నుంచి తెలంగాణ డెయిరీ డెవెలప్‌మెం ట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ డెయిరీ డెవెలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ వ్యాపారం నిర్వహిస్తోంది. కానీ సంస్థ విభజన జరగకుండానే తెలంగాణ ఈ వ్యాపారం చేస్తోందని, ఉద్యోగుల విభజన కూడా ఏకపక్షంగానే జరిగిందనే రెండు అభ్యంతరాలతో ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు తొమ్మిదో షెడ్యూల్ సంస్థల ప్రధాన కార్యాలయం నిర్వచనంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తొమ్మిదో షెడ్యూల్ సంస్థల విభజనకు కేంద్రం గతంలోనే షీలాబేడీ నేతృత్వంలో కమిటీ వేసింది. ఆ కమిటీ గడువు ముగిసినా మళ్లీ పెంచలేదు. కనీసం ఆ కమిటీ నివేదికలు, మార్గదర్శకాలను సైతం వెల్లడించలేదు. కొత్తగా నోడల్ అధికారి నియామకంతోపాటు ఢిల్లీలో జరిగే భేటీతో విభజన ప్రక్రియ వేగవంతమవుతుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. భేటీలో తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, డెయిరీ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ నిర్మల ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఉక్కు సంకల్పమేదీ!
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు–2014 షెడ్యూల్ 13లో హామీ ఉంది. ఆ బిల్లులో ఉన్న అన్నీ అంశాలు నెరవేరుస్తామని కేంద్రప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. అయినప్పటికీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే చిత్తశుద్ధి కన్పించలేదు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది’ అని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేందర్‌సింగ్‌కు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విన్నవించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ జిల్లాలో నెలకొంటున్న ఉద్యమాల నేప«థ్యంలో బుధవారం ఆయన న్యూఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి విజ్ఞాపన అందజేశారు. వివరాలిలా ఉన్నాయి. గతంలో ఉక్కుశాఖ మంత్రిగా పనిచేసిన నరేంద్రసింగ్ తోమర్జీ దృష్టికి ఇదే విషయాన్ని పలుమార్లు తీసుకువచ్చాం. కడపలో స్టీల్ఫ్లాంట్ ఏర్పాటుచేస్తామని రీఆర్గనైజేషన్ బిల్లులో హామీ ఇచ్చారు. అనేకసార్లు ఇదే విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించాం, ఫలితం లేదు. 2016 మార్చి 18 కేంద్ర, రాష్ట్ర అధికారులచే టాస్క్ఫోర్సు ఏర్పాటు చేశామంటూ మార్చి 27న ఉక్కుశాఖ మంత్రి నుంచి ఒక లేఖ మాత్రమే అందింది. అనంతరం ఎలాంటి పురోగతి లేదని కేంద్రమంత్రి బిరేందర్సింగ్ దృష్టికి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తీసుకువచ్చారు. సత్వరమే స్టీల్‌ఫ్లాంట్‌పై ప్రకటన చేయాలి. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు గడిచిన సమస్య అలాగే ఉండిపోయింది. ప్రజలు నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఇప్పటికే వివిధ ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. స్టీల్ఫ్లాంట్ సాధన సమితి ఆధ్వర్యంలో ఇటీవల భారీ బహిరంగసభ నిర్వహించారు. వేలాదిగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. విభజన బిల్లులో ఇచ్చిన హామీని కేంద్రం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రప్రభుత్వం ఇంకా జాప్యం చేస్తే ప్రజలకు పార్లమెంటుపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అవినాష్‌రెడ్డి వివరించారు. మీ నేతృత్వంలో అయినా స్టీల్ఫ్లాంట్ ఏర్పాటు చర్య వేగవంతంగా చేపట్టాలని అభ్యర్థించారు. ఆమేరకు స్పందించిన ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేందర్‌సింగ్ 10రోజల్లో సెయిల్, రెయిల్, ఎన్ఎండీసీ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్సుతో సమావేశమై స్టీల్ఫ్లాంటు విషయమై చర్చిస్తానని తెలిపారు. ఆగస్టు 2వవారంలో ఎంపీగా మీతో కూడా సమావేశమైతానని ఎంపీ అవినాష్‌రెడ్డికి హామీ ఇచ్చారు. -
మార్గదర్శకాలు రూపొందించాం
- న్యాయాధికారుల కేటాయింపులపై సుప్రీంకు కేంద్రం నివేదన - మార్గదర్శకాలు న్యాయశాఖ పరిశీలనలో ఉన్నాయని వెల్లడి - వారంలోగా తమ ముందుంచాలన్న అత్యున్నత న్యాయస్థానం - నియామక సలహా కమిటీ వివరాలు కూడా ఇవ్వాలని సూచన - విచారణ వచ్చే వారానికి వాయిదా సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం న్యాయాధికారుల నియామక ప్రక్రియకు సంబంధించి సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలు రూపొందించిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. గతేడాది న్యాయాధికారుల కేటాయింపుల ప్రక్రియను సత్వరం తేల్చాలని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై తాజాగా మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 80 ప్రకారం న్యాయాధికారుల కేటాయింపు ప్రక్రియ చేపట్టాల్సి ఉందని, అందుకు సంబంధించి చట్టం అమల్లోకి వచ్చిన 30 రోజుల్లోపు సలహా కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. అయితే రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు గడిచినప్పటికీ న్యాయాధికారుల కేటాయింపు ప్రక్రియ పూర్తవలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏమంటోందని జస్టిస్ టీఎస్ ఠాకూర్ ప్రశ్నించగా, కేంద్రం తరఫు న్యాయవాది తమకు కొంత సమయం కావాలని విన్నవించారు. దీంతో సాయంత్రం 4 గంటలకు తిరిగి విచారణ ప్రారంభించగా కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మణిందర్‌సింగ్ వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన అనంతరం అఖిల భారత సర్వీసు అధికారులు, రాష్ట్ర స్థాయి సర్వీసు అధికారుల కేటాయింపునకు సంబంధించి సలహా కమిటీల సిఫారసుల మేరకు ఇప్పటికే అధికారుల విభజన ప్రక్రియ అమలులో పురోగతి ఉందని మణిందర్ వివరించారు. అయితే న్యాయాధికారుల కేటాయింపులకు సంబంధించి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలు రూపొందించిందని, ఇందుకు ఒక సలహా కమిటీని కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రస్తుతం మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు న్యాయ శాఖ వాటిని పరిశీలిస్తోందని వివరించారు. ఈ నేపథ్యంలో వాటిని ధర్మాసనం ముందుంచాలని, అలాగే కేంద్రానికి ఈ వ్యవహారంలో నోటీసు జారీ చేయాలని ఇందిరా జైసింగ్ కోరారు. అయితే సంబంధిత మార్గదర్శకాలను, సలహా కమిటీ నియామకం, విధివిధానాలు, తదితర వివరాలను అఫిడవిట్ రూపంలో వారంలోపు తమ ముందుంచాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు అదనపు సొలిసిటర్ జనరల్ మణిందర్‌సింగ్ సమ్మతించారు. తిరిగి వచ్చే వారం ఈ కేసు విచారణకు రానుంది. -
‘మిషన్’కు రూ.5 వేల కోట్లివ్వండి
ఆర్థిక మంత్రి జైట్లీకి సీఎం కేసీఆర్ లేఖ సాక్షి, హైదరాబాద్ : జల సంరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధి లక్ష్యంగా చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి రూ. 5 వేల కోట్ల సాయం అందించాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఆయన శనివారం లేఖ రాశారు. వచ్చే మూడేళ్ల కోసం మిషన్ కాకతీయ కోసం రూ. 5 వేల కోట్ల సాయం అందించాలని నీతి ఆయోగ్ చేసిన సిఫారసులను సీఎం తన లేఖలో ప్రస్తావించారు. అలాగే తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించాలని ఏపీ పునర్విభజన చట్టం చెబుతోందని...అందుకనుగుణంగానే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 2015-19 కాలానికి రూ. 30,571 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని గతంలో కోరిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. కేంద్ర జలవనరులశాఖ ద్వారా దేశవ్యాప్తంగా జల సంరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధి కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సీఎం అన్నారు. అదే లక్ష్యంతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. మిషన్ కాకతీయ పురోగతి, కార్యక్రమాలను సీఎం లేఖలో వివరించారు. -
కుదరని లెక్క
కృష్ణా జలాలపై ఏకాభిప్రాయం కరువు పాజెక్టులను బోర్డు పరిధిలో తేవొద్దన్న తెలంగాణ... తేవాల్సిందేనన్న ఆంధ్రప్రదేశ్ పోలవరం ద్వారా మళ్లించే నీటిలో 45 టీఎంసీలు ఇవ్వాలన్న తెలంగాణ సయోధ్య కుదర్చలేక చేతులెత్తేసిన కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇరు రాష్ట్రాలు చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావాలన్న మంత్రి ఉమాభారతి నెల రోజుల వరకూ పాత విధానాన్నే అమలు చేయాలని కేఆర్ఎంబీ నిర్ణయం! బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇప్పటి వరకూ నోటిఫై కాలేదు. కోర్టు విచారణలో ఉంది. నీటి కేటాయింపులపై కేంద్రానికే హక్కు లేదు. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులను నియంత్రించే అధికారం మాత్రమే కృష్ణా బోర్డుకు ఉంది. బోర్డు తన పరిధి దాటి రూపొందించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను పరిగణనలోకి తీసుకోవద్దు. - తెలంగాణ వాదన ఇదీ పునర్విభజన చట్టంలో సెక్షన్ 87(1) ప్రకారం కృష్ణా బోర్డు పరిధి, విధివిధానాలను కేంద్రం తక్షణమే నోటిఫై చేయాలి. బోర్డుకు అధికారాలు కట్టబెట్టాలి. దిగువ కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తేవాలి. కృష్ణా బోర్డు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినా.. నీటి విడుదలలో తెలంగాణ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. - ఇదీ ఆంధ్రప్రదేశ్ వాదన సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం.. ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాల్సిందేనన్న ఏపీ డిమాండ్‌ను తెలంగాణ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అటు పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల్లో 45 టీఎంసీలు తమకు కేటాయించాల్సిందేనన్న తెలంగాణ డిమాండ్‌ను ఏపీ తోసిపుచ్చింది. కృష్ణా జలాల వినియోగంపై, ప్రాజెక్టుల నిర్వహణపై ఇరు రాష్ట్రాల అధికార బృందాలతో కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్ సింగ్ ఢిల్లీలో రెండు రోజులు సుదీర్ఘంగా చర్చించినా సయోధ్య కుదర్చలేకపోయారు. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఇదే అంశంపై తెలంగాణ, ఏపీ మంత్రులు హరీశ్‌రావు, దేవినేని ఉమాలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నెల రోజుల్లోగా రెండు రాష్ట్రాల బృందాలు చర్చించుకుని ఏకాభిప్రాయానికి రండి. ఆ తర్వాత మీ ఇద్దరితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకూ గతేడాది అనుసరించిన విధానాన్నే అమలు చేస్తాం’ అని స్పష్టం చేశారు. కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణపై మంగళవారం రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. చర్చలు బుధవారం నాటికి వాయిదా పడిన విషయం విదితమే. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్ సింగ్ సమక్షంలో కృష్ణా బోర్డు ఇన్చార్జి చైర్మన్ రాంశరాణ్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ కమిషనర్లు, ఈఎన్సీలు ఎస్కే జోషి, శశిభూషణ్ కుమార్, మురళీధర్, వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్లు నరసింహారావు, రామకృష్ణ, కోటేశ్వరరావు తదితరులతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగాయి. కానీ ఇరు రాష్ట్రాలు తొలి రోజు చేసిన వాదనలనే పునరుద్ఘాటించడంతో సమావేశం మరింత వేడెక్కింది. బోర్డు పరిధిలో వద్దు.. లేదు తేవాల్సిందే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై చేయని నేపథ్యంలో.. ఆ అవార్డు కోర్టు విచారణలో ఉన్నందున కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తేవడానికి అంగీకరించమని తెలంగాణ తెగేసి చెప్పింది. ఏపీ మాత్రం విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కృష్ణా బోర్డు పరిధి, విధి విధానాలను తక్షణమే నోటిఫై చేయాలని పట్టుబట్టింది. దిగువ కృష్ణా బేసిన్లో ఇరు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తేవాలని వాదించింది. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తేలేని పక్షంలో నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌పై తమకే పూర్తి అజమాయిషీ అప్పగించాలని.. రెండు రాష్ట్రాల పరిధిలోని రెగ్యులేటర్లపై ఆయా రాష్ట్రాలకే అధికారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇందుకు తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో గతేడాది కేటాయించిన నీటి కన్నా 13 టీఎంసీలు ఏపీ అధికంగా వినియోగించుకున్న నేపథ్యంలో బోర్డుకు అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందంటూ తెలంగాణ నిలదీసింది. తేలని పంచాయతీ.. కృష్ణా జలాలను గత నీటి సంవత్సరం తరహాలోనే తెలంగాణ 299, ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు వినియోగించుకోవాలని, 811 టీఎంసీల కన్నా అధికంగా నీటి లభ్యత ఉంటే ఇదే నిష్పత్తిలో పంచుకోవాలని అమర్జీత్ సింగ్ ఇరు రాష్ట్రాలకూ సూచించారు. కానీ.. ఈ ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించింది. ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తెచ్చిన తర్వాతే నీటి వినియోగంపై నిర్ణయం తీసుకోవాలంది. అందుకు తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరకపోవంతో అమర్జీత్ సింగ్ ఈ అంశాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఆమె ఎన్‌డబ్ల్యూడీఏ నేతృత్వంలో నదుల అనుసంధానంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల మంత్రులు హరీశ్, దేవినేని హాజరయ్యారు. ఇద్దరు మంత్రులతోనూ ప్రత్యేకంగా సమావేశమైన ఉమాభారతి.. ఇరు రాష్ట్రాల బృందాలు చర్చించుకుని నెల రోజుల్లోగా ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. ఆ తర్వాత మీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని.. అప్పటి వరకూ గతేడాది అమలు చేసిన విధానాన్నే అనుసరించాలని ఆదేశించారు. 45 టీఎంసీలు మాకివ్వాల్సిందే: తెలంగాణ పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల్లో బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటక, మహారాష్ట్రలకు 35 టీఎంసీలు.. నాగార్జునసాగర్‌కు ఎగువన 45 టీఎంసీలు వినియోగించుకునేలా తీర్పు ఇచ్చిందని, ఆ నీటిపై తమకే హక్కు ఉందని తెలంగాణ స్పష్టంచేసింది. ఆ 45 టీఎంసీలను తమకే కేటాయించాలని పేర్కొంది. ఇందుకు ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఆ 45 టీఎంసీలపై నిర్ణయం తీసుకుంటుందని, ఆ నీటిలో రాయలసీమకూ హక్కు ఉంటుందని పేర్కొంది. తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ డిమాండ్ చేయగా.. పట్టిసీమ, వెలిగొండ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను ఏ అనుమతులతో చేపట్టారని తెలంగాణ ప్రశ్నించింది. -
కొలిక్కిరాని పదో షెడ్యూల్ సంస్థల విభజన
విద్యామండలి అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు తర్వాతే చర్చ హోంశాఖ సంయుక్త కార్యదర్శితో తెలుగు రాష్ట్రాల అధికారుల భేటీ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూల్ సంస్థల విభజన అంశం ఇంకా కొలిక్కి రాలేదు. విభజన విషయంలో ఏపీ, తెలంగాణల మధ్య ఏర్పడిన సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు మంగళవారం హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి కె.రామకృష్ణారావు, అదనపు కార్యదర్శి ఎన్.శంకర్, ఏపీ తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, తెలుగు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. పదో షెడ్యూల్లో ఉన్న ఉన్నత విద్యామండలి వ్యవహారంపై సుప్రీం తీర్పును అన్ని సంస్థల విభజనకు వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనికి తెలంగాణ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యామండలి ఆస్తులు, రుణాలను జనాభా ప్రాతిపదికన 2 రాష్ట్రాలు 58ః42 నిష్పత్తిలో పంచుకోవాలని మార్చిలోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని తెలంగాణ అధికారులు కేంద్ర హోం శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజనను నిలిపివేయాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం కేసీఆర్ రాసిన లేఖను తెలంగాణ ప్రతినిధులు ఉటంకించారు. పదో షెడ్యూల్లోని సంస్థల విభజనపై మరి కొంత కాలం వేచి చూడాల్సిన అవసరం ఉందనడంతో ఎలాంటి నిర్ణయం లేకుండానే సమావేశం వాయిదా పడింది. -
తెలంగాణకే 4 వేల మెగావాట్లు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)ఉత్పత్తి చేసే తెలంగాణ పవర్‌పై డిస్కంలు వివరణ ఇచ్చాయి. ఆ విద్యుత్ తెలంగాణకే చెందుతుందని స్పష్టం చేశాయి. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామగుండంలో 4000మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మిం చతలపెట్టిన విషయం తెలిసిందే. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఆ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్ రాష్ట్రానికే చెందుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణకే అంకితమని స్పష్టం చేశాయి. ఎన్టీపీసీ, డిస్కంల మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లో ప్రాజెక్టు నుంచి రాష్ట్రానికి కేటాయించే విద్యుత్ వాటాలను కేంద్రం నిర్ణయిస్తుందని పేర్కొన్న నిబంధనపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ మేరకు వివరణ ఇచ్చాయి. తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చేందుకు ఎన్టీపీసీ ఈ విద్యుత్ ప్రాజెక్టును చేపట్టిందని డిస్కంలు తెలిపాయి. తొలి విడతగా రామగుండంలో ఎన్టీపీసీ 1600(2x800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు రం గం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన పీపీఏపై విద్యుత్ రంగ నిపుణుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలు, సూచనలపై సోమవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) బహిరంగ విచారణ నిర్వహించనుంది. ఎన్టీపీసీ ప్రాజెక్టుల విద్యుత్ ధరలను కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్సీ) నిర్ణయిస్తుందని, రామగుండం ఎన్టీపీసీ తొలి దశ ప్రాజెక్టు విద్యుత్ ధరలను సైతం అదే సంస్థ ఖరారు చేస్తుందని వెల్లడించాయి. ఒప్పంద కాలం 25 ఏళ్లు ముగిసే నాటికి ఈ ప్రాజెక్టుపై పెట్టుబడి వ్యయం ఎన్టీపీసీకి తిరిగి వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రాజెక్టును తెలంగాణ డిస్కంలు బై అవుట్ చేసేలా పీపీఏలో మార్పులు చేయాలని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్, జర్నలిస్ట్ ఎం.వేణుగోపాల్‌రావు సూచించగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ ప్లాంట్లను బైఅవుట్ చేసేందుకు సీఈఆర్సీ నిబంధనలు అంగీకరించవని డిస్కంలు బదులిచ్చాయి. -
అన్యాయం జరిగింది.. న్యాయం చేయండి
ఏసీజేకు తెలంగాణ న్యాయాధికారుల వినతి సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థ విభజనలో భాగంగా న్యాయాధికారుల కేటాయింపులకు సంబంధించి హైకోర్టు విడుదల చేసిన ప్రాథమిక జాబితాపై తెలంగాణ న్యాయాధికారులు శనివారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే ను కలసి అభ్యం తరం వ్యక్తం చేశా రు. కేటాయింపు ల్లోతమకు అన్యా యం జరిగిందని, ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు ఏసీజేను అభ్యర్థించారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ బొసాలేను ఆయన నివాసంలో కలసి అభినందించిన తెలంగాణ న్యాయాధికారులు.. ఆయనకు వినతిపత్రం సమర్పించారు. కేడర్ వారీగా రెండు రాష్ట్రాలకు ప్రతిపాదించిన కేటాయింపుల నిష్పత్తిని, స్థానికత ఆధారంగా తెలంగాణకు కేటాయించిన వారి వివరాలను జాబితాలో పేర్కొనలేదని వారు ఏసీజేకు వివరించారు. అసలు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల విభజనకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. అయితే హైకోర్టు ఇందుకు విరుద్ధంగా మార్గదర్శకాలను రూపొందించిందన్నారు. ఆ మార్గదర్శకాలనైనా పరిగణనలోకి తీసుకోకుండా న్యాయాధికారులు ఇచ్చిన ఆప్షన్లను బట్టి కేటాయింపులు చేశారన్నారు. మార్గదర్శకాల ప్రకారం ఒకచోట ఖాళీలు భర్తీ అయ్యాక మిగిలిన పోస్టులనే మరో రాష్ట్రానికి కేటాయించాలని, దీనికి విరుద్ధంగా ఏపీలో ఖాళీలున్నా పెద్ద సంఖ్యలో న్యాయాధికారుల్ని తెలంగాణకు కేటాయించారన్నారు. రాష్ట్ర విభజన తరువాత 2 రాష్ట్రాలకు కేటాయింపులు జరిపి ఆ తరువాత పదోన్నతులివ్వాలని.. అలాకాకుండా కామన్ సీనియారిటీని తయారు చేసి పదోన్నతులు కల్పించారని అన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జస్టిస్ బొసాలే హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఏసీజేను కలసిన వారిలో సంఘం అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు పి.చంద్రశేఖర ప్రసాద్, డాక్టర్ సున్నం శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.వరప్రసాద్ తదితరులున్నారు. -
‘పాలమూరు’ ఎత్తిపోతల్లో ఉల్లంఘన లేదు
రాజ్యసభలో కేంద్రం స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: జూన్ 2, 2014 తరువాత కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని తెలంగాణ ప్రభుత్వం తమకు లేఖ రాసిందని, అందువల్ల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, నక్కలగండి ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించలేదని కేంద్రం స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్ సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి సన్వర్‌లాల్‌జాట్ ఈమేరకు సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 11వ షెడ్యూలులో గల సెక్షన్ 84(3), 85(8)డీ, పేరా 7ను ఉల్లంఘిస్తూ, సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల సంఘం ఆమోదించకుండానే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు పునాది రాయి వేసినట్టు ఏపీ ప్రభుత్వం నుంచి ఫిర్యాదు ఏదైనా వచ్చిందా? వస్తే ఈ పథకాలను ఆపేందుకు కేంద్రం తీసుకున్న చర్యలేమిటంటూ రమేశ్ ప్రశ్నించారు. దీనికి సన్వర్‌లాల్ సమాధానమిస్తూ, ‘ఏపీ ప్రభుత్వం సంబంధిత అంశంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు, కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఇప్పటివరకు సాంకేతిక-ఆర్థిక అంచనా నివేదిక ఏదీ రాలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం 2015 ఆగస్టు 22న మాకు ఒక లేఖ రాసింది. అపాయింటెడ్ డే అయిన జూన్ 2, 2014 తరువాత తాము ఏ కొత్త ప్రాజెక్టూ చేపట్టలేదని ఆ లేఖలో పేర్కొంది. అందువల్ల పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి ఎలాంటి ఉల్లంఘన జరగలేదు’ అని పేర్కొన్నారు. -
హోదా ఆశకు సమాధి
ఏపీపై తేల్చేసిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ప్రత్యేక హోదా నిబంధనేదీ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హా పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ నిర్లిప్త వైఖరిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండటం, హోదా కోసం విపక్ష వైఎస్సార్సీపీ తన వంతు కృషి కొనసాగిస్తుండటంతో.. ప్రజల దృష్టి మరల్చేందుకు, హోదా కోసం తామూ పోరాటం చేస్తున్నామని కలర్ ఇచ్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎప్పుడో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా గత నెల 25న జయంత్ సిన్హా లేఖ రాస్తే.. పదిరోజుల తర్వాత ఆ లేఖను బయటపెట్టారు. బుధవారం లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తుందనే ఏకైక కారణంతో, తామూ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పుకునేందుకు టీ డీపీ ఈ హడావుడి చేసింది. అయితే రాష్ట్రాలకు ‘హోదా’ మంజూరు విషయంలో ఇప్పటివరకు ఉన్న విధానాన్ని మార్చే ఆలోచన లేదని కేంద్ర మంత్రి కుండబద్ధలు కొట్టారు. డిసెంబర్ 21, 2015న లోక్‌సభ జీరో అవర్‌లో అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. దానికి బదులుగా కేంద్రమంత్రి రాసిన లేఖను బుధవారం ఆయన విడుదల చేశారు. లేఖలోని సారాంశం ఇదీ.. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014పై రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20న చర్చ జరుగుతున్న సమయంలో అప్పటి ప్రధాని కొన్ని అంశాలను ప్రస్తావించారు. 13 జిల్లాలతో కూడిన ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్‌ను ఐదేళ్ల పాటు వర్తింపజేస్తామన్నారు. కానీ విభజన చట్టంలో ప్రత్యేక కేటగిరీ హోదా కట్టబెట్టాలని ఎలాంటి నిబంధన పొందుపరచలేదు. అలాగే రెవెన్యూ లోటు భర్తీకి వీలుగా నిధులు ఇవ్వాలని గానీ, ఆ మేరకు ఆర్థిక సంఘం సిఫారసు చేస్తుందని గానీ చట్టంలో పొందుపరచలేదు. అయితే విభజన అనంతరం తొలి ఏడాది ఏపీకి ప్రత్యేక సాయం కింద రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 46(2) సెక్షన్‌ను పొందుపరిచారు. దీనికి అనుగుణంగా, ఏపీ అభివృద్ధికి మద్దతుగా 6,403 కోట్ల ప్రత్యే క సాయం కేంద్రం అందించింది. 2014-15లో రూ.4,403 కోట్లు, 2015-16లో రూ 2,000 కోట్ల నిధులను ఏపీ ప్రభుత్వానికి ఇచ్చాం. ఇందులో రెవెన్యూ లోటు భర్తీకి రూ. 2,803 కోట్లు, ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.700 కోట్లు, నూతన రాజధానికి రూ. 2,050 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 850 కోట్లు ఇచ్చాం. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపలేదు. అనేక మార్గాల్లో నిధులు: ఆ విధంగా ఏపీకి వివిధ మార్గాల ద్వారా.. అంటే కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూపంలో, 14వ ఆర్థిక సంఘం గ్రాంట్ల రూపంలో, రాష్ట్ర ప్రణాళిక పథకాల్లో కేంద్ర సాయంగా, కేంద్ర ప్రాయోజిత పథకాలు తదితర రూపాల్లో నిధులు అందుకుంటోంది. ఏపీ ప్రభుత్వ 2016-17 బడ్జెట్ ప్రకారం 2016-17లో రూ.51,487 కోట్ల కేంద్ర సాయం అందుకోబోతోంది. ఇందులో రూ.26,850 కోట్ల మేర సెంట్రల్ గ్రాంట్లు, 24,637 కోట్ల మేర కేంద్ర పన్నులు ఉన్నాయి. 2015-16 సవరించిన అంచనాల ప్రకారం ఈ రెండు పద్దుల మొత్తం 39,616 కోట్లుగా ఉంది. ఇందులో కేంద్ర పన్నుల వాటా రూ.21,894 కోట్లు. 2014-15 కంటే ఈ మొత్తం 30 శాతం అధికంగా ఉంది..’ అని జయంత్ సిన్హా పేర్కొన్నారు. పిల్లి మొగ్గలే పుట్టిముంచాయి: ప్రత్యేక హోదా విషయంలో రోజుకో మాట మాట్లాడటం ద్వారా చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగేందుకు కారణమయ్యారు. మరోవైపు ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలు వివరించటంతో పాటు దాని సాధనకు అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీకి అడుగడుగునా అడ్డంకులు కల్పించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల్లో లోపం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్న ఆందోళన, ఆవేదనతో గత ఏడాది ఆగస్టులోనే ఐదుగురు ఆత్మహత్య, ఆత్మాహుతులకు పాల్పడ్డారు. ఇవేవీ బాబును కదిలించలేక పోగా రాష్ట్ర ప్రజానీకాన్ని గందరగోళంలోకి నెట్టేశారు. హోదా తప్పక వస్తుందని టీడీపీకి చెందిన ఒక కేంద్ర మంత్రి అంటే.. హోదా రాదని, ఆ విషయం సీఎంకూ తెలుసునని ఆ పార్టీకే చెందిన ఎంపీ ఒకరు అంటారు. తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సభలో టీడీపీ, బీజేపీలు హామీ ఇచ్చాయి. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఊరూవాడా ప్రచారం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి రాగనే హోదా అంశాన్ని అటకెక్కించారు. ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారు. హోదా ఇవ్వడం లేదంటూనే కేంద్ర ప్రభుత్వంలో తన మంత్రులను కొనసాగించడం చంద్రబాబు చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోంది. హోదాపై బాబు ఎప్పుడేమన్నారు ► రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఐదేళ్లే ఇస్తామన్నారు. 15 ఏళ్లు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతున్నా. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే రెండు మూడేళ్లు పడుతుంది. ఐదేళ్లే ఇస్తే పరిశ్రమలు ప్రారంభమయ్యే లోపు హోదా పోతే అభివృద్ధి ఆగిపోతుంది. అందువల్ల 15 ఏళ్లు ఇవ్వాలని కోరుతున్నా. ► ప్రత్యేక హోదా ఇస్తే.. అదొక సంజీవని కింద అన్నీ అయిపోతాయని అంటున్నారు. ఏమొస్తాయండి..?. రెండే వస్తాయి. ఆర్థిక ప్యాకేజీ (ఈఏపీ), సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ప్రత్యేక హోదా బదులు ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారనుకో.. ఇంకా నీకు బాధేముంది. నేను కాదనను కదా? కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా?. ► ప్రత్యేక హోదానే మొత్తం అయిపోతుంది. స్వర్గం అయిపోతుందని చెబుతున్నారు. పదేళ్లు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గమైపోలేదే? -
కర్ణాటక అభ్యంతరాలను తోసిపుచ్చిన ట్రిబ్యునల్
♦ సభ్యుడిగా జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి కొనసాగింపు ♦ కృష్ణా నదీ జలాల వివాదంపై విచారణ ప్రారంభం ♦ ఉమ్మడి వాటాలోనే తెలంగాణ, ఏపీ పంచుకోవాలన్న కర్ణాటక ♦ నేడు వాదనలు వినిపించనున్న ఏపీ సాక్షి, న్యూఢిల్లీ: తమ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తి జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌లో సభ్యుడిగా నియమించడంపై భవిష్యత్తులో ఇతర భాగస్వామ్య రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తాయేమోనన్న కర్ణాటక ఫిర్యాదును ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి స్థానంలో నదీ జలాల భాగస్వామ్యం లేని ఇతర రాష్ట్రాల నుంచి న్యాయమూర్తిని నియమించాలని కేంద్రానికి కర్ణాటక జనవరిలో లేఖ రాసి ఏప్రిల్ 5న ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన భాగస్వామ్య రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల అభిప్రాయాన్ని మంగళ, బుధవారాల్లో ట్రిబ్యునల్ తెలుసుకుంది. జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి సభ్యుడిగా ఉండడంపై తమకు అభ్యంతరం లేదని తెలంగాణ, మహారాష్ట్ర నివేదించాయి. ఏపీ మాత్రం ట్రిబ్యునలే తగిన మార్గదర్శనం చేయాలని కోరింది. ఇక కేంద్రం తరపు సీనియర్ న్యాయవాది ఖాద్రీ కర్ణాటక అభ్యంతరాలను తోసిపుచ్చారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రం అభిప్రాయం విన్న తరువాత కర్ణాటక అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. విచారణ ప్రారంభం..: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతను తేల్చేందుకు జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం విచారణ ప్రారంభమైంది. ముందుగా కర్ణాటక తరపున సీనియర్ న్యాయవాది అనిల్ దివాన్ వాదనలు ప్రారంభించారు. ‘ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ఉద్దేశం, లక్ష్యం రెండు కొత్త రాష్ట్రాల మధ్య నీటిని పంచుకోవడమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మొత్తం నుంచే పంచుకోవాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ మొత్తం తిరగదోడాలంటోంది. ఇది సరికాదు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 84, సెక్షన్ 85 చెబుతున్నది కూడా ఇదే’ అని వివరించారు. ఈ క్రమంలో విచారణను గురువారానికి వాయిదావేస్తూ ట్రిబ్యునల్ చైర్మన్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా తమ వాదనల్లో మరికొంత భాగాన్ని కర్ణాటక గురువారం వినిపించనుంది. మిగిలిన రోజంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపించనున్నారు. బుధవారం విచారణకు ఆంధ్రప్రదేశ్ తరపున అదపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు, ప్రభుత్వ న్యాయవాది గుంటూరు ప్రభాకర్, తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, రామచంద్రరావు, రవీందర్రావు, విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. -
17 అంశాలను అమలు చేయాలి
హైదరాబాద్: పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానం ప్రవేశపెట్టారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. విభజన సందర్భంగా పార్లమెంట్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మొత్తం 17 అంశాలను అమలు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. పునర్విభజన చట్టంలోని హామీలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హేతుబద్ధత లేకుండా, సంప్రదింపులు లేకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాగా ప్రత్యేక హోదా అంశం బిల్లులో చేర్చలేదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో ఉందన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 645 కోట్లు ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం 1449 కోట్లు ఖర్చు చేసిందని చంద్రబాబు చెప్పారు. కేంద్రం నిధులిస్తే 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు పెంచాలని కోరామన్నారు. సగటున ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి 2 చొప్పున సీట్లు పెరుగుతాయని చెప్పారు.